వారెవ్వా కుల్దీప్‌.. దెబ్బకు రవీంద్ర ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌​ | Kuldeep Yadav Strikes First-Ball To Remove In-Form Rachin Ravindra | Sakshi
Sakshi News home page

CT 2025 Final: వారెవ్వా కుల్దీప్‌.. దెబ్బకు రవీంద్ర ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌​

Published Sun, Mar 9 2025 4:06 PM | Last Updated on Sun, Mar 9 2025 4:26 PM

Kuldeep Yadav Strikes First-Ball To Remove In-Form Rachin Ravindra

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌ర‌గుతున్న ఫైన‌ల్లో కుల్దీప్ యాద‌వ్ త‌న స్పిన్ మ‌యాజాలాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. కుల్దీప్ బౌలింగ్‌ ఎటాక్‌లోకి వ‌చ్చిన తొలి బంతికే భార‌త్‌కు వికెట్ అందించాడు. అప్ప‌టివ‌రకు దూకుడుగా ఆడుతున్న కివీ స్టార్ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ను కుల్దీప్ అద్బుత‌మైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి ర‌చిన్ వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్  11వ ఓ‍వర్ వేసిన కుల్దీప్ తొలి బంతిని రవీంద్రకు గూగ్లీగా సంధించాడు. ఆ డెలివరీని రచిన్ బ్యాక్‌ఫుట్‌​పై నుంచి ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ  బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రవీంద్ర ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ వికెట్‌తో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రవీంద్ర 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 పరుగులు చేశాడు. కాగా కుల్దీప్ తన తరవాతి ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను కూడా బోల్తా కొట్టించాడు. విలియమ్సన్.. కుల్దీప్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌.. 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.

ఫైనల్‌ మ్యాచ్‌కు తుది జ‌ట్లు
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్

భార‌త్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: Champions Trophy Final: రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement