Martin guptil
-
గప్టిల్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్.. కోహ్లి, రోహిత్ తర్వాత అతడే!
New Zealand vs Pakistan, 1st T20I - Babar Azam Record: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. తద్వారా కివీస్ బ్యాటర్ మార్టిన్ గఫ్టిల్ను అధిగమించాడు. కెప్టెన్సీకి గుడ్‌బై టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాక్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన బాబర్ ప్రస్తుతం కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఈ క్రమంలో టీ20 కొత్త సారథి షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో భాగమయ్యాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన బాబర్ 35 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు. గప్టిల్ రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20లలో 3538 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్ గప్టిల్‌ను దాటి మూడోస్థానానికి ఎగబాకాడు. తన 105వ మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఇక ఈ లిస్టులో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బాబర్ ఇంకో 316 పరుగులు సాధిస్తే రోహిత్‌ను కూడా దాటేస్తాడు! అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు: 1. విరాట్ కోహ్లి(ఇండియా)- 115 మ్యాచ్‌లలో- 4008 రన్స్ 2. రోహిత్ శర్మ(ఇండియా)- 148 మ్యాచ్‌లలో- 3853 రన్స్ 3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 105 మ్యాచ్‌లలో- 3538 రన్స్ 4. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్‌లలో- 3531 రన్స్ 5. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 134 మ్యాచ్‌లలో- 3438 రన్స్. చదవండి: డారిల్ మిచెల్ ఊచకోత.. కివీస్ చేతిలో పాక్ చిత్తు! బాబర్ పోరాడినా.. చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు -
భారత్‌తో మ్యాచ్ ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్..
Martin Guptill declared fit for India Match: టీ20 ప్రపంచకప్2021లో సూపర్-12లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం (ఆక్టోబర్31)ఆసక్తికర పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు కాస్త ఊరట లభించింది. గాయంతో భాదపడుతన్న ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫిట్నెష్ సాధించాడు. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్... గప్టిల్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో గప్టిల్ గాయపడిన సంగతి తెలిసిందే. కాగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓటమితో ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రారంభించాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి కఠినమైన సవాల్ ఎదరు కానుంది. చదవండి: T20 World Cup Pak Vs Afg: ఆఫ్రిదికి సెల్యూట్ చేసిన మాలిక్.. ఎందుకో తెలుసా..! -
‘ధోని రనౌట్ కావడం నా అదృష్టం’
మాంచెస్టర్ : డైరెక్ట్ హిట్‌తో భారత ఆశలను సమాధి చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆ రనౌట్‌పై స్పందించాడు. టీమిండియా ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్ కావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గప్టిల్ తన అద్భుత ఫీల్డింగ్‌తో ధోనిని పెవిలియన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. భారత విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని ఓ భారీ సిక్స్ కొట్టి గెలుపు ఆశలను రేకిత్తించాడు. ఆ మరుసటి బంతిని వదిలేసిన మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గప్టిల్ డైరెక్ట్ త్రోకు ఔటయ్యాడు. ఈ ఔట్‌తో ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గప్టిల్ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు. ఈ రనౌట్‌పై ఐసీసీ ట్వీట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘ఎంత అదృష్టం ఉంటే ధోనిని కీలక సమయంలో డైరెక్ట్ హిట్‌తో ఔట్ చేస్తాను’ అని సంబరపడిపోయాడు. "Lucky enough to get a direct hit from out there" – New Zealand's @Martyguptill on his ⚡ ️throw to dismiss MS Dhoni in the #CWC19 semi-final against India. #BackTheBlackCaps pic.twitter.com/GnerDahQgQ — ICC (@ICC) July 11, 2019 -
గేల్‌ను మళ్లీ వద్దనుకున్నారు..
బెంగళూరు: ట్వంటీ 20 స్పెషలిస్టులుగా ముద్రపడిన క్రిస్ గేల్(వెస్టిండీస్), మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)లకు ఐపీఎల్-11 వేలంలో మరోసారి చుక్కెదురైంది. శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఈ ఇద్దరి క్రికెటర్లు.. ఆదివారం కొనసాగుతున్న వేలంలో కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ స్టార్ క్రికెటర్ల వైపు కనీసం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తికూడా చూడకపోవడం గమనార్హం. వీరిద్దరి కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఫ్రాంచైజీలు ఎటువంటి ఆసక్తికనబరచలేదు. మరొకవైపు నిన్న అమ్ముడుపోని భారత క్రికెటర్ మురళీ విజయ్‌కు ఊరట లభించింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకు చెన్నె సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అటు తరువాత శామ్ బిల్లింగ్స్‌ను కూడా సీఎస్కే దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 1 కోటికే సీఎస్కే కొనుగోలు చేసింది. -
ఆ క్యాచ్ చూస్తే.. వారెవ్వా అనాల్సిందే.. !
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా- న్యూజిలాండ్ తొలి టీ-20లో పాండ్యా అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. చాహాల్ ఓవర్లో మార్టిన్ గుఫ్టిల్ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్‌లో ఉన్న హర్ధిక్ పాండ్యాకు దొరికిపోయాడు. బౌండరీ దగ్గర్లో ఉన్న పాండ్యా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. పాండ్యా మ్యాజిక్‌తో న్యూజిల్యాండ్ ఓపెనర్ గుప్టిల్ వెనుదిరగడంతో అభిమానుల ఆనందానకి అవధులు లేకుండా పోయాయి. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (51 బంతుల్లో80: 9ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ(55 బంతుల్లో 80: 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. కివీస్ బౌలర్లలో సోదీ 2 వికెట్లు, బౌల్ట్ కు ఓ వికెట్ దక్కాయి. -
గప్టిల్.. అంత ఈజీ కాదు: కుంబ్లే
కోల్ కతా: ఇప్పటికే ఒక టెస్టులో ఓటమితో మూడు మ్యాచ్ ల సిరీస్ లో వెనుకబడిపోయిన న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మైండ్ గేమ్ ను మొదలు పెట్టేశాడు. ప్రధానంగా కివీస్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ను లక్ష్యంగా చేసుకుని అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన గప్టిల్ కు ఇక్కడ పరిస్థితుల్లో ఆడాలంటే అంత ఈజీ కాదంటూ వ్యాఖ్యానించాడు.'గప్టిల్ ఒక నాణ్యమైన ఆటగాడు. అంతే కాదు భారీ షాట్లు కొట్టగల సమర్ధుడు. అయితే ప్రస్తుతం ఫామ్ లేని గప్టిల్ సత్తా చాటుకోవాలంటే ఇక్కడ అంత ఈజీ కాదు. నీ దూకుడు ఇక్కడ పని చేయదు 'అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. గత మ్యాచ్ లో కొనసాగించిన ఆట తీరునే రెండో టెస్టులో కూడా కొనసాగిస్తామని కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ప్రత్యర్థి జట్టుకు అత్యంత కీలకమని, వారి ఓపెనర్లను ముందుగా పెవిలియన్ కు పంపి ఒత్తిడి తెస్తామన్నాడు. మరోవైపు మార్క్ క్రెయిగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జీతన్ పటేల్ ను కుంబ్లే ప్రశంసించాడు. గత కొంతకాలంగా జీతన్ ఆట తీరు ఆకట్టుకుందన్నాడు. రెండో టెస్టులో ఆడబోతున్న జీతన్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు కుంబ్లే పేర్కొన్నాడు. -
దుమ్మురేపిన గప్టిల్
మొహాలి:వరల్డ్ టీ 20లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ దుమ్మురేపాడు. గప్టిల్(80;48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కళాత్మక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. గప్టిల్ కు కెప్టెన్ విలియమ్సన్ చక్కటి సహకారం అందించాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద విలియమ్సన్(17) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో మున్రో(7) కూడా పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ తడబడినట్లు కనిపించింది. కాగా, కోరీ అండర్సన్(21;14 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ మళ్లీ గాడిలో పడింది. ఆపై రాస్ టేలర్(36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ 181 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచకల్గింది. ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. -
దుమ్మురేపిన గుప్టిల్, లాథమ్
లక్ష్య ఛేదనలో కివీస్ కొత్త రికార్డు హరారే : ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (138 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), లాథమ్ (116 బంతుల్లో 110 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 42.2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది. దీంతో వికెట్లు నష్టపోకుండా అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా కొత్త రికార్డును సృష్టించింది. గతంలో 2011 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక వికెట్ నష్టపోకుండా 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. సికిందర్ రజా (95 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.