అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది! | Mahesh Babu Pic With Dhoni In Anant Ambani And Radhika Merchant Wedding, Trending On Social Media | Sakshi
Sakshi News home page

Mahesh Babu-Dhoni Viral Pic: ధోనీతో మహేశ్ బాబు ఫ్యాన్ బాయ్ మూమెంట్.. ఫొటో వైరల్

Published Sat, Jul 13 2024 6:38 PM | Last Updated on Sat, Jul 13 2024 7:52 PM

Mahesh Babu Pic With Dhoni In Anant Ambani Wedding

అంబానీ ఇంట్లోని పెళ్లి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్, టీమిండియా.. ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు.. అనంత్ అంబానీ పెళ్లిలో కనిపించారు. జస్ట్ కనిపించడమే కాకుండా డ్యాన్సులతో రచ్చ రచ్చ చేశారు. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి మహేశ్, వెంకటేశ్, రామ్ చరణ్ తదితరులు సతీసమేతంగా పెళ్లికి హాజరయ్యారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మహేశ్, టీమిండియా లెజెండ్ ధోనీతో పిక్ తీసుకోవడం మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: వీడియో కాల్‌లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?)

టీమిండియా దిగ్గజం ధోనీకి అభిమానులు కాని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా మహేశ్ కూడా ఆయనకు ఫ్యాన్స్ అనుకుంట. అందుకే అంబానీల పెళ్లిలో ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే అవకాశం దొరకడంతో ధోనీతో ఓ ఫొటో దిగాడు. తాజాగా ఆ పిక్‌ని ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. 'లెజెండ్‌తో..' అని క్యాప్షన్ పెట్టాడు. దీనిబట్టి ధోనీకి మహేశ్ ఎంత పెద్ద అభిమానో అర్థమైపోతోంది.

మహేశ్ బాబు తెలుగు హీరో కావడం వల్ల ఈ పెళ్లిలో ఆయన్ని గుర్తుపట్టి పలకరించిన వాళ్లు తక్కువమందే. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు కదా. దీని రిలీజ్ తర్వాత కచ్చితంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోతాడు. అప్పుడు మహేశ్‌తో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎగబడటం గ్యారంటీ. ఏదేమైనా మహేశ్-ధోనీ పిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement