వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న హైఓల్టేజీ సమరంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. వరల్డ్‌కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లితో పాటు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
విరాట్ 32 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో 12 హాఫ్ సెంచరీలు చేయగా.. హిట్‌మ్యాన్ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకాడు. రోహిత్, విరాట్‌లతో పాటు షకీబ్ అల్ హసన్, కుమార సంగక్కర కూడా వరల్డ్‌కప్‌లో 12 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 21 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా హిట్‌మ్యాన్ ఒత్తిడికి గురి కాకుండా ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 30.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. ఇప్పుడే (30.2వ ఓవర్) కేఎల్ రాహుల్ (39) అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. రోహిత్ శర్మతో (79) పాటు సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా.. ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లి (0), శ్రేయస్ అయ్యర్ (4) తక్కువ స్కోర్లకే ఔటై దారుణంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment