క్రిస్ గేల్-గప్టిల్
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ లో భాగంగా తొలి రోజు వేలంలో పలువురు ఆటగాళ్ల ధరలకు రెక్కలొస్తే, మరికొందరు స్టార్ క్రికెటర్లకు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ రోజు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో బెన్ స్టోక్స్(రూ.12.50 కోట్లు) అత్యధిక మొత్తంలో అమ్ముడు పోగా, మనీష్ పాండే(రూ.11.00 కోట్లు) కూడా రికార్డు ధర దక్కించుకున్నాడు. కాగా, మొదటి రోజు వేలంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కు చుక్కెదురైంది. క్రిస్ గేల్ కనీస ధర రూ. 2.00 కోట్లు ఉండగా, అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ట్వంటీ 20ల్లో ఘనమైన రికార్డు ఉన్న గేల్ కు అత్యధిక మొత్తం దక్కుతుందని తొలుత భావించారు. కాగా, అనూహ్యంగా గేల్ ను పక్కకు పెట్టడంతో ఐపీఎల్ వేలంలో ఏదైనా సాధ్యమనేది మరోసారి రుజువైంది.
అదే క్రమంలో జో రూట్, మురళీ విజయ్, హషీమ్ ఆమ్లా, మార్టిన్ గప్టిల్, జేమ్స్ ఫాల్కనర్, పార్థీవ్ పటేల్, జానీ బెయిర్ స్టోలను సైతం కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో వీరంతా ఈసారి ఐపీఎల్ కు దాదాపు దూరమయ్యారనే చెప్పాలి. ఒకవేళ ఆదివారం చివరిరోజు వేలంలో ఆయా ఆటగాళ్లకు నిర్ణయించబడి ఉన్న కనీస ధర కంటే తక్కువ మొత్తానికి ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన పక్షంలో మాత్రమే వారు ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంది.
అన్ సోల్డ్ క్రికెటర్లు..
నమాన్ ఓజా( కనీస ధర రూ. 75 లక్షలు)
బెయిర్ స్టో(కనీస ధర రూ.1.5 కోట్లు)
పార్థీవ్ పటేల్(కనీస ధర రూ.1 కోటి)
ఫాల్కనర్(కనీస ధర రూ. 2 కోట్లు)
గప్టిల్(కనీస ధర రూ. 75 లక్షలు)
ఆమ్లా(కనీస ధర రూ.1.5 కోట్లు)
మురళీ విజయ్( కనీస ధర రూ.2 కోట్లు)
జో రూట్(కనీస ధర రూ.1.5 కోట్లు)
క్రిస్ గేల్(కనీస ధర రూ.2 కోట్లు)
ఇషాంత్ శర్మ
లసిత్ మలింగా
Comments
Please login to add a commentAdd a comment