గేల్‌ను మళ్లీ వద్దనుకున్నారు.. | Chris gayle goes unsold again | Sakshi
Sakshi News home page

గేల్‌ను మళ్లీ వద్దనుకున్నారు..

Published Sun, Jan 28 2018 3:01 PM | Last Updated on Sun, Jan 28 2018 3:05 PM

Chris gayle goes unsold again - Sakshi

బెంగళూరు: ట్వంటీ 20 స్పెషలిస్టులుగా ముద్రపడిన క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌), మార్టిన్‌ గప్టిల్‌(న్యూజిలాండ్‌)లకు ఐపీఎల్‌-11 వేలంలో మరోసారి చుక్కెదురైంది. శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఈ ఇద్దరి క్రికెటర్లు.. ఆదివారం కొనసాగుతున్న వేలంలో కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ స్టార్‌ క్రికెటర్ల వైపు కనీసం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తికూడా చూడకపోవడం గమనార్హం. వీరిద్దరి కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఫ్రాంచైజీలు ఎటువంటి ఆసక్తికనబరచలేదు.

మరొకవైపు నిన్న అమ్ముడుపోని భారత క్రికెటర్‌ మురళీ విజయ్‌కు ఊరట లభించింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకు చెన్నె సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. అటు తరువాత శామ్‌ బిల్లింగ్స్‌ను కూడా సీఎస్‌కే దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 1 కోటికే సీఎస్‌కే కొనుగోలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement