
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు విశాఖ వేదికగా జరుగనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. మార్చి 30న ఢిల్లీ సన్‌రైజర్స్ హైదరబాద్‌ను ఢీకొట్టనుంది. ఢిల్లీ, లక్నో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఢిల్లీ, సన్‌రైజర్స్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. లక్నోతో జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిన్ననే విశాఖకు చేరుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖను రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో ఇక్కడ బీసీసీఐ రెండు మ్యాచ్‌లను షెడ్యూల్ చేసింది. గతేడాది కూడా ఢిల్లీ రెండు మ్యాచ్‌లను విశాఖలో ఆడింది. నాడు సీఎస్‌కే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లకు మంచి ప్రజాదరణ లభించింది.
అయితే ఈ సీజన్‌లో జరుగబోయే మ్యాచ్‌లకే జనాదరణ కరువైంది. మ్యాచ్‌లకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల టికెట్ల అమ్మకాలు నత్త నడకన సాగుతున్నాయి. మ్యాచ్‌లపై జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తొలి మ్యాచ్ (లక్నో) ప్రారంభానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పటికీ ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముడుపోలేదు. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి నాలుగు రోజులవుతున్నా ఏమాత్రం జనాదరణ కనిపించడం లేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను విశాఖలోనే (లక్నో) ఆడనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ అక్షర్ పటేల్ నేతృత్వంలో కొంగొత్త జట్టుతో ఉరకలేస్తుంది. కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అక్షర్‌కు డిప్యూటీగా అనుభవజ్ఞుడైన ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమించింది ఢిల్లీ మేనేజ్‌మెంట్.
ఈ సీజన్‌లో ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్‌లతో కూడిన ప్రమాదకర బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, నటరాజన్‌లతో బౌలింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా ఉంది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..
అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్
Comments
Please login to add a commentAdd a comment