
PC: AFP
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ విజయానికి ఇంకా 219 పరుగులు అవసరమ్వగా.. బంగ్లా విజయానికి కేవలం 3 వికెట్ల దూరంలో నిలిచింది.
ప్రస్తుతం క్రీజులో న్యూజిలాండ్ బ్యాటర్లు డార్లీ మిచెల్(44), ఇష్ సోధి(7) పరుగులతో ఉన్నారు. తొలి టెస్టులో కివీస్ ఓటమి నుంచి గట్టుఎక్కాలంటే ఏవైనా అద్బుతాలు జరిగాలి. కాగా సెకెండ్ ఇన్సింగ్స్‌లో బంగ్లా స్పిన్‌వలలో కివీస్ బ్యాటర్లు చిక్కుకున్నారు.
బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4 వికెట్లతో కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తైజుల్ ఇస్లాంతో పాటు షార్‌ఫుల్ ఇస్లాం, మెహాది హసన్, నయీం హసన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ షాంటో(105) సెంచరీతో మెరిశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ 4 వికెట్లు, ఇష్ సోధి రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు మాత్రమే చేసింది.
చదవండి: VHT 2023: దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం