రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో నిలిచిన మనీష్‌రెడ్డి
ఆంధ్రా రంజీ జట్టు తరఫున ప్రాతినిధ్యం
పెద్దదోర్నాల: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రేసులో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన గొలమారు మనీష్‌రెడ్డి ఉన్నారు. గొలమారు ఉమామహేశ్వరరెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. ఉమామహేశ్వరరెడ్డి తండ్రి గొలమారు పెద్దతాతిరెడ్డి గతంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అఖిల భారత రెడ్ల సత్రం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తించారు.
ఉమామహేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు మనీష్‌రెడ్డి చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని, ఆంఽధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలానికి సిద్ధమయ్యారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలం రిజిస్టర్ చేసుకున్నారు. పలు ఐపీఎల్ జట్లు కొత్త కుర్రాళ్ల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మనీష్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా సోమవారం కూడా నిర్వహించనున్న ఐపీఎల్ వేలంలో మనీష్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తూ మనీష్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment