Dhoni retirement
-
క్రికెట్‌కు ధోని గుడ్‌బై.. ఆదివారం సర్ఫ్రైజ్ ఇవ్వనున్న తలైవా?
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని ధోని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్.. అప్పటి నుంచి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే తాజాగా ధోని చేసిన ఓ పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లు అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ధోని శనివారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఆదివారం(సెప్టెంబర్25) మధ్యాహ్నం 2 గంటలకు ఓ సర్ఫ్రైజ్ ఇవ్వనున్నట్లు ధోని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో ధోని రిటైర్మెంట్ ప్రకటించానున్నాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. He scares me more 🧐#MSDhoni pic.twitter.com/f37qig1KRF — PavanTweetz 〽️ (@mrprincepavan) September 24, 2022 చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. పంత్, చాహల్‌కు నో ఛాన్స్! -
సరిగ్గా ఇదే రోజు.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై! ఐసీసీ స్పెషల్ వీడియో
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ మిస్టర్ కూల్.. సరిగ్గా ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ధోనీ రిటైర్మెంట్ రెండో వార్షికోత్సవ సందర్భంగా ఐసీసీ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐసీసీ ఈవెంట్లలో ధోని సారథ్యంలో భారత్ సాధించిన విజయ క్షణాలును ఐసీసీ చూపించింది. కాగా ఈ వీడియోకు ఎంఎస్ ధోని: "1928 గంటల నుంచి నన్ను రిటైర్డ్‌గా పరిగణించండి". "2020 ఆగస్టు 15న భారత సూపర్ స్టార్ ఎంస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లెజెండ్కి ఇదే మా ప్రత్యేక నివాళి' అని ఐసీసీ క్యాప్షన్‌గా పెట్టింది. కాగా భారత క్రికెట్ చరిత్రలో తన పేరును ధోని సువర్ణ అక్షరాలతో లిఖించాడు. ఐసీసీ నిర్వహించిన అన్ని టోర్నమెంట్లనూ తన ఖాతాలో వేసుకున్న తొలి కెప్టెన్ ధోని మాత్రమే. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిని ధోని సారథ్యంలోనే భారత్ కైవసం చేసుకుంది. ధోని తన అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లు కలిపి 17,226 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో 15 సెంచరీలు ఉన్నాయి. చదవండి: Asia Cup 2022 Winner Prediction: కచ్చితంగా ఆ జట్టు ట్రోఫీ గెలవగలదు: పాక్ మాజీ కెప్టెన్ -
ధోనీ రిటైర్మెంట్ : సీఎం స్పందన
చెన్నై : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఆదివారం ధోనీని ఉద్ధేశిస్తూ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘‘ 331 అంతర్జాతీయ మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించటంతో పాటు కెప్టెన్ కూల్‌గా దేశానికి మూడు ఛాంపియన్‌షిప్‌లు గెలిపించినందుకు ఎంఎస్ ధోనీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతడి విజయాలు, కీర్తి ప్రతీ భారతీయుడికి చిరస్మరణీయం’’ అని పేర్కొన్నారు. ( ఆ సిక్సర్‌ను ఎలా మర్చిపోగలను? ) #MSDhoni's name will be etched in history for leading the Indian cricket team in 331 international matches and for being the only #captaincool to win 3 championships for the nation. His laurel and fame will be cherished by every Indian. pic.twitter.com/KBDJwoRt5V — Edappadi K Palaniswami (@CMOTamilNadu) August 16, 2020 -
ఆ సిక్సర్‌ను ఎలా మర్చిపోగలను?
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయంటారు క్రీడాప్రియులు. మ్యాచ్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మహీ ఉన్నాడనే భరోసా కొండంత బలాన్ని ఇచ్చేది. ధోని ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాక అతని బ్యాట్ నుంచి వచ్చే హెలికాప్టర్ షాట్లు చూసి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టేవి. అత్యుత్తమ కెప్టెన్, బెస్ట్ ఫినిషర్, అద్భతమైన వికెట్ కీపర్.. ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు శనివారం ప్రకటించారు. దీంతో క్రికెట్ ప్రేమికుల గుండె బద్ధలైంది. ధోని లేని ఆటను ఊహించుకోలేమంటూ రోదిస్తున్నారు. క్రీడా ప్రముఖులతో పాటు, సినీ సెలబ్రిటీలు ఆయన రిటైర్మెంట్ పట్ల విచారం వ్యక్తం చేశారు. (షాకింగ్: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై) ధోని తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ట్విటర్లో స్పందించారు. 2011లో జరిగిన వరల్డ్‌కప్‌లో ధోనీ సిక్సర్ బాది భారత్ కప్పు కైవసం చేసుకున్న ఆనాటి జ్ఞాపకాల్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా "ఆ ఐకానిక్ సిక్సర్‌ను నేనెలా మర్చిపోగలను? 2011 ప్రపంచ్ కప్ విజేతగా భారత్.. ఆ సమయంలో వాంఖడే స్టేడియంలో నిలబడ్డ నేను సంతోష గర్వంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. కానీ క్రికెట్ ఇక ఎప్పుడూ ఒకేలా ఉండదు" అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. (షాక్: ధోని బాటలోనే రైనా కూడా) How can I ever forget the iconic sixer!! World cup champions 2011 India!! Was in the stands at Wankhede, proud and tears rolling down... Cricket will never be the same... Take a bow @msdhoni 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/69vsf96820 — Mahesh Babu (@urstrulyMahesh) August 15, 2020 -
ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్ వద్దు
‘ధోని బాయ్ ఇప్పుడే రిటైర్మెంట్ వద్దు.. మెగా టోర్నీ నిష్క్రమణతోనే మా గుండెపగిలింది. ఈ పరిస్థితుల్లో నీ రిటైర్మెంట్ ప్రచారం మమ్మల్ని ఇంకా బాధపెడుతోంది. దయచేసి ఆ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు.’ అని సోషల్ మీడియా వేదికగా యావత్ క్రికెట్ అభిమానుల మిస్టర్ కూల్‌ను అభ్యర్థిస్తున్నారు. #Donotretiredhoni యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది. అభిమానులకు గుండె కోతను మిగిల్చింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. టాపార్డర్ చేతులెత్తేసినా.. ఓటమి కళ్లుముందు కనిపిస్తున్నా.. మ్యాచ్ ఫినిషర్ ధోని ఉన్నాడులే గెలిపిస్తాడులేనన్న ఓ చిన్న ఆశ.. ప్రతి అభిమాని మదిలో మెదిలింది. 12 బంతుల్లో 36 పరుగులు.. ధోని అనుభవం ముందు పెద్ద లెక్కకాదు. కానీ అదృష్టం కలిసిరాక రనౌట్ రూపంలో ఆ ఆశ కూడా ఆవిరైంది. ఏనాడు భావోద్వేగాలను ప్రదర్శించని ధోని కూడా ఈ రనౌట్‌తో కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ రనౌట్ అంపైర్‌కు కూడా ఇష్టం లేదని అతని ముఖకవలికల ద్వారా స్పష్టమైంది. ఇక ఓ కెమెరా అయితే కన్నీరే కార్చేసింది. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మీడియా మాత్రం ధోని తొలి మ్యాచ్‌లో రనౌట్.. ఆఖరి మ్యాచ్‌లో రనౌట్ అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. దీన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని ధోనిని వేడుకుంటున్నారు. ‘వీల్‌చైర్‌లో ఉన్న ధోనికి తన జట్టులో చోటిస్తానని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ అన్న మాటలే ధోని ఎంత గొప్ప ఆటగాడో తెలియజేస్తున్నాయి. తమ దేశ పౌరసత్వం ఉంటే ఇప్పుడే ధోనిని తమ జట్టులోకి తీసుకుంటామని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అన్న వ్యాఖ్యలు ధోని విలువెంటో చెబుతున్నాయి. కానీ మనవాళ్లే ధోని రిటైర్మెంట్పై ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ధోని భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యమని, మరెవరిని ఊహించలేని పాత్ర అతనిదని.. ఇప్పుడే రిటైర్మెంట్ వద్దని వేడుకుంటున్నారు. #donotretiredhoni please sir please I'm believe in Number 7⃣ & you are truly legend and fighter #MSDlove and forever inspiring to every youth please sir do not retire 🙏 pic.twitter.com/Fl9Gc8Jqj5 — Sunil Prajapati (@Imsunil122) July 11, 2019 #donotretiredhoni Hey Msd we are watching your Batting since we were able to understand cricket,your are our super hero,last hope of Millions of your fan.dont disappointment them,Play for india until you have believe on yourself. Love you MSD.🙂#Lasthope pic.twitter.com/vUSmI3eFvY — prateek jain (@prateeks1129) July 11, 2019 -
మిస్టర్ కూల్.. కంట తడి!!
న్యూఢిల్లీ : మహేంద్ర సింగ్ ధోనీ అనగానే.. అంతా మిస్టర్ కూల్ అంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా చాలా సరదాగా, నవ్వుతూ ఉండిపోవడం ధోనీ లక్షణం. అలాంటి ధోనీ.. కంటతడి పెట్టాడంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు. టెస్టు కెరీర్ ముగిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని డ్రసింగ్ రూంలో సహచరులకు చెప్పే సమయంలో ధోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆఖరి టెస్ట్ ఆడిన అనంతరం స్నేహితులకు వీడ్కోలు చెబుతూ డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీటి పర్యంతమయ్యాడు. జట్టు సహచరులతో దాని గురించి మాట్లాడుతుంటే ధోనీ కళ్ల వెంట నీళ్లు ఆగలేదని.. దాంతో చుట్టూ ఉన్న మిగిలిన జట్టు సభ్యులు కూడా బాగా చలించారని ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ పూర్తయిన తర్వాత విలేకరుల సమావేశంలో మాత్రం ధోనీ సరదాగా మాట్లాడాడు. లోపలకు వెళ్లిన తర్వాత అతడి లోపలి మనిషి ఇన్నాళ్లకు బయటకొచ్చాడు. -
'2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలి'
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ సాధించడం భారత కెప్టెన్ ధోనీ లక్ష్యం కావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. మహీ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించగానే సచిన్ స్పందించాడు. టెస్టు క్రికెట్లో ధోనీ అద్భుతమైన కెరీర్ కొనసాగించాడని సచిన్ ట్వీట్ చేశాడు. తామిద్దరం కలిసి క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సాహం చూపేవాళ్లమని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. 2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలని సచిన్ సూచించాడు. -
ధోనీ రిటైర్మెంట్కు కారణమదేనా?
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి తక్షణం రిటైరవడానికి కారణమేంటి? క్రికెట్ వర్గాలు, అభిమానులను వేధిస్తున్న ప్రశ్నఇది. ధోనీ ఇంత తొందరగా రిటైరవుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ధోనీ అనూహ్య నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ధోనీ తన రిటైర్మెంట్ విషయం గురించి రెండేళ్ల కిందటే ప్రస్తావించాడు. వచ్చే ప్రపంచ కప్ (2015 వన్డే కప్) నాటికి తన వయసు 34 ఏళ్లు ఉంటాయని, జట్టుకు సారథ్యం వహించాలంటే ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన అవసరముందని మహీ గతంలో వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్, పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించాలంటే టెస్టుల నుంచి వైదొలగకతప్పదని కూడా అప్పట్లో చెప్పాడు. ధోనీ కెప్టెన్‌గా భారత్‌కు అత్యుత్తమ విజయాలు అందిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలివి. మహీ తన సారథ్యంలో టి-20, వన్డే ప్రపంచ కప్‌లను అందించాడు. ఇక టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా మన్ననలందుకున్నాడు. రెండేళ్ల క్రితం కూడా ధోనీ కెప్టెన్సీ విషయంపై చర్చ జరిగింది. మహీపై ఒత్తిడి తగ్గించేందుకు మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించాలని కొందరు విశ్లేషకులు ప్రతిపాదించారు. కనీసం టెస్టు ఫార్మాట్కన్నా వేరేవారికి పగ్గాలు అప్పగించాలని సూచించారు. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ధోనీ రిటైర్మెంట్పై ప్రకటన చేయడం షాక్‌కు గురిచేసింది. కాగా బీసీసీఐ మహీ నిర్ణయాన్ని సమర్థించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. దీన్నిబట్టి ప్రపంచ కప్, పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకే మహీ రిటైరయ్యాడని భావిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇటీవల గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చినా అవి కెప్టెన్సీపై ప్రభావితం చూపేంత పెద్దవికావు. విదేశాల్లో పరాజయాలు, గాయాలు, ఒత్తిడి ప్రభావం చూపే అవకాశాలున్నా.. తక్షణం వైదొలిగేంత కారణాలు కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ధోనీ రిటైర్మెంట్పై ప్రముఖుల స్పందన
భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్టు అనూహ్యంగా ప్రకటించడంతో క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ధోనీ నిర్ణయంపై క్రికెట్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వెంటనే పలువురు క్రికెట్, సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ తక్షణం రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ పూర్తిగా ఆడుంటే బాగుండేదని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో ధోనీ అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు భారత క్రికెట్ ప్రస్థానం అసాధారణమని సంజయ్ ఝా అన్నారు. ధోనీ సారథ్యంలో భారత్ ఓ వెలుగు వెలిగిందని ట్వీట్ చేశారు. మరికొందరు ప్రముఖుల వెల్లడించిన అభిప్రాయలు.. మీ సారథ్యం, నిష్ర్కమణ సాహసోపేతమైనది- సురేష్ రైనా ధోనీకి మరో మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది-గవాస్కర్ మీ సేవలు ప్రశంసనీయం. మీ సారథ్యంలో దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు. -శృతిహాసన్ ధోనీ నిర్ణయం సరైనదే. మహీ గాయాలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. -చిన్మయ్ భోగ్లే దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు- ప్రియమణి News Alert - MS Dhoni has chosen to retire from Test Cricket with immediate effect #MSD #Captain — BCCI (@BCCI) December 30, 2014 MS Dhoni's retirement marks an extraordinary decade (2004-14) from debut to farewell. His singular leadership transformed the Men in Blue. — Sanjay Jha (@JhaSanjay) December 30, 2014 Valiant while you led. Valiant in your departure. #Respect @msdhoni pic.twitter.com/w6xdnebG3s — Suresh Raina (@ImRaina) December 30, 2014 The art of leadership – by MS Dhoni...What made MSD captain extraordinaire? He reveals it here - http://t.co/UUQ5aYQAiV #Dhoni #Captain — BCCI (@BCCI) December 30, 2014 Shri Mahendra Singh Dhoni ji should now be elevated to the Marg Darshak Mandal. #Dhoni #Respect — Paresh Rawal (@Babu_Bhaiyaa) December 30, 2014 Good call from Dhoni. Looked like he was nursing chronic injuries - Not diving to the left/right, extra pressure on the slips, etc. — Chinmay Bhogle (@chinmaybhogle) December 30, 2014 As the new year dawns on all of us Dhoni announces his retirement in test cricket!take a bow #msd!!!u did the county proud! — priyamani (@priyamani6) December 30, 2014 -
టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేది: గంగూలీ
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ మరికొన్నాళ్లు ఆడతారని అనుకున్నానట్లు గంగూలీ చెప్పారు.