
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. దీంతో కివీస్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 46.1 ఓవర్లలో చేధించింది.
బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తొలి మ్యాచ్‌లోనే రవీంద్ర శతకొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ప్లేయర్లు విల్ యంగ్, కేన్ విలియమ్సన్ వికెట్లు కోల్పోయిన కివీస్‌ను రచిన్ ఆదుకున్నాడు.
డెవాన్ కాన్వేతో కలిసి స్కోర్‌ను బోర్డును ముందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో తన నాలుగో సెంచరీ మార్క్‌ను రవీంద్ర అందుకున్నాడు. ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్.. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టామ్ లాథమ్(55), డెవాన్ కాన్వే(30) రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్, రిషాద్ తలా వికెట్ సాధించారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment