ప్రస్తుత ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఓటమి ఎరుగని జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఈనెల 29న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా తమ విజయపరంపరను కొనసాగించి, డబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించాలని భావిస్తుంది. ఇందుకోసం భారత క్రికెటర్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు వేదిక అయిన లక్నోకు ఇదివరకే చేరుకున్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో ముమ్మరంగా సాధిన చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఎల్లుండి జరుగబోయే మ్యాచ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం కానుంది. ఈ మ్యాచ్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ను వందో మ్యాచ్ కావడం విశేషం. కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన రోహిత్.. 73 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చి టీమిండియా మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో అరుదైన రికార్డుపై కూడా కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో అతను మరో 47 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 18000 పరుగుల మైలురాయిని చేరుకున్న 20వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
ఎవరికీ అందనంత ఎత్తులో కోహ్లి..
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ 47 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 18000 పరుగుల మైలురాయిని చేరుకోనున్న 20వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనుండగా.. ఈ విభాగంలో కోహ్లి ప్రస్తుత క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 26121 పరుగులు చేసి, సచిన్ (34357), సంగక్కర (28016), పాంటింగ్‌ల (27483) తర్వాత 26000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఈ లెక్కన చూస్తే కోహ్లి.. రోహిత్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పరుగుల పరంగా రోహిత్.. కోహ్లిని చేరుకోవాలంటే మరో 8000 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంది. వయసు రిత్యా రోహిత్‌కు ఇది సాధ్యపడకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment