Retention
-
మహిళల ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా ఇదే..!
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) విడుదల చేశాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది.ఏ ఫ్రాంచైజీ ఎవరిని రీటైన్ చేసుకుంది, ఎవరిని వేలానికి విడిచిపెట్టింది..?ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగెజ్, తానియా భాటియా, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, మారిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాస్సెన్, టైటాస్ సాధు, మిన్నూ మణి, స్నేహ దీప్తిఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీళ్లే..లారా హ్యారిస్, అశ్వని కుమారి, పూనమ్ యాదవ్, అపర్ణ మొండల్ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇసబెల్ వాంగ్ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్యూపీ వారియర్జ్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..అలైసా హీలీ (కెప్టెన్), కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, చమారీ ఆటపట్టు, గ్రేస్ హ్యారిస్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అంజలి సర్వని, గౌహెర్ సుల్తానా, పూనమ్ ఖెమ్నార్, ఉమా ఛెత్రీ, వ్రింద దినేశ్యూపీ వారియర్జ్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..లారెన్ బెల్, పర్షవీ చోప్రా, లక్ష్మీ యాదవ్, ఎస్ యషశ్రీగుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్, లారా వోల్వార్డ్ట్, దయాలన్ హేమలత, తనూజా కన్వర్, షబ్నిమ్ షకీల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, మేఘన సింగ్గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్స్ జాబితా ఇదే..స్నేహ్ రాణా, కేథరీన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నుమ్ పఠాన్, లియా తహుహుఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది..గుజరాత్- 4.4 కోట్లుయూపీ వారియర్జ్- 3.9 కోట్లుఆర్సీబీ- 3.25 కోట్లుముంబై ఇండియన్స్- 2.65 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్- 2.5 కోట్లుఏ ఫ్రాంచైజీ ఇంకా ఎంత మందిని కొనగోలు చేయొచ్చంటే..?ఆర్సీబీ- 4ముంబై ఇండియన్స్- 4ఢిల్లీ క్యాపిటల్స్- 4యూపీ వారియర్జ్- 3గుజరాత్ జెయింట్స్- 4 -
IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్సీబీతోనే!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్‌కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను. ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు. విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్ ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్‌ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్‌కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్‌కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది. -
IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేశారు. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో పలువురు జాక్‌పాట్ కొట్టారు. బేస్ ధర నుంచి ఏకంగా కోట్లకు పడగలెత్తారు. రిటెన్షన్స్‌లో అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్. ఈ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ను రాయల్స్ 20 లక్షల నుంచి 14 కోట్లకు సొంతం చేసుకుంది. జురెల్ తర్వాత సీఎస్కే పతిరణ, కేకేఆర్ రింకూ సింగ్ అత్యధికంగా లబ్ది పొందారు. పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లకు.. రింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. వీరి తర్వాత రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ 20 లక్షల బేస్ ధర నుంచి 11 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. ఓవరాల్‌గా చూస్తే రిటెన్షన్స్ అనంతరం అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. క్లాసెన్‌కు గత సీజన్ శాలరీ 5.25 కోట్లు కాగా.. ఎస్ఆర్హెచ్ ఈసారి అతన్ని ఏకంగా 23 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే క్లాసెన్ శాలరీ ఏకంగా 17.75 కోట్లు పెరిగింది.రిటెన్షన్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాళ్లు వీరే..!హెన్రిచ్ క్లాసెన్ 5.25 కోట్ల నుంచి 23 కోట్లుధృవ్ జురెల్ 20 లక్షల నుంచి 14 కోట్లుమతిశ పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లురింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లురజత్ పాటిదార్ 20 లక్షల నుంచి 11 కోట్లుమయాంక్ యాదవ్ 20 లక్షల నుంచి 11 కోట్లుసాయి సుదర్శన్ 20 లక్షలు నుంచి 8.5 కోట్లునితీశ్ కుమార్ రెడ్డి 20 లక్షల నుంచి 6 కోట్లుశశాంక్ సింగ్ 20 లక్షల నుంచి 5.5 కోట్లు -
IPL రిటెన్షన్ లిస్ట్ విడుదల..అత్యధిక ధర ఎవరికంటే?
-
IPL 2025: ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకున్నాయి. రిటెన్షన్స్ అనంతరం ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే.పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుశశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుపంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుశిఖర్ ధవన్ (కెప్టెన్)రిలీ రొస్సోహర్ప్రీత్ సింగ్ భాటియాశివమ్ సింగ్అధర్వ తైడేఅశుతోష్ శర్మవిశ్వనాథ్ సింగ్సికందర్ రజాసామ్ కర్రన్క్రిస్ వోక్స్రిషి ధవన్తనయ్ త్యాగరాజన్జానీ బెయిర్స్టోజితేశ్ శర్మరాహుల్ చాహర్విధ్వత్ కావేరప్పహర్షల్ పటేల్నాథన్ ఎల్లిస్అర్షదీప్ సింగ్ప్రిన్స్ చౌదరీహర్ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుపాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లుగ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్లక్నో సూపర్ జెయింట్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లునికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ వదిలేసిన ఆటగాళ్లుప్రేరక్ మన్కడ్దేవ్దత్ పడిక్కల్కైల్ మేయర్స్కృనాల్ పాండ్యామార్కస్ స్టోయినిస్అర్షిన్ కులకర్ణిదీపక్ హుడాఆస్టన్ అగర్కృష్ణప్ప గౌతమ్క్వింటన్ డికాక్కేఎల్ రాహుల్ (కెప్టెన్)మణిమారన్ సిద్దార్థ్యుద్ద్వీర్సింగ్ చరక్నవీన్ ఉల్ హక్యశ్ ఠాకూర్షమార్ జోసఫ్అమిత్ మిశ్రాఅర్షద్ ఖాన్మ్యాట్ హెన్రీకోల్కతా నైట్‌రైడర్స్ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లురింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసిన ఆటగాళ్లుమనీశ్ పాండేనితీశ్ రాణాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)సకీబ్ హుసేన్షెర్ఫాన్ రూథర్ఫోర్డ్వెంకటేశ్ అయ్యర్అనుకుల్ రాయ్అంగ్క్రిష్ రఘువంశీరహ్మానుల్లా గుర్భాజ్శ్రీకర్ భరత్వైభవ్ అరోరాసుయాశ్ శర్మచేతన్ సకారియామిచెల్ స్టార్క్దుష్మంత చమీరాఅల్లా ఘజన్ఫర్ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ఆటగాళ్లురికీ భుయ్యశ్ ధుల్డేవిడ్ వార్నర్పృథ్వీ షాజేక్ ఫ్రేసర్ మెక్గుర్క్స్వస్తిక్ చికారలలిత్ యాదవ్సుమిత్ కుమార్గుల్బదిన్ నైబ్షాయ్ హోప్కుమార్ కుషాగ్రారిషబ్ పంత్ (కెప్టెన్)ఇషాంత్ శర్మజై రిచర్డ్సన్రసిఖ్ దార్ సలామ్విక్కీ ఓస్త్వాల్ఖలీల్ అహ్మద్ముకేశ్ కుమార్అన్రిచ్ నోర్జేప్రవీణ్ దూబేలిజాడ్ విలియమ్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లుసుయాశ్ ప్రభుదేశాయ్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్మహిపాల్ లోమ్రార్మనోజ్ భండగేసౌరవ్ చౌహాన్స్వప్నిల్ సింగ్టామ్ కర్రన్అనూజ్ రావత్కర్ణ్ శర్మవిజయ్కుమార్ వైశాఖ్అల్జరీ జోసఫ్రాజన్ కుమార్మయాంక్ డాగర్లోకీ ఫెర్గూసన్మొహమ్మద్ సిరాజ్హిమాన్షు శర్మఆకాశ్దీప్చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుఅజింక్య రహానేషేక్ రషీద్సమీర్ రిజ్విడారిల్ మిచెల్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రనిషాంత్ సంధుమిచెల్ సాంట్నర్అరవెల్లి అవనీశ్అజయ్ జాదవ్ మండల్హంగేర్కర్ముకేశ్ చౌదరీప్రశాంత్ సోలంకిశార్దూల్ ఠాకూర్సిమ్రన్జీత్ సింగ్తుషార్ దేశ్పాండేమహీశ్ తీక్షణరిచర్డ్ గ్లీసన్దీపక్ చాహర్ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుజస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లుటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్నేహల్ వధేరానమన్ ధిర్శివాలిక్ శర్మషమ్స్ ములానీశ్రేయస్ గోపాల్రొమారియో షెపర్డ్కుమార్ కార్తీకేయమొహమ్మద్ నబీఅర్జున్ టెండూల్కర్ఇషాన్ కిషన్హార్విక్ దేశాయ్పియూశ్ చావ్లాఅన్షుల్ కంబోజ్గెరాల్డ్ కొయెట్జీఆకాశ్ మధ్వాల్నువాన్ తుషారక్వేనా మపాకాలూక్ వుడ్గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లుగుజరాత్ టైటాన్స్ వదిలేసిన ఆటగాళ్లుడేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్అభినవ్ మనోహర్విజయ్ శంకర్అజ్మతుల్లా ఒమర్జాయ్వృద్దిమాన్ సాహామాథ్యూ వేడ్శరత్ బీఆర్కార్తీక్ త్యాగినూర్ అహ్మద్రవిశ్రీనివాసన్ సాయి కిషోర్జాషువ లిటిల్స్పెన్సర్ జాన్సన్మొహిత్ శర్మదర్శన్ నల్కండేజయంత్ యాదవ్ఉమేశ్ యాదవ్సందీప్ వారియర్మారవ్ సుతార్గుర్నూర్ బ్రార్రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్ వదిలేసిన ఆటగాళ్లు..రోవ్‌మన్ పొవెల్శుభమ్ దూబేతనుశ్ కోటియన్రవిచంద్రన్ అశ్విన్డొనొవన్ ఫెరియెరాకునాల్ సింగ్ రాథోర్టామ్ కొహ్లెర్-కాడ్మోర్ఆవేశ్ ఖాన్ట్రెంట్ బౌల్ట్నవ్దీప్ సైనీనండ్రే బర్గర్యుజ్వేంద్ర చహల్కుల్దీప్ సేన్ ఆబిద్ ముస్తాక్కేశవ్ మహారాజ్ -
IPL 2025: వేలంలో పాల్గొనబోయే స్టార్ ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఫ్రాంచైజీలు వదిలేసిన అనంతరం వేలానికి రానున్న స్టార్ ఆటగాళ్లు వీరే.రిలీ రొస్సో సామ్ కర్రన్ జానీ బెయిర్‌స్టో గ్లెన్ ఫిలిప్స్ఎయిడెన్ మార్క్రమ్మార్కస్ స్టోయినిస్కేఎల్ రాహుల్ (కెప్టెన్)శిఖర్ ధవన్ (కెప్టెన్)క్వింటన్ డికాక్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)మిచెల్ స్టార్క్రిషబ్ పంత్ (కెప్టెన్)డేవిడ్ వార్నర్జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్ఇషాన్ కిషన్డేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్జోస్ బట్లర్ట్రెంట్ బౌల్ట్రవిచంద్రన్ అశ్విన్యుజ్వేంద్ర చహల్చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025 Auction: ఏయే ఫ్రాంచైజీల దగ్గర ఎంత మొత్తం మిగిలి ఉంది..?
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ మిగిలిందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.రిటెన్షన్స్‌లో అతి తక్కువ ఖర్చు చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లైతే ఈ ఫ్రాంచైజీ కేవలం 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను 5.5 కోట్లకు, ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్‌ను 4 కోట్లకు రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లందరినీ వేలానికి వదిలేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 110.5 కోట్లు బ్యాలెన్స్ ఉంది. వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీల్లో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఇంత మొత్తం లేదు. కాబట్టి పంజాబ్ కింగ్స్ వేలంలో భారీ కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.పంజాబ్ కింగ్స్ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఆర్సీబీ దగ్గర ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో 37 కోట్లు ఖర్చు చేసి ఇంకా 83 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కలిగి ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో భాగంగా విరాట్ కోహ్లికి 21 కోట్లు, రజత్ పాటిదార్‌కు 11 కోట్లు, యశ్ దయాల్‌కు 5 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్, ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉంది. ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 73 కోట్ల బ్యాలెన్స్ ఉంది.పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ తర్వాత ఎల్ఎస్జీ, గుజరాత్, సీఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ వద్ద వరుసగా 69 కోట్లు, 69, 55, 51, 45, 45, 41 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అన్ని ఫ్రాంచైజీల దగ్గర భారీ మొత్తం మిగిలి ఉండటంతో ఈ సారి వేలం ఆసక్తికరంగా మారనుంది. రిటెన్షన్స్‌లో చాలా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను వదిలి పెట్టడంతో సదరు స్టార్ ఆటగాళ్ల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్పాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్రైడర్స్రింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుముంబై ఇండియన్స్జస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుగుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లు -
IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను (ఒక ఆర్‌టీఎమ్‌తో పాటు) రిటైన్ చేసుకోవచ్చని ఇటీవల జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఖరారైంది. ఫ్రాంచైజీలు అంట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు తెలియజేయడానికి అక్టోబర్ 31ని డెడ్‌లైన్‌గా విధించారు. ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ఒకరు లేదా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండవచ్చు. ఫ్రాంచైజీ పర్స్ విలువను రూ. 90 కోట్ల నుంచి రూ. 120 కోట్లకు పెంచారు. ఐపీఎల్ రిటెన్షన్స్‌పై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని అంటిపెట్టుకోనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకోబోతుందని సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లపై మనం కూడా ఓ లుక్కేద్దాం.ముంబై ఇండియన్స్హార్దిక్ పాండ్యాసూర్యకుమార్ యాదవ్రోహిత్ శర్మజస్ప్రీత్ బుమ్రాతిలక్ వర్మనేహల్ వధేరాపంజాబ్ కింగ్స్సామ్ కర్రన్శశాంక్ సింగ్అర్షదీప్ సింగ్హర్షల్ పటేల్లియామ్ లివింగ్స్టోన్కగిసో రబాడఆర్సీబీవిరాట్ కోహ్లిఫాఫ్ డుప్లెసిస్విజయ్కుమార్ వైశాఖ్విల్ జాక్స్మొహమ్మద్ సిరాజ్రజత్ పాటిదార్ఢిల్లీ క్యాపిటల్స్రిషబ్ పంత్అక్షర్ పటేల్అభిషేక్ పోరెల్జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ట్రిస్టన్ స్టబ్స్కుల్దీప్ యాదవ్రాజస్థాన్ రాయల్స్సంజూ శాంసన్జోస్ బట్లర్సందీప్ శర్మయశస్వి జైస్వాల్రియాన్ పరాగ్యుజ్వేంద్ర చహల్కేకేఆర్శ్రేయస్ అయ్యర్ఆండ్రీ రసెల్హర్షిత్ రాణారింకూ సింగ్సునీల్ నరైన్వెంకటేశ్ అయ్యర్సీఎస్కేరుతురాజ్ గైక్వాడ్రవీంద్ర జడేజాఎంఎస్ ధోనిశివమ్ దూబేడెవాన్ కాన్వేమతీష పతిరణలక్నో సూపర్ జెయింట్స్కేఎల్ రాహుల్దేవదత్ పడిక్కల్మార్కస్ స్టోయినిస్నికోలస్ పూరన్క్వింటన్ డికాక్మయాంక్ యాదవ్గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్డేవిడ్ మిల్లర్సాయి సుదర్శన్రషీద్ ఖాన్రాహుల్ తెవాతియాజాషువ లిటిల్సన్రైజర్స్ హైదరాబాద్పాట్ కమిన్స్ట్రవిస్ హెడ్హెన్రిచ్ క్లాసెన్నితీశ్కుమార్ రెడ్డిఅభిషేక్ శర్మగ్లెన్ ఫిలిప్స్చదవండి: పూరన్ సుడిగాలి శతకం -
ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవే.. ఆర్టీఎమ్ కార్డుకు నో ఛాన్స్..!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను (ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు) రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) కార్డుకు బీసీసీఐ ఒప్పుకోలేదని తెలుస్తోంది. బుధవారం బెంగళూరులో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలన్ని ఫైనలైజ్ అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.రైట్ టు మ్యాచ్ కార్డ్(ఆర్టీఎమ్) అంటే.. ఏదైనా ఫ్రాంచైజీ వేలంలో తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎమ్ కార్డు ద్వారా ఆ ధరను సదరు ప్రాంచైజీకి చెల్లించి ఆటగాడిని తిరిగి తీసుకోవచ్చు. 2018 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్‌ను చివరిసారిగా ఉపయోగించారు. ఆ తర్వాత బీసీసీఐ ఆర్టీఎమ్ కార్డ్ రూల్‌ను తొలగించింది. రానున్న మెగా వేలం తిరిగి ఈ రూల్‌ను ప్రవేశపెట్టాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బీసీసీఐ ఇందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేయగా.. దీనికి కూడా బీసీసీఐ నో చెప్పినట్లు సమాచారం. అంతిమంగా ఐదు రిటెన్షన్స్, నో ఆర్టీఎమ్, మెగా వేలానికి బీసీసీఐ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం జరిగే అవకాశం ఉంది.చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్ -
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితా ఇదే..?
వచ్చే ఐపీఎల్ సీజన్ (2025) నుంచి అన్ని ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. నిన్న (జులై 31) జరిగిన బీసీసీఐ-ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రతి ఫ్రాంచైజీ విదేశీ, స్వదేశీ, క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల పేర్లతో కూడిన జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీల వారీగా రిటైన్ చేసుకోయే ఆటగాళ్ల జాబితాలో ఇలా ఉండబోతుందంటూ నెట్టింట పలు జాబితాలు స్క్రోల్ అవుతున్నాయి.ఆర్సీబీ: విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, విల్ జాక్స్, మొహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లొమ్రార్రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, రోవ్‌మన్ పావెల్కేకేఆర్: సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్పంజాబ్ కింగ్స్: సామ్ కర్రన్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, జానీ రిలీ రొస్సో, నాథన్ ఇల్లిస్సన్రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, శివమ్ దూబే, మతీశ పతిరణ, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్లక్నో సూపర్ జెయింట్స్: మయాంక్ యాదవ్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యాగుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, స్పెన్సర్ జాన్సన్ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయెట్జీ -
ఐపీఎల్: ఆటగాళ్లకు మరిన్ని కోట్లు?!
ఐపీఎల్‌కు సంబంధించి బిగ్ అప్డేట్స్ అందుతున్నాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్ టు మ్యాచ్ (RTM) ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే సీజన్ నుంచి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ కూడా పెరుగనుందని సమాచారం. మెగా వేలం ఐదేళ్లకు ఒకసారి జరగనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ (జులై 31) జరిగే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల సమావేశంలో ఈ అంశాలపై క్లారిటీ రావచ్చు. కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది చివర్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు అన్ని ఫ్రాంచైజీలకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెంపుపై ఫ్రాంచైజీలు ఐపీఎల్ మేనేజ్మెంట్పై ఒత్తిడి తెస్తున్నాయి. -
IPL 2024: ఏప్రిల్ 16న ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ భేటి
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీల ఓనర్లతో భేటి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం. 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, పర్స్ వ్యాల్యూ తదితర అంశాలు అజెండాగా ఉండవచ్చని తెలుస్తుంది. గతేడాది మినీ వేలంలో 100 కోట్లకు పెరిగిన ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూ రానున్న సీజన్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, 2024 ఐపీఎల్ సీజన్ రసపట్టుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 13 మ్యాచ్‌లు అభిమానులకు కావల్సినంత మజాను అందించాయి. ఈ సీజన్లో ఇంకా 61 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సీఎస్కే, రాజస్థాన్, గుజరాత్, సన్‌రైజర్స్, లక్నో, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. వాంఖడే వేదికగా ఇవాళ (ఏప్రిల్ 1) ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. -
IPL 2024: ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఇలా..!
ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిలీజ్ (వదిలేయడం), రిటెన్షన్ (నిలబెట్టుకోవడం) ప్రక్రియకు నిన్న (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ పూర్తి వివరాలను వెల్లడించాయి. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని వదిలేసిందో, ఏ ఆటగాడిని నిలబెట్టుకుందో అన్న అంశంపై నిన్నటితో పూర్తి క్లారిటీ వచ్చింది. అలాగే పర్స్ (బడ్జెట్) వివరాలు, ఇంకా ఎంత మందిని తీసుకునే వెసులుబాటు ఉందనే అంశాలపై కూడా లెక్కలు తేలాయి. Salary cap for all IPL teams. pic.twitter.com/YYZOW69HlY — Johns. (@CricCrazyJohns) November 26, 2023 ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఇలా ఉంది.. చెన్నై సూపర్ కింగ్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). ఢిల్లీ క్యాపిటల్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-16 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4). గుజరాత్ టైటాన్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). కోల్‌కతా నైట్‌రైడర్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4). లక్నో సూపర్ జెయింట్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). ముంబై ఇండియన్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (15.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). పంజాబ్ కింగ్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (40.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4). రాజస్థాన్ రాయల్స్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3). ఐపీఎల్ 2024 వేలం తేదీ: 2023, డిసెంబర్ 19 వేదిక: దుబాయ్ -
IPL 2024: కేకేఆర్‌లో భారీ ప్రక్షాళన.. షకీబ్‌కు షాక్.. రసెల్, నరైన్ కొనసాగింపు
ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వదిలించుకోవడం) ప్రక్రియకు ఇవాళ (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు ఓ మోస్తరుగా మార్పులు చేర్పులు చేయగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం భారీ ప్రక్షాణన చేపట్టింది. ఈ ఫ్రాంచైజీ ఏకంగా 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసి, 13 మందిని అట్టిపెట్టుకుంది. కేకేఆర్ యాజమాన్యం కెప్టెన్ పేరును సైతం ప్రకటించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షకీబ్ అల్ హసన్ లిట్టన్ దాస్ ఆర్య దేశాయ్ డేవిడ్ వీస్ నారాయణ్ జగదీశన్ మన్దీప్ సింగ్ కుల్వంత్ కెజ్రోలియా శార్ధూల్ ఠాకూర్ లోకీ ఫెర్గూసన్ ఉమేశ్ యాదవ్ టిమ్ సౌథీ జాన్సన్ చార్లెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే.. నితీశ్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
2024 సీజన్ ప్లేయర్ల రిటెన్షన్.. స్టార్ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. The big names are back for Season 2!🙌 All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20. Are you ready for a firecracker of a tournament?💥 For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4 — International League T20 (@ILT20Official) July 10, 2023 గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్‌మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్‌లను దక్కించుకోగా.. గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది. మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు: దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్‌మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్ షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్` -
అశ్విన్ విషయంలో రాజస్తాన్ రాయల్స్ దిమ్మతిరిగే కౌంటర్
ఐపీఎల్ 2023కి ముందే టోర్నీలో పాల్గొనే పది జట్లు తమ ఆటగాళ్లకు సంబంధించిన రిటైన్, రిలీజ్ జాబితాను ప్రకటించేశాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఇక వేలంలో పాల్గొనబోయే ఫ్రాంజైజీలు ఆటగాళ్లను వదులుకున్న తర్వాత అందుబాటులో ఉన్న మొత్తాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రిలీజ్ చేసినట్లు వార్తలు రావడం సంచలనం కలిగించింది. టి20 క్రికెట్లో అశ్విన్ అంతగా మెరవకపోయినప్పటికి ఐపీఎల్లో మాత్రం అతనికి మంచి రికార్డే ఉంది. పైగా గతేడాది ఐపీఎల్లో అతను బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శనే కనబరిచాడు. జట్టుకు అతని సేవలు అవసరమున్న దశలో జట్టు నుంచి రిలీజ్ చేయడమేంటని అభిమానులు కామెంట్ చేశారు. కానీ రాజస్తాన్ రాయల్స్ ఈ వార్తలను ఖండిస్తూ అసలు అశ్విన్‌ను రిలీజ్ చేయలేదని ట్విటర్ వేదికగా ప్రకటించింది. రాజస్తాన్ రిటైన్ చేసుకున్న జాబితాలో అశ్విన్ పేరు కూడా ఉంది. అశ్విన్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్ చేసిన వారిని ఉద్దేశించి రాజస్తాన్.. ''నిజంగా ఇంతలా ఆలోచించారా'' అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ తమ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్లు పెట్టి అశ్విన్‌ను కొనుగోలు చేసింది. అప్పట్లో అశ్విన్ కోసం ఢిల్లీ కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 2022 ఫిబ్రవరి వేలంపాటలో పోటీ పడ్డాయి. చివరకు అశ్విన్ విషయంలో రాజస్థాన్ పైచేయి సాధించింది. ఇక అశ్విన్ ఐపీఎల్ 2022లో.. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 12 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లోనూ పరవాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్ 27.29 యావరేజ్‌తో 191 పరుగులు చేశాడు. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, , శురాస్సీ వాన్ డెర్ డస్సెన్భమ్ గర్వాల్, తేజస్ బరోకా Did you 𝘳𝘦𝘢𝘭𝘭𝘺 think?! 🤦♂️#iplretentions pic.twitter.com/2zFf9Zvlrv — Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టార్ ఆల్‌రౌండర్‌ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి ఎడిషన్ (16) కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు ఊపందుకున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రముఖ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. తదుపరి సీజన్‌కు ముంబై వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2010 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తూ, జట్టకు ఎన్నో అపురూప విజయాలు అందించిన పోలీని.. ఇలా అవమానకర రీతిలో తప్పించడం బాధాకరమని ఎంఐకి సంబంధించిన అతని ఫ్యాన్స్ వాపోతున్నారు. పోలార్డ్‌తో పాటు ఫాబ్ అలెన్, తైమాల్ మిల్స్, మయాంక్ మార్కండే, హతిక్ షోకీన్‌లను కూడా ఎంఐ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. పేస్ విభాగం బలం పెంచుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జేసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ట్రేడింగ్ చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల మీడియా కథనం మేరకు ముంబై అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఫోర్ టైమ్ ఛాంపియన్ సీఎస్కే అనూహ్యంగా రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. గత సీజన్లో సీఎస్కే యజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తడంతో.. జడ్డూ లీగ్ మధ్యలోనే గాయం సాకుగా చూపి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో క్రిస్ జోర్డన్, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ ఉన్నట్లు సమాచారం. సీఎస్కే కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీ, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ -
నలుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. సీఎస్కే నుంచి ధోని సహా 'ఆ ముగ్గురు'..!
IPL Teams Can Retain Upto 4 Players From Their Current Squad Before 2022 Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు జట్లు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల సంఖ్యపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడు ఉంటాడని సమాచారం. ఇదిలా ఉంటే, ఆటగాళ్లను అట్టిపెట్టువడంపై ప్రస్తుత ఛాంపియన్ సీఎస్కే యాజమాన్యం ఇది వరకే ఓ క్లారిటీ ఇచ్చింది. జట్టు సారధి ధోనిని రిటైన్ చేసుకోనున్నట్లు స్వయానా ఆ ఫ్రాంచైజీ యజమానే వెల్లడించారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై తాజాగా ఓ క్లారిటీ రావడంతో మిగిలిన ముగ్గురు ఆటగాళ్లపై కూడా సీఎస్కే యాజమాన్యం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లను స్వదేశీ ఆటగాళ్ల కోటాలో.. విదేశీ ప్లేయర్స్ కోటాలో బ్రావో లేదా డుప్లెసిస్‌లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సీఎస్కే వర్గాల సమాచారం. చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు -
ధోని అభిమానులకు వరుస శుభవార్తలు.. తాజాగా మరొకటి
First Retention Card At Auction Will Be Used For Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2021 టైటిల్ చేజిక్కించుకున్న నాటి నుంచి ఆ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత ధోని రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న వార్త విని సంబరపడిపోయిన ఆయన అభిమానులు.. తాజాగా సీఎస్కే యాజమాన్యం చేసిన ప్రకటనతో ఎగిరి గంతులేస్తున్నారు. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోని కోసమే అని సీఎస్కే వర్గాలు అధికారికంగా ప్రకటించడంతో తలా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబైపోతున్నారు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ధోని అందుబాటులో ఉంటాడో లేదోనన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. కాగా, తాను సీఎస్కేతోనే ఉండాలని అనుకుంటున్నానని, చెన్నైలో ఫేర్వెల్ గేమ్ ఆడాలని అనుకుంటున్నానని ధోని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022లో ధోని ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లకు అట్టిపెట్టుకునే పాలసీకి బీసీసీఐ స్వస్తి పలికితే.. ధోని ఐపీఎల్‌కు సైతం వీడ్కోలు పలికే అవకాశాలు లేకపోలేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2021 ఫైనల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్..! -
ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం
ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి మినీ వేలంకు సిద్ధమవుతున్న 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను భారీగానే వదులుకున్న సంగతి తెలిసిందే. జనవరి 20 (బుధవారం)తో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల ఫైనల్ లిస్టును విడుదల చేశాయి. కాగా ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఫుట్‌బాలర్.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హారీ కేన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హారీ కేన్‌కు ఐపీఎల్ అంటే మహా ప్రాణం.. ఇంగ్లీష్ ఫుట్‌బాల్‌ను ఎంతగా ఆస్వాదిస్తాడో ఐపీఎల్‌ను కూడా అంతే సమానంగా ఆదరిస్తాడు.. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). ఆర్సీబీ అంటే హారి కేన్‌కు విపరీతమైన ప్రేమ.. అందునా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట అంటే అతనికి చాలా పిచ్చి. తాజాగా ఆర్సీబీ రిటైన్, రిలీజ్ లిస్ట్ విడుదల చేసిన సందర్భంగా కేన్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా' 'నన్ను సెలెక్ట్ చేయనందుకు చాలా నిరాశతో ఉన్నా.. రిటైన్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడం బాధాకరం కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు.. ఆర్సీబీపై ఉన్న ఇష్టం మాత్రం చచ్చిపోదు.. జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరియేందుకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది.' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఈసారి ఆర్సీబీ 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వారిలో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మెయిన్ అలీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత రూ. 35.7 కోట్లతో ఆర్సీబీ వేలానికి సిద్ధమవుతుంది. కాగా ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత హారి కేన్ తన బ్యాటింగ్ స్కిల్‌కు సంబంధించిన వీడియోను కోహ్లి, ఆర్సీబీ హాష్‌ట్యాగ్‌తో షేర్ చేశాడు. మీ టీమ్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు నేను సిద్ధం. వచ్చే సీజన్లో అవకాశం ఉంటే నాకు ఒక చాన్స్ ఇవ్వండి .. నేనేంటో చూపిస్తాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిపై కోహ్లి స్పందించాడు. కేన్ నీ బ్యాటింగ్ సిల్క్స్ సూపర్.. వచ్చే సీజన్లో కౌంటర్ అటాక్ బ్యాట్స్‌మన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ లాఫింగ్ ఎమోజీతో తెలిపాడు. చదవండి: ‘ప్రాక్టీస్ వద్దంటే గోల చేసేవాడు.. లెజెండ్ అవుతాడు’ Got a match winning T20 knock in me I reckon. 😂🏏 Any places going for @RCBTweets in the @IPL next season @imVkohli?? pic.twitter.com/tjUZnedVvI — Harry Kane (@HKane) November 27, 2020 Bit disappointed not to be selected but nothing I can do now. Will still be cheering the boys on 😂🏏🔥 https://t.co/Jq17o1m3aO — Harry Kane (@HKane) January 20, 2021 -
వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!
ముంబై: నాలుగు నెలల్లో ఐపీఎల్–14 జరగాలి. ఈ సీజన్‌కు, వచ్చే సీజన్‌కు విరామం తక్కువున్నా తప్పనిసరిగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే నిర్వహించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ కూడా నిర్వహించాలి. ఈ ఏడాదిలా 2021లో ఐపీఎల్ వాయిదా వేస్తే కుదరదు. అందుకే వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్‌పై కసరత్తు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే వచ్చే సీజన్లో 8 జట్లు కాకుండా 9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అలాగే పాక్షిక వేలం కాకుండా వచ్చే సీజన్ కోసం మెగా వేలాన్ని నిర్వహించాలా అనే దానిపై కూడా బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లందరినీ వేలానికి తెస్తారు. అప్పుడు జట్ల రూపురేఖలు మారొచ్చు. అయితే ఇది కేవలం ప్రతిపాదనే అని దీనిపై ఇంకా చర్చగానీ, నిర్ణయం కానీ తీసుకోలేదు. ‘రెండు నెలల్లో జరిగే వేలానికి సిద్ధంగా ఉండాలంటూ బీసీసీఐ మాకు సమాచారం ఇచ్చింది. అధికారికంగా తెలపకపోయినా... మరో జట్టు చేరే అవకాశమున్నట్లు మాకూ తెలిసింది’ అని ఒక ఫ్రాంచైజీ ఉన్నతాధికారి వెల్లడించారు. లక్షా 10 వేల మంది సామర్థ్యం కలిగిన సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొత్తగా రానుందని, బడా కార్పొరేట్ సంస్థలు దీనిపై కన్నేశాయని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో వేలం ఎలా వుంటుందో, ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ (అట్టిపెట్టుకునే విధానం) ఏ విధంగా మారుతుందోననే చర్చ మొదలైంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తారా లేదంటే అందరీని వేలంలోకి తేస్తారా అనే విషయంపై బోర్డు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ స్టేక్ హోల్డర్స్‌తో సమావేశం ఏర్పాటు చేశాకే దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. -
జీతం+అమితం
ఉద్యోగం ఉంటే జీతం ఉంటుంది. ఇది ఎంప్లాయీకి. భీతి ఉంటే అమితం ఉంటుంది. ఇది ఎంప్లాయర్‌కి. అదేనండీ... ఉద్యోగం ఇచ్చాక వెళ్లిపోతారేమోనన్న భయం ఉంటే అమితంగా ప్రేమిస్తారు. ఇది కార్పోరేట్ ప్రేమ కథ. టెన్షన్లెస్ ‘రిటెన్షన్’ కథ. డిగ్రీ రెడీ. ఉద్యోగం వెతుక్కునే హడావిడి. ఐదారు కంపెనీలకు అప్లై చేశారు. టెస్ట్ రాశారు. సెలక్ట్ అయ్యారు. ఓ మూడింట్లో ఓకే అయ్యారు. మూడూ పెద్ద కంపెనీలే. (అసలు చెయ్యడమే మనం పెద్ద కంపెనీలకు అప్లై చేసి ఉంటాం కదా). ఇప్పుడు ఈ మూడింట్లో దేన్ని సెలక్ట్ చేసుకుంటారు? ఏ కంపెనీకి వెళ్తారు? జనరల్‌గా జీతం ఎక్కడ ఎక్కువైతే అక్కడికి వెళ్తారు. బెనిఫిట్స్ ఎందులో ఎక్కువుంటే అందులోకి వెళతారు. ముందు జీతభత్యాలు, తర్వాత కంపెనీ పేరు ప్రతిష్ఠలు. ఇవి చూసుకుని జాయిన్ అవుతారు. అంతేకదా. అభ్యర్థులు ఇలా టాప్ కంపెనీలను ఎంపిక చేసుకున్నట్లే... కంపెనీలు కూడా మెరికల్ని నిలుపుకోవడం వడం పోటీపడి మరీ జీతభత్యాలతో పాటు ‘ఎక్స్ట్రా’ సదుపాయాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇక్కడ కొన్ని జయెంట్ కంపెనీలు ఉన్నాయి. అవి తమ ఉద్యోగులకు ఎలాంటి ‘ఎక్స్ట్రా’క్షన్స్ ఇస్తున్నాయో చూడండి! 1 గూగుల్ (సాఫ్ట్వేర్ కంపెనీ) ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి గూగుల్ ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటుంది. గూగుల్ క్యాంటీన్లలో హై క్వాలీటీ ఫుడ్ ఉంటుంది. మసాజ్ రూములు ఉంటాయి. వర్క్ మధ్యలో అలిసిపోతే కునుకు తియ్యడానికి చక్కటి చోటు ఉంటుంది. హెయిర్ కటింగ్ సెలూన్ ఉంటుంది. డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ ఉచితంగానే. ఇక ఎంప్లాయీ ఏ కారణం చేతనైనా చనిపోతే.. వారి జీవిత భాగస్వామికి కంపెనీ పదేళ్ల పాటు 50 శాతం జీతం ఇస్తుంది. ఇంతకు మించిన లైఫ్ టైమ్ బోనస్ ఉంటుందా! 2 ట్విట్టర్ (ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్) ఇక్కడి ఉద్యోగులకు రుచికరమైన త్రీ కోర్స్ మీల్ (స్టార్టర్స్ + మెయిన్ మీల్స్ + డెజర్ట్) అన్ని షిఫ్టుల్లో అందుబాటులో ఉండి ఆవురావురుమనిపిస్తుంది. ‘కండకలవాడే మనిషోయ్’ అన్నట్లు ఇక్కడి రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎంప్లాయీస్‌ని మనుషులుగా మార్చేస్తాయి. ఆహారం వల్ల ఆరోగ్యం, ఆరోగ్యం వల్ల పని. అందుకే ఇక్కడి ఉద్యోగులు అనారోగ్యంతో పెట్టే సెలవులు దాదాపుగా ఉండవు. సెలవులు పెట్టరని చెప్పి సెలవులు లేకుండా ఏమీ లేవు. ట్విట్టర్లో ఎన్ని సెలవులైనా పెట్టుకోవచ్చు. అవి అపరిమితం. 3 ఫేస్బుక్ (ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్) ఏడాదికి నాలుగు వారాలు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ మొబైల్ సర్వీసు, ఫ్రీ బైక్ సర్వీసు సరేసరి. ఇక విందులు విహారాలకైతే లోటే లేదు. ముఖ్యంగా... డెలివరీ అయిన ఎంప్లాయీకి 4 వేల డాలర్ల ‘బేబీ క్యాష్’ను ఇస్తుంది. అంటే.. 2,71,860 రూపాయలు. ఇంకా జిమ్ము, హెల్త్ సెంటర్, బైక్ షాప్; తల్లికైనా, తండ్రికైనా 4 నెలల పేరెంటల్ లీవు వంటి సదుపాయాలు ఉన్నాయి. విస్త్రృతమైన సిబ్బంది వినోద కార్యక్రమాలకు కూడా ఫేస్బుక్ ఫేమస్. 4 సేల్స్‌ఫోర్స్ (క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ) ఇక్కడి ఉద్యోగికి ఏడాదికి 6 రోజుల పెయిడ్ హాలిడే ఉంటుంది. అలాగే ఏడాదికొకసారి ఛారిటీ మనీ పేరిట ప్రతి ఎంప్లాయీకి 1000 డాలర్లు ఇస్తారు. (సుమారు 68 వేల రూపాయలు). దానిని దాన ధర్మాలకు ఉపయోగించాలని కంపెనీ ఆకాంక్ష. ఇక చాలా కంపెనీల కంటే ఇక్కడ హెల్త్ ప్రీమియం తక్కువ, హెల్త్ బెనిఫిట్లు ఎక్కువ. ఆఫీస్ ఫన్కైతే కొదవే లేదు. సిబ్బంది స్ట్రెస్ ఫీల్ అవకుండా గంగ్నమ్ స్టెయిల్ సింగర్స్ వచ్చి, ఉల్లాసపరిచి వెళుతుంటారు. యోగా క్లాసులూ ఉంటాయి. 5 అడోబ్ (సాఫ్ట్వేర్ కంపెనీ) అడోబ్ కంపెనీని ప్రతి డిసెంబరులో ఒక వారం పాటు మూసేస్తారు! అలాగే సమ్మర్లో ఒక వీక్ మొత్తం ఆఫీస్ ఉండదు. మిగతా సెలవులకు, వీక్ఆఫ్లకు ఇది అదనం. ‘ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ ప్రోగ్రామ్’ ద్వారా షేర్స్‌ను తక్కువ ధరకు పొందవచ్చు. అదనపు పనిగంటలకు అదనపు జీతం వస్తుంది. ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే లీగల్ అసిస్టెంట్ లభిస్తుంది. పెట్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్ కూడా. ఇంట్లో చూసేవాళ్లు ఎవరూ లేకపోతే పెట్స్‌ని ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. 6 స్పోటిఫై మ్యూజిక్ సర్వీస్ ఈ కంపెనీ 6 నెలల పేరెంటింగ్ లీవ్ ఇస్తోంది! ప్లస్ ఉద్యోగి వర్క్‌కి తిరిగి వచ్చాక ఒక నెల పాటు పనివేళల్లో వెసులుబాటు ఉంటుంది. ఇదికాక ఆఫీస్ పరిసరాలు, అమరికలు అదిరిపోతాయి. కళాత్మకంగా తీర్చిదిద్దన ఈ వర్క్‌ప్లేస్‌లో భౌతికవాదులకు సైతం సృజనాత్మకత వెల్లివిరుస్తుందని అంటారు. ఇంకా ఇక్కడ ఏడాదికోసారి ఇచ్చే బోనస్‌కి అదనంగా పెర్మార్మెన్స్ బోనస్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం మెడికల్ లీవు కూడా తీసుకోవచ్చు. 7 ఎయిర్ బి.ఎన్.బి (ఆన్లైన్ అకామడేషన్స్) ఈ కంపెనీ ఉద్యోగులకు ఏడాదికొక 2000 డాలర్ల స్టయిఫండ్ వస్తుంది. ఎయిర్ బి.ఎన్.బి. జాబితాలో ఉన్న ప్రదేశాలకు ప్రపంచమంతా పర్యటించడానికి కంపెనీ కల్పించిన సదుపాయం ఇది. రెండు వేల డాలర్లంటే సుమారు 1,36,000 రూపాయలు. అలాగే సంతానం కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఫెర్టిలిటీ అసిస్టెన్స్ ఇప్పిస్తారు. పిల్లల్ని దత్తత తీసుకున్నవారికి కూడా పేరెంటింగ్‌కి ఇచ్చే సదుపాయాలనే వర్తింపజేస్తారు. రీచార్జ్ కావడానికి స్పెషల్ లీవ్ ఇస్తారు. 8 యాక్సెంచ్యూర్ (మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్) ఉద్యోగులకు ‘టోటల్ రివార్డ్స్’ ప్యాకేజీ ఉంటుంది. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా సౌకర్యాలను, సదుపాయాలను పెంచుకుంటూ పోతారు. అలాగే ఇక్కడ ‘గే’ ఎంప్లాయీలకు, ఇంకా, ఆ కేటగిరీలో ఉన్నవారికి ప్రత్యేక వసతులు, వెసులుబాట్లు ఉంటాయి. అవసరమైతే కొన్నాళ్లపాటు ఇంటి నుంచే పనిచేయవచ్చు. సోషల్ ఈవెంట్లకు వెళ్లిరావచ్చు. ఉద్యోగిగా అప్డేట్ అవడానికి ఇలాంటి ఈవెంట్స్ తోడ్పడతాయని కంపెనీ భావిస్తుంది. -
‘సాక్షి’ డెరైక్టర్లపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంత పరిధిలో అధికారపార్టీ నేతల భూ అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా పొన్నూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న నరేంద్రకుమార్, గుంటూరు జిల్లా పోలీసులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పొన్నూరు పోలీసులు.. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్లు యర్రంరెడ్డి ఈశ్వర ప్రసాదరెడ్డి, కాల్వ రాజప్రసాదరెడ్డి, పి.వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి తదితరులపై కేసు నమోదు చేయడం విదితమే. ఈ కేసును కొట్టేయాలని, అప్పటివరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ‘సాక్షి’ డెరైక్టర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు. పిటిషనర్ల తరఫున జి.కళ్యాణి వాదనలు వినిపిస్తూ... వాస్తవాలను నిర్ధారించుకున్నాకనే కథనాల్ని ప్రచురించినట్టు పేర్కొన్నారు. పత్రిక రోజువారీ వ్యాపారాలతో కంపెనీ డెరైక్టర్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సాక్షి కథనాలకు, దాని డెరైక్టర్లకు ఏ సంబంధం లేదని, ఈ విషయం తెలిసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. -
ఆ..పనులను ఆపేయండి
నీరు-చెట్టు పనులు నిలుపుదలకు కలెక్టరు ఆదేశం కొత్తనిబంధనలు వచ్చే వరకూ పనులకు బ్రేక్ శ్రీకాకుళం టౌన్: డబ్బులిచ్చినా పనిచేయలేక పోయారు. ప్రాజెక్టుకైతే భూసేకరణ, ఇతర సమస్యలు చెపుతారు. ఇప్పుడు ఏసమస్యలేని పనులెందుకు చేయలేక పోతున్నారు. ఇందులో ఉన్న ఆంతర్యమేమిటో చెప్పాలంటూ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది మంజూరైన పనుల్లో ఇంతవరకు ఎంత మేరకు పనులు పూర్తి చేశారు..ఎంత చెల్లింపులు జరిగాయో వివరాలు చెప్పాలని ఆదేశించారు. కలెక్టరేట్లో నీరు-చెట్టు పనులపై శనివారం సమీక్షించారు. ఈనెల 21లోగా పనులు చేసి.. ఆ తరువాత నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారు. మీ నిర్లక్ష్యం వల్ల రూ.కోట్లు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. కొత్తగా ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను అనుసరించి కొత్తగా పనులు మంజూరు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. వేసవిలో పనులు చేపట్టక పోతే సాగునీటివనరుల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తు చేశారు. ఇప్పటివరకు డివిజన్లవారీగా మంజూరు చేసిన పనులు, వాటికి ఇచ్చిన కేటాయింపులు, ఇప్పటివరకు పూర్తిచేసిన పనులు, వాటికి చెల్లింపులు ఎంతమేరకు జరిగాయన్న వివరాలు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో నీరు-చెట్టు పథకం నోడల్ అధికారి, వంశధార ఎస్ఈ బి.అప్పలనాయుడు, ఈఈ రవీంద్ర, వంశధార, అఫ్షోర్, మడ్డువలస ప్రాజెక్టుల ఈఈలు పాల్గొన్నారు.