డెవాన్ కాన్వే స్ధానంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌కు చోటు.. | Daryl Mitchell to replace Devon Conway in NZ squad for two match Test series against India | Sakshi
Sakshi News home page

New Zealand Tour of India: డెవాన్ కాన్వే స్ధానంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌కు చోటు..

Published Sun, Nov 14 2021 12:18 PM | Last Updated on Sun, Nov 14 2021 4:23 PM

Daryl Mitchell to replace Devon Conway in NZ squad for two match Test series against India - Sakshi

Daryl Mitchell to replace Devon Conway: టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కీవిస్‌ మూడు టీ20లు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. అయితే  భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైన ఆజట్టు స్టార్‌ బ్యాటర్‌  డెవాన్ కాన్వే టీ20 ప్రపంచకప్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ మెగా టోర్నెమెంట్‌ ఫైనల్‌కు, భారత పర్యటనకు దూరమయ్యాడు.

దీంతో గాయపడిన  కాన్వే స్ధానంలో ఆజట్టు  ఆల్ రౌండర్ డారిల్ మిచెల్‌ను భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక  ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో డారిల్ మిచెల్‌ కీలకమైన పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌-2021లో కివీస్‌ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా నవంబర్‌17న జైపూర్‌ వేదికగా జరగనున్న తొలి టీ0 మ్యాచ్‌తో  న్యూజిలాండ్‌ పర్యటన ప్రారంభంకానుంది.

చదవండి: Matthew Wade: క్యాన్సర్‌ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement