Martin Guptill declared fit for India Match: టీ20 ప్రపంచకప్2021లో సూపర్-12లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం (ఆక్టోబర్31)ఆసక్తికర పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు కాస్త ఊరట లభించింది. గాయంతో భాదపడుతన్న ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫిట్‌నెష్ సాధించాడు. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్... గప్టిల్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు.
మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో గప్టిల్ గాయపడిన సంగతి తెలిసిందే. కాగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓటమితో ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రారంభించాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి కఠినమైన సవాల్ ఎదరు కానుంది.
చదవండి: T20 World Cup Pak Vs Afg: ఆఫ్రిదికి సెల్యూట్ చేసిన మాలిక్.. ఎందుకో తెలుసా..!
Comments
Please login to add a commentAdd a comment