
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని ధోని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్.. అప్పటి నుంచి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే తాజాగా ధోని చేసిన ఓ పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లు అయ్యింది.
సోషల్ మీడియా వేదికగా ధోని శనివారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఆదివారం(సెప్టెంబర్25) మధ్యాహ్నం 2 గంటలకు ఓ సర్‌ఫ్రైజ్ ఇవ్వనున్నట్లు ధోని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో ధోని రిటైర్మెంట్ ప్రకటించానున్నాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
He scares me more 🧐#MSDhoni pic.twitter.com/f37qig1KRF
— PavanTweetz 〽️ (@mrprincepavan) September 24, 2022
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. పంత్, చాహల్‌కు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment