క్రికెట్‌లో సత్తా చాటుతున్న గుంటూరు బాలిక
బీసీసీఐ అండర్–15 టోర్నీలో వెలుగులోకి ప్రతిభ
ల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు కష్టపడేతత్వంతో రాణింపు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొంచెం ఊహ వచ్చిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కాలక్రమేణా తగ్గిపోతుంది. అందుకే వారు స్నేహితులపైనా, సెల్‌ఫోన్స్‌లాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌పై ఎక్కువ ఆధారపడుతుండడం మనం తరచూ చూస్తుంటాం. పిల్లలకు విషయాలు తెలుస్తున్న సమయంలో వారితో ఎక్కువ టైం గడిపితే వారిలోని అభిరుచులు, అలవాట్లు తెలుసుకునే వీలుంటుంది. ఇదే చేశారు ఎస్‌వీఎన్ కాలనీకి చెందిన కాట్రగడ్డ శేషసాయి, హేమ ప్రభ దంపతులు. తమ ఒక్కగానొక్క కుమార్తె దీక్షను చిన్న వయస్సులోనే క్రికెట్ ఆటలో చేరి్పంచి మార్గదర్శకులుగా మారారు. అందుకే దీక్ష కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే బీసీసీఐ అండర్–15 బాలికల క్రికెట్‌లో సత్తా చాటి ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో కీలక భూమిక పోషించింది. ఓపెన్ బ్యాటర్‌గానూ, వికెట్ కీపర్‌గానూ రాణించింది.
కన్నవారి ప్రోత్సాహంతో..
దీక్ష తండ్రి శేషసాయి ఒకప్పుడు క్రికెటర్. దీక్షకూ క్రికెట్‌పై మక్కువ ఏర్పడింది. ఆమెకు ఆట నేర్పడంతో దీక్ష అండర్–13 జిల్లా, జోనల్‌క్రికెట్‌లో రాణించింది. గత నెలలో జరిగిన బీసీసీఐ అండర్–15 బాలికల టోర్నీకి ఆంధ్ర జట్టుకు ఎంపికైంది. కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఆ టోరీ్నలో ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. దీంతో నేరుగా ఆంధ్ర జట్టుకు బీసీసీఐ తదుపరి టోరీ్నకి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. దీక్ష బ్యాటర్‌గానూ, కీపర్‌గానూ రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మంగళవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దీక్షను అభినందించారు.
తల్లిదండ్రులే స్ఫూర్తి
నాన్నను చూసి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నా. అమ్మ నాతో మ్యాచ్‌లకు వస్తుంది. నాకు ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది. కేవలం నేను క్రికెట్‌ను శ్రద్ధగా ఆడాలని మాత్రమే వారు చెబుతుంటారు. కోచ్‌ల సహకారం కూడా ఎంతో ఉంది. ఏసీఏతోపాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. ముందు సీనియర్స్ విభాగానికి రావాలి. ఆ తర్వాత నాకంటూ లక్ష్యాలు పెట్టుకుంటా. పేరెంట్స్ సహకారముంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చు.
– దీక్ష
Comments
Please login to add a commentAdd a comment