దుబాయ్: ఈ దశాబ్దాపు అత్యుత్తమ క్రికెట్ జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఇందులో మెన్స్ విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఈ దశాబ్దపు అత్యుత్తమ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం దశాబ్దపు జట్లను ఐసీసీ వెల్లడించింది. దీనిలో భాగంగా టీ20, వన్డే జట్లకు ధోనిని సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ.. టెస్టు ఫార్మాట్‌కు విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అత్యుత్తమ వన్డే జట్టులో ధోనితో పాటు కోహ్లి, రోహిత్ శర్మలు భారత్ నుంచి ఎంపికైన ఆటగాళ్లు. ఓవరాల్‌గా ఐసీసీ ప‍్రకటించిన అత్యుత్తమ జట్లలో(టెస్టు, వన్డే, టీ20) ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు స్థానం దక్కించుకోవడం విశేషం. ధోని, కోహ్లిలతో పాటు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉన్నారు. (సెంచరీతో మెరిసిన కెప్టెన్ అజింక్యా రహానే)
భారత్ ఆటగాళ్లను పక్కన పెడితే ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న వారిలో డేవిడ్ వార్నర్, ఏబీ డివిలయర్స్, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహీర్, లసిత్ మలింగాలు ఉన్నారు. ఇవే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అందులో మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.
ఐసీసీ దశాబ్దపు వన్డే జట్టు..
ఎంఎస్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి, డివిలియర్స్, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, తాహీర్, మలింగా
ఐసీసీ దశాబ్దపు టీ20 జట్టు
ఎంఎస్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, క్రిస్ గేల్, అరోన్ ఫించ్, కోహ్లి, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, పొలార్డ్, రషీద్ ఖాన్, బుమ్రా, మలింగా
ఐసీసీ దశాబ్దపు టెస్టు జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, సంగక్కార, బెన్‌స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, డేల్ స్టెయిన్
Comments
Please login to add a commentAdd a comment