ముంబై: మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. ఈరోజు 40 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని కు ఐసీసీ ఒక స్పెషల్ వీడియోతో పుట్టినరోజు విషెస్ చెప్పింది. ఈ వీడియోలో ధోని కెప్టెన్‌గా తన కెరిర్‌లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాడో తెలియజేస్తూ ఐసీసీ పొందుపరిచింది. మైదానంలో బౌలర్లకి సూచనలివ్వడంతో పాటు ఫీల్డింగ్ మార్పులు చేయడం ఇవన్నీ ధోని స్పెషల్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మిస్బా ఇన్నింగ్స్‌తో చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్ శర్మతో బౌలింగ్ చేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ధోని తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు తొలి టీ20 వరల్డ్‌కప్‌ను తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో అనుహ్యంగా యువరాజ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ 79 బంతుల్లో 91 పరుగులు నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో భారత్‌కు కప్‌ను అందించాడు. ధోని తన కెరిర్‌లో 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఈ వీడియోను ఐసీసీ ట్విటర్‌లో షేర్ చేస్తూ .. '' అందుకే అతన్ని కెప్టెన్ కూల్'' అని పిలుస్తురాని కామెంట్ చేసింది.
There’s a reason they call him Captain Cool 😎
— ICC (@ICC) July 7, 2021
On his birthday, relive some of MS Dhoni’s greatest calls as @BCCI skipper 👨✈ pic.twitter.com/8nK5hvTuWM
Comments
Please login to add a commentAdd a comment