ICC Pays Heartfelt Tribute To MS Dhoni on Retirement Anniversary - Sakshi
Sakshi News home page

Ms Dhoni: సరిగ్గా ఇదే రోజు.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై! ఐసీసీ స్పెషల్‌ వీడియో

Published Mon, Aug 15 2022 8:00 PM | Last Updated on Mon, Aug 15 2022 8:52 PM

ICC pays heartfelt tribute to MS Dhoni on retirement anniversary - Sakshi

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ మిస్టర్ కూల్.. సరిగ్గా ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక ధోనీ రిటైర్మెంట్ రెండో వార్షికోత్సవ సందర్భంగా ఐసీసీ ఓ స్పెషల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఈ వీడియోలో 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐసీసీ ఈవెంట్‌లలో ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన విజయ క్షణాలును ఐసీసీ చూపించింది. కాగా ఈ వీడియోకు ఎంఎస్‌ ధోని: "1928 గంటల నుంచి నన్ను రిటైర్డ్‌గా పరిగణించండి". "2020 ఆగస్టు 15న భారత సూపర్‌ స్టార్‌ ఎంస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లెజెండ్‌కి ఇదే మా ప్రత్యేక నివాళి' అని ఐసీసీ క్యాప్షన్‌గా పెట్టింది.

కాగా భారత క్రికెట్ చరిత్రలో తన పేరును ధోని సువర్ణ అక్షరాలతో లిఖించాడు. ఐసీసీ నిర్వహించిన అన్ని టోర్నమెంట్లనూ తన ఖాతాలో వేసుకున్న తొలి కెప్టెన్ ధోని మాత్రమే. 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిని ధోని సారథ్యంలోనే భారత్‌ కైవసం చేసుకుంది. ధోని తన అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి 17,226 పరుగులు సాధించాడు. అతడి కెరీర్‌లో 15 సెంచరీలు ఉన్నాయి.

చదవండి: Asia Cup 2022 Winner Prediction: కచ్చితంగా ఆ జట్టు ట్రోఫీ గెలవగలదు: పాక్‌ మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement