రన్నరప్‌గా ప్రాషి జోషి | The runner-up prasi Joshi | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా ప్రాషి జోషి

Published Sun, Aug 3 2014 12:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

The runner-up prasi Joshi

సాక్షి, హైదరాబాద్: ఏపీ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా క్రీడాకారిణి, టాప్ సీడ్ ప్రాషి జోషి రన్నరప్‌గా నిలిచింది. వరంగల్‌లో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆమె తుదిమెట్టుపై చతికిలబడింది. బాలికల అండర్-15 సింగిల్స్ తుదిపోరులో రెండో సీడ్ ఎ. అక్షిత (తూర్పు గోదావరి) 22-20, 21-14తో ప్రాషిపై విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది.
 
 అంతకుముందు సెమీస్‌లో ప్రాషి 21-15, 21-8తో ఐదో సీడ్ షబానా బేగం (కర్నూలు)పై, అక్షిత 21-15, 21-19తో ప్రీతి (విజయనగరం)పై గెలిచారు. బాలుర సింగిల్స్ ట్రోఫీని టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్ (తూర్పుగోదావరి) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 21-10, 21-16తో కె. జగదీశ్ (విశాఖపట్నం)పై గెలుపొందాడు. అండర్-15 బాలుర  డబుల్స్ టైటిల్‌ను సాత్విక్-కృష్ణప్రసాద్ (తూర్పు గోదావరి)జోడి, బాలికల డబుల్స్ టైటిల్‌ను మేఘ-షబానా బేగం (కర్నూలు) జంట దక్కించుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement