MS Dhoni birthday
-
MS Dhoni birthday special: యుగానికి ఒక్కడు.. మహీ.. ది వారియర్
2004 డిసెంబర్ 23.. ఈ తేదికి భారత క్రికెట్లో ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజున జులపాల జట్టుతో ఓ యవ ఆటగాడు టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువకుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని. ఆ రోజు ఎవరూ ఊహించలేదు.. ఆ జులుపాల ఆటగాడే భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పుతాడని. తన తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డకౌటై విమర్శలు అందుకున్న ఆ యువ ఆటగాడే.. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవమయ్యాడు.ఆ యువ సంచలనమే మూడు దశాబ్దాలుగా ఎంతోమంది కెప్టెన్లకు సాధ్యం కానీ వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించాడు. అతడే భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ సారధిగా నిలిచిన ధోని ఆదివారం(జూలై 7) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనిపై ఈ ప్రత్యేక కథనం.ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్ రూపరేఖలను మార్చేశాడు. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే కెప్టెన్‌గా మారిన మిస్టర్‌కూల్.. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అతడి సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ తిరిగిలేని శక్తిగా అవతరించింది. అప్పటివరకు ఆడదడప విజయాలను చూసిన భారత్.. అతడి నాయకత్వంలో వరుస విజయాలు సాధించింది. 2007లో జరిగిన తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అద్భుతాలు సృష్టించింది. ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్.. విశ్వవిజేతగా నిలిచింది.ఆ తర్వాత కెప్టెన్‌గా ధోని వెనక్కి తిరిగిచూడలేదు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ను అందించి 30 ఏళ్ల భారత నిరీక్షణకు తెరిదించాడు. మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలకు సాధ్యం కానిది మిస్టర్ కూల్ చేసి చూపించాడు. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫిని కూడా భారత్‌కు అందించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు కొన్నాళ్లపాటు వరల్డ్ నెం1గా కొనసాగింది. ఝార్ఖండ్ డైనమెట్‌గా పేరుగాంచిన ఎంస్ ధోని.. ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించాడు. ఇక తన 16 ఏళ్ల కెరీర్లో ధోని ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలను ధోని అందుకున్నాడు.ధోని సాధించిన ఘనతలు ఇవే..ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుపెట్టాడు. కానీ ఆ సిరీస్ మొత్తం విఫలమై కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ధోని కెరీర్‌ను మార్చేసింది. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ధోని విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేసి విమర్శకుల నోళ్లను మూయించాడు. ధోనికి తన కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వన్డేల్లో భారత తరుపన అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. ఇప్పటికి ఈ రికార్డు ధోనీ పేరిటే ఉంది.అత్యధిక స్టంపౌట్స్ చేసిన రికార్డు కూడా ధోని పేరిటనే ఉంది. ధోని మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 538 మ్యాచ్‌ల్లో 195 స్టంపౌట్స్ చేశాడు.భారత్‌కు ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ కూడా ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.మూడు ఫార్మాట్లలో 332 మ్యాచులలో కెప్టెన్ గా సేవలందించిన ధోని.. 178 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలను అందించాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారధ్యం వహించిన కెప్టెన్ కూడా ధోనినే.అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు కూడా ధోనినే.వరల్డ్‌క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో 84 సార్లు అజేయంగా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ ధోనినే కావడం గమనార్హం.ధోని ఐపీఎల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోని సారథిగా ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇక చివరిగా.. "భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంది కెప్టెన్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అందులో కచ్చితంగా మిస్టర్ కూల్ మాత్రం ఉంటాడు. హ్యాపీ బర్త్‌డే మహీ. -
MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు(జూలై 7). నేటితో మిస్టర్ కూల్ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ రాంచి డైనమైట్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సీఎస్కే సారథి ధోనితో జడ్డూకు ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. జడ్డూ కోసం తన స్థానం త్యాగం చేసి జడేజా సీఎస్కేలో చేరిననాటి నుంచే ధోని పెద్దన్నలా అతడికి అండగా నిలిచాడు. గతేడాది కెప్టెన్సీ వదులుకుని జడ్డూను తన వారసుడిగా ప్రకటించి పగ్గాలు అప్పగించాడు. ఇందులో భాగంగా మొదటి రిటెన్షన్ ఆప్షన్ జడ్డూ ఉండాలని తన స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే, అంతకుముందు సారథిగా అనుభవం లేని జడ్డూ కారణంగా సీఎస్కే ఐపీఎల్-2022లో దారుణంగా వైఫల్యం చెందింది. మధ్యలోనే జడ్డూ పగ్గాలు వదిలేయడంతో ధోని మళ్లీ నాయకుడై ముందుండి నడిపించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా చాంపియన్ ఇదిలా ఉంటే.. అనూహ్య రీతిలో పుంజుకున్న ధోని సేన ఐపీఎల్-2023లో ఏకంగా చాంపియన్‌గా నిలిచింది. తద్వారా ఐదోసారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఇక రిజర్వ్ డే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఫోర్ బాది సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన జడ్డూను ధోని అభినందించిన తీరును అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఆనంద భాష్పాలతో ధోని తీవ్ర భావోద్వేగానికి గురైన ధోని జడ్డూ ఎత్తుకుని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు, జడ్డూకు ధోనికి పడట్లేదు అంటూ జరిగిన ప్రచారానికి ఒక్క దెబ్బతో ఫుల్స్టాప్ పెట్టాడు. ఇక టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత జడ్డూ సైతం.. మహీ భాయ్ నీకోసం ఏమైనా చేస్తా అంటూ ప్రేమను చాటుకున్నాడు. తాజాగా ధోని బర్త్‌డేను పురస్కరించుకుని..‘‘2009 నుంచి ఇప్పటి వరకు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఎలాంటి అవసరం వచ్చినా.. సలహాలు, సూచనలు కావాలన్నా నేను మొదటగా సంప్రదించే వ్యక్తి(My Go To Man). పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్. మళ్లీ నిన్ను త్వరలోనే ఎల్లో జెర్సీలో చూడాలి’’ అని ట్వీట్ చేసిన రవీంద్ర జడేజా #respect జతచేశాడు. ప్రస్తుతం జడ్డూ ట్వీట్ లైకులు, షేర్లతో వైరల్‌గా మారింది. చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ My go to man since 2009 to till date and forever. Wishing you a very happy birthday mahi bhai.🎂see u soon in yellow💛 #respect pic.twitter.com/xuHcb0x4lS — Ravindrasinh jadeja (@imjadeja) July 7, 2023 -
MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు..
#HappyBirthdayMSDhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుత ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ- 2013 సాధించి చరిత్ర సృష్టించాడు. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గూడు కట్టుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ధోని.. ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలపడం ఇందుకు నిదర్శనం. హెలికాప్టర్ షాట్ల ధోని క్రీజులోకి వస్తున్నాడంటే చాలు మైదానం హోరెత్తిపోవాల్సిందే. ధోని మేనియాతో జనం ఊగిపోవాల్సిందే. అలాంటిది ధోని పుట్టినరోజు(1981, జూలై 7) అంటే సంబరాలు అంబరాన్నంటుతాయి కదా! అవును.. ఈరోజు తలా.. 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా జార్ఖండ్ డైనమైట్ ధోని వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన 42 ఆసక్తికర విషయాలు మీకోసం.. క్రికెటర్ అవడానికి ముందు 1. ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ ఆరంభించడానికి ముందు ధోని భారత రైల్వేస్‌లో ఉద్యోగి. 2. భారత్‌లోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన ఖరగ్‌పూర్ పరిధిలో ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వర్తించాడు. 3. క్రికెట్ కాకుండా ధోనికి ఇష్టమైన ఇతర క్రీడలు డబ్ల్యుడబ్ల్యూఈ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్. 4. టీమిండియాలోకి వచ్చిన తొలినాళ్లలో ధోని జులపాల జుట్టుతో కనిపించేవాడు. తన హెయిర్‌స్టైల్‌కు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం స్ఫూర్తి అట! 5. ధోనికి హాట్ చాకొలెట్లంటే మహాప్రీతి. వాళ్ల పాటలంటే చెవికోసుకుంటాడు 6. ప్రముఖ సింగర్లు కిషోర్ కుమార్, ముకేశ్‌లకు ధోని వీరాభిమాని. బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్స్ అంటే చెవికోసుకుంటాడు. 7. ఆటోమొబైల్స్ అంటే ధోనికి పిచ్చిప్రేమ. ఈ విషయం తన గ్యారేజీలో ఉన్న వింటేజ్ మోటార్ సైకిల్స్, సూపర్బైకులు చూస్తే అర్థమవుతుంది. 8. 2007లో ధోని తొలిసారి సాక్షిని కలిశాడు. 2010లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జివా సంతానం. 9. 1999-2000 సీజన్లో ధోని దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. 10. 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4876, 10773, 1617 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు అదే 11. చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా ధోని ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఐపీఎల్ జట్టు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్. 12. 2005లో శ్రీలంక మీద సాధించిన 183 పరుగులు(నాటౌట్) ధోనికి వన్డేల్లో అత్యధిక స్కోరు. 13. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 14. వన్డేల్లో 200 లేదంటే అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఏకైక ఆసియా కెప్టెన్ ఎంఎస్ ధోని. 15. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. రెండో బ్యాటర్‌గా 16. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన సారథిగా ధోని అరుదైన ఘనత. 17. వన్డేల్లో అత్యధిక స్కోరు(శ్రీలంకపై 183 పరుగులు నాటౌట్) సాధించిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డులకెక్కాడు. 18. ఐపీఎల్లో 11 ఫైనల్ మ్యాచ్‌లలో ఆడిన ఏకైక క్రికెటర్ ఎంఎస్ ధోని. 19. ఐపీఎల్-2023లో చెన్నైని విజేతగా నిలిపిన ధోని ఐదోసారి ట్రోఫీ గెలిచాడు. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 20. చెన్నైలో 2013 నాటి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద ధోని 224 పరుగులు చేశాడు. భారత కెప్టెన్లలో ఈ మేరకు అత్యధిక స్కోరు నమోదు చేసిన రెండో బ్యాటర్ ధోని. ఐసీసీ టైటిళ్ల వీరుడు 21. టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా 2018లో ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 22. స్వదేశంలో, విదేశాల్లో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు గెలిపించిన రెండో భారత కెప్టెన్ ధోని. 23. వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్ ధోని. 24. ఐసీసీ టీ20, వన్డే, చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు. 25. వన్డేలో ఒకే మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన ఏకైక టీమిండియా క్రికెటర్. 41 ఏళ్ల తర్వాత అక్కడ విజయం 26. వన్డే క్రికెట్లో 100 కంటే ఎక్కువ స్టంపింగ్‌లు చేసిన ఏకైక వికెట్ కీపర్ ధోనినే! 27. 2009లో ధోని అద్భుతమైన కెప్టెన్సీ కారణంగా న్యూజిలాండ్ గడ్డ మీద 41 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి విజయం నమోదు చేసింది. 28. 2009లో టీమిండియాను టెస్టు క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1గా నిలిపాడు ధోని. 29. 2008, 2009లో ధోని ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. 30. 2007లో ధోని రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్నాడు. అవార్డులు ఇవే 31. 79 బంతుల్లో 91 పరుగులు చేసిన ధోని అద్భుత ఇన్నింగ్స్ కారణంగా దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి వన్డే వరల్డ్‌కప్(2011) గెలుచుకుంది. 32. టెస్టు క్రికెట్లో 78 సిక్సర్లు బాదిన ధోని వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. 33. క్రీడా రంగంలో ధోని సేవలకు గానూ భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 34. ఐపీఎల్లో కెప్టెన్‌గా 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఒకే ఒక్క క్రికెటర్ ఎంఎస్ ధోని. 35. ధోని జీవితం ఆధారంగా 2016లో ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ పేరిట బాలీవుడ్లో సినిమా వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో నటించాడు. సెప్టెంబరు 30, 2016లో ఈ సినిమా విడుదలైంది. వాళ్లంటే అభిమానం 36. 2011లో ధోని లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కించుకున్నాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో క్రికెటర్ ధోని. 37. డబ్ల్యుడబ్ల్యుఈకి అభిమాని అయిన ధోని ఫేవరెట్ రెజ్లర్లు బ్రెట్ ది హిట్‌మ్యాన్ హార్ట్, హల్క్ హోగన్. 38. ధోని ఆల్‌టైమ్ ఫేవరెట్ ఫుట్‌బాలర్ జినెడైన్ జిడానే. లియొనల్ మెస్సీ ఆటను కూడా ధోని ఇష్టపడతాడు. 39. ధోనికి సిగ్నేచర్ షాట్ హెలికాప్టర్ షాట్. దానిని అతడికి నేర్పించింది మరెవరో కాదు ధోని సహచర ఆటగాడు,బెస్ట్‌ఫ్రెండ్ సంతోష్ లాల్. 40. తన బర్త్‌డే జూలై 7న కాబట్టి ధోని తన జెర్సీ నంబరును సెవన్‌గా ఎంచుకున్నాడు. 41. టెస్టు క్రికెట్లో ద్విశతకం బాదిన ఒకే ఒక్క భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధోని. 42. క్రికెటర్‌గా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ధోని ఇండియన్ సూపర్ లీగ్‌లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి చెన్నైయన్ ఎఫ్‌సీ సహ యజమానిగా ఉన్నాడు. -సాక్షి, వెబ్‌డెస్క్. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా -
నా అన్నయ్య.. కెప్టెన్ ధోని.. హ్యాపీ బర్త్‌డే: కోహ్లి భావోద్వేగ ట్వీట్
Virat Kohli Emotional Wishes For MS Dhoni: ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు అన్నయ్యగా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా మిస్టర్ కూల్ ధోని గురువారం తన 41వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సైతం ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పూరిత ట్వీట్ చేశాడు. నా కెప్టెన్ ధోని అంటూ అతడితో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. కోహ్లి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక స్టార్ బ్యాటర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఎదగడం వెనుక ధోని ప్రోత్సాహం ఉందన్న సంగతి తెలిసిందే. కష్టకాలంలో కోహ్లికి అండగా నిలబడి అతడు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ధోని ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలో తన ‘అన్న’ పట్ల కోహ్లి ట్విటర్ వేదికగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. మరోవైపు హర్భజన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు.. రాజకీయ, సినీ ప్రముఖులు ధోని భాయ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. దీంతో #HappyBirthdayDhoni హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా ధోని తన కెరీర్లో 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి భారత్‌కు మూడు ఐసీసీ మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్! A leader like no other. Thanks for everything you have done for Indian cricket. 🇮🇳 You became more like an elder brother for me. Nothing but love and respect always. Happy birthday skip 🎂@msdhoni pic.twitter.com/kIxdmrEuGP — Virat Kohli (@imVkohli) July 7, 2022 View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r) Happy Birthday to my big brother. Thank you for being my biggest supporter and mentor in every phase of life, may god bless you and your family with good health always. Much love to you mahi bhai. Wishing you a great year ahead! @msdhoni #HappyBirthdayDhoni pic.twitter.com/3uABWFIlnO — Suresh Raina🇮🇳 (@ImRaina) July 6, 2022 Very very happy birthday to you @msdhoni 🥳 My best wishes are always with you! Have the most wonderful year ahead. Love always 🤗 pic.twitter.com/95n92fqeNT — Harbhajan Turbanator (@harbhajan_singh) July 7, 2022 -
ధోని సిక్సర్ల మాయ చూడాల్సిందే; వీడియో వైరల్
ముంబై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి క్రికెట్ ఆస్ట్రేలియా ఒక స్పెషల్ వీడియో తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుధవారం 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ధోనీకి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు సోషల్ మీడియా విషెస్ చెప్తూ.. పాత ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో పాటు చాలా మంది ప్రముఖులు, క్రికెటర్లు ధోనీకి విషెస్ చెప్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియోలో ధోని బాదిన సిక్సర్లను పొందుపరిచారు. ధోని 2004లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని టీమిండియా తరపున వికెట్ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల బాదిన జాబితాలో ధోని ఐదవ స్థానంలో ఉన్నాడు. ధోని తన కెరీర్లో 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. 📽 WATCH: MS Dhoni's best ever sixes in Australia. https://t.co/tRadt6XCkI — cricket.com.au (@cricketcomau) July 7, 2021 -
'అందుకే అతన్ని కెప్టెన్ కూల్ అనేది'.. ఐసీసీ స్పెషల్ వీడియో
ముంబై: మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్లో ఈ పేరు ఒక సంచలనం. ఈరోజు 40 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని కు ఐసీసీ ఒక స్పెషల్ వీడియోతో పుట్టినరోజు విషెస్ చెప్పింది. ఈ వీడియోలో ధోని కెప్టెన్‌గా తన కెరిర్లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాడో తెలియజేస్తూ ఐసీసీ పొందుపరిచింది. మైదానంలో బౌలర్లకి సూచనలివ్వడంతో పాటు ఫీల్డింగ్ మార్పులు చేయడం ఇవన్నీ ధోని స్పెషల్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మిస్బా ఇన్నింగ్స్‌తో చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్ శర్మతో బౌలింగ్ చేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ధోని తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు తొలి టీ20 వరల్డ్‌కప్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో అనుహ్యంగా యువరాజ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ 79 బంతుల్లో 91 పరుగులు నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో భారత్‌కు కప్‌ను అందించాడు. ధోని తన కెరిర్లో 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఈ వీడియోను ఐసీసీ ట్విటర్లో షేర్ చేస్తూ .. '' అందుకే అతన్ని కెప్టెన్ కూల్'' అని పిలుస్తురాని కామెంట్ చేసింది. There’s a reason they call him Captain Cool 😎 On his birthday, relive some of MS Dhoni’s greatest calls as @BCCI skipper 👨✈ pic.twitter.com/8nK5hvTuWM — ICC (@ICC) July 7, 2021 -
కెప్టెన్.. లీడర్.. విన్నర్..
టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ధోనీ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'. నేడు టీమిండియా కెప్టెన్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ యూనిట్ ఆయనకు కానుకగా అధికారిక పోస్టర్ విడుదల చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కనిపించనున్న విషయం తెలిసిందే. ధోనీ మూవీ అఫీషియల్ పోస్టర్ ను హీరో సుశాంత్ సింగ్ ట్వీట్ చేశారు. కెప్టెన్.. లీడర్.. విన్నర్.. అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ధోనీకి ఇలా ఎన్నో పేర్లు సంపాదించాడంటూ ప్రశంసించాడు. ఈ సందర్భంగా మరోసారి ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కీపర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టి, అనతికాలంలోనే కెప్టెన్‌గా భారత్ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు ధోనీ. నీరజ్ పాండే దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుశాంత్‌తోపాటు కియరా అద్వానీ, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, సుశాంత్ రాజ్‌పుత్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఫోస్టర్ ను ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ లో ధోనీ నెం.7 జెర్సీలో, స్కూలు రోజులు, భార్యతో కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. Captain. Leader. Winner. Many names & a journey unknown. Official poster -#MSDhoniTheUntoldStory! #HappyBirthdayMahi pic.twitter.com/AgGpkd9yfx — Sushant S Rajput (@itsSSR) 7 July 2016