ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి ఎడిషన్ (16) కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు ఊపందుకున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించింది.
ఈ క్రమంలో ప్రముఖ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. తదుపరి సీజన్‌కు ముంబై వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2010 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తూ, జట్టకు ఎన్నో అపురూప విజయాలు అందించిన పోలీని.. ఇలా అవమానకర రీతిలో తప్పించడం బాధాకరమని ఎంఐకి సంబంధించిన అతని ఫ్యాన్స్ వాపోతున్నారు.
పోలార్డ్‌తో పాటు ఫాబ్ అలెన్, తైమాల్ మిల్స్, మయాంక్ మార్కండే, హతిక్ షోకీన్‌లను కూడా ఎంఐ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. పేస్ విభాగం బలం పెంచుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జేసన్ బెహ్రెన్డార్ఫ్‌ను ట్రేడింగ్ చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల మీడియా కథనం మేరకు ముంబై అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది.
మరో పక్క ఫోర్ టైమ్ ఛాంపియన్ సీఎస్‌కే అనూహ్యంగా రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. గత సీజన్‌లో సీఎస్‌కే యజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తడంతో.. జడ్డూ లీగ్ మధ్యలోనే గాయం సాకుగా చూపి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక సీఎస్‌కే వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో క్రిస్ జోర్డన్, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ ఉన్నట్లు సమాచారం. సీఎస్‌కే కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీ, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్‌లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్
Comments
Please login to add a commentAdd a comment