ధోనీ రిటైర్మెంట్పై ప్రముఖుల స్పందన | Reactions on dhoni retirement | Sakshi
Sakshi News home page

ధోనీ రిటైర్మెంట్పై ప్రముఖుల స్పందన

Published Tue, Dec 30 2014 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

ధోనీ రిటైర్మెంట్పై ప్రముఖుల స్పందన

ధోనీ రిటైర్మెంట్పై ప్రముఖుల స్పందన

భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్టు అనూహ్యంగా ప్రకటించడంతో క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ధోనీ నిర్ణయంపై క్రికెట్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వెంటనే పలువురు క్రికెట్, సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ తక్షణం రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. కాగా ఆసీస్తో టెస్టు సిరీస్ పూర్తిగా ఆడుంటే బాగుండేదని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో ధోనీ అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు భారత క్రికెట్ ప్రస్థానం అసాధారణమని సంజయ్ ఝా అన్నారు. ధోనీ సారథ్యంలో భారత్ ఓ వెలుగు వెలిగిందని ట్వీట్ చేశారు. మరికొందరు ప్రముఖుల వెల్లడించిన అభిప్రాయలు..

మీ సారథ్యం, నిష్ర్కమణ సాహసోపేతమైనది- సురేష్ రైనా
ధోనీకి మరో మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది-గవాస్కర్
మీ సేవలు ప్రశంసనీయం. మీ సారథ్యంలో దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు. -శృతిహాసన్
ధోనీ నిర్ణయం సరైనదే. మహీ గాయాలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. -చిన్మయ్ భోగ్లే
దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు- ప్రియమణి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement