Under-15
-
క్రికెట్లో మన ‘దీక్ష’.. మెరిసింది! సత్తా చాటుతున్న గుంటూరు బాలిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొంచెం ఊహ వచ్చిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కాలక్రమేణా తగ్గిపోతుంది. అందుకే వారు స్నేహితులపైనా, సెల్ఫోన్స్లాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌పై ఎక్కువ ఆధారపడుతుండడం మనం తరచూ చూస్తుంటాం. పిల్లలకు విషయాలు తెలుస్తున్న సమయంలో వారితో ఎక్కువ టైం గడిపితే వారిలోని అభిరుచులు, అలవాట్లు తెలుసుకునే వీలుంటుంది. ఇదే చేశారు ఎస్వీఎన్ కాలనీకి చెందిన కాట్రగడ్డ శేషసాయి, హేమ ప్రభ దంపతులు. తమ ఒక్కగానొక్క కుమార్తె దీక్షను చిన్న వయస్సులోనే క్రికెట్ ఆటలో చేరి్పంచి మార్గదర్శకులుగా మారారు. అందుకే దీక్ష కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే బీసీసీఐ అండర్–15 బాలికల క్రికెట్లో సత్తా చాటి ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో కీలక భూమిక పోషించింది. ఓపెన్ బ్యాటర్‌గానూ, వికెట్ కీపర్‌గానూ రాణించింది. కన్నవారి ప్రోత్సాహంతో.. దీక్ష తండ్రి శేషసాయి ఒకప్పుడు క్రికెటర్. దీక్షకూ క్రికెట్‌పై మక్కువ ఏర్పడింది. ఆమెకు ఆట నేర్పడంతో దీక్ష అండర్–13 జిల్లా, జోనల్క్రికెట్లో రాణించింది. గత నెలలో జరిగిన బీసీసీఐ అండర్–15 బాలికల టోర్నీకి ఆంధ్ర జట్టుకు ఎంపికైంది. కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఆ టోరీ్నలో ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. దీంతో నేరుగా ఆంధ్ర జట్టుకు బీసీసీఐ తదుపరి టోరీ్నకి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. దీక్ష బ్యాటర్‌గానూ, కీపర్‌గానూ రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మంగళవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దీక్షను అభినందించారు. తల్లిదండ్రులే స్ఫూర్తి నాన్నను చూసి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నా. అమ్మ నాతో మ్యాచ్‌లకు వస్తుంది. నాకు ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది. కేవలం నేను క్రికెట్‌ను శ్రద్ధగా ఆడాలని మాత్రమే వారు చెబుతుంటారు. కోచ్‌ల సహకారం కూడా ఎంతో ఉంది. ఏసీఏతోపాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. ముందు సీనియర్స్ విభాగానికి రావాలి. ఆ తర్వాత నాకంటూ లక్ష్యాలు పెట్టుకుంటా. పేరెంట్స్ సహకారముంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చు. – దీక్ష -
రన్నరప్‌గా ప్రాషి జోషి
సాక్షి, హైదరాబాద్: ఏపీ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా క్రీడాకారిణి, టాప్ సీడ్ ప్రాషి జోషి రన్నరప్‌గా నిలిచింది. వరంగల్‌లో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆమె తుదిమెట్టుపై చతికిలబడింది. బాలికల అండర్-15 సింగిల్స్ తుదిపోరులో రెండో సీడ్ ఎ. అక్షిత (తూర్పు గోదావరి) 22-20, 21-14తో ప్రాషిపై విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. అంతకుముందు సెమీస్‌లో ప్రాషి 21-15, 21-8తో ఐదో సీడ్ షబానా బేగం (కర్నూలు)పై, అక్షిత 21-15, 21-19తో ప్రీతి (విజయనగరం)పై గెలిచారు. బాలుర సింగిల్స్ ట్రోఫీని టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్ (తూర్పుగోదావరి) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 21-10, 21-16తో కె. జగదీశ్ (విశాఖపట్నం)పై గెలుపొందాడు. అండర్-15 బాలుర డబుల్స్ టైటిల్‌ను సాత్విక్-కృష్ణప్రసాద్ (తూర్పు గోదావరి)జోడి, బాలికల డబుల్స్ టైటిల్‌ను మేఘ-షబానా బేగం (కర్నూలు) జంట దక్కించుకున్నాయి.