Daryl Mitchell, Marcus Stoinis Played Same Team Before 12 Years.. టి20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 14న జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టగా.. అటు ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించి తుది సమరానికి సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ హీరోగా నిలిస్తే.. ఇటు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో వేడ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టోయినిస్ అంతే ప్రముఖపాత్ర పోషించాడు.
చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. మిచెల్, స్టోయినిస్‌లు ఇద్దరు 12 ఏళ్ల క్రితం ఒక టోర్నీలో కలిసి ఆడారు. కలిసి ఆడడమే కాదు.. ఏకంగా కప్‌ను కూడా అందించారు. విషయంలోకి వెళితే 2009లో మిచెల్, స్టోయినిస్‌లు ప్రీమియర్‌షిప్ క్రికెట్ టోర్నీలో స్కార్‌బరో అనే టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. సెమీఫైనల్లో స్టోయినిస్ (189 పరుగులు ) సూపర్ శతకంతో మెరవడంతో స్కార్‌బరో ఫైనల్‌కు చేరింది. ఇక బేస్‌వాటర్-మోర్లీతో జరిగిన ఫైనల్లో డారిల్ మిచెల్ అనూహ్యంగా బౌలింగ్‌లో మెరిశాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. అలా ఈ ఇద్దరు కలసి స్కార్‌బరో కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా మిచెల్, స్టోయినిస్‌లు టి20 ప్రపంచకప్ ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడనుండడం ఆసక్తికరంగా మారింది.
చదవండి: Gautam Gambhir: అనూహ్యంగా సిక్స్ కొట్టిన వార్నర్.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’
Comments
Please login to add a commentAdd a comment