IPL 2025 Auction: ఏయే ఫ్రాంచైజీల దగ్గర ఎంత మొత్తం మిగిలి ఉంది..? | IPL 2025 Retentions: Remaining Purse Of All 10 Teams At Mega Auction, Check Out For More Insights | Sakshi
Sakshi News home page

IPL 2025 Purse Remaining: ఏయే ఫ్రాంచైజీల దగ్గర ఎంత మొత్తం మిగిలి ఉంది..?

Published Fri, Nov 1 2024 6:52 AM | Last Updated on Fri, Nov 1 2024 10:01 AM

IPL 2025 RETENTIONS: REMAINING PURSE OF EACH TEAM AT MEGA AUCTION

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్‌ జాబితాను నిన్న (అక్టోబర్‌ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్‌ బ్యాలెన్స్‌ మిగిలిందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రిటెన్షన్స్‌లో అతి తక్కువ ఖర్చు చేసింది పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ. టోటల్‌ పర్స్‌ వాల్యూ 120 కోట్లైతే ఈ ఫ్రాంచైజీ కేవలం 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ శశాంక్‌ సింగ్‌ను 5.5 కోట్లకు, ప్రభ్‌మన్‌సిమ్రన్‌ సింగ్‌ను 4 కోట్లకు రిటైన్‌ చేసుకుని మిగతా ఆటగాళ్లందరినీ వేలానికి వదిలేసింది. 

ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 110.5 కోట్లు బ్యాలెన్స్‌ ఉంది. వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీల్లో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఇంత మొత్తం లేదు. కాబట్టి పంజాబ్‌ కింగ్స్‌ వేలంలో భారీ కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.

పంజాబ్‌ కింగ్స్‌ తర్వాత అత్యధిక పర్స్‌ బ్యాలెన్స్‌ ఆర్సీబీ దగ్గర ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో 37 కోట్లు ఖర్చు చేసి ఇంకా 83 కోట్ల పర్స్‌ బ్యాలెన్స్‌ కలిగి ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో భాగంగా విరాట్‌ కోహ్లికి 21 కోట్లు, రజత్‌ పాటిదార్‌కు 11 కోట్లు, యశ్‌ దయాల్‌కు 5 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్‌, ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్‌ బ్యాలెన్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద ఉంది. ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 73 కోట్ల బ్యాలెన్స్‌ ఉంది.

పంజాబ్‌, ఆర్సీబీ, ఢిల్లీ తర్వాత ఎల్‌ఎస్‌జీ, గుజరాత్‌, సీఎస్‌కే, కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద వరుసగా 69 కోట్లు, 69, 55, 51, 45, 45, 41 కోట్ల బ్యాలెన్స్‌ ఉంది. అన్ని ఫ్రాంచైజీల దగ్గర భారీ మొత్తం మిగిలి ఉండటంతో ఈ సారి వేలం ఆసక్తికరంగా మారనుంది. రిటెన్షన్స్‌లో చాలా ఫ్రాంచైజీలు స్టార్‌ ఆటగాళ్లను వదిలి పెట్టడంతో సదరు స్టార్‌ ఆటగాళ్ల కోసం​ వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది.  

చదవండి: ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా విడుదల

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement