సోషల్‌మీడియాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కింగ్ సోషల్‌మీడియాలోని ఏ ప్లాట్‌ఫాంలో పోస్ట్ పెట్టినా కోట్లల్లో వ్యూస్, లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్‌కు సంబంధించిన పోస్ట్ ఒకటి ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేసింది.
టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ సహచరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్‌గా రికార్డు సృష్టించింది.
Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o
— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024
ఈ వీడియోను ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించారు. 9.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఐసీసీ ఇన్‌స్టా చరిత్రలో ఇది అత్యధిక జనాధరణ పొందిన పోస్ట్‌గా రికార్డైంది. ఇన్‌స్టాలో 20 మిలియన్ లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్‌గా, సెకెండ్ ఏషియన్‌గా, ప్రపంచంలో ఐదో అథ్లెట్‌గా విరాట్ రికార్డులు నెలకొల్పాడు.
ఐసీసీ ఇన్‌స్టా వీడియోకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వీడియోలో కోహ్లి ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహింది పాడిన ఆల్‌టైమ్ హిట్ సాంగ్ "తునుక్ తునుక్ తన్"కు డ్యాన్స్ చేశాడు. కోహ్లికి జతగా అర్ష్‌దీప్, సిరాజ్, అక్షర్ పటేల్, బుమ్రా, రింకూ సింగ్ చిందులేశారు.
VIRAT KOHLI'S INSTAGRAM POST ON T20 WORLD CUP VICTORY NOW HAS 20 MILLION LIKES...!!!! 🇮🇳
- King Kohli becomes the first Asian to have 20 Million likes on a Instagram post in the History. 🐐🙌 pic.twitter.com/noofdlRQfP— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024
కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది.
విరాట్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం విరాట్.. సహచరులు రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. కోహ్లి, రోహిత్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment