వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం భారత సెలెక్టర్లు ఇవాళ (సెప్టెంబర్ 5) టీమిండియాను ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. యువకులు, అనుభవజ్ఞులతో ఈ జట్టు సమతూకంగా ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్‌లకు అందరూ ఊహించినట్టుగానే మొండిచెయ్యి ఎదురైంది.
ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. గత వరల్డ్‌కప్‌లో ఆడిన సగం మంది సభ్యులు (ఏడుగురు) ప్రస్తుతం ప్రకటించిన జట్టులో లేరు. అలాగే టీమిండియాకు కెప్టెన్ కూడా మారాడు. 2019 ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లి సారథ్యం వహించగా.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే 2023 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు.
గత వరల్డ్‌కప్ ఆడిన ఎంఎస్ ధోని పూర్తిగా ఆట నుంచి తప్పుకోగా.. శిఖర్ ధవన్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వీరి స్థానల్లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. ఈ ఏడుగురికి ఇది తొలి వరల్డ్‌కప్ కావడం విశేషం.
వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్.
Comments
Please login to add a commentAdd a comment