ఆ సిక్స‌ర్‌ను ఎలా మ‌ర్చిపోగ‌ల‌ను? | Mahesh Babu Emotional Tweet On MS Dhoni | Sakshi
Sakshi News home page

ఇక క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు: మ‌హేశ్‌

Published Sun, Aug 16 2020 11:06 AM | Last Updated on Sun, Aug 16 2020 11:40 AM

Mahesh Babu Emotional Tweet On MS Dhoni - Sakshi

మ‌హేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులోనే వైబ్రేష‌న్స్ ఉన్నాయంటారు క్రీడాప్రియులు.  మ్యాచ్‌ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మహీ ఉన్నాడనే భరోసా కొండంత బలాన్ని ఇచ్చేది. ధోని ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాక అతని బ్యాట్‌ నుంచి వచ్చే హెలికాప్టర్‌ షాట్లు చూసి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టేవి. అత్యుత్తమ కెప్టెన్‌, బెస్ట్ ఫినిష‌ర్‌, అద్భ‌త‌మైన వికెట్ కీప‌ర్‌.. ఇలా అన్నింట్లోనూ త‌నదైన ముద్ర వేసుకున్న ఈ బ్యాట్స్‌మెన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు. దీంతో క్రికెట్‌ ప్రేమికుల గుండె బ‌ద్ధ‌లైంది. ధోని లేని ఆట‌ను ఊహించుకోలేమంటూ రోదిస్తున్నారు. క్రీడా ప్ర‌ముఖుల‌తో పాటు, సినీ సెలబ్రిటీలు ఆయ‌న రిటైర్‌మెంట్ ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. (షాకింగ్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై)

ధోని తీసుకున్న నిర్ణ‌యంపై టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు ట్విట‌ర్‌లో స్పందించారు. 2011లో జ‌రిగిన వ‌రల్డ్‌క‌ప్‌లో ధోనీ సిక్స‌ర్ బాది భార‌త్‌ క‌ప్పు కైవ‌సం చేసుకున్న ఆనాటి జ్ఞాపకాల్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా "ఆ ఐకానిక్ సిక్స‌ర్‌ను నేనెలా మ‌ర్చిపోగ‌ల‌ను? 2011 ప్ర‌పంచ్ క‌ప్ విజేత‌గా భార‌త్‌.. ఆ స‌మ‌యంలో వాంఖ‌డే స్టేడియంలో నిల‌బ‌డ్డ నేను సంతోష గ‌ర్వంతో క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోయాను. కానీ క్రికెట్ ఇక ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు" అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. (షాక్‌: ధోని బాటలోనే రైనా కూడా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement