Ravindra Jadeja Emotional Birthday Wishes To MS Dhoni On His 42nd Birthday, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

MS Dhoni Birthday: మహీ భాయ్‌.. అంటూ రవీంద్ర జడేజా ఎమోషనల్‌ ట్వీట్‌.. వైరల్‌

Published Fri, Jul 7 2023 12:50 PM | Last Updated on Fri, Jul 7 2023 2:09 PM

Ravindra Jadeja Birthday Wish For My Go To Man MS Dhoni Goes Viral - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పుట్టినరోజు నేడు(జూలై 7). నేటితో మిస్టర్‌ కూల్‌ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ రాంచి డైనమైట్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సీఎస్‌కే సారథి ధోనితో జడ్డూకు ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

జడ్డూ కోసం తన స్థానం త్యాగం చేసి
జడేజా సీఎస్‌కేలో చేరిననాటి నుంచే ధోని పెద్దన్నలా అతడికి అండగా నిలిచాడు. గతేడాది కెప్టెన్సీ వదులుకుని జడ్డూను తన వారసుడిగా ప్రకటించి పగ్గాలు అప్పగించాడు. ఇందులో భాగంగా మొదటి రిటెన్షన్‌ ఆప్షన్‌ జడ్డూ ఉండాలని తన స్థానాన్ని త్యాగం చేశాడు.

అయితే, అంతకుముందు సారథిగా అనుభవం లేని జడ్డూ కారణంగా సీఎస్‌కే ఐపీఎల్‌-2022లో దారుణంగా వైఫల్యం చెందింది. మధ్యలోనే జడ్డూ పగ్గాలు వదిలేయడంతో ధోని మళ్లీ నాయకుడై ముందుండి నడిపించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఈసారి ఏకంగా చాంపియన్‌
ఇదిలా ఉంటే.. అనూహ్య రీతిలో పుంజుకున్న ధోని సేన ఐపీఎల్‌-2023లో ఏకంగా చాంపియన్‌గా నిలిచింది. తద్వారా ఐదోసారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఇక రిజర్వ్‌ డే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్లో ఫోర్‌ బాది సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చిన జడ్డూను ధోని అభినందించిన తీరును అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.

ఆనంద భాష్పాలతో ధోని
తీవ్ర భావోద్వేగానికి గురైన ధోని జడ్డూ ఎత్తుకుని విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు, జడ్డూకు ధోనికి పడట్లేదు అంటూ జరిగిన ప్రచారానికి ఒక్క దెబ్బతో ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. ఇక టైటిల్‌ విజేతగా నిలిచిన తర్వాత జడ్డూ సైతం.. మహీ భాయ్‌ నీకోసం ఏమైనా చేస్తా అంటూ ప్రేమను చాటుకున్నాడు.

తాజాగా ధోని బర్త్‌డేను పురస్కరించుకుని..‘‘2009 నుంచి ఇప్పటి వరకు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఎలాంటి అవసరం వచ్చినా..  సలహాలు, సూచనలు కావాలన్నా నేను మొదటగా సంప్రదించే వ్యక్తి(My Go To Man). పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్‌. మళ్లీ నిన్ను త్వరలోనే ఎల్లో జెర్సీలో చూడాలి’’ అని ట్వీట్‌ చేసిన రవీంద్ర జడేజా #respect జతచేశాడు. ప్రస్తుతం జడ్డూ ట్వీట్‌ లైకులు, షేర్లతో వైరల్‌గా మారింది.  

చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్‌ గంగూలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement