Tests
-
పెట్రోల్, డీజిల్ నిక్షేపాల వెలికితీతకు ట్రయల్ రన్
లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను కనుగొనేందుకు బోరుబావుల తవ్వకాల ద్వారా ట్రయల్ రన్ ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో ఈ తవ్వకాలకు నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. సుమారు 80–200 అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు. ఆ తర్వాత వాటి అడుగు భాగంలో డైనమైట్లు, జిలెటిన్ స్టిక్స్, మందుగుండు సామాగ్రి పంపి పేలుస్తున్నారు.అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుళ్లవల్ల చుట్టుపక్కల వ్యవసాయ బోరుబావులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. రైతుల అనుమతుల్లేకుండా వారి పంట పొలాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదా.. లింగాల మండల కేంద్రంలోని ఎ.వి. శ్రీనివాసరెడ్డి పొలంలో అనుమతిలేకుండా తొమ్మిది బోరు బావులు తవ్వారు. జిల్లా కలెక్టర్ అనుమతులతో ఓఎన్జీసీ సంస్థ బోరుబావులు తవ్వుతోందని తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చిన అనుమతుల కాపీని తనకు అందించారన్నారు. ఇక ముదిగుబ్బ నుంచి జమ్మలమడుగు వరకు బోరుబావుల తవ్వకాల కాంట్రాక్టును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ పొందినట్లు సమాచారం. -
సొరంగంలో జీపీఆర్ పరీక్షలు
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చు. దీంతో గల్లంతైన కార్మికులు శిథిలాల కింద ఎక్కడున్నారో గురువారం రాత్రిలోగా తెలిసిపోయే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. శిథిలాల తవ్వకాలు ప్రారంభం..బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్‌ఫోర్స్‌మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.కన్వేయర్ బెల్టు మరమ్మతు కష్టమే..సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్‌తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సింగరేణి నుంచి మరో 200 మందిగోదావరిఖని (రామగుండం): సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.ఈ పరికరం ఎలా పనిచేస్తుంది?జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు శుక్రవారం విశ్లేషించనున్నారు. -
ఐపీఎల్ సమయంలోనూ ‘ఎర్రబంతి’తో...
ముంబై: భారత క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శనతో ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరింది. తమ స్థాయికి తగినట్లుగా ఆడితే టైటిల్ కూడా సాధించే అవకాశం ఉంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆటగాళ్లంతా ఐపీఎల్ హడావిడిలో పడిపోతారు. తమ ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైపోతారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం టీమిండియా ఇటీవలి టెస్టు ప్రదర్శనను పూర్తిగా మర్చిపోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా 0–3తో చిత్తయిన భారత్ ఆ తర్వాత ఆ్రస్టేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్–జులైలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ కీలక సిరీస్‌కు ముందు అంతా ఐపీఎల్‌లోనే ఉంటారు కాబట్టి టెస్టుల సన్నద్ధతకు తగిన సమయమే లభించదు. గతంలో ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ వెళ్లిన సందర్భాల్లో (2011, 2014, 2018లలో) భారత్ చిత్తుగా ఓడి సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌లో ముందంజలో నిలిచినా... కోవిడ్ కారణంగా కొద్ది రోజుల తర్వాత జరిగిన టెస్టుల ఓడి సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సమయంలోనూ భారత క్రికెటర్లు టెస్టులకు సిద్ధమయ్యేలా చూసే ప్రణాళికను బీసీసీఐ రూపొందిస్తోంది. పూర్తిగా టి20కే అంకితం కాకుండా టెస్టుల కోసం ఎర్రబంతితో సాధన చేసేలా చేయడమే దీని ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు జట్టులో సభ్యులైన భారత ఆటగాళ్లు రెండు నెలల పాటు పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమైపోరు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు రాబోయే టెస్టుల కోసం ప్రాక్టీస్ కొనసాగించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా సెషన్లు ఉంటాయి. ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక దుబాయ్‌లో దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు అధికారులు చర్చించారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత జరిగే మరో సమావేశంలో ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను బోర్డు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుగానే సన్నాహాలు మొదలు పెడుతోంది. -
కోహ్లి చేసిన తప్పిదే.. ఇకనైనా మారుతాడా?
-
India vs Australia: ఎవరిదో శుభారంభం!
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుంది. 136 ఏళ్ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా మూడు సిరీస్‌లలో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. 1888లో ఇంగ్లండ్ జట్టు మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు భారత జట్టుకు ఈ అవకాశం లభిస్తోంది. అయితే ఈసారి భారత జట్టుకు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం... తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం... గాయంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ వైదొలగడం... పుజారా, రహానే వంటి టెస్టు స్పెషలిస్టులు లేకపోవడం... కోహ్లి, కేఎల్ రాహుల్ ఆటలో నిలకడలేమి... వెరసి భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదు. గత రెండు పర్యాయాల్లో భారత జట్టు చేతిలో సిరీస్ కోల్పోయిన ఆ్రస్టేలియా ఈసారి మాత్రం అదరగొట్టే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. భారత్‌పై తొలి టెస్టు నుంచే ఒత్తిడి పెంచి ఈ సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో కమిన్స్ బృందం ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండుసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ... ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 4–0తో గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో చిక్కి కివీస్ చేతిలో వైట్‌వాష్ కు గురైన భారత జట్టు... పేస్‌కు సహకరించే ఆ్రస్టేలియా గడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి! పెర్త్: పోరాటతత్వానికి పెట్టింది పేరైన ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సమరానికి భారత జట్టు సిద్ధమైంది. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి సిరీస్‌లో ఐదు టెస్టులు నిర్వహించనుండగా... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు అత్యవసరం కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం. గత రెండు ఆసీస్ పర్యటనల్లో (2018–19, 2020–21) సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా... వరుసగా మూడోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఒత్తిడిలో కనిపిస్తోంది. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టుకు ఇదే తొలి విదేశీ టెస్టు సిరీస్ కాగా... అతడితో పాటు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి ఈ పర్యటన మరింత కీలకం కానుంది. గత ఆసీస్ పర్యటనలో రాణించిన పుజారా, రహానే, షమీ, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేకపోగా... యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ పరీక్ష కానుంది. మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ మెరుగైన సాధనతో సిద్ధంగా ఉంది. నితీశ్ రెడ్డి అరంగేట్రం! ఆ్రస్టేలియా పర్యటనలో రాణిస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కెరీర్ తొలి నాళ్లలో సచిన్ టెండూల్కర్ ‘వాకా’ పిచ్‌పై శతకంతోనే మరింత పేరు ప్రఖ్యాతలు సాధించగా... 2014 ఆసీస్ టూర్ లో కోహ్లి నాలుగు శతకాలతో చెలరేగి ‘కింగ్’ అనిపించుకున్నాడు. యావత్ ప్రపంచ దృష్టి సారించే ఆ్రస్టేలియా పర్యటన ద్వారా పుజారా, రిషభ్ పంత్ సాధించిన గుర్తింపు తక్కువేమీ కాదు. అలాగే ఇక్కడ విఫలం కావడంతోనే కెరీర్‌కు ముగింపు పలికిన ప్లేయర్లకూ కొదవలేదు. గతంలో దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఇలాగే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లి, రోహిత్, అశ్విన్ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కనిపించే మాటల యుద్ధం ఈసారి పెద్దగా తెర పైకి రాకపోగా... తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనుండటం... ఆసీస్ సీనియర్ల నోటికి తాళాలు వేసినట్లు కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... గాయంతో దూరమైన గిల్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయనున్నాడు. కోహ్లి, పంత్‌తో కలిసి ధ్రువ్ జురేల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి, ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు జట్టులో స్థానం పక్కా కాగా... తాత్కాలిక కెప్టెన్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, హర్షిత్లలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. స్మిత్ అచ్చొచ్చిన స్థానంలోనే... డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్న ఆ్రస్టేలియా జట్టు పలు ప్రయోగాలు చేసి విఫలమైంది. టీమిండియాతో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఆ సమస్య తీరినట్లే అనిపిస్తోంది. ఇటీవల భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’జట్టుకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనీ ఈ సిరీస్‌లో ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.దీంతో స్మిత్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బరిలోకి దిగనున్నాడు. లబుషేన్, ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్, అలెక్స్ క్యారీలతో ఆసీస్ మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ పిచ్‌పై మెరుగైన గణాంకాలు ఉన్న నాథన్ లయన్ స్పిన్ బాధ్యతలు మోయనుండగా... కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ భారత టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టడానికి అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యారు. 24న రోహిత్ శర్మ రాక... వ్యక్తిగత కారణాలరీత్యా ఆ్రస్టేలియాతో తొలి టెస్టుకు దూరమైన భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈనెల 24న జట్టుతో చేరనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టులో బుమ్రా జట్టును నడిపించనుండగా... మొదటి టెస్టు మూడో రోజు రోహిత్ టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు (డే అండ్ నైట్) రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. పిచ్, వాతావరణం పెర్త్ పిచ్ పేస్‌కు, బౌన్స్‌కు ప్రసిద్ధి. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు అకాల వర్షం కారణంగా పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ వెల్లడించగా... రెండు రోజులుగా బాగా ఎండ కాయడంతో వికెట్ పూర్వ స్థితికి చేరింది. పచ్చికతో కూడిన పిచ్‌పై తొలి రోజు ఆట కీలకం కానుంది.భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ ఎంతో ప్రత్యేకమైంది. ఈసారి ఐదు మ్యాచ్‌లు ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత ఎక్కువ. తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనున్నప్పటికీ... ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అనుకోవడం లేదు. వేలంలో చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందులో ప్లేయర్లు చేయాడానికి ఏమీ ఉండదని అందరికీ తెలుసు. స్వదేశంలో ఆడేటప్పుడు అంచనాల ఒత్తిడి ఉండటం సహజమే. భారత్ కఠిన ప్రత్యర్థి. వారిని ఎదుర్కొనేందుకు మేం బాగా సిద్ధమయ్యాం. ఐపీఎల్ సందర్భంగా భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. బంతిని స్వింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో రాణించే సత్తా అతడిలో ఉంది. –ప్యాట్ కమిన్స్, ఆ్రస్టేలియా కెప్టెన్ కెప్టెన్సీని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తా. దాని కోసం సదా సిద్ధంగా ఉంటా. చిన్నప్పటి నుంచి సవాళ్లను ఎదుర్కోవడం అలవాటే. గతంలో నాయకత్వం చేసిన అనుభవం ఉంది. అయితే ఇది ఒక్క మ్యాచ్‌కే... రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ రెండో టెస్టు నుంచి బాధ్యతలు తీసుకుంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. రోహిత్, కోహ్లిని అనుకరించాలని చూడను. దేశానికి సారథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. మేనేజ్మెంట్కు అతడిపై విశ్వాసం ఉంది. కోహ్లి బ్యాటింగ్‌పై వ్యాఖ్యలు చేయను. అతడి సారథ్యంలోనే జట్టులోకి వచ్చా. జట్టులో అతడి ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలుసు. –బుమ్రా, భారత కెప్టెన్ 52 ఆ్రస్టేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత జట్టు ఇప్పటి వరకు 52 టెస్టులు ఆడింది. ఇందులో 9 టెస్టుల్లో గెలిచింది. 30 టెస్టుల్లో ఓడిపోయింది. 13 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.4 ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుండటం ఇది నాలుగోసారి. గతంలో 1947లో, 1977లో, 1991లో రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. ఐదు టెస్టులతో కూడిన మూడు సిరీస్లలోనూఆ్రస్టేలియా జట్టే విజేతగా నిలవడం గమనార్హం. తుది జట్లు (అంచనా) భారత్: బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లి, పంత్, జురేల్, అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ, సిరాజ్/ఆకాశ్‌దీప్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. -
జై శ్రీరాం.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ఆకాశ్ దీప్ (ఫొటోలు)
-
ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టులు
లండన్: భారత క్రికెట్ జట్టు 2025లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ప్రస్తుత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముగిసిన వెంటనే 2025–2027 డబ్ల్యూటీసీ మొదలవుతుంది. ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దీనికి సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 10 నెలల ముందుగానే షెడ్యూల్‌ను విడుదల చేయడం విశేషం. ఐదు టెస్టులు జరిగే వేదికలతో పాటు తేదీలను కూడా ఈసీబీ ప్రకటించింది.జూన్ 20–24 మధ్య లీడ్స్‌లో తొలి టెస్టు, జూలై 2–6 మధ్య బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరుగుతాయి. జూలై 10–14 మధ్య జరిగే మూడో టెస్టుకు లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదిక కానుండగా... మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు (జూలై 23–27), లండన్‌లోని ఓవల్‌లో ఐదో టెస్టు (జూలై 31–ఆగస్టు 4) నిర్వహిస్తారు. ఇరు జట్ల మధ్య 2021–22 సీజన్లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచి 17 ఏళ్లయింది. 2026లో లార్డ్స్‌లో మహిళల టెస్టు... భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న సమయంలో భారత్, ఇంగ్లండ్ మహిళా జట్లు కూడా అక్కడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య వచ్చే ఏడాది 5 టి20లు, 3 వన్డేలు జరుగుతాయి. జూన్ 28, జూలై 1, 4, 9, 12 తేదీల్లో నాటింగ్‌హామ్, బ్రిస్టల్, ఓవల్, మాంచెస్టర్, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా ఐదు టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.అనంతరం సౌతాంప్టన్, లార్డ్స్, డర్హమ్లలో జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో భారత మహిళల జట్టు పర్యటన ముగుస్తుంది. అయితే 2026లో మన టీమ్ మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లి ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఈ టెస్టు జరుగుతుందని ఈసీబీ ప్రకటించింది. లార్డ్స్‌లో మహిళల టెస్టు మ్యాచ్ జరగనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
మేడిగడ్డకు ‘పరీక్ష’ కాలం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనకు కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి నిర్వహిస్తున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు(ఇన్వెస్టిగేషన్లు) అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బరాజ్‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిలిపివేయాల్సి వచి్చందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలపగా, ఇతర సమస్యలు ఉత్పన్నం కావడంతోనే పరీక్షలను ఆపామని మరో అధికారి వివరించారు. బరాజ్‌కు పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించడానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో సమావేశం కానుంది. శాశ్వత మరమ్మతులకు ఇన్వెస్టిగేషన్లే కీలకం గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. బ్లాకులోని 19, 20, 21వ పియర్లతోపాటుగా 20వ పియర్పైన ఉన్న శ్లాబు, పారాపెట్ వాల్స్, రోడ్డు బ్రిడ్జికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు పడి నీరు లీకైన విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మూడు బరాజ్‌లను పరిశీలించి గతంలో మధ్యంతర నివేదిక సమరి్పంచింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి దారితీసిన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పటిష్టతను పరీక్షించడానికి వాటికి సైతం ఈ పరీక్షలు జరపాలని కోరింది. వాటి ఆధారంగానే శాశ్వత మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ పరీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించిన తర్వాతే మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు నిర్వహించాల్సిన శాశ్వత మరమ్మతులపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమరి్పంచనుంది. మేడిగడ్డ బరాజ్‌కు పరీక్షలు మధ్యంతరంగా ఆగిపోవడంతో కమిటీ తుది నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మాత్రం పరీక్షలు కొనసాగుతున్నాయని, మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. మేడిగడ్డ బరాజ్‌కు ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో కొన్ని చివరి దశలో ఉండగా, మరికొన్ని వేర్వేరు దశల్లో ఉన్నాయని, వర్షాలు పూర్తిగా నిలిచిన తర్వాతే వాటిని మళ్లీ పునరుద్ధరించడానికి ఆస్కారముంటుందని స్పష్టం చేస్తున్నాయి. అత్యవసర మరమ్మతులు దాదాపుగా పూర్తిచేశాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా అత్యవసర మరమ్మతులు దాదాపుగా పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణుల బృందానికి నీటిపారుదలశాఖ తెలియజేసింది. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు ఇంకా పూర్తికావాల్సి ఉందని పేర్కొంది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) బి.నాగేందర్రావు, రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి శుక్రవారం జలసౌధలో ఎన్డీఎస్ఏతో పాటు సెంట్రల్ వాటర్ అండర్ పవర్ రిసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్(సీఎస్ఎంఆర్ఎస్) ప్రతినిధులు అమితాబ్ మీనా, మనీష్గుప్తా, డాక్టర్ మందిరతో సమావేశమై మధ్యంతర నివేదిక అమలులో పురోగతిని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలియజేశారు.ఈ బృందం త్వరలో ఢిల్లీలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశమై వారికి తెలియజేయనుంది. దీని ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేస్తుంది. -
అమ్మాయి ఆరోగ్యానికి ఏడు పరీక్షలు
ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలి. అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి.వారికి వద్దు ఆటంకాలు. వారిపై వద్దు చిన్నచూపు.ఇదే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందేశం.అయితే యుక్త వయసుకు వచ్చిన బాలికలకు చాలామంది తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షలు చేయించరు.వైద్యనిపుణులు మాత్రం ఎదిగే వయసులోని ఆడపిల్లలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలంటున్నారు.‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవ్వాల్సిన కానుక ఈ ఆరోగ్య పరీక్షలే. ఆడుతూ పాడుతూ ఉన్నంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లలకు శారీరకంగా ఏవో కొన్ని పోషక విలువల లోటుపాట్లు ఉండకపోవు. అయితే చాలామంది తల్లిదండ్రులు వాటిని నిర్థారణ చేసుకోరు. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు. పోషకాహార లోపంతో బాధపడే బాలికల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు, లోపాలను సరి చేసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించాలంటున్నారు వైద్య నిపుణులు. బాలికల సమగ్ర వికాసాన్ని సందేశంగా ఇచ్చే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా తప్పక ఈ పరీక్షలను చేయించడమే ఆడపిల్లలకు ఇచ్చే అసలైన కానుక అవుతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ): బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. పూర్తి రక్త గణన (íసీబీపీ) పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత ఉందో లేదో తెలుస్తుంది. సీబీసీ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కౌంట్ గురించి చెబుతుంది. ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా సీబీపీ పరీక్ష తెలియచేస్తుంది. బాలికల్లో అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అసలు కారణం తెలియడానికి సీబీపీ చేయించడం మంచిది. ఐరన్ప్రొఫైల్: ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణంగా రక్తహీనత వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ పరిస్థితిని (ఐరన్ లోపాన్ని) సమర్థంగా అధిగమించవచ్చు. విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్స్: ఉత్సాహకరమైన శారీరక ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్స్ వల్ల విటమిన్ల లోపం ఏదైనా ఉంటే తెలుస్తుంది. విటమిన్ బి12 జీవ క్రియలకు అత్యంత ముఖ్యమైనది. ఆ విటమిన్ లోపం ఉంటే వైద్యుని సలహాతో దానిని పూరించే సప్లిమెంట్స్ ఇప్పించాలి. విటమిన్ డి లోపంతో ఎముకలపై ప్రభావం పడుతుంది. శరీరంలో డి విటమిన్ తగ్గకుండా ఉదయపు ఎండ తగిలేలా చూడటం, వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవడం చేయాలి. ఆడపిల్లలు కండరాల బలహీనత, అలసట, ఎముకల్లో నొప్పిని ఎదుర్కొంటుంటే విటమిన్ల టెస్ట్ తప్పక చేయించాలి. మూత్ర పరీక్ష: మైక్రోస్కోప్ ద్వారా చేసే మూత్రపరీక్ష ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మంట వంటి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించాలి. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సింప్టమ్స్ కనిపించకపోవచ్చు. అందువల్ల ఒకసారి ఈ పరీక్ష చేయించడం మంచిది. మల పరీక్ష: ఎదిగే వయసు పిల్లలు మల విసర్జన రోజువారీ చేయకపోయినా, మల విసర్జనలో ఇబ్బంది పడుతున్నా, తరచూ విరేచనాలవుతున్నా లేదా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా అదేం పెద్ద విషయం కాదన్నట్టు నిర్లక్ష్యం చేయకూడదు. మల పరీక్ష చేయించాలి. దానివల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుస్తుంది. కంటి పరీక్ష: టీనేజ్ పిల్లలకు తప్పనిసరిగా చేయించాల్సిన పరీక్ష ఇది. ఈ వయసులో హ్రస్వదృష్టి వచ్చినా, దీర్ఘదృష్టి వచ్చినా పిల్లలు దానిని గుర్తించకనే కంటికి శ్రమ ఇచ్చి రోజువారి పనులను, చదువును కొనసాగిస్తారు. కాని కంటి పరీక్ష వల్లే దృష్టిలోపం తెలుస్తుంది. ఈ వయసులో గుర్తించకుండా దృష్టిలోపం కొనసాగితే తర్వాత కాలంలో కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకని కంటి పరీక్ష తప్పదు.హార్మోనల్ వర్కప్ టెస్ట్: ఆడపిల్లల్లో ఈడేరడం ఆలస్యం అవుతుంటే ఈ టెస్ట్ చేయించడం తప్పనిసరి. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, థైరాయిడ్ పని తీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు తదితరాలు తెలుస్తాయి. దీనివల్ల యుక్తవయసుకు జాప్యం ఎందుకో తెలుస్తుంది. సరి చేయ వీలవుతుంది. -
సెల్ఫోన్లలో ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుదారుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాము చేయించుకున్న చికిత్సలు, వైద్య పరీక్షల వివరాలను లబ్దిదారులు ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఎప్పుడైనా మెడికల్ రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. కార్డుదారులకు అవసరమైన చికిత్సలు ఏఏ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయో తెలియజేసే వివరాలన్నీ ఈ యాప్‌లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు చేపట్టిన మొదటి విడత ఇంటింటి సర్వే సమయంలోనే.. ఈ యాప్‌ను ఆరోగ్యశ్రీ కార్డుదారులు తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని లబ్దిదారుల ఫోన్లలో దీనిని డౌన్లోడ్ చేయించి.. దాని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు నంబర్ లేదా సంబంధిత కుటుంబసభ్యుని ఆధార్ నంబర్‌ను యాప్‌లో నమోదు చేస్తే.. ఆ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ వివరాలన్నీ అందులో ప్రత్యక్షమవుతాయి. వారంతా ఈ పథకం ద్వారా పొందిన చికిత్సల వివరాలను తెలుసుకోవచ్చు. చికిత్స సమయంలో జరిగిన వైద్య పరీక్షల రిపోర్టులు కూడా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా ఆ వైద్య పరీక్షల రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించినందుకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించిందన్న వివరాలను కూడా వారు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికం.. వలంటీర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుదారుల మొబైల్ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్‌కు సంబంధించిన కార్యక్రమం నవంబర్ 29 వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించిన పురోగతిని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 6,83,635 మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఈ యాప్‌ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్నారు. బుధవారం ఒక్క రోజే 1,81,507 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్ష మందికి పైగా, ఏలూరు జిల్లాలో 99,427 మంది, కాకినాడ జిల్లాలో 85,166 మంది డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు చెప్పారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్‌వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్‌సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్‌పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో హెల్త్ ఏటీఎం చూశారా? అన్ని పరీక్షలు ఇక్కడే!
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, విపరీతమైన కాలుష్యం కారణంగా చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్లు, స్కూలు విద్యార్థులు కూడా గుండెజబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో ఏ చిన్న అనుమానం వచ్చినా, సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పని సరిగా మారిపోయింది. అయితే సాధారణంగా 30 ఏళ్లు నిండినవారు, కుటుంబాల్లో బీపీ,సుగర్, కేన్సర్, గుండె జబ్బుల చరిత్ర ఉన్నవాళ్లు క్రమంగా తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఉరుగుల పరుగుల జీవితంలో మనలో చాలామంది హెల్త్ చెకప్స్‌ను వాయిదా వేస్తుంటాం. అలాంటివారికి గుడ్ న్యూస్ ఈ హెల్త్ ఏటీఎం బ్యాంక్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM) తరహాలోనే హెల్త్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. టచ్-స్క్రీన్ కియోస్క్ హార్డ్‌వేర్,ఇది ఏదైనా ఇంటర్నెట్-కనెక్ట్ చేయబడిన వెబ్ బ్రౌజర్ నుండి వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.హైదరాబాద్‌కు చెందినప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ డిజిటల్ హెల్త్‌కేర్ కియోస్క్‌ను తీసుకొచ్చింది. ఏటీఎం తరహాలో హెల్త్ పాడ్ ఎక్విప్మెంట్ ద్వారా బీపీ, టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్, బీఎంఐ, ఈసీజీ వంటి వివరాలను నిమిషాల్లో తెలుసుకోవచ్చు. రిపోర్ట్స్ వెంటనే వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ లేదా ప్రింటవుట్‌పై పొందవచ్చు. ఈ ఏర్పాటు ఆస్పత్రుల్లో రోగుల ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో BMI, BMR, ఎత్తు, బరువు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, ECG వంటి 75 కంటే ఎక్కువ విభిన్న ఇన్వాసివ్ అండ్ నాన్-ఇన్వాసివ్ పరీక్షలను నిర్వహించగలదు. ఏఐ ,మెషీన్ లెర్నీంగ్ సాఫ్ట్వేర్, సెన్సర్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎలాంటి సమస్యకైనా ఈ ఆటోమేటెడ్ టచ్ స్క్రీన్ కియోస్క్ ద్వారా వారు డాక్టర్‌తో టెలీకన్సల్టింగ్ పొందే వెసులుబాటు కూడా ఉంది. -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
చెప్పులే ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలు విధించింది. ప్రధానంగా ఎగ్జామ్‌హాల్‌లోకి వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు వరుసగా(సెలవులు మినహా) పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుదల చేసింది. ఇప్పటివరకు 88 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, పరీక్ష సమయానికి గంటముందు వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు టీఆర్‌ఈఐఆర్‌బీ కల్పించింది. ముందస్తుగా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని నిబంధనలు పాటించాలని, పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు తెలిపారు. అర్హత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి సెషన్, రెండోసెషన్ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, మూడోసెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. పరీక్ష సమయంకంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల వరకు మాత్రమే గేట్లు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. అధికారుల పరిశీలనలో సంతృప్తి చెందితేనే లోనికి పంపిస్తారు. అభ్యర్థులు తమ వెంట ఏదేని ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు (పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకెళ్లాలి. ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లిన తర్వాత అభ్యర్థి బయోమెట్రిక్ సమాచారం సేకరిస్తారు. ప్రతి పరీక్ష 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిర్దేశించిన గడువు తర్వాతే అభ్యర్థిని బయటకు పంపిస్తారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌లో సాంకేతిక కారణాలతో ఫొటో ముద్రితం కాకుంటే ఒరిజినల్ ఫొటో అతికించి నిబంధనలకు అనుగుణంగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి హాజరుకావాలి. బోర్డు కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ కొందరు అభ్యర్థులు సోమవారం ఉదయం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఆందోళనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బోర్డు కార్యాలయ ఆవరణకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించడం, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం కత్తిమీద సాముగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఏమీ లేదని, అభ్యర్థులకు సర్దిచెప్పి పంపించారు. -
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ ఆధ్వర్యంలో తలసేమియా పరీక్షలు
హైదరాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ అధ్వర్యంలో తలసేమియా(సికిల్ సెల్ అనీమియా) వ్యాధిని గుర్తించే హెచ్పీఎల్సీ(హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) పరీక్షలను నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నర్గీస్ సకీనా యార్ ఖాన్, కార్యదర్శి ఫాతిమా తాహిర్‌లు.. జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో 23 మంది మహిళలకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ హానికర రక్త హీనత(సికిల్ సెల్ అనీమియా) వంశపారంపర్యంగా వ్యాపిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్లో లోపం కారణంగా ఇది సంభవిస్తుంది. జన్యువులలో మ్యుటేషన్ కారణంగా ఈ వ్యాధి రావచ్చని వైద్యులు తెలిపారు. పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి తల్లి నుంచి శిశువుకు వ్యాపించకుండా నిరోధించడానికి గర్భిణీలకు ముందస్తు నిర్ధారణ చాలా ముఖ్యమని డాక్టర్లు వెల్లడించారు. తలసేమియా వ్యాధి కలిగిన వ్యక్తులను గుర్తించడానికి ఈ హెచ్పీఎల్సీ (హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు వ్యాధి వ్యాపించకుండా నిర్దారణకు ఈ టెస్టు ఉపయోగపడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. సికిల్ సెల్ అనీమియాను కనిపెట్టడానికి హెచ్పీఎల్సీ టెస్టింగ్ నిర్దిష్టమైన ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి తమకు ఎఫ్‌పీఏఐ సహాయం చేసినట్లు చెప్పారు. తలసేమియాను గుర్తించిన మహిళలకు కాల్షియం సిరప్, మల్టీవిటమిన్ సిరప్ బాటిల్లను అందించారు. ఇదీ చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా -
ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు ఎలక్ట్రికల్ పరీక్షలు పూర్తి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సంబంధించి ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు శుక్రవారం ఎలక్ట్రికల్ పరీక్షలను పూర్తిచేశారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అదేవిధంగా ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రోజూ అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత ప్రయోగాన్ని నిర్వహిస్తారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ నెల 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని షార్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు శుక్రవారం నుంచే https://lvg. shar.gov.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి పేరు, పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు, కోవిడ్ పరీక్ష సర్టిఫికెట్ కూడా ఉండాలని పేర్కొన్నారు. -
‘సెమీ క్రయోజనిక్’ టెస్ట్... సూపర్ సక్సెస్.. ఇస్రో కీలక ప్రకటన
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఇంటరీ్మడియట్ కాన్ఫిగరేషన్ పరీక్ష (పవర్ హెడ్ టెస్ట్ ఆరి్టకల్)ను సంస్థ మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ) సెంటర్లో జూలై 1న ఈ పరీక్ష జరిపినట్టు సోమవారం ఇస్రో ప్రకటించింది. ‘‘భవిష్యత్తు ప్రయోగ వాహనాలను దృష్టిలో ఉంచుకుని బూస్టర్ దశలను శక్తిమంతం చేయడం, 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేయడం ఈ పరీక్ష లక్ష్యం. గ్యాస్ జనరేటర్, టర్బో పంపులు, ప్రీ–బర్నర్, కంట్రోల్ కాంపోనెంట్ల వంటి కీలకమైన సబ్ సిస్టమ్‌ల సమగ్ర పనితీరును 4.5 సెకండ్ల స్వల్ప వ్యవధిలో హాట్ ఫైరింగ్ చేసి ధ్రువీకరించడం దీని ముఖ్య ఉద్దేశం’’ అని తన వైబ్సైట్లో వెల్లడించింది. ఇంధనం, ఆక్సిడైజర్ పంపులను నడపడానికి ప్రధాన టర్బైన్ను నడిపించే ప్రీ బర్నర్ ఛాంబర్లోని వేడి–గ్యాస్ జ్వలన, ఉత్పత్తిని పరీక్షించారు. ఇప్పటిదాకా లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌తో కలిపి క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేశారు. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను మాత్రం సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్‌కు తోడుగా కిరోసిన్ ప్రపొల్లెంట్ కలయికతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కిరోసిన్ కలయికతో సెమీ క్రయోజనిక్ ఇంజన్ తయారు చేయాలని చిరకాల ప్రయత్నం ఇప్పటికి కార్యరూపు దాల్చింది. తదుపరి పరీక్షల్లో పనితీరును మరింత మెరుగు పరుచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. 13న చంద్రయాన్–3 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–3 మిషన్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ నెల 13వ తేదీన ఇస్రో దీనిని ప్రయోగించనుంది. ల్యాండర్–రోవర్ కాంబినేషన్‌తో చేపట్టే ఈ ప్రయోగం లక్ష్యం చంద్రుడిలోని సుదూర ప్రాంతాల అన్వేషణ. ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు లాంచ్ విండో అందుబాటులో ఉంటుంది. అయితే, తొలిరోజే ప్రయోగం చేపట్టాలనుకుంటున్నామని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. -
సదరం ‘స్లాట్స్’ తిప్పలు!
దివ్యాంగులకు సదరం ‘స్లాట్స్’ తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సదరం శిబిరాలకు స్లాట్స్ అందని ద్రాక్షగా మారాయి. 15 రోజులకు ఒకసారి విడుదల చేస్తున్న స్లాట్స్ ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐదు సదరం శిబిరాల కేంద్రాలు ఉన్నాయి. వివిధ కేటగిరీ వైకల్యాల నిర్ధారణ శిబిరాలు వారానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండటంతో దివ్యాంగులకు నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవంగా శారీరక వైకల్యం, మానసిక రుగత్మ, వినికిడి లోపం, కంటి రుగత్మల లాంటి నాలుగు వైకల్యం నిర్ధారణ పరీక్షలు ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్వహిస్తోంది. ఒక్కో వైకల్యానికి ఒక్కో కేంద్రాన్ని ప్రత్యేకంగా కేటాయించి వారంవారం శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. వికలత్వ నిర్ధారణ కోసం నాలుగు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి శాశ్వత, తాత్కాలిక ప్రాతిపధికన సర్టిఫికెట్ జారీ చేస్తోంది. మానసిక వైక్యలం పరీక్షలకు రెండు కేంద్రాలు మాత్రమే నిర్వహిస్తోంది. నిలోఫర్ ఆస్పత్రిలో 18 సంవత్సరాల లోపు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 18 సంవత్సరాల పై బడిన వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్... కొత్తగా వైకల్య నిర్ధారణ పరీక్షలు కోసం మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సదరం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఆధార్ నెంబర్, వివరాలు నమోదుతో దరఖాస్తు చేసుకుంటే తేదీ, సమయం, కేంద్రంతో కూడిన స్లాట్ లభిస్తోంది. స్లాట్ ప్రకారం దరఖాస్తుదారులైన దివ్యాంగులు మీ సేవ కేంద్రం రసీదు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటో, మెడికల్ రిపోర్ట్స్‌తో సదరం కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. స్లాట్ ప్రకారం సదరం క్యాంపునకు హాజరు కాకపోతే రెండు రోజుల తర్వాత తిరిగి మీ సేవా ద్వారా స్లాట్ బుక్ చేసు కోవచ్చు. సదరం కేంద్రంలో సంబంధిత వైద్య బందం పరీక్షలు నిర్వహించి వైకల్యాన్ని నమోదు చేస్తోంది. వైకల్యంపైనే... మెడికల్ బోర్టు ఆన్లైన్ వివరాలను పరిశీలించి వైకల్యాన్ని నిర్ణారించిన తర్వాతనే తాత్కాలిక, శాశ్వత ధ్రువీకరణ పత్రాల జారీపై నిర్ణయం తీసుకుంటారు. తాత్కాలిక ధ్రువీకరణ పత్రాలను ఒకటి, రెండు, మూ డు, నాలుగు సంవత్సరాల వరకు వర్తించేలా ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్ రెన్యువల్ కోసం కూడా తిరిగి స్లాట్ బుకింగ్ చేసుకొని వైకల్య నిర్ణారణ పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది. రిజక్ట్ అయితే అంతేనా? క్యాంపులో సదరం సర్టిఫికెట్ జారీ చేయటంలో అప్లికేషన్ రిజక్ట్ అయితే మళ్లీ స్లాట్ సమస్యగా తయారైంది. మానసిక, ఇతర ఇబ్బందులున్న చిన్న పిల్లలు, సర్టిఫికెట్ టెస్టులు టైంలో సహకరించకపోవడంతో డాక్టర్ల టీమ్ రిజక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
హెల్త్ ఐడీల జారీలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానాన్ని మధ్యప్రదేశ్, మూడో స్థానాన్ని ఉత్తరప్రదేశ్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి 3,86,86,305 మందికి సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఐడీలను జారీ చేసిందని వెల్లడించింది. ప్రాథమిక దశలోనే వ్యాధుల నివారణ.. జీవనశైలి, జీవనశైలేతర వ్యాధులను నివారించడానికి రాష్ట్రంలోని 4.66 కోట్ల జనాభాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రజలకు వారి ఇళ్ల వద్దే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు.. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో వ్యాధులు బయటపడినవారికి వైద్యులతో తదుపరి పరీక్షలు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటికి 3,86,86,305 మందికి వారి ఇళ్ల వద్దే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. వారి ఆరోగ్య వివరాలతో కూడిన హెల్త్ ఐడీలను జారీ చేసి డిజిటలైజ్ చేశారు. అలాగే ప్రజల హెల్త్ ఐడీలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానించారు. దీంతో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. చదవండి: మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్‌డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్‌డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ముందు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చదవండి: కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. -
‘చంద్రయాన్–3’లో కీలక పరీక్ష విజయవంతం
బెంగళూరు: చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్/ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ కంపాటిబిలిటీ(ఈఎంఐ/ఈఎంసీ) పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రకటించింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలియజేసింది. శాటిలైట్ ఉప వ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ/ఈఎంసీ టెస్టు నిర్వహించారు. శాటిలైట్ ప్రయోగాల్లో ఇది ముఖ్యమైన పరీక్ష అని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపైన లూనార్ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. 2019లో చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. -
పోలవరం: డయాఫ్రమ్ వాల్ పరీక్షలు పూర్తి
సాక్షి, అమరావతి: గత సర్కారు నిర్వాకాలతో గోదావరి వరదలకు దెబ్బతిన్న పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2 పునాది అయిన డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఈ డేటాను ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) బృందం సమగ్రంగా విశ్లేషించి డయాఫ్రమ్ వాల్ భవితవ్యంపై రెండు వారాల్లోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖకు నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు డయాఫ్రమ్ వాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. డయాఫ్రమ్ వాల్ పటిష్టంగానే ఉన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ తేల్చితే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు మార్గం సుగమం అవుతుంది. స్పిల్ వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే టీడీపీ సర్కార్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించింది. గోదావరికి 2019లో భారీ వరదలు రావడం.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలితేగానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించలేని దుస్థితి నెలకొంది. చంద్రబాబు సర్కారు నిర్వాకాల వల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. 16 రోజులు.. రెండు రకాల పరీక్షలు డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చే పరీక్షలను నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి పీపీఏ, డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ అధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లతో చర్చించింది. సీడబ్ల్యూసీ 2022లో చేసిన సూచనల మేరకు ఈ బాధ్యతను ఎన్హెచ్పీసీకి అప్పగించింది. ఈ ఏడాది జనవరి 26వ తేదీన నేషనల్ హ్రెడ్రోపవర్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌పీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎల్.కపిల్ నేతృత్వంలో జియో ఫిజిక్స్ విభాగంలో నిపుణులైన సంస్థ సీనియర్ మేనేజర్లు ఎ.విపుల్ నాగర్, ఎన్.కె.పాండే, ఎంపీ సింగ్‌లతో కూడిన బృందం పోలవరానికి చేరుకుంది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు హై రిజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానం, సెస్మిక్ టోమోగ్రఫీ విధానం ప్రకారం ఒకే సారి పరీక్షలను ప్రారంభించింది. ఇవి తాజాగా పూర్తయ్యాయి. మొత్తం 16 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. పరీక్షలు నిర్వహించారు ఇలా.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందకు ఎన్‌హెచ్‌పీసీ బృందం రెండు రకాల పరీక్షలు నిర్వహించింది. వాటిని ఎలా నిర్వహించారంటే.. హై రిజల్యూషన్ జియో ఫిజికల్ రెసిస్టివిటీ విధానం ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో నిర్మించిన 1,750 మీటర్ల డయాఫ్రమ్ వాల్ పొడవునా ప్రతి మీటర్‌కు ఒకచోట 20 మిల్లీమీటర్లు (ఎంఎం) వ్యాసంతో 1.5 అడుగుల లోతుతో వేసిన రంధ్రాల్లోకి ఎలక్ట్రోడ్లను పంపి వాటి ద్వారా విద్యుత్ తరంగాలను ప్రసారం చేసి హైరిజల్యూష్ జియో ఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానంలో ఎన్‌హెచ్‌పీసీ బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా తీసిన 3–డి చిత్రాలను విశ్లేషించి డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చనుంది. సెస్మిక్ టోమోగ్రఫీ పరీక్ష.. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌కు ఒక మీటర్ ఎగువన, ఒక మీటర్ దిగువన 60 మి.మీ. వ్యాసంతో 30 నుంచి 40 అడుగుల లోతు వరకూ ప్రతి 40 మీటర్లకు ఒక బోరు బావిని జిగ్ జాగ్ విధానంలో తవ్వారు. అందులోకి ఎలక్ట్రోడ్లను పంపి విద్యుత్ తరంగాలను ప్రసారం చేసి పరీక్షలు నిర్వహించారు. -
ఛీ.. ఛీ ఇదేం ఎయిర్ పోర్టు....మహిళలకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు
దోహ ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియాకి చెందిన ఐదుగురు మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించింది. సదరు మహిళా ప్రయాణికులు 2020లో ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తున్నప్పుడూ ఘోర పరాభవాన్ని చవి చూశారు. దీంతో సదరు మహిళలు ఆ ఖతార్ ఎయిర్ వేస్‌పై దావా వేయాలని సన్నద్ధమవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అక్టోబోర్ 2020లో ఖతార్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వెళ్లినప్పుడూ ఆ మహిళలు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే...అక్కడ ఖతార్‌లో పెళ్లికాకుండా గర్భం దాల్చితే వారిని జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తుంది. ఐతే ఆ రోజు ఈ మహిళలు దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఖాతర్ ఎయిర్వేస్లో ప్రయాణించాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలో దోహా ఎయిర్పోర్ట్ బాత్రూంలో ఒక నవజాత శిశువును ఎవరో వదిలేసి వెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు సదరు మహిళలను తుపాకితో బెదిరించి బలవంతగా అంబులెన్స్‌లో టార్మాక్‌కు తీసుకెళ్లి బలవంతంగా గైనాకలజిస్ట్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రయాణికురాలు నర్సు మాట్లాడుతూ... ఆ ఘటన తర్వాత మళ్లీ ఈ ఎయిర్వేస్లో ప్రయాణించలేదని, చాలా మానసిక క్షోభకు గురైనట్లు వివరించారు. సదరు మహిళా ప్రయాణికులు ఆ ఎయిర్‌పోర్ట్‌పై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఖతార్ అధికారులు ఈ విషయమై ఆ మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేసి సదరు అధికారిని సస్పెండ్ చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...) -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్‌ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
సంచలనం: పీకలదాకా మద్యం తాగి విమానం నడుపుతున్న పైలెట్లు!
విమానయాన రంగంలో 30కి పైగా వివిధ రకాలైన ఉద్యోగాలుంటాయి.వాటిలో మిగిలిన ఉద్యోగుల విధులు ఎలా ఉన్నా..ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే అధికారం పైలెట్లకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విభాగంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల విమానం పైలెట్ల గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ విస్తుపోయే వాస్తవాల్ని బయట పెట్టింది. ఏవియేషన్ రెగ్యూలేటర్ ప్రకారం..విమానంలో ప్రయాణించే ముందు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ (బీఏ) టెస్టుల్లో విఫలమైన విమాన సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ ఉద్యోగులకు తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఏవియేషన్ రెగ్యులేటర్ జనవరి 1, 2022 నుండి నాలుగు నెలల కాలంలో 48 మంది సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు చేయగా మద్యం సేవించడంతో పాటు ఇతర నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో విమానయాన సిబ్బందిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో 9మంది పైలెట్లు, 30మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది రెండోసారి మద్యం తాగినట్లు తేలడంతో మూడేళ్లపాటు సస్పెండ్ చేసింది. మిగిలిన 37 మంది సిబ్బందిని తొలిసారి పాజిటివ్ రావడంతో వారిని సైతం 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విమానయాన సంస్థలు కాక్‌పిట్, క్యాబిన్ క్రూ సభ్యులలో 50 శాతం మందిని రోజూ ప్రీ ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాలని గత నెలలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి ముందే సిబ్బంది విమాన ప్రయాణానికి ముందే ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2 నెలలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, విమానయాన సర్వీసులు ప్రారంభం కావడంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని మళ్లీ ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్‌ల్లో విమానయాన సిబ్బంది బాగోతం బట్టబయలైంది. చదవండి👉మద్యం తాగి కాక్‌పిట్‌లో ప్రయాణం -
నడిరోడ్డు మీద డ్రగ్ టెస్ట్‌లు! ఎరుపు రంగులో చుక్కలు కనిపించాయంటే..
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన రాష్ట్ర పోలీసులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌ల మాదిరి పోలీసులు నడిరోడ్డుపై డ్రగ్ పరీక్షలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారిని డ్రగ్ అనలైజర్ల సాయంతో గుర్తించనున్నారు. తొలుత ఒకట్రెండు డ్రగ్ అనలైజర్లను కొనుగోలు చేసి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేయనున్నారు. అవి ఉపయుక్తంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసి విస్తృతంగా వాటిని వినియోగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలా పరీక్షిస్తారంటే..? చిన్నసైజు టూత్‌బ్రష్(టెస్ట్ కాట్రిడ్జ్) ఆకారంలో ఉండే ఉపకరణాన్ని అనుమానితులు నోటిలో పెట్టుకొని బ్రష్ చేసినట్లుగా తిప్పాలి. ఆ తర్వాత ఏటీఎంలో కార్డ్ పెట్టినట్లుగా ఆ కాట్రిడ్జ్‌ను డ్రగ్ అనలైజర్ డివైజ్‌లో పెడితే చాలు రెండు నిమిషాల్లో ఫలితాలను దాని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్లయితే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు కనిపిస్తాయి. అయితే ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమే! పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మూత్రం, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే మరింత స్పష్టమైన నిర్ధారణకు వస్తారు. డ్రగ్ అనలైజర్ గంజాయి, హష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్ వంటి అన్ని రకాల మాదక ద్రవ్యాలను గుర్తిస్తుంది. ఎంత మోతాదులో డ్రగ్ తీసుకున్నారు? తీసుకొని ఎంత సమయమవుతోంది? వంటి వివరాలను స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ డివైజ్‌కు జీపీఎస్ కూడా ఉంటుంది. దీంతో ఏ ప్రాంతంలో డ్రగ్ పరీక్షలు నిర్వహించారో సాంకేతిక ఆధారాలుంటాయి. వీటిని ఎవరు వినియోగిస్తారంటే..? డ్రగ్ పరీక్షలను లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగరంలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించిన హాట్స్పాట్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత కొన్ని ప్రాంతాల్లో చేపట్టి, వాటి ఫలితాలను బట్టి విస్తరిస్తామని పేర్కొన్నారు. ఎవరికి టెస్ట్‌లు చేస్తారంటే? కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్ అనలైజర్లను వినియోగిస్తున్నారు. వాటి ఫలితాలను మన రాష్ట్ర పోలీసులు అధ్యయనం చేసి, మెరుగైన ఫలితాలు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పట్టుబడిన డ్రగ్ పెడ్లర్ల నుంచి కస్టమర్ల వివరాలను సేకరించి వారికి కూడా పరీక్షలు చేస్తారు. కేస్ స్టడీల ఆధారంగా డ్రగ్స్ çసరఫరా జరిగే ప్రాంతాలను గుర్తిస్తారు. పబ్‌లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలపై నిఘా పెడతారు. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకొని దొరికివాళ్ల డేటాను రికార్డ్‌లోకి ఎక్కిస్తారు. పోలీస్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. -
గ్రూప్స్ వైపు వైద్యుల చూపు
►ఆయన పేరు డాక్టర్ రామకృష్ణ (పేరు మార్చాం). హైదరాబాద్‌లో ఒక పేరొందిన మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా, బోధనాసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కానీ, ఏదో అసంతృప్తి. ఎంత చేసినా పదోన్నతులు ఆలస్యం అవుతుండటం, గుర్తింపు లేదన్న భావనతో ఉన్న ఆయన ఇటీవల ప్రకటించిన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. గ్రూప్–1 పరీక్షలు రాయాలని, ఉన్నతస్థాయి పోస్టు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ►మరొకరు డాక్టర్ రాహుల్ (పేరు మార్చాం). ఎంబీబీఎస్ పూర్తిచేసి రాష్ట్రంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే. కానీ, మూడు నాలుగేళ్లుగా మెడికల్ పీజీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నా ఎండీలో సీటు రావడంలేదు. పీహెచ్సీలో పనిచేసుకుంటూ పోవడం, ఎదుగుబొదుగూ లేని జీవితంతో విసిగిపోయిన ఆయన ఈసారి గ్రూప్–1, 2 రెండూ రాయాలని నిర్ణయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకుపైగా వివిధ రకాల పోస్టులు వేయడంతో నిరుద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పుడు పోటీ పరీక్షల వైపు దృష్టి సారిస్తున్నారు. వీరిలో పీజీ మెడికల్ సీటు రాని వైద్యులు కూడా ఉన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించి ఎంబీబీఎస్ చదివినవారు కూడా గ్రూప్స్ పోస్టులపై కన్నేశారు. చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎదుగుబొదుగూ లేని జీతం, ఇంకా పెళ్లికాక స్థిరపడని జీవితం.. వంటి సమస్యలతో మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటివారు దాదాపు 20 వేల మంది ఉంటారని అంచనా. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన 75 శాతం మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ) పాస్ కాకపోవడంతో దేశంలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోవడం, ప్రాక్టీస్‌కు కూడా అర్హత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిలో చాలామంది ఇప్పుడు పోటీపరీక్షలపై దృష్టి సారించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులతోపాటు నైపుణ్యం ఉంటేనే లక్షల్లో జీతాలు ఇస్తారు. కేవలం ఎంబీబీఎస్ చది వి స్థిరపడే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో 5,200 ఎంబీబీఎస్ సీట్లుంటే, 2 వేల వరకే పీజీ సీట్లున్నాయి. కోచింగ్ సెంటర్లలో చేరికలు రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ఇప్పటికే కోచింగ్‌లు ప్రారంభమయ్యా యి. హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ‘ఈసారి 500 పైగా ఉన్న గ్రూప్–1 పోస్టుల్లో కనీసం 50 మంది వైద్యులే సాధిస్తారని అనుకుంటున్నా. గతంలో నేను సివిల్స్ కోసం కూడా పోటీపడ్డాను. మెయిన్స్ పాసయ్యాను. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రావడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నా. ఇప్పుడు గ్రూప్–1 సాధిద్దామని అనుకుంటున్నా’అని ఒక బోధనాసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యుడు పేర్కొన్నారు. ఇక్కడ చాకిరి తప్ప ఏమీ లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. గ్రూప్–1 అధికారిగా ఎంతో సేవచేయొచ్చు. సమాజంలో గౌరవం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులుగా పనిచేస్తున్నవారు కూడా చేరుతున్నారని ఒక కోచింగ్ సెంటర్ యజమాని తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు కూడా గ్రూప్–1 పోస్టులకు సన్నద్ధం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ..
Samantha Falls Sick And Tested In Private Hospital: స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని వెళ్లింది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సామ్ ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు. -
అక్కడ కోవిడ్ టెస్ట్ బహు ఖరీదు.. ఏకంగా రూ.4500
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాంటిజెన్ పరీక్ష ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రయాణానికి 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకున్నప్పటికీ విమానాశ్రయంలో ఫ్లైట్ బయలుదేరడానికి ముందు యాంటిజెన్ పరీక్ష తప్పనిసరిగా మారింది. దీంతో కనీసం రూ.150 కూడా విలువ చేయని యాంటిజెన్ పరీక్షలకు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.4500 వరకు వసూలు చేస్తున్నారు. కోవిడ్ నెగెటివ్ నినేదికతో బయలుదేరిన ప్రయాణికులు సైతం యాంటిజెన్ పరీక్ష చేసుకోవలసి రావడంతో చిన్న టెస్టు కోసం రూ.వేలల్లో వసూలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాతో పాటు పలు దేశాలు కోవిడ్ ఆంక్షలను సడలించడంతో అంతర్జాతీయ రాకపోకలు పెరిగాయి. దీంతో ఎయిర్‌పోర్టులో యాంటిజెన్ టెస్టులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘టెస్టుల పేరిట ఇలా దోచుకోవడం అన్యాయమని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు’. ‘ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లేందుకు ఇంకా ఫ్లైట్లు అందుబాటులోకి రాలేదు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి చేరుకొనే వరకు కనీసం మూడు,నాలుగు సార్లు యాంటిజెన్ టెస్టులు చేసుకోవలసి వస్తుంది.’ అని ఒక ప్రయాణికుడు తెలిపారు. ఆంక్షలు సడలించాక..... కోవిడ్ దృష్ట్యా నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఎయిర్‌లైన్స్ సేవలు అందుబాటులోకి రాలేదు, గతంలో కుదిరిన ఎయిర్‌బబుల్ ఒప్పందం మేరకే పలు ఎయిర్‌లైన్స్ పరిమితంగా విమానాలను నడుపుతున్నాయి. ఒక్క అమెరికాకే కాకుండా యూరోప్ దేశాలకు సైతం రాకపోకలు పెరిగాయి. ప్రత్యేకించి ఎక్కువ మంది బ్రిటన్‌కు బయలుదేరి వెళ్తున్నారు.అలాగే దుబాయ్, దోహ, షార్జా తదితర దేశాలకు సైతం రాకపోకలు పెరిగాయి. అక్టోబర్‌లో హైదరాబాద్ నుంచి లక్ష మందికి పైగా వివిధ దేశాలకు రాకపోకలు సాగించగా ఆ సంఖ్య ప్రస్తుతం 1.6 లక్షలు దాటినట్లు అంచనా. ఇదే సమయంలో దేశంలోని 65 నగరాలకు హైదరాబాద్ నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో జాతీయ ప్రయాణికుల రద్దీ పెరిగింది. అమెరికాకు వెళ్లవలసిన వాళ్లు బెంగళూరు, ముంబయి, దిల్లీ నుంచి బయలుదేరుతున్నారు. దేశీయ ప్రయాణికులు కూడా 9.35 లక్షల నుంచి ఇంచుమించు 10 లక్షల వరకు చేరుకున్నట్లు అంచనా. మరో 2 నెలలు ఇలాగే... మరో 2 నెలల పాటు యాంటిజెన్ పరీక్షలు తప్పనిసరి కావచ్చునని ఎయిర్‌పోర్టు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ తుదిదశకు చేరుకుంది. జనవరి నాటికి అందరూ వ్యాక్సిన్లు తీసుకోవచ్చు. ఆ తరువాత యాంటిజెన్ తప్పనిసరి వంటి నిబంధనలు ఉండకపోవచ్చునని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
కోవిడ్ టెస్టుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: కోవిడ్ నిర్ధారణలో అత్యధిక కచ్చితత్వం ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) టెస్టులు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో ఎక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం దక్కింది. ఖర్చు ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టులకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆగస్టు 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన మొత్తం ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తమిళనాడు తర్వాత అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే. తమిళనాడులో 99 శాతం టెస్టులు ఆర్టీపీసీఆర్ పద్ధతిలో జరుగుతుండగా.. ఏపీలో 97 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు జరుగుతున్నట్టు వెల్లడైంది. కేరళ వంటి రాష్ట్రాలు సైతం నేటికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల పైనే ఆధారపడుతున్నాయి. మన రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందే నాటికి ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. అలాంటిది 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం వల్లే పెద్ద సంఖ్యలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలుగుతున్నారు. పాజిటివిటీ తగ్గింది ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకూ దేశంలో 10 శాతం అంతకంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న 45 జిల్లాలను గుర్తించారు. ఇందులో ఏపీకి సంబంధించిన జిల్లాలు లేవు. అంతేకాదు 5 నుంచి 10 శాతం లోపు పాజిటివిటీ రేటు ఉన్న 37 జిల్లాలను గుర్తించగా.. అందులోనూ ఒకే ఒక్క జిల్లా ఉంది. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో 7.25 శాతం మాత్రమే పాజిటివిటీ ఉన్నట్టు వెల్లడైంది. దేశంలోని చాలా జిల్లాల్లో 7 నుంచి 9 వరకూ పాజిటివిటీ ఉంది. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు కేరళలోనే 11 ఉండగా.. 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు అరుణాచల్‌ప్రదేశ్‌లో 10 ఉన్నాయి. మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువగానే పాజిటివిటీ ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అత్యధిక పాజిటివిటీ రేటు అక్కడే రాజస్థాన్‌లోని చురు జిల్లాలో వంద టెస్టులు చేస్తే 60కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాగా చురును గుర్తించారు. నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలో 51.52 శాతం పాజిటివిటీ రేటు నమోదై రెండో స్థానంలో నిలిచింది. పుదుచ్చేరిలోని మహే జిల్లా 35.94 శాతం పాజిటివిటీతో మూడవ స్థానంలో ఉంది. -
మృతిచెందిన వ్యక్తికి కరోనా నెగిటివ్ రిపోర్ట్
సాక్షి, రామగుండం(కరీంనగర్): అంతర్గాం మండలంలోని రాయదండికి చెందిన మూడు కుటుంబాల్లో 13 మంది కరోనా టెస్ట్ చేయించుకోకున్నా వారి సెల్ నంబర్లకు నెగెటివ్ రిపోర్ట్ అంటూ మెసేజ్‌లు రావడంతో అవాక్కయ్యారు. వీరిలో ఒకరు గతంలోనే మృతిచెందారు. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయదండికి చెందిన మచ్చ బాలయ్య గత అక్టోబర్ 3న అనారోగ్యంతో మృతిచెందాడు. అంతకుముందు అతనికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చింది. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి విషమించి, చనిపోయాడు. ఈ నేపథ్యంలో మృతుడితోపాటు అతని కుటుంబసభ్యులు శారద, సంజీవ్, విష్ణు, మరో రెండు కుటుంబాలకు చెందిన మచ్చ రామయ్య, రజిత మొత్తంగా 13 మందికి జూలై 28న బసంత్‌నగర్ పీహెచ్సీలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు, రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినట్లు వారి ఫోన్ నంబర్లకు మెస్సేజ్‌లు వచ్చాయి. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కరోనా టెస్ట్‌కు వెళ్లకపోగా పరీక్ష చేయించుకున్నట్లు మెస్సేజ్‌లు రావడం పట్ల మృతుడి కుమారుడు సంజీవ్ ‘సాక్షి’తో తన ఆవేదన వెలిబుచ్చాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన వంగల రమేష్, అతని భార్య వాణి గత ఏప్రిల్ 15న తన కోవిషీల్డ్ మొదటి డోస్ టీకా వేసుకున్నారు. ఆ సమయంలో ఒకే ఫోన్‌నంబర్ ఇచ్చారు. జూలై 26న రెండో డోస్ టీకా వేసుకునేందుకు వెళ్తే వాణి పేరు మాత్రమే ఆన్లైన్లో చూపిస్తోందని ఆమెకు మాత్రమే వ్యాక్సిన్ వేశారు. రమేష్‌కు వేయకుండా పంపించారు. అసలైన లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు. మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్ ప్రకటించారు. చదవండి: ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్ -
Corona Virus: నిర్ధారణకూ నిరీక్షణే
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: ఇది ఒక్క దస్రు, పరిస్థితే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా నిర్ధారణ టెస్టులు ప్రజల సహనానికి నిజంగా పరీక్ష పెడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న అనేకమంది అనుమానితులు సకాలంలో కరోనా పరీక్ష చేయించుకోలేకపోతున్నారు. ఉదయాన్నే వెళ్లి క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్నా ఫలితం ఉండటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పరీక్షా కేంద్రాలకు రోజూ వందల సంఖ్యలో అనుమానితులు వస్తుంటే, కిట్లు లేవంటూ చాలామందిని సిబ్బంది తిప్పిపంపుతున్నారు. పదిరోజుల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాలు కలిపి ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 55 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఎక్కువగా ఉండే ప్రైవేటు కేంద్రాలను పక్కన పెడితే గ్రామాల్లోని ప్రభుత్వ కేంద్రాల్లో జరిగే పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందనే విషయం స్పష్టమవుతోంది. కొందరు మూడు నాలుగురోజులు తిరిగినా ప్రభుత్వ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోలేక పోతున్నారంటే రాష్ట్రంలో కరోనా టెస్టులు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధమవుతుంది. నిస్సహాయ పరిస్థితుల్లో కొందరు అనుమానితులు తమకు పరీక్ష చేయండంటూ సిబ్బందిని ప్రాథేయపడుతున్నారు. కొందరు నిలదీస్తుంటే మరికొందరు ధర్నాలు, బైఠాయింపులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు వ్యయ ప్రయాసలతో ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తుంటే, వైరస్ సోకిన వారు సకాలంలో టెస్టు చేయించుకోలేని ఫలితంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. పరీక్షల కోసం మూడు నాలుగురోజులు తిరిగే క్రమంలో వైరస్ ఇతరులకు వ్యాపించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. పదిరోజుల్లో 6.38 లక్షల పరీక్షలు ప్రభుత్వం నిర్వహించే 1,085 కేంద్రాల్లో 1,064 పరీక్షా కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ (ఆర్ఏటీ) పరీక్షలు చేస్తుండగా... మిగతా 21 కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. నెలక్రితం వరకు ఒక్కో కేంద్రంలో సగటున 100–150 నమూనాలు స్వీకరించి పరీక్షలు చేసిన వైద్యశాఖ సిబ్బంది.. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 63 వేల పరీక్షలు చేస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,38,286 నమూనాలు స్వీకరించారు. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 4,62,820, ప్రైవేటు కేంద్రాల్లో 1,75,466 పరీక్షలు చేశారు. అంటే రోజుకు సగటున 55 పరీక్షలు మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల సంఖ్య 25–30 మధ్యే ఉంటోంది. వీరు కూడా ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడితే చాలాచోట్ల ముందుగా టోకెన్లు ఇచ్చి తర్వాత పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా సిబ్బంది కిట్లు లేవని తిప్పి పంపేస్తున్నారు. కోవిడ్–19 రెండోదశ తీవ్రత దృష్ట్యా పరీక్షలను విరివిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అదేవిధంగా రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానం సైతం రోజుకు కనీసం లక్ష పరీక్షలు చేయాలని వైద్య,ఆరోగ్య శాఖను ఆదేశించింది. అయినా పరీక్షల సంఖ్య రోజురోజుకూ తగ్గడమే తప్ప పెరుగుతున్న దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. మెరుగైన చికిత్సపైనే సర్కారు దృష్టి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల కంటే చికిత్సను మెరుగ్గా అందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్సపైనే దృష్టి్ట సారించింది. మొదటి దశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. – జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ నాలుగు రోజులు పట్టింది నాకు జ్వరమచ్చినట్లయితాందని కరోనా పరీక్ష కోసం పందిల్ల నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి మూడురోజుల నుంచి వత్తన్న. పొతన్న. నేను వచ్చే వరకే మంది బాగా ఉంటాండ్లు. టోకెన్ కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి చెప్పులు పెట్టి క్యూ కడుతున్న. సిబ్బంది వచ్చే వరకు చెట్ల కిందనే ఉంటున్నా. రోజుకు 30 నుంచి 40 మందికే పరీక్షలు చే స్తున్నరు. కానీ రోజూ వందల మంది వస్తాండ్లు. కౌంటర్ దగ్గర ఒక్కరికొక్కరు మీద పడి ఎగబడుతాండ్లు. రోగం ఉందో లేదోమోకని, ఈ లైన్ల నిలబడితే లేని రోగాన్ని తెచ్చుకున్నట్లే. ఈరోజు కూడా దొరుకుతదో లేదో అనుకున్నా కానీ ఈరోజు చేసిండ్రు. – తోలు రాజయ్య, పందిల్ల, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా మందులిచ్చి పంపిస్తున్నారు! ఈమె పేరు మేడి రాజమ్మ. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన ఈమె నాలుగు రోజులుగా దగ్గుతో బాధపడుతోంది. కరోనా కావచ్చని అనుమానించిన ఆమె గురువారం తాండూరు పీహెచ్‌సీకి వచ్చింది. ‘నీకు పరీక్ష అవసరం లేదు. మందులు వాడు తగ్గిపోతుంది’ అని అక్కడి సిబ్బంది కొన్ని మందులు చేతిలో పెట్టి పంపించారు. ఈ పీహెచ్‌సీకి గురువారం 45 మంది అనుమానితులు టెస్టుల కోసం వస్తే 26 మందికి పరీక్షలు చేశారు. మిగతావారిని రాజమ్మకు చెప్పినట్టే చెప్పి తిప్పి పంపేశారు. కిట్ల కొరత కారణంగానే ముందు వచ్చిన వారికి టెస్టులు చేస్తున్నట్లు సిబ్బంది చెప్పారు. మేం పోంగనే కిట్లు అయిపోయినై అంటున్నరు నాకు, నా భార్యకు దగ్గు, జ్వరం వచ్చింది. అందరు కరోనా వచ్చింది పరీక్ష చేసుకొమ్మని చెప్పారు. పరీక్ష కోసం మా తండాకు, పరీక్షలు చేసే కొరవి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురవి నాలుగు రోజులుగా పోయి వస్తున్నాం. మేము పోగానే కిట్లు అయిపోయినై అంటుండ్రు. ఆటోలో ఎక్కించుకునేందుకు డ్రైవర్లు ఇబ్బంది పడుతుండ్రు. తండా వాళ్ళందరూ వేరే తీరుగా చూస్తుండు. తొందరగా పరీక్ష చేస్తే.. మా ఇబ్బంది మేము పడతాం. – ధారవత్ హరి, పద్మ దంపతులు, మోదుగుల గూడెం జుజ్జురు తండా జిల్లా ఆసుపత్రిలో కూడా.. ఇతని పేరు సీహెచ్ అశోక్‌రావు. సిరిసిల్ల బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తాడు. 28 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. మళ్లీ డ్యూటీలో చేరాలంటే.. కరోనా టెస్టు రిపోర్టు కావాలి. అశోక్‌రావు ఉండేది ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో. సిరిసిల్ల జిల్లాసుపత్రికి గురువారం టెస్ట్ కోసం వస్తే.. కిట్లు లేవని సిబ్బంది చెప్పారు. గత మూడ్రోజులుగా అశోక్‌రావు టెస్టు కోసం వస్తున్నా ఇదే పరిస్థితి. గురువారం ఉదయం 8–30 గంటలకు వచ్చినా కిట్లు లేక టెస్టు చేయలేమని సిబ్బంది చెప్పారని అశోక్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు తిరిగి..9 కి.మీ. నడిచి... రాష్ట్రవ్యాప్తంగా కరోనా అనుమానితుల ఇబ్బందులుఇంట్లో దిగాలుగా కూర్చున్న ఇతడి పేరు బుక్యా దస్రు (మహబూబాబాద్ జిల్లా బోరింగ్ తండా). కొద్దిరోజులుగా కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఈయన నిర్ధారణ పరీక్ష కోసం సోమవారం 9 కిలోమీటర్ల దూరం లోని కొత్తగూడ పీహెచ్‌సీకి వెళ్లాడు. అప్పటికే బారులుతీరిన జనంతో కలిసి క్యూలో నిలబడ్డాడు. అతడి వంతు వచ్చేసరికి సమయం మించిపోయిందన్నారు. మళ్లీ మంగళవారం వెళ్లగా కిట్లు లేవన్నారు. బుధవారమూ అదే పరిస్థితి. అప్పటికి దగ్గు తీవ్రమైంది. దగ్గుతున్నాడని ఆటో వాళ్లు ఎక్కించుకోకపోవడంతో 9 కిలోమీటర్ల మేర కాళ్లీడ్చుకుంటూ ఆరోజు ఇంటికి చేరాడు. గురువారం పరిస్థితి విషమిం చడంతో బంధువులు నర్సంపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ మూడు రోజులు పరీక్షల కోసం తిరిగినందుకు రూ.400కుపైగా ఖర్చుచేశాడు. చివరకు పరీక్ష చేయించుకోకుండానే ఆస్పత్రి పాలయ్యాడు. -
వ్యాక్సిన్.. టెస్టులు.. బెడ్స్ కోసం పరుగే పరుగు
కరోనా ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి వ్యాపించే ప్రమాదం నెలకొంది. మన దేశంలో వైరస్ 800 రకాలుగా పరివర్తనం చెందింది. అందుకే ఈ విజృంభణ. కాబట్టి ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. - డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య డైరెక్టర్ కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయి. అత్యవసర పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత నెలకొంది. బాధితులు పడకల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. - డాక్టర్ కృష్ణ ప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి సాక్షి, హైదరాబాద్: మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జనం తీవ్రమైన ఆందోళనల్లోకి వెళ్లిపోయారు. కొం దరు వ్యాక్సిన్ల కోసం, మరికొందరు నిర్ధారణ పరీ క్షల కోసం, ఇంకొందరు ఆసుపత్రుల్లో పడకల కోసం పరుగులు తీస్తున్నారు. దాదాపు ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబం ఇప్పుడు పై మూడు పనుల్లోనే నిమగ్నమైందని వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేసింది. వ్యాక్సిన్లు, టెస్ట్ కిట్లు, కరోనా పడకలు మూడింటికీ కొరత ఏర్పడటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరిని కదిలించినా తమకు తెలిసిన లేదా తమ బంధువుల్లో కొందరికి కరోనా వచ్చిందంటూ చెబుతున్నారు. అధికారికంగా నమోదవుతున్న కేసులే భయాందోళనకు గురిచేస్తుంటే.. ప్రభుత్వ అనుమతి లేకుండా అనేక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో చేస్తున్న పరీక్షలు, కేసులు లెక్కలోకి రావట్లేదని అధికారులే పేర్కొంటున్నారు. క్లస్టర్ దశలో కేసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రపంచంలో 70 శాతం దేశాలు కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయి. ఇండియా క్లస్టర్ దశలో ఉందని ప్రకటించింది. క్లస్టర్ దశ అంటే గత 14 రోజుల్లో కేసులు అధికంగా నమోదైనా, అవి ఎక్కువగా ఒక ప్రాంతానికి చెందినవిగా ఉంటాయి. బయట ప్రాంతం కేసులతో సంబంధం లేకుండా రావడం. మార్కెట్లో లేదా పెళ్లిళ్లలో ఇలా కొన్నిచోట్ల విజృంభించడం. ఇలా వస్తే క్లస్టర్లు అంటారు. చాలావరకు కేసులు మనం గుర్తించని రీతిలో నమోదైనవి ఉంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల వారికే వస్తాయి. మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా విస్తరించింది. సెకండ్ వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తరించింది. ఫస్ట్‌వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో 20 జిల్లాల్లోనే 50 శాతం కేసులు నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో 75 శాతం కేసులు 60 నుంచి 100 జిల్లాల్లో నమోదు కాగా, సెకండ్ వేవ్‌లో 75 శాతం కేసులు 20 నుంచి 40 జిల్లాల్లోనే ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో కొన్నిచోట్ల మరింత ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో నమోదైన 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో 63 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, కేరళలో నమోదయ్యాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ కంటే ఎక్కువగా ప్రస్తుతం దేశంలో 63 శాతం యాక్టివ్ కేసులున్న ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లు తెలంగాణకు సరిహద్దులుగా ఉండటం వల్ల ఇక్కడ అధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభావం మనపై తీవ్రంగా ఉంది. అందుకే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కేసులు కన్పిస్తున్నాయి. ఫస్ట్ వేవ్‌లో సెప్టెంబర్ 18 నాటికి దేశంలో కరోనా పీక్ దశలో ఉంది. ఆ రోజు యాక్టివ్ కేసులు 10.17 లక్షలుంటే, ఈ నెల 18న 19.29 లక్షలు ఉన్నాయి. అంటే దాదాపు రెట్టింపు కేసులు రెండు నెలల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో గత సెప్టెంబర్ 18న 30,673 యాక్టివ్ కేసులుంటే, ఈ ఏప్రిల్ 18న 39,154 యాక్టివ్ కేసులున్నాయి. సామాజిక వ్యాప్తికి దగ్గరలో క్లస్టర్ దశను దాటి ఇప్పుడు సామాజిక వ్యాప్తికి దగ్గరలో ఉన్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోందని పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం గడిచిన 28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే కరోనా లేనట్లు అర్థం. గత 14 రోజుల్లో కేసులు గుర్తించడం.. ఇతర దేశాల నుంచి రావడాన్ని స్పొరాడిక్ లేదా ఇంపోర్టెడ్ దశ అంటారు. అంటే ఇక్కడ కేసులు పుట్టుకుని రాకపోవడం. ఇక క్లస్టర్ దశలో గత 14 రోజుల్లో కేసులు నమోదై అవి ఎక్కువగా ఒక ప్రాంతానికి చెందినవిగా ఉండటం. బయట ప్రాంతం కేసులతో సంబంధం లేకుండా రావడం. నాలుగోది సామాజిక వ్యాప్తి. అన్ని ప్రాంతాల్లోకి వైరస్ విస్తరించి ఉండటం. ఇందులో మళ్లీ నాలుగు దశలు ఉంటాయి. ఒకటి గత 14 రోజుల్లో విపరీతంగా పెరగడం.. క్లస్టర్‌తో సంబంధం లేకుండా పెరగడం. ఎలా కేసులు పెరుగుతున్నాయో తెలియనంతగా నమోదు కావడం. చిన్న ప్రాంతాల్లో కూడా ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు కావడం. ఇలా ఉన్నా ఈ దశలో సాధారణ వ్యక్తులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. 2) 14 రోజుల్లో బాగా కేసులు వస్తాయి. సాధారణ ప్రజలకు మధ్య స్థాయి రిస్క్ ఉంటుంది. 3) సామాజిక వ్యాప్తి ఉంటుంది. 14 రోజుల్లో కేసులు బాగా వస్తాయి. అయితే కేసులు చాలా వరకు హైరిస్క్‌లోకి వెళ్తాయి. 4) నాలుగో దశలో సామాజిక వ్యాప్తి మరింత ఉధృతంగా ఉంటుంది. మరింత హైరిస్క్‌లోకి జనం వెళ్తారు. ఇంట్లో వారికి కూడా కరోనా సోకుతుంది. మన రాష్ట్రంలోనూ వివిధ జిల్లాల్లో సామాజిక వ్యాప్తికి సమీపంలో ఉన్నామని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ప్రాంతాలు మరింత హైరిస్క్‌లో ఉన్నాయి. హైదరాబాద్ కూడా హైరిస్క్‌లో ఉందని అంటున్నారు. -
టెస్టులు లక్ష.. టీకాలు లక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అదేస్థాయిలో ముందుకెళ్తోంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు, టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రికార్డు స్థాయిలో 1,01,986 నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చడంతోపాటు 1,02,886 మందికి టీకాలు వేసింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాస రావు శుక్రవారం బులెటిన్ విడుదల చేశారు. 17.83 లక్షలకు చేరుకున్న కరోనా టీకాలు... గురువారం ఒక్కరోజే 45 ఏళ్లు పైబడ్డ 95,871 మందికి మొదటి డోస్ టీకాలు వేయగా 5,740 మందికి రెండో డోస్ టీకాలు వేశారు. అలాగే గతంలో టీకాలు వేసుకోని కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా గురువారం టీకాలు ఇచ్చారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్నవారు 14,99,801 మందికాగా రెండో డోస్ తీసుకున్నవారు 2,83,407 మంది ఉన్నారు. అంటే రెండు డోస్ టీకాలు తీసుకున్న వారి సంఖ్య 17,83,208కు చేరింది. సగటున 2.51 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. మున్ముందు లక్షన్నర మందికి టీకాలు వేసేలా ప్రణాళిక రచించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు టీకా వేసుకోని వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేస్తామని ఆయన చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించామన్నారు. ఒక్కరోజే 2,478 కేసులు... రాష్ట్రంలో గురువారం 2,478 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 402 కేసులు నమోదయ్యాయి. తాజాగా 363 మంది కోలుకోగా ఇప్పటివరకు 3,03,964 మంది కోలుకున్నారు. ఒక రోజులో ఐదుగురు చనిపోగా ఇప్పటివరకు కరోనాతో 1,746 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.63 శాతంగా నమోదవగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 15,472 ఉండగా, అందులో ఇళ్లలో, కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో, ఐసోలేషన్‌లో 9,674 మంది ఉన్నారు. ఇప్పటివరకు 1,07,61,939 నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 3,21,182 కేసులు నమోదయ్యాయి. గాంధీలో ఒక్కరోజులో 75 మంది అడ్మిట్ గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసీయూ రోగుల సంఖ్య అమాంతం పెరిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 75 మంది కరోనా బాధితులు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో నయంకాకపోవడంతో చివరి దశలో వస్తున్న వరేనని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గాంధీ కోవిడ్ ఐసీయూలో 232 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు రోగుల రద్దీకి అనుగుణంగా ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. గాంధీ కరోనా టీకా కేంద్రంలో ప్రతిరోజూ 300 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, అర్హులైన వారంతా టీకా వేయించుకోవాలన్నారు. -
కరోనా ఉధృతి.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!
హైదరాబాద్: వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చేవారిలో అవసరమైన అందరికీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా పరీక్ష తప్పనిసరిగా చేయాలని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. తీవ్ర శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, కరోనా లక్షణాలు లేకుండా ఆస్పత్రిలో చేరే హైరిస్క్ రోగులకు, వివిధ రకాల శస్త్రచికిత్సలు, సాధారణ వైద్యం కోసం వచ్చే లక్షణాలు లేని రోగులకు, ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 శాతంగానే ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలను 40 శాతానికిపైగా పెంచేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. నేడు మంత్రి ఈటల మీటింగ్ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మంత్రి బుధవారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సలపై సమీక్షిం చారు. కరోనా పరీక్షలను సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. అయితే అందరికీ వ్యాక్సిన్ అందించడానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు మూసివేసిన సర్కారు మరోవైపు రోజూ నిర్వహించే కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచింది. సోమవారం 68,171 , మంగళవారం రికార్డు స్థాయిలో 70,280 పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముమ్మరంగా కొనసాగిస్తోంది. కాగా, మంగళవారం 431 మందికి కరోనా సోకిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 111 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 97,89,113 కోవిడ్ పరీక్షలు జరిగాయి. వీటిల్లో మొత్తం 3,04,298 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజులో 228 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,99,270 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,676కు చేరింది. ఇక రికవరీ రేటు 98.34 శాతానికి తగ్గగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 3,352 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,395 మంది కరోనా బాధితులు ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 10 లక్షలకు పైగా టీకాలు రాష్ట్రంలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 59 ఏళ్ల వయస్సులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేస్తున్నారు. మంగళవారం నాటికి 60 ఏళ్లు పైబడిన 3,10,728 మంది టీకా వేయించుకున్నారు. 45–59 ఏళ్ల వయస్సు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 1,47,718 మంది టీకా పొందారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్నవారు 7,86,426 మంది కాగా, 2,24,374 మంది రెండో డోస్ తీసుకున్నారు. మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 10,10,800కు చేరింది. మంగళవారం ఒక్క రోజులో 60 ఏళ్లు పైబడిన 20,198 మందికి మొదటి డోస్ టీకా వేయగా, 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 15,026 మందికి టీకా వేశారు. -
కరోనా టెస్టుల కోసం ప్రజలు క్యూ
-
ఏందీ కిరికిరి: ఒకటి పాజిటివ్.. మరొకటి నెగిటివ్
బోయిన్పల్లి గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి అకస్మాత్తుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి శనివారం ఉదయం కోవిడ్ టెస్ట్ చేయించగా, పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ విద్యార్థికి సన్నిహితంగా ఉన్న హాస్టల్లోని మరో 103 మంది విద్యార్థులు, హాస్టల్ సిబ్బందికి అదే రోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. వీరిలో 36 మంది విద్యార్థులు సహా నలుగురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ తర్వాత అదే రోజు వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించగా, వీరిలో పదో తరగతి విద్యార్థి(16), ఒక వర్కర్(55) మినహా మిగిలిన వారందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల నాణ్యత, పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నిర్ధారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతూ వైరస్ నిర్ధారణ కోసం వచ్చిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. వైరస్ లేనివారికి ఉన్నట్లు...ఉన్న వారికి లేనట్లు రిపోర్టులు వస్తుండటంతో ఇటు వైద్యులే కాకుండా అటు బాధితులు ఆందోళన చెందుతున్నారు. బోయిన్పల్లి గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు నిర్వహించిన యాంటిజన్ టెస్టులు, జారీ చేసిన రిపోర్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను పరిశీలించకుండా నాసిరకం కిట్లను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు. వైరస్ విస్తరణకు ఈ తప్పుడు రిపోర్టులు కూడా ఓ కారణమని చెబుతున్నారు. ప్రశ్నార్థకంగా ర్యాపిడ్ కిట్ల నాణ్యత.. నిజానికి కోవిడ్ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్‌ను గోల్డెన్ స్టాండర్డ్‌గా భావిస్తారు. ఇందులో వైరస్ నిర్ధారణకు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. అదే ర్యాపిడ్ యాంటిజెన్‌లో అరగంటలోనే ఫలితం తేలుతుంది. సత్వర వైరస్ నిర్ధారణ, చికిత్సల కోసం ప్రభుత్వం ఈ కిట్ల వైపు మొగ్గుచూపింది. నగరంలో ప్రస్తుతం 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 25 పరీక్షలు చేస్తుండగా, ప్రస్తుతం 404 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో 97, మేడ్చల్‌లో 88, రంగారెడ్డిలో 60 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడం సహజమే. ఇలాంటి వారికి వైద్యులు ఖచ్చితత్వం కోసం ఆర్టీపీసీఆర్‌ను సిఫార్సు చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా వైరస్‌ను నిర్ధారిస్తారు. నిజానికి యాంటిజెన్‌లో పాజిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్లోనూ పాజిటివ్ రావాలి. కానీ బోయిన్పల్లి గిరిజన సం క్షేమ వసతి గృహంలో నిర్వహించిన క్యాంపులో పాజిటివ్ వచ్చిన వారిలో, ఇద్దరికి మినహా అందరికీ ఆ తర్వాత నెగిటివ్ రావడం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మార్చింది. ఒక్క రోజే 300కుపైగా కేసులు.. ఒక వైపు కిట్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతుండగా...మరో వైపు గ్రేటర్లో చాపకిందినీరులా వైరస్ విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా సోమవారం కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కూకట్పల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో 47, కుత్బుల్లాపూర్‌లో 22, సరూర్‌నగర్‌లో 27, ముసారంబాగ్‌లో 7, ముషీరాబాద్‌లో 16, గచ్చిబౌలిలో 19, ఉప్పల్‌లో 26, అంబర్‌పేటలో 29, గోల్కొండలో 13, మేడ్చల్‌లో 25, సుభాష్‌నగర్‌లో 10, అల్వాల్ లో 7, మల్కజ్గిరిలో 27, వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 30, ఘోషామహల్లో 9, సనత్‌నగర్‌లో 2, మలక్‌పేట్‌లో 4, బంజారాహిల్స్‌లో 3, ఆమన్నగర్లో 3, మల్లాపూర్‌లో 3, కాప్రాలో 11, యునానీ ఆస్పత్రిలో 2 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు కావడం గమనార్హం. ఇవేకాకుండా ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లోనూ కేసుల సంఖ్య భారీగానే నమోదైనట్లు తెలిసింది. గ్రేటర్లో కరోనా కేసులు ఇలా.. తేదీ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి 16 29 41 10 17 35 21 12 18 47 20 29 19 75 32 31 20 81 34 64 21 91 28 37 చదవండి: కరోనా కట్టడికి 15 రోజుల ప్రచార కార్యక్రమాలు -
తెలంగాణలో తగ్గిన కరోనా పరీక్షల ధరలు
సాక్షి, హైదరాబాద్: కరోనా పరీక్షల ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు ధర రూ.850 నుంచి రూ.500కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి వద్ద శాంపిల్ పరీక్ష ధర రూ.1200 నుంచి రూ.700కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకే ధరలు తగ్గించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. (చదవండి: కొత్త కరోనా: తెలంగాణ సర్కార్ అలర్ట్) ఇది ఇలా ఉండగా, బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ అప్రమత్తమైంది. యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నామని, వారం రోజుల్లో యూకే నుంచి 358 మంది వచ్చినట్టు గుర్తించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. స్ట్రెయిన్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. భారత్ వచ్చాక ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.(చదవండి: భారత్‌లో కొత్త రకం కరోనా ఎంట్రీ!) -
యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ?
సాక్షి, హైదరాబాద్ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాలను అమలు చేయలేదని, డాక్టర్ శ్రీనివాసరావుపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. తమ ఆదేశాలపై అభ్యంతరముంటే అప్పీల్ చేసుకోవచ్చని, అంతేగానీ లెక్కలేనట్టు వ్యవహరిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజు దోపిడీని నియంత్రించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా విచారణకు డాక్టర్ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రోజుకు 50 వేల పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఇంకా ఎక్కువ చేసేందుకూ సిద్ధమని డాక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించడంపై ధర్మాసనం మండిపడింది. రోజుకు 50 వేల పరీక్షలు తప్పకుండా చేయాలని ఈనెల 19న తాము ఆదేశించినా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఈ వారంలో రోజుకు 40 నుంచి 42 వేలలోపు మాత్రమే పరీక్షలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడింది. ఏపీలో ప్రతి మిలియన్‌కు 1.85 లక్షల పరీక్షలు ‘ఏపీలో ప్రతి పది లక్షల (మిలియన్) జనాభాకు 1,85,025 మందికి పరీక్షలు చేశారు. ఢిల్లీలో 2.95 లక్షలు, కేరళలో 1.67 లక్షల పరీక్షలు చేయగా, తెలంగాణలో 1.39 లక్షల పరీక్షలే చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పరీక్షల సంఖ్య చాలా తక్కువుంది. వెంటనే పరీక్షలు పెంచాలి. రోజూ 50 వేలకు తగ్గకుండా చేయాలి. వారంలో ఒకరోజు లక్ష పరీక్షలకు తగ్గకుండా చేయాలి. ఆర్టీపీసీఆర్ పరీక్ష ల్యాబ్‌లను పెంచుతామని రెండు నెలల క్రితం హామీనిచ్చారు. ప్రస్తుతం ఉన్న 17కు అదనంగా 6 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలు గడిచినా ఒక ల్యాబ్‌ను మాత్రమే పెంచారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, కరోనా కారణంగా కుటుంబసభ్యులను, ఉపాధిని కోల్పోయిన వారు మానసిక సంఘర్షణలో ఉంటారని, వారి కోసం మానసిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 17కు వాయిదా వేసింది. ‘యశోద’పై ఎందుకంత ప్రేమ? ‘సన్‌షైన్ ఆసుపత్రిపై 14, కేర్‌పై 10, మెడీకవర్‌పై 8, కిమ్స్‌పై 13, విరించి ఆసుపత్రిపై 19 ఫిర్యాదులు వచ్చాయి. సోమాజిగూడ, సికింద్రాబాద్‌ల్లోని యశోద ఆసుపత్రులపై ఎక్కువ బిల్లులు వసూలు చేశారంటూ అత్యధికంగా 33 ఫిర్యాదులొచ్చాయి. యశోదపై ఇన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలెందుకు తీసుకోలేదు?. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశాయంటూ డెక్కన్, విరించి ఆసుప్రతులపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకున్నారు?. యశోద ఆసుపత్రి అంటే ఎందుకంత ప్రేమ?’అని శ్రీనివాసరావును ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులపై 276 ఫిర్యాదులు రాగా 154 పరిష్కరించామని, 122 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారని, తదుపరి విచారణలోగా పెండింగ్‌లో ఉన్న 122 ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టంగా నివేదికనివ్వాలని ఆదేశించింది. -
కరోనా: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ పరీక్షలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని మండిపడింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యశోద, కిమ్స్, కేర్, సన్ షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ, ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని చురకలంటించింది. రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని మొట్టికాయ వేసింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. కేసులు ఉన్నపుడే పెంచుతారా: హైకోర్టు ఈ క్రమంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రావును హైకోర్టు ఆదేశించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాస రావు నివేదికలో పేర్కొనగా.. రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశించింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. చదవండి: డేటా ఎంతమేరకు భద్రం? జీఎచ్ఎంసీలో మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు మండిపడింది. కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యత జీహీచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని తెలిపింది. కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది. -
హైకోర్టు ఆదేశాలు.. సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిరోజూ 65 వేలకు తగ్గకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రతి జిల్లాకు చేయాల్సిన పరీక్షల టార్గెట్‌ను విధించింది. నిర్దేశించిన పరీక్షల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 35 వేల నుంచి 40 వేల మధ్యే కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తోన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొవాలంటే విస్తృత పరీక్షలొక్కటే మార్గమని ఆయన తెలిపారు. వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు భారీగా టెస్టులు చేయాల్సి ఉందన్నారు. (ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు?) ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 కేంద్రాల్లో యాంటిజెన్, 18 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సామర్థ్యం రోజుకు 25 వేల వరకు ఉండగా, వాటిలో ప్రస్తుతం రోజుకు కనీసం 3 వేలు కూడా చేయడం లేదు. సిరిసిల్ల, నారాయణపేట్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లోనే రోజుకు వెయ్యి లోపు టార్గెట్ ఉండగా, మిగిలిన అన్ని జిల్లాల్లో సగటున 1,200–1,500 మధ్య టెస్టులు చేయాలని శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. -
రోజుకు ‘లక్ష’ పరీక్షలే లక్ష్యం..!
సాక్షి, హైదరాబాద్: సంతృప్తికర (శ్యాచురేషన్) స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలను కోరింది. అంటే కరోనా పరీక్షలు చేయించుకునే వారెవరూ లేరన్నంత వరకు చేయాలని స్పష్టం చేసింది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. కీలకమైన చలికాలంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు గుమికూడే ప్రదేశాల్లో పరీక్షలను ముమ్మరం చేయాలని, ఎక్కడ, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై రాష్ట్రాలు వ్యూహం రచించుకోవాలని సూచించింది. పరీక్షకు నిధులు ఎలా సమకూర్చుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. గుమికూడే ప్రదేశాలపై దృష్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మార్కెట్లు తదితర ప్రజలు అధికంగా గుమికూడే ప్రదేశాలు కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని కేంద్రం తెలిపింది. ‘చాలాసార్లు కార్యాలయాల్లోని వ్యక్తులు సమాజంలోకి వైరస్‌ను మోసుకువస్తారు. లేదా తమ కుటుంబ సభ్యులకు అంటిస్తారు. ఇలా వీరు సూపర్ స్ప్రెడర్స్‌గా మారతారు. కార్యాలయాల ద్వారా పెద్దసంఖ్యలో ప్రజలు వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది. మార్కెట్లు తదితర ప్రాంతాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో వైరస్‌ను గుర్తించడానికి సంతృప్తికర స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించడం వీలవుతుందని పేర్కొంది. (చదవండి: ‘వ్యాక్సిన్’ కోసం లక్షమంది వివరాలు..) ర్యాపిడ్‌లో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ సామూహిక పరీక్షలు పూర్తయిన తరువాత నెగెటివ్ వచ్చిన వారిని కనీసం 5 – 10 రోజుల వరకు పరిశీలనలో ఉంచాలి. వారిలో లక్షణాలుంటే కొన్నిరోజులకు వైరస్ బయటపడుతుంది. అలా లక్షణాలున్న వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలి. విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, కిట్లను, ఇతరత్రా సామగ్రిని సమకూర్చుకోవాలి. ఆ ప్రకారం సాధ్యమైనంత వరకు సంతృప్తికర స్థాయి వరకు పరీక్షలు చేయాలని కేంద్రం సూచించింది. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన సలహాలు, సాంకేతిక సహకారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీనిచ్చింది. (చదవండి: అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్!) రాష్ట్రంలో రోజుకు లక్ష పరీక్షలు చలికాలం నేపథ్యంలో తెలంగాణలో గణనీయసంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 40 వేలకు అటూఇటూగా పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు. ప్రజలు గుమికూడే ప్రదేశాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మార్కెట్ల వద్ద కూడా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 ఆస్పత్రుల్లో, 310 మొబైల్ టెస్టింగ్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే 18 ప్రభుత్వ, 50 ప్రైవేట్ లేబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిల్లో మొత్తం కలిపి రోజుకు లక్ష వరకు పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఆదేశాలతో సంతృప్తికర స్థాయిలో పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్లూ సీజన్.. జాగ్రత్త ప్రస్తుతం చలికాలం కాబట్టి స్వైన్‌ఫ్లూ సహా సీజనల్ ఫ్లూ వ్యాధులు విజృంభిస్తాయి. అలాగే మున్ముందు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. చలికాలం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో చలితీవ్రత దృష్ట్యా జనవరి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర చోట్ల పరీక్షల నిర్వహణకు కార్యాచరణ ప్రారంభించాం. లక్షణాలున్నా లేకున్నా అవసరమైన వారికి పరీక్షలు చేస్తాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
నిర్లక్ష్యానికి ఫలితం.. కోటి టెస్ట్‌లు
బీజింగ్: చైనాలోని కింగ్డావ్ హాస్పిటల్లో జరిగిన చిన్న నిర్లక్ష్యపూరిత తప్పిదానికి దాదాపు కోటి మందికి కరోనా టెస్టులు చేయాల్సివచ్చిందని సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ఇంతవరకు వీరిలో ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు. కింగ్డావ్ ఆస్పత్రి సీటీ రూమ్‌లో డిసిన్ఫెక్షన్ సరిగా చేయకపోవడంతో ఆస్పత్రి కరోనాకు కొత్త క్లస్టర్‌గా మారిందని తెలిపారు. కానీ ఈ తప్పిదంతో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని, ఇకపై క్రాస్ ఇన్ఫెక్షన్తో కొత్త కేసులు వచ్చే అవకాశాలు కూడా ఉండకపోవచ్చని తెలిపారు. కింగ్‌డావ్‌లో కొత్త క్లస్టర్ ఏర్పడడం దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. ఈ నగరాన్ని ఇటీవలి సెలవు దినాల్లో వేలాది మంది సందర్శించారు. దీంతో వీరందరికీ కోవిడ్ ముప్పు ఉండొచ్చన్న అనుమానాలు పెరిగాయి. అందుకే భారీ స్థాయిలో కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు 1.04 కోట్ల శాంపిళ్లు సేకరించామని, వీటిలో 88 లక్షల శాంపిళ్ల ఫలితాలు వచ్చాయని అధికారులు చెప్పారు. శుక్రవారానికి 1.1 కోట్ల మందికి టెస్టులు నిర్వహించడం పూర్తవుతుందన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యానికిగాను కింగ్డావ్ హెల్త్ కమీషన్ డైరెక్టర్ సుయిజెన్హువాను సస్పెండ్ చేశారు. పల్మనరీ ఆస్పత్రి డీన్ డెంగ్ కైను పదవి నుంచి తొలగించారు. ప్రజలకు అందుబాటులో టీకా చైనాలోని జియాజింగ్ నగరంలోని కొందరు పౌరులకు ప్రయోగాత్మకంగా కరోనా టీకాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న, టీకా అత్యంత అవసరమైన వారు ఈ సైనోవాక్ బయోటెక్ టీకా కోసం స్థానిక క్లినిక్‌లలో సంప్రదించాలని జియాజింగ్ అధికారులు గురువారం ప్రకటించారు. ఈ టీకాను ఇప్పటికే వైద్యసిబ్బంది సహా వైరస్ ముప్పు అధికంగా ఉన్న వారికి ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎంతమందికి ఈ టీకా ఇచ్చారనే విషయం కానీ, టీకా దుష్ఫలితాల విషయం కానీ వారు వెల్లడించలేదు. ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో 2 డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీకా ధర 400 యువాన్లు(రూ. 4332)గా నిర్ధారించారు. చైనాలో ప్రస్తుతం 11 టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వాటిలో నాలుగు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఏ టీకా కూడా పూర్తి స్థాయిలో ప్రజాబాహుళ్య వినియోగానికి అనుమతులు పొందలేదు. -
సరికొత్త రికార్డు నెలకొల్పనున్న చైనా..!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఐదు రోజుల్లో ఏకంగా 9 మిలియన్ల కోవిడ్ టెస్టులు చేయనున్నట్లు తెలిపింది. వివరాలు.. పోర్ట్ సిటీగా ప్రసిద్ధి చెందిన కింగ్డావో నగరంలో తాజాగా ఆదివారం 6 కరోనా కేసులు వెలుగు చూశాయి. దాంతో ఆ నగరంలోని సుమారు 9.4 మిలయన్ల పై చిలుకు జనాభాకు కరోనా టెస్టులు జరపనున్నట్లు వైద్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఐదు జిల్లాల్లో మూడు రోజులు పరీక్షలు జరపనుండగా.. ఐదు రోజుల్లో మొత్తం నగర జనాభాకు టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. చైనా విస్తృతమైన, వేగవంతమైన పరీక్ష సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ క్రమంలో కొత్త కేసులు వెలుగు చూసిన వెంటనే వైద్య సిబ్బంది కింగ్డావో నగరంలో దాదాపు 1,40,000 పరీక్షలు చేశారు. ఇక జూన్‌లో బీజింగ్‌లో ఏకంగా 20 మిలియన్ల మందికి పైగా కరోనా టెస్టులు చేశారు. రాజధానికి సమీపంలోని ఓ ఫుడ్ మార్కెట్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఇంత భారీ మొత్తంలో టెస్టులు చేశారు. (చదవండి: కరోనాని అంతం చేస్తాం) కరోనా వైరస్ చైనాలో ఉద్భవించినప్పటికి ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే.. ఇక్కడ కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ కట్టడి కోసం చైనా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ని విధించింది. దాంతో ప్రపంచ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. ఇక ‘గోల్డెన్ వీక్’ సెలవు దినం సందర్భంగా గత వారం చైనాలో మిలియన్ల మంది ప్రయాణాలు చేశారు. దాంతో దేశంలో వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా యంత్రాంగం తక్కువ సమయంలో ఎక్కువ టెస్టులు చేయడమే కాక అవసరమైతే మరోసారి లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రపంచ దేశాల కంటే ముందు తానే కరోనా వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకురావడానికి చైన విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రయోగాలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇప్పటికే నిరూపించబడని వ్యాక్సిన్‌ని ముఖ్య కార్మికులు, సైనికులపై ప్రయోగించింది. -
సెప్టెంబర్‌లోనే సగానికిపైగా కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా సెప్టెంబర్‌లోనే నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 29.96 లక్షల పరీక్షలు నిర్వహించగా.. అందులో 15.72 లక్షల పరీక్షలు సెప్టెంబర్ (29వ తేదీ వరకు) నెలలోనే చేసినట్లు పేర్కొంది. అంటే కరోనా వ్యాప్తి చెందిన ఈ ఏడు నెలల కాలంలో సగానికిపైగా పరీక్షలు సెప్టెంబర్‌లోనే నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వివరించింది. ఆగస్టులో 9,65,253 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కేసుల సంఖ్య కూడా అత్యధికంగా ఈ ఒక్క నెలలోనే నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,91,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో సెప్టెంబర్ 29వ తేదీ నాటికి 63,689 కేసులు నమోదయ్యాయి. ఇళ్లలో చికిత్స పొందుతున్నవారు 81.42 శాతం.. రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజులో 55,359 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 2,103 మంది వైరస్ బారిన పడ్డారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఒక్క రోజులోనే 2,243 మంది కోలుకోగా, ఇప్పటి వరకు వైరస్‌బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 1,60,933కు చేరింది. అలాగే ఒక రోజులో 11 మంది మృతి చెందగా, ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 1,127కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కోలుకున్నవారి రేటు 84.08 శాతానికి చేరుకుంది. ఇక ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 29,326 ఉండగా, అందులో ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో 23,880 మంది ఉన్నారు. అంటే ఇళ్లలో, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నవారు 81.42 శాతం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలో పది లక్షల జనాభాకు 80,494 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 298, మేడ్చల్ జిల్లాలో 176, రంగారెడ్డిలో 172, నల్లగొండలో 141, కరీంనగర్లో 103 ఉన్నాయి. -
రికార్డు సృష్టించిన ఏపీ.. జనాభాలో 10% మందికి..
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్ వ్యూహంతో ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర జనాభాలో 10 శాతం మందికి కరోనా టెస్టులు చేసి రికార్డు సృష్టించింది. రోజు రోజుకూ టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వచ్చి మిలియన్ (10 లక్షలు) జనాభాకు లక్షకు పైగా టెస్టులు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ కంటే జనాభాలోనూ, వైశాల్యంలోనూ, సాధనసంపత్తిలోనూ మిన్నగా ఉన్న రాష్ట్రాలేవీ ఈ రికార్డును చేరుకోలేకపోయాయి. ('నీకు కరోనా రాను') రాష్ట్రంలో కరోనా వైరస్ వెలుగుచూసేనాటికి ఒక్క ల్యాబొరేటరీ కూడా లేకపోయినా గత ఆరు నెలల్లో టెస్టులు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుని ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. దేశంలో జరుగుతున్న ప్రతి వంద టెస్టుల్లో 8 టెస్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయంటే కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా ముందుకు వెళ్తోందో తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో 1,00,718 మందికి కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయి. మొదట్లో మిలియన్‌కు 10వేల మందికి టెస్టులు చేయడానికి 133 రోజులు పట్టగా, తాజాగా ఆ సంఖ్య 7 రోజులకు చేరింది. -
ఆక్సిజన్ బెడ్స్ వెంటనే పెంచండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ తక్కువగా ఉండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగులకు ఆక్సిజన్ అత్యవసరమని, ఆక్సిజన్ బెడ్స్ కొరత కారణంగా వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆక్సిజన్ బెడ్స్ సంఖ్యను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ చికిత్సలకు సంబంధించి దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తండ్రి ఈ నెల 7న చనిపోయారని, దీంతో ఆయన సెలవులో ఉన్నారని... గతంలో ఇచ్చిన ఆదేశాలపై నివేదిక సమర్పించేందుకు మరో రెండు వారాలు గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి తేడా ఉంది. మహారాష్ట్రలో రోజుకు 1.5 లక్షల పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామని గతంలో ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అయినా అప్పుడప్పుడు పరీక్షల సంఖ్య తగ్గుతోంది. కొన్నిసార్లు పరీక్షలు పూర్తిగా ఆపినట్లుగా పత్రికల్లో చదివాం. పరీక్షల సంఖ్య పెంచాల్సి ఉన్నా ఎందుకు తగ్గిస్తున్నారు? పరీక్షలు పెంచాలని ఇప్పటికి అనేక పర్యాయాలు ఆదేశించాం. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అనేక మంది ద్వారానూ మాకు ఇదే సమాచారం వస్తోంది. ఆక్సిజన్ బెడ్స్ పెంచేందుకు సంబంధించిన ప్రణాళిక ఏమైనా ఉందా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మారుస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏజీ వివరించారు. పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గించారో తదుపరి విచారణకు డాక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రోగులు, ఆక్సిజన్ బెడ్స్ నిష్పత్తి పెంచాలి ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల మేరకు ప్రతి వెయ్యి మంది రోగులకు 5 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ప్రతి 1,000 మంది రోగులకు 3 అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 1 బెడ్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెడ్స్ సంఖ్య చాలా తక్కువ. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి పూర్తి వివరాలు అక్టోబర్ 6లోగా సమర్పించండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. -
25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలసంఖ్య భారీగా పెరిగింది. నెలరోజుల్లోనే పరీక్షలు దాదాపు మూడింతలయ్యాయి. గత నెల 20వ తేదీ నాటికి రాష్ట్రం లో 8,48,078 పరీక్షలు నిర్వహించగా, ఈ నెల 20 నాటికి వాటి సంఖ్య 25,19,315కు చేరుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవా రం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. మొత్తంగా 6.85 శాతం మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. 1,41,930 మంది కోలుకున్నారు. కోలుకున్నవారి రేటు 82.22 శాతా నికి పెరగడం గమనార్హం. నెల క్రితం రాష్ట్రం లో కోలుకున్నవారి రేటు 77.43 శాతం మాత్ర మే ఉంది. నెలక్రితం కరోనా మరణాల రేటు 0.74 శాతం ఉంటే, ఇప్పుడు 0.60 శాతానికి తగ్గింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 29,636 ఉండగా, అందులో 22,990 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రతి 10 లక్షల జనాభాలో 67,858 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఒక్క రోజులో 31,095 పరీక్షలు... ఆదివారం ఒక్కరోజు 31,095 పరీక్షలు నిర్వహించగా, అందులో 1,302 మందికి కరోనా సోకినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. ఒక్కరోజులో 2,230 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. 45 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,093 కరోనా పడకలుండగా, వాటి ల్లో 2,584 పడకలు మాత్రమే రోగులతో నిండిపోయాయి. 223 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11,055 పడకలుండగా, 4,062 నిండిపోగా 6,993 పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. టెస్టులు చేయకపోవడంపై... ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ జిల్లాల్లో ఒక్క పరీక్ష కూడా చేయలేదు. నారాయణపేట జిల్లాలో 8, నిర్మల్ జిల్లాలో 47, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39, వికారాబాద్ జిల్లాలో కేవలం 72 పరీక్షలు మాత్రమే చేశారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆ జిల్లా వైద్యాధికారుల (డీఎంహెచ్ఓ)కు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
కరోనా వచ్చి పోయిందేమో?
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా సోకినట్లు చాలామందికి తెలియను కూడా తెలియదు. ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా కరోనా వచ్చిపోవచ్చు’ అంటూ డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. దీనిని బలపరుస్తూ ‘దేశంలో ఇప్పటికే దాదాపు 18కోట్ల మందికి కరోనా సోకింది’.. అని ఓ సర్వే వెల్లడించింది. నగరంలో ‘గత 35 రోజుల్లో 6.60లక్షల మందికి కరోనా బారినపడ్డారు’ అని మరో పరిశోధన తేల్చి చెప్పింది. ఇవే ఇప్పుడు నగరవాసుల్లో యాంటీబాడీస్ టెస్ట్స్ పట్ల ఆసక్తిని పుట్టించాయి. ‘నాకు తెలీకుండానే కరోనా వచ్చి తగ్గిపోయిందేమో’ తెలుసుకోవాలనే కుతూహలం ఈ పరీక్షలకు సిటీలో డిమాండ్ తెచ్చిపెట్టింది. కరోనా మహమ్మారి కొందరికి ప్రాణాంతకం ఎలా అవుతుందో మరికొందరికి కనీసం చీమ కుట్టినంత నొప్పి కూడా ఇవ్వకుండానే వచ్చిపోతోంది. ఈ నేపథ్యంలోనే తమకు కరోనా సోకిందో లేదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగి యాంటీ బాడీ టెస్ట్స్ ఇప్పుడు క్రేజీగా మారాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఇమ్యూనిటీ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్స్ ఊపందుకున్నాయి. దీనికి తోడు సర్వేల ద్వారా నగరాలు, పట్టణాల్లో కరోనా వ్యాప్తి అవకాశాలను అంచనా వేయడం జోరుగా సాగుతోంది. ప్రైవేట్.. స్పీడ్ రూట్.. రాష్ట్రంలో మొత్తం 54 ల్యాబ్స్‌కు కోవిడ్ ఆర్టీ పీఎస్ఆర్ టెస్టులకు అనుమతి ఉంది. వీటిలో 17 ప్రభుత్వానికి చెందినవి కాగా, 37 ప్రైవేటు సంస్థలకు చెందినవి. సహజంగానే ప్రైవేటు ల్యాబ్స్ ఈ తరహా పరీక్షల విషయంలో ప్రజల్లో ఆసక్తికి అనుగుణంగా మరింత వేగంగా పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు అందిస్తున్నారు. తొలుత ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో వీటికి బాగా ఆదరణ ఉండగా, ఇప్పుడు హైదరాబాద్ సహా దక్షిణాది నగరాల్లో కూడా టెస్టులు బాగా పెరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ టెస్టుల కోసం రిక్వెస్టులు పెడుతున్నట్టు ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పారు. యాంటీ బాడీస్ ఉంటే సురక్షితమనేనా? వైరస్‌కు సంబంధించి శరీరంలో యాంటీ బాడీస్ వృద్ధి చెందడం అనేది ఖచ్చితంగా మేలు చేసే అంశమే అయినా.. అవి ఉన్నట్టు నిర్ధారణ అయినంత మాత్రానే మనం సేఫ్ అనేది ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు వైద్యులు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏ పరిమాణంలో యాంటీ బాడీస్ ఉంటే మనం కోవిడ్‌తో యుద్ధం చేసినట్టనేది ఇంకా తేలాల్సి ఉందంటున్నారు. ఇవి వ్యక్తిగతంగా ఆయా వ్యక్తుల ఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుందనీ, వ్యక్తికి సంబంధించిన మెడికల్ హిస్టరీ, ఇన్ఫెక్షన్ పరిమాణం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే గానీ చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఈ పరీక్షలతో పాటు రివర్స్ ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ కూడా తోడైతే మరింత ఖచ్చితత్వం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ.. అదే ఇమ్యూనిటీ.. ఇన్ఫెక్షన్తో పోరాడే ప్రోటీన్స్నే యాంటీ బాడీస్ అంటారు. వైరస్‌కు సమాధానంగా ఇవి ఉత్పన్నమవుతాయి. ఇవే మన శరీరంలో వైరస్‌ని గుర్తించడానికి బయటకు వెల్లడికావడానికి కూడా సహకరిస్తాయి. వీటినే ఇమ్యూనిటీ పరీక్షలని కూడా పేర్కొనవచ్చు. ఇందులోనే ప్రత్యేకంగా యాంటీ బాడీ టైట్లర్ టెస్ట్ ద్వారా యాంటీడీస్ సంఖ్య కూడా లెక్కిస్తారు. అధిక ప్రమాదం కలిగిన హెల్త్‌కేర్ వర్కర్స్కు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వ్యవహరిస్తున్నవారికి వీటిని సూచిస్తున్నారు. కరోనా సోకి కోలుకున్న శరీరంలో యాంటిబాడీస్ గుర్తింపు ద్వారానే ప్లాస్మా దానానికి అర్హులుగా పరిగణిస్తున్నారు. అలాగే రీ ఓన్ఫెక్షన్కి గురయ్యే అవకాశాలు ఉన్నావారిని కూడా వీటి పరీక్ష ద్వారా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. పోటాపోటీగా.. పరీక్షలు ఈ పరీక్షలను కంటైన్మెంట్ జోన్స్, సెక్యూరిటీ సిబ్బంది, ట్యాక్సీ డ్రైవర్స్, పరిశ్రమల సిబ్బంది, మీడియా సంస్థల సిబ్బంది, పోలీసులు, హెల్త్‌కేర్ వర్కర్స్కు అధికంగా చేయాలని ఐసీఎమ్ఆర్ గైడ్‌లైన్స్ సూచిస్తోంది. అయితే ప్రైవేట్ల్యాబ్స్కు కూడా అనుమతులు లభించడంతో ఇతరులకూ ఊపందుకున్నాయి. వీటి పట్ల సిటిజనుల్లో ఆసక్తికి తగ్గట్టుగా అవి పరీక్షలను ఇంటి ముంగిటకే అందిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఒక్కో పరీక్ష శాంపిల్‌కు రూ.150 నుంచి రూ.300 దాకా ఇస్తూ ల్యాబ్ టెక్నీషియన్స్‌గా కొందరు తాత్కాలిక సిబ్బందిని కూడా పరీక్షల కోసం నియమించుకుంటున్నాయి. టెస్ట్ ప్లీజ్ అంటున్న కంపెనీలు.. వ్యక్తిగతంగా కొందరు పరీక్షలు కోరుతుంటే.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు సైతం తిరిగి ఆఫీస్‌లోకి అడుగుపెట్టే ముందుగా ఈ తరహా పరీక్షలు చేయించుకోవాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ‘కొందరు యాంటీ సార్స్–కోవ్–2 1జి టెస్ట్, మరికొందరు టోటల్ యాంటీ బాడీ టెస్ట్(1జి జి, 1జిఎమ్)లను కోరుతున్నారు. ఇవి రూ.1200, రూ.900 ధరల్లో అందుబాటులో ఉన్నాయి’ అని ఓ డయాగ్నస్టిక్స్‌కు చెందిన శివాని చెప్పారు. అంతేగాకుండా బ్లడ్ శాంపిల్ ఏ సమయంలోనైనా ఇచ్చే అవకాశం ఉండటం, ఒక్కరోజులోనే ఫలితం వెల్లడిస్తుండటంతో అనేక మంది ఈ పరీక్షలకు సై అంటున్నారు. ఉపయుక్తమే.. మానవ శరీరంలోని కరోనా వైరస్ స్థితిగతుల పరిశీలనకు యాంటీ బాడీస్ టెస్ట్ ఉపకరిస్తుంది. ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు మన వ్యాధి నిరోధక శక్తి వీటిని ఉత్పత్తి చేస్తుంది. అంతకు ముందు లక్షణాలు కనిపించిన/ కనిపించని కరోనా బాధితుల శరీరంలో సైతం వీటిని కనిపెట్టవచ్చు. 24గంటల్లోనే దీని ఫలితాలు వెల్లడించవచ్చు. ఈ పరీక్ష కోసం ఖాళీ కడుపుతో ఉండడం వంటి జాగ్రత్తలు అవసరం లేదు. ఈ పరీక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ప్రయోజనాలు చాలా ఎక్కువ. నిరుపేదలకు మేం ఉచితంగానే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. – ఐశ్వర్య వాసుదేవన్, న్యూబర్గ్ డయాగ్నస్టిక్ సెంటర్ -
కంటైన్మెంట్లలో కట్టుదిట్టంగా..
సాక్షి, హైదరాబాద్: కట్టడి ప్రాంతా (కంటైన్మెంట్ జోన్లు)ల్లోని ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలున్నా, లేకున్నా కట్టడి ప్రాంతాల్లో పెద్దాచిన్నా అందరికీ నూటికి నూరు శాతం పరీక్షలు చేయాలని స్పష్టంచేసింది. కరోనా సామాజిక వ్యాప్తి జరగడంతో ఐసీఎంఆర్ ఈ తాజా మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. వీటిని అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో లక్షణాలున్నవారికి, వారి ప్రాథమిక, రెండో కాంటాక్టులకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో లక్షలాది మందికి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 2,300కుపైగా కట్టడి ప్రాంతాలున్నాయి. కొన్ని జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే కట్టడిలో ఉన్నాయి. ఇవికాక, ఇతర ప్రాంతాల్లో 65 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్న వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరని సూచించింది. అవసరాన్ని బట్టి రాష్ట్రాలు కొన్ని సవరణలతో ఈ మార్గదర్శకాలను పాటించవచ్చంది. ఒకరకంగా వైరస్ విస్తరిస్తున్న నగరాల్లో కట్టడి ప్రాంతాల్లో వంద శాతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. నాన్ కంటైన్మెంట్ ఏరియాల్లో ఇలా.. ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. గత 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణం చేసి వచ్చి, రోగ లక్షణాలున్న వారందరికీ పరీక్షలు చేయాలి. ఇప్పటికే కరోనా నిర్ధారణైన వ్యక్తులు, కుటుంబసభ్యులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. లక్షణాలున్న ఆరోగ్య కార్యకర్తలు, వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఫ్రంట్‌లైన్ కార్మికులకూ పరీక్షలు తప్పనిసరి. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చినవారు, వలస వెళ్లొచ్చి.. లక్షణాలున్న వారికి, అత్యధిక హైరిస్క్ లో ఉండే 65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఆసుపత్రుల్లో ఏం చేయాలంటే? అన్ని ఆసుపత్రుల్లో తీవ్ర శ్వాసకోశ సమస్య ఉన్న రోగులందరికీ కరోనా టెస్టులు చేయాలి. రోగనిరోధక శక్తిలేని, ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, 65ఏళ్లు పైబడినవారు, అవయవ మార్పిడికి ఆసుపత్రిలో చేరిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్ష చేయాలి. ఒక్కోసారి వీరికి ఆసుపత్రిలో చేరడానికి ముందే టెస్టులు చేయాలి. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉన్న రోగులకు లేదా వారానికంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉన్న రోగులకు వైరస్ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షించకూడదు. కరోనా పరీక్ష చేసే వసతి లేనప్పుడు వీలైతే శస్త్రచికిత్సను వాయిదా వేయాలి. టెస్ట్ చేశాకే ఆపరేషన్ చేయాలి. ప్రసవానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణులకూ కరోనా పరీక్షలు తప్పనిసరి. ఒకవేళ తల్లికి పాజిటివ్ వస్తే, 14 రోజుల పాటు బిడ్డకు పాలివ్వడం వంటివి చేయాల్సివస్తే మాస్క్ ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. అనారోగ్యం, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడే నవజాత శిశువులకూ టెస్ట్ చేయాలి. ర్యాపిడ్‌లో నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే.. వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే వారికి ముందే కరోనా టెస్ట్ చేయాలి. నెగెటివ్ ఉంటేనే ప్రయాణానికి అనుమతివ్వాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేశాక పాజిటివ్ వస్తే నిర్ధారించుకునేందుకు మరోసారి పరీక్ష అవసరంలేదు. కరోనా నుంచి కోలుకున్నాక వారికి తిరిగి పరీక్ష నిర్వహించనక్కర్లేదు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చాక కూడా సంబంధిత వ్యక్తిలో లక్షణాలుంటే, తప్పక ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలి. ఒకవేళ అప్పటికప్పుడు వారిలో లక్షణాలు లేకున్నా తర్వాత వారిలో వృద్ధి చెందితే మళ్లీ పరీక్ష చేయాల్సిందే. -
కొంపముంచుతున్న నెగెటివ్
ఓ పార్టీ ఎమ్మెల్యే ఇటీవల అనుమానంతో కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ లక్షణాలుండటంతో అనుమానమొచ్చి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. రామారావు (పేరు మార్చాం) పార్టీ నేతగా తరచూ ప్రజల వద్దకు వెళ్తుంటాడు. ఎందుకైనా మంచిదని యాంటిజెన్ టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. కానీ గొంతులో గరగర ఉండటంతో మళ్లీ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. దాంట్లో పాజిటివ్ వచ్చింది. సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ఉన్న సమస్యే ఇది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే 99.3% నుంచి 100% ఓకే. నెగెటివ్ వస్తే 50.6% నుంచి 84% మాత్రమే కరెక్ట్ అని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టంచేసింది. మిగిలిన నెగెటివ్‌లన్నీ నెగెటివ్‌లుగా గుర్తించలేమంది. యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ కచ్చితత్వమే అసలు సమస్య. అందువల్ల యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి ఏమాత్రం లక్షణాలున్నా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పక చేసుకోవాలని ఐసీఎంఆర్ చెబుతోంది. అంతేకాదు లక్షణాల్లేకుండా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా, ఆ తర్వాత లక్షణాలు కనిపిస్తే అప్పుడు మళ్లీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కానీ రాష్ట్రంలో చాలామంది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ రాగానే కులాసాగా తిరిగేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితే వైరస్ సామాజిక వ్యాప్తికి దారితీస్తోంది. 70 శాతం యాంటిజెన్ టెస్టులే ఇప్పటివరకు రాష్ట్రంలో 16.67 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,38,395 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొదట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆపై ప్రైవేట్‌లోనూ ఆర్టీ–పీసీఆర్ పరీక్షల ద్వారానే కరోనా నిర్ధారణ జరిగింది. అయితే, ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో భాగంగా శ్వాబ్ నమూనాలు తీయడం, వాటిని భద్రంగా లేబొరేటరీలకు పంపడం ప్రహసనంగా మారింది. చివరకు టెస్ట్ ఫలితం రావడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు పడుతోంది. ఫలితం వచ్చేలోగా బాధితుల్లో వైరస్ ముదిరిపోయి పరిస్థితి తలకిందులయ్యేది. దీంతో రెండు నెలలుగా రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. శ్వాబ్ తీసిన వెంటనే అక్కడికక్కడే పరీక్ష జరగడం, పావుగంట నుంచి అరగంటలోనే ఫలితం రావడంతో బాధితులకు ఊరటనిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చేసిన మొత్తం పరీక్షల్లో 70 శాతం, రోజువారీ పరీక్షల్లో 90 శాతం యాంటిజెన్ పరీక్షలేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారికి తక్షణ చికిత్సకు ఈ టెస్టులు వీలు కల్పించాయి. నెగెటివ్ వచ్చి లక్షణాలున్నవారిపై నిర్లక్ష్యం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 చోట్ల యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి లేకున్నా ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులు కూడా యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నాయి. అయితే నెగెటివ్ వచ్చినా లక్షణాలుంటే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలన్న ఐసీఎంఆర్ నిబంధనను పలుచోట్ల కాలరాస్తున్నారు. కిందిస్థాయిలో వైద్యారోగ్య యంత్రాంగం కూడా ఇది మర్చిపోయింది. బాధితులు కూడా లక్షణాలున్నా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆనందపడిపోతున్నారు. ఇదే కొంపముంచుతోంది. కొందరిలో వైరస్ తీవ్రం కావడంతో పాటు వారి కుటుంబసభ్యులకూ సోకుతోంది. ఉన్నతస్థాయిలోని వ్యక్తులు కూడా యాంటిజెన్ టెస్టుల నెగెటివ్ రిపోర్ట్‌ను పూర్తిగా నమ్మేస్తున్నారు. ఉదాహరణకు ఒక మీటింగ్ ఏర్పాటుకు ముందు అందరికీ యాంటిజెన్ టెస్టులు చేసి నెగెటివ్ వచ్చిన వారందరినీ హాలులోకి అనుమతించారనుకోండి. అలా నెగెటివ్ వచ్చిన వారిలో లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే, వారి వల్ల ఆ మీటింగ్‌లో ఉన్న ఇతరులకూ వైరస్ సోకుతుంది. ఇలా వైరస్ సామాజిక వ్యాప్తికి విస్తరిస్తుందని ఒక వైద్య నిపుణుడు వివరించారు. -
69% మందికి లక్షణాల్లేవ్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,24,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 86,225 మందికి లక్షణాల్లేవని తెలిపింది. ఇక 38,738 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువ. ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్ సోకుతోంది. ఈ కారణంగానే అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక, రెండో కాంటాక్టులకు అధిక పరీక్షలు కాంటాక్ట్ ట్రేసింగ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ముందంజలో ఉంది. ఆదివారం 37,791 శాంపిళ్లను సేకరించగా, వాటిలో ప్రాథమిక, రెండో కాంటాక్ట్ ద్వారా అనుమానిత లక్షణాలతో పరీక్ష చేయించుకున్న వారు 59 శాతం మంది ఉన్నారు. మిగిలిన 41 శాతం మంది డైరెక్ట్ బాధితులు. అంటే ఈ బాధితుల ద్వారా ప్రాథమిక కాంటాక్టు అనుమానంతో 17,006 (45%) మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ప్రాథమిక కాంటాక్టుల నుంచి రెండో కాంటాక్టు అయిన వారిలో 5,290 (14%) మందికి పరీక్షలు నిర్వహించారు. డైరెక్ట్ బాధితుల నుంచి ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను ట్రేసింగ్ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ కృషి ఫలించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతుండగా, వాటి ద్వారా ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో ట్రేసింగ్ ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను వెంటనే గుర్తించడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది. తగ్గుతున్న సీరియస్ కేసులు లక్షణాల్లేకుండా ఎక్కువ మంది కరోనా బారినపడటం, వారి ద్వారా వైరస్ సోకిన ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి తక్షణ వైద్యం చేయడం వల్ల చాలామంది కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారు. వీరిని ఇళ్లలోనే ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్ కేసులుంటే, 24,216 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగానికిపైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. మొదట్లో దాదాపు 70 శాతం పడకలు కరోనా రోగులతో నిండేవి. అప్పట్లో కొంత నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం వల్ల సీరియస్ అయ్యాకే బాధితులు వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు చేస్తుండటంతో కరోనా నిర్ధారణ సులువైంది. అందుబాటులో వ్యాధి నిర్ధారణ కేంద్రాలుండటంతో అనుమానమున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకుంటున్నారు. -
కాసుల కోసం అడ్డదారులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. తమ ప్రా ణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కోవిడ్ బారిన పడ్డారు. మరికొందరు ప్రాణాలు విడిచారు. వైద్యులే లేకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ నేపథ్యంలో వైద్యుల్ని ప్రత్యక్ష దైవంగా ప్రజలు కొలుస్తున్నారు. అలాంటి వైద్య వృత్తిలో కొందరు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కరోనా నేపథ్యంలో సొమ్ము సంపాదించుకునే పనిలో పడ్డారు. ఎంత వేగంగా పరీక్షలు చేస్తే అంత వేగంగా వైద్యం అందించవ చ్చని ప్రభుత్వం ఉచితంగా విలువైన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కిట్లను ఆస్పత్రులకు సమకూర్చితే వాటిని పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకుంటున్నారు. రోగులు వెంటనే కోలుకునేలా, ప్రాణాపాయం నుంచి కాపాడేందుకని ఖరీదైన రెమిడెసీవిర్ తదితర మందులను అందుబాటులోకి తెస్తే వాటిలోనూ చేతివాటం ప్రదర్శించి డబ్బులు వెనకేసుకుంటున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పలాస సీహెచ్‌సీలో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు దొరికారు. ఇలాంటి వారు జిల్లాలో మరికొన్నిచోట్ల ఉన్నారు. కరోనా సమయంలో ఉచితంగా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న ర్యాపిడ్ కిట్లకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధార్ నమోదు చేసి ప్రైవేటు క్లినిక్‌లలో పరీక్షలు చేయించి నగదు వసూలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి రోగం వచ్చినా, దీర్ఘకాలిక రోగం ఉన్నా వైద్యులు చూసేందుకు భయపడుతున్నారు. కరోనా పరీక్షలు చేసుకుని, ఫలి తం చూపిస్తేనే చేయి ముట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డయాలసిస్ రోగులు, ఆస్తమా రోగులు, గర్భిణులు, డయాబెటిస్ రోగులు, హృద్రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ చెకప్ చేసుకుంటేనే వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సాధారణ జ్వరం, దగ్గు, జలుబు వచ్చిన వారికి కూడా వైద్యం అందించే పరిస్థితి కొన్నిచోట్ల కరువైంది. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అందుబాటులో ఉంచిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కిట్లను పక్కదారి పట్టించి, ఆయా రోగులకు ప్రైవేటు క్లినిక్‌లు పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా చేస్తే ఫర్వాలేదు. కానీ ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 2వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేసి పరీక్షలు చేస్తున్నారు. విశేషమేమిటంటే ఆ కిట్లు వినియోగించినట్టు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత రోగుల ఆధార్ నమోదు చేయించి, బయట పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి ఇప్పటి వరకు ఐదు మాసాలుగా పలు విధాలుగా ఇండెంట్ పెడుతూ వేలల్లో ర్యాపిడ్ కిట్ల ను తీసుకువచ్చారు. కానీ ఇక్కడ కొంద రు కుమ్మక్కై వాటిని సర్దుకుంటూ వారికి ఉన్న ప్రైవేటు క్లినిక్‌లకు తీసుకెళ్లి వినియోగించారు. పలాస ఆస్పత్రిలో ఇది కొ త్తేమీ కాదు. గతంలో ప్రసూతి ఆపరేషన్‌కు రూ.5వేలు వసూలు చేసిన గైనికాలజిస్టు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడి సస్పెండైన విషయం తెలిసిందే. రక్తం పేరిట కూడా దందా నడిచేదన్న ఆరోపణలు ఉన్నాయి. కరోనా భయంలో అత్యవసర వైద్యం కోసమని శ్రీకాకుళం తరలించడానికి పెట్టే అంబులెన్స్‌లో కూడా కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క పలాసలోనే కాదు జిల్లాలో పలు చోట్ల ఇదేరకమైన తంతు నడుస్తోంది. మందులు కూడా.. ప్రస్తుతం కరోనా రోగులు కోలుకునేందుకు బాగా ఉపయోగపడుతున్న రెమిడెసీవర్ త దితర మందులను కూడా పలుచోట్ల పక్కదా రి పట్టిస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ. 5400పైగా ఉండటంతో వాటిని ఆస్పత్రుల్లో రోగులకు వినియోగించినట్టు చూ పించి, వాటిని ప్రైవేటుగా విక్రయాలు చేప డుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ము ఖ్యంగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్టు సమాచారం. ఉపేక్షించం.. ర్యాపిడ్ కిట్లను పక్కదారి పట్టించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎక్కడైనా జరిగినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే నిఘా పెట్టాం. రెమిడెసీవిర్ ఇంజెక్షన్ల విషయంలో కూడా ఆరా తీస్తాం. ఎక్కడై నా ప్రైవేటుకు తరలించినట్టు తేలితే సీరియస్‌గా చర్యలు తీసుకుంటాం. – జె.నివాస్, కలెక్టర్ లెక్క అడుగుతున్నాం కరోనా ర్యాపిడ్ పరీక్ష కిట్లు పక్కదారి పడుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యాం. ఎక్కడ ఎన్ని కిట్లు వినియోగించారు? ఎవరికి పరీక్షలు చేశారు? ఏ అవసరం కోసం పరీక్ష చేశారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నాం. ఆస్పత్రుల వారీ గా సరఫరా చేసిన కిట్లకు సంబంధించి లెక్క అడుగుతున్నాం. తప్పు చేసే వారిని వదలం. – కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్. -
ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏయే జైళ్లలో కరోనా పరీక్షలు నిర్వహించారు? ఎంత మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు? వారిని చికిత్స నిమిత్తం ఎక్కడికి తరలించారు? సాధారణ లక్షణాలున్న వారి కోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేశారా ? వంటి పూర్తి వివరాలు తదుపరి విచారణ నాటికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైళ్లలో జీవిత ఖైదు, ఇతర శిక్షలు అనుభవిస్తున్న వారిలో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని మధ్యంతర బెయిల్ మీద విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జైళ్లలో కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద విడుదల చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రఘునాథ్ నివేదించారు. ఎంతమంది ఖైదీలు కరోనా బారిన పడ్డారని ధర్మాసనం రఘునాథ్‌ను ప్రశ్నించగా పరీక్షలు నిర్వహిస్తే తెలుస్తుందని తెలిపారు. జైళ్లలో ఎక్కడా కరోనా పరీక్షలు నిర్వహించలేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ముంబై జైలులో 55 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారని, ఈ నేపథ్యంలో ఇక్కడా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ నాటికి తాము కోరిన వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. -
కరోనా టెస్ట్‌ల్లో కృష్ణా జిల్లా బెస్ట్..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కరోనా నిర్ధారణ పరీక్షలు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా కృష్ణాజిల్లాలో నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ నాటికి జిల్లాలో 3,00,973 మందికి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖల సమన్వయంతో టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్ విధానంతో మొదటి నుంచి అప్రమత్తంగా పనిచేశారు. వీరి కృషి ఫలించింది. ప్రస్తుతం రాష్ట్రంలోనే తక్కువ కేసులు నమోదైన జిల్లాగా కృష్ణాజిల్లా నిలిచింది. అంతేకాదు ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో తక్కువ పాజిటివ్ కేసులు జిల్లాలోనే నమోదవుతుండటంపై అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పరీక్షలు ఇలా.. జిల్లాలో ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 20 బస్సులు, మరో 15 బృందాలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆయా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలు నిర్వహించారు. వివరాలు ఇలా.. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోని వీఆర్డీఎల్ లేబొరేటరీలో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 2,18,128 చేశారు. కాగా, ట్రూనాట్ పరీక్షలు సిద్ధార్థ వైద్య కళాశాలలో 19,147, నూజివీడు ఏరియా ఆస్పత్రిలో 8,425, జిల్లా ఆస్పత్రి మచిలీపట్నంలో 7,539, గన్నవరం వెటర్నరీ కళాశాలలో 3,407, గుడివాడ ఏరియా ఆస్పత్రిలో 470, జగ్గయ్యపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 540, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 231, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు 16,304, క్లియా పరీక్షలు 6,992, సిద్ధార్థ వైద్య కళాశాలలోని సీబీనాట్ పరీక్షలు 112, ఇతర ల్యాబ్‌లలో 19,678 పరీక్షలు నిర్వహించారు. కేసుల నమోదులో చివరి స్థానంలో.. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు తూర్పు గోదావరిజిల్లాలో 49,245 నమోదు కాగా, తర్వాతి స్థానంలో కర్నూలులో 38,835, అనంతపురంలో 34,793, చిత్తూరులో 29,830, పశ్చిమ గోదావరిలో 29,860 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 30,392 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో కేవలం 13,875 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్ ఆఖరులో అత్యధిక కేసులు నమోదు కాగా, కర్నూలు , తూర్పుగోదావరి తర్వాత మూడో స్థానంలో ఉంది. అనంతరం కేసులు కట్టడి చేయడంతో కేసులు క్రమేణ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కంటే తక్కువగా కేసులకు చేరుకోగలిగింది. అంతేకాదు పదిహేను రోజులుగా అతితక్కువ కేసులు నమోదవుతున్నది కృష్ణాజిల్లాలోనే. ఫలించిన సమష్టి కృషి జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేసిన కృషి ఫలించింది. ప్రభుత్వం తొలుత జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో పరీక్షలు చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న హాట్ స్పాట్లను గుర్తించడం, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచడం, సౌకర్యం లేని వారికి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించడం పక్కాగా అమలు చేశారు. ప్రజలు బయట తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పిచండంతో సత్ఫలితాలు సాధించగలిగారు. విస్తృతంగా పరీక్షల కోసం ఏ జిల్లాలో లేని విధంగా 19 ఐమాస్క్ బస్సులు, మూడు సంజీవని బస్సులో కేటాయించింది. దీంతో పరీక్షలు వేగవంతం చేయడం, పాజిటివ్ కేసులను సత్వరమే గుర్తించడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కృషి ఫలించింది. ప్రజల సహకారంతోనే కరోనా విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. స్వచ్ఛందంగా పరీక్షల కోసం ముందుకు వచ్చే విధంగా చేశాం. పాజిటివ్ వస్తే లక్షణాలు లేకుంటే హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండే విధంగా చూశాం. అన్ని శాఖలు ఐదు నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న కృషి ఫలించింది. ప్రజల్లో మార్పు ద్వారానే అరికట్టగలిగాం. – డాక్టర్ ఐ.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
లక్షకు చేరువలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,48,078 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, వాటిల్లో 99,391 పాజిటివ్ కేసులున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 76,967 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 22,843 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కరోజులో 26,767 పరీక్షలు... గురువారం అత్యధికంగా 26,767 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 1,967 మందికి కరోనా సోకింది. 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 737కి చేరింది. కొత్తగా 1,781 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,687 యాక్టివ్ కేసులున్నాయి. అందులో 15,332 మంది ఇళ్లలో లేదా ఇతరత్రా సంస్థల్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 473 నమోదయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 202, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 170, వరంగల్ అర్బన్ జిల్లాలో 101, కరీంనగర్లో 86, జగిత్యాలలో 81, ఖమ్మంలో 79, నిజామాబాద్‌లో 69 కేసులు నమోదయ్యాయి. -
కరోనా వైరస్.. వచ్చివెళ్లింది ఎందరికి..?
-
కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్
మధుర: రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, గురువారం కోవిడ్-19 నిర్ధారణ అయింది. కృష్ణ జన్మాష్టమి వేడుకల నిమిత్తం మధుర వెళ్లిన ప్రస్తుతం ఆయనకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహంత్ ను మెరుగైన చికిత్స కోసం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించనున్నామని మధుర జిల్లా మేజిస్ట్రేట్ రామ్ మిశ్రా వెల్లడించారు. గతవారం (ఆగస్టు 5న) ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వేదికను పంచుకున్న ఈయన తాజాగా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేపింది. ఇదే వేదికపై యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఉండటం గమనార్హం. కాగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు కొన్ని రోజుల ముందు, పూజారి ప్రదీప్ దాస్ సహా మరో 14 మంది పోలీసులకుకూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. -
టెస్టులంటే టెన్షన్
ఆదిలాబాద్‌కు చెందిన ఆమె పేరు లక్ష్మీబాయి (పేరు మార్చాం). ఇటీవల కొద్దిగా జ్వరం, దగ్గు రావడంతో డాక్టర్ సూచన మేరకు మందులు వాడింది. అయినా తగ్గలేదు. కరోనా టెస్ట్ చేయించుకోవాలని కుమారుడు చెబితే తనకు వచ్చింది సీజనల్ జ్వరమంటూ వాదించింది. చివరకు ఆయాసం మొదలవడంతో పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 80కి పడిపోవడంతో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తి రామలింగయ్య. ఇటీవల పొడి దగ్గు రాగా దగ్గు మందు వాడాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కరోనా పరీక్ష చేయించుకోవాలని చెప్పినా తొలుత పట్టించుకోలేదు. వారమైనా దగ్గు తగ్గకపోవడం, ఆయాసం రావడంతో సీటీ స్కాన్ చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ బెడ్‌పై ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి మాత్రం ముందుకు రావట్లేదు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా సీజనల్ వ్యాధులుగా భావించి టెస్టులు చేయించుకోవట్లేదు. కొందరైతే జ్వరం వస్తే సొంతంగా పారాసిటమాల్ మాత్రలు వాడేస్తున్నారు. దగ్గు, జలుబు చేస్తే సొంత వైద్యంపైనే ఆధారపడుతున్నారు. పరిస్థితి విషమించే దాకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొందరు డాక్టర్లు కూడా కరోనా అనుమానితులకు సాధారణ చికిత్సపైనే దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా కాలంలో ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. సామాజిక వ్యాప్తి మొదలైనా... రాష్ట్రంలోనూ కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది. ఎక్కడ, ఎలా కేసులు నమోదవుతున్నాయో కూడా ఎవరికీ అంతుబట్టట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, జలుబు, ఇతరత్రా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి పెద్దాసుపత్రుల వరకు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తోంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే తక్షణమే కరోనా నివారణ కిట్లు ఇస్తున్నారు. ఒకవేళ ఫలితం నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని చెబుతోంది. అయితే ఇన్ని రకాలుగా వసతులున్నా కొందరు బాధితులు చాలా తేలికగా తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి అందరితో కలసి టెస్టు చేయించుకోవడం వల్ల తమకు వైరస్ లేకున్నా సోకుతుందేమోనని అనుమానపడుతున్నారు. మరికొందరేమో పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు భయపడతారని భావిస్తున్నారు. ఇంకొందరేమో తమకు ఏమీ లేదన్న ధీమాతో ఉంటున్నారు. దీంతో ఇలాంటి వారిలో ఒక్కోసారి వైరస్ తీవ్రత పెరిగి పరిస్థితి విషమిస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతుండటంతో అప్పుడు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో అనేక సందర్భాల్లో ఆక్సిజన్ బెడ్‌పైకి లేకుంటే ఐసీయూలోకి వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి ప్రాణాంతకం అవుతోంది. ఇక విరివిగా ప్రచారం.. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు, లక్షణాలుంటే తక్షణమే స్పందించేలా అవగాహన పెంచడం కోసం పట్టణాలు, గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. జిల్లాల్లో ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా కూడా భారీగా ప్రచారం చేయనుంది. కరపత్రాలు ముద్రించాలని, గ్రామాల్లో చాటింపులు వేయించడం ద్వారా కరోనా లక్షణాలున్న వారు తక్షణమే ఆసుపత్రికి వచ్చేలా చేయాలని నిర్ణయించింది. కరోనా వస్తే ఏమీ కాదని, ఆలస్యం చేయడం వల్లే సమస్యలు వస్తాయని ప్రజలకు వివరించనుంది. ముందే స్పందిస్తే కరోనాతో ముప్పులేదు.. కరోనా పరీక్షలను పీహెచ్‌సీలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చేస్తున్నారు. అత్యంత ఖరీదైన విలువైన రెమిడెసివిర్, టోసీలుక్సిమాబ్ మందులు అన్ని జిల్లా ఆసుపత్రులలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పటికే ఉన్న 8 వేల ఆక్సిజన్ పడకలకు తోడుగా మరో పది వేలు పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఎవరికైనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. వెంటనే స్పందిస్తే కరోనా వల్ల ముప్పు ఏమీ ఉండదు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
-
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్ ట్వీట్ చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అందించిన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులతో 22 లక్షల కేసులను అధిగమించిందని, 44 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికవరీ రేటు 69.33 శాతంగా ఉందని, మరణాల రేటు కొత్త కనిష్టాన్ని (2 శాతం) చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today. I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee — Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020 -
నెగెటివా.. నమ్మలేం!
అతని పేరు జానకీరాం.. హైదరాబాద్‌లో ఉంటారు. ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. జ్వరం, దగ్గు ఉండటంతో ఇటీవల సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడు. అరగంటలో అతనికి నెగెటివ్ అని తేలింది. ఎంతో సంబరపడ్డాడు. అయితే తర్వాత రెండ్రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో ప్రముఖ డయాగ్నస్టిక్ సెంటర్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. అందులో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన జానకీరాం ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌పై గొడవకు దిగాడు. తనకు అక్కడ నెగెటివ్ వస్తే ఇక్కడ ఎందుకు పాజిటివ్ వచ్చిందని తగాదా పెట్టుకున్నాడు. ఇక మరో వ్యక్తి రమేశ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు. అతనికి 102 డిగ్రీల జ్వరం, పొడి దగ్గు ఉండటంతో తక్షణమే డాక్టర్‌ను సంప్రదించగా మెడిసిన్ ఇచ్చారు. అయితే ఒక స్నేహితుడి సలహా మేరకు రమేశ్ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకున్నాడు. నెగెటివ్ అని తేలింది. కానీ అతనికి మాత్రం జ్వరం, పొడి దగ్గు, నీరసం ఉన్నాయి. తనకు నెగిటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులతో కలసిమెలిసి ఉంటున్నాడు. లక్షణాలున్నాయి కదా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోమని చెబితే, తనకు నెగెటివ్ వచ్చింది కదా అని ధీమాగా ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: ఇవీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా నిర్ధారణ పరీక్షలతో గందరగోళం తలెత్తుతోంది. ఇందులో నెగెటివ్ వచ్చినా.. బాధితుడికి కరోనా లేదని ధ్రువీకరించలేని పరిస్థితులుం డటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు ల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే నిర్ధారణ చేస్తారు. అయితే నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 70 శాతంలోపేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. నెగెటివ్ వచ్చిన వారందరికీ తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయాల్సిందేనని నెల క్రితం ప్రకటించిన ఐసీఎంఆర్.. దాదాపు పది రోజుల క్రితం దానికి కీలక సవరణ చేసింది. ‘యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలని, వారికి ఎలాంటి లక్షణాలు లేకుంటేనే దాన్ని నెగెటివ్‌గానే పరిగణించాలని’స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా మార్గదర్శకాలున్నా యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చి, లక్షణాలున్నవారు దర్జాగా బయట తిరుగుతున్నారు. వారి ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో వచ్చే నెగెటివ్ ఫలితాలపై నీలినీడలు అలుముకున్నాయి. 90 శాతం యాంటిజెన్ టెస్టులే... రాష్ట్రంలో మొదట్లో ఆర్టీ–పీసీఆర్ ద్వారానే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు వీటిని నిర్వహిస్తున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో నిర్వహించే ఫలితాల కోసం రెండు, మూడ్రోజుల నుంచి వారం పది రోజుల వరకు నిరీక్షించాల్సి రావడంతో కరోనా వైరస్ తీవ్రత పెరిగి సీరియస్‌గా మారుతుండేది. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకునేందుకే బాధితులు ఎగబడుతున్నారు. ఈ పరీక్ష చేసిన అర గంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రభుత్వం కూడా వీటిని విరివిగా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,100 చోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు పైస్థాయి వరకు ఈ టెస్టులు జరుగుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏకంగా 7 లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించింది. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి మరింత అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 4.16 లక్షల టెస్టులు చేస్తే, అందులో దాదాపు 2 లక్షలు యాంటిజెన్ టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ కూడా ఈ 15 నుంచి 20 రోజుల మధ్య చేసినవేనని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న టెస్టుల్లో 90 శాతం యాంటిజెన్ టెస్టులేనని ఆయన పేర్కొన్నారు. ఆర్టీ–పీసీఆర్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం.. రాష్ట్రంలో కరోనాకు సంబంధించి విరివిగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. మొబైల్ ల్యాబ్‌ల ద్వారా కూడా చేస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ.. నెగిటివ్ వచ్చి లక్షణాలున్న వారికి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలన్న నిబంధనను కింది స్థాయిలో పట్టించుకోవడం లేదు. పైగా దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి లక్షణాలున్నా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవడంలేదు. దీంతో చాలామంది లక్షణాలున్నవారు వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలంటున్నారు. దీనివల్ల కూడా బాధితులు వెనక్కు తగ్గుతున్నారు. -
కరోనా పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని విఆర్డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. (పాజిటివ్ వ్యక్తులకు ‘దివ్య’ కషాయం) ప్రతి ల్యాబ్ పరీక్షల్లో ఐసీఎంఆర్ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఎన్ఏబీహెచ్ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
16 లక్షలకు చేరువలో ఏపీలో కొవిడ్ పరీక్షలు
-
ఉచిత టెస్టుల్లోనూ కాసుల వేట
వేగంగా నిర్ధారణ ఫలితం వస్తుండటంతో కరోనా లక్షణాలున్న బాధితులంతా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు మొగ్గుతున్నారు. దీన్నే కొందరు అక్రమార్కులు ధనార్జనగా మార్చుకుంటున్నారు. హైదరాబా ద్ నగరంలో 300 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నా దాదాపు అన్నిచోట్లా జనం కిటకిటలాడుతున్నారు. పైగా వచ్చిన వారందరికీ పరీక్షలు చేయకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. తాకిడి పెరగడంతో ఆయా ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది మాట్లాడుకొని ఉచితంగా చేయాల్సిన పరీక్షలను సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తమకు తెలిసిన వారి నుంచి వచ్చే విన్నపాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొంత మొత్తం చెల్లించాలని ముందే చెబు తున్నారు. విచిత్రమేంటంటే పైరవీ, ఎంతో కొంత చెల్లించనిదే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌చేసే పరిస్థితి చాలాచోట్ల లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో అటెండర్ నుం చి పైస్థాయి వరకు వచ్చిన డబ్బులు పంచుకుంటున్నారన్న ఆరోపణలు న్నాయి. కొన్నిచోట్ల తలా కొన్ని కిట్లు అనుకొని డబ్బులిచ్చినవారికి పరీక్ష లు చేసి పంపుతున్నారు. డబ్బులు చెల్లించలేనివారు లైన్లలో నిలబడి, కిట్లు అయిపోయాక వెనుదిరిగి పో తున్నారు. వాస్తవంగా యాంటిజెన్ పరీక్ష చేయాలంటే దానిక య్యే ఖర్చు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం రూ.500. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగా చేయాలి. కానీ ఎక్కడా అటువం టి పరిస్థితి కనిపించట్లేదు. -
కోదాడలో సీనియర్ సిటిజన్లకు పరీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో కేరళ రెవెన్యూ కాలనీలోని సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో సి.విద్యాధర భట్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓరల్ టెస్టింగ్ ల్యాబ్స్’ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఈ అంశంపై ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ, సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదును విచారించి పై విధంగా స్పందించారు. కోవిడ్–19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించవచ్చునని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు కోరినట్టుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. -
ట్రంప్ సర్కార్‌పై ఫేస్బుక్ సీఈఓ ఆరోపణలు
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై నిరాశను వ్యక్తం చేశారు. కోవిడ్-19 నియంత్రణలో అనేక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు ఘోరంగా ఉందన్నారు. ప్రాథమిక నిబంధనల అమలుతో పాటు, సమగ్ర నివారణ చర్యలు తీసుకొని ఉంటే జూలైలో రెండవ దశ కరోనాను నివారించే అవకాశం ఉండేదన్నారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ కరోనా నిర్ధారిత పరీక్షలు ఇప్పటికీ తగినన్ని అందుబాటులో లేకపోవడం నిజంగా నిరాశ కలిగిం చిందన్నారు. ప్రజారోగ్య చర్యలపై శాస్త్రవేత్తల సలహాలను పాటించడం లేదనీ, నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో దేశంలోని టాప్ సైంటిస్టుల, సీడీసీ విశ్వసనీయత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కరోనా కేసుల నమోదు తక్కువ స్థాయిలోఉంటే, అమెరికాలో మాత్రం రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాంతక వ్యాధి కట్టడిలో అనేక ఇతర దేశాలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అమెరికా ఈ విషయంలో వెనుకబడిందని వ్యాఖ్యానించారు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం లాంటి ఇతర భద్రతా చర్యలు తీసుకోకుండానే చాలా రాష్ట్రాలు నిబంధనల ఎత్తివేతకు, ఆర్థిక కార్యలాపాల పునరుద్ధరణకు తొందరపడ్డాయని డాక్టర్ ఫౌసీ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాలలో వైరస్ రెండవ దశ విజృంభణకు దారితీసిందన్నారు. కాగా కరోనా వైరస్‌పై తన వినియోగదారులకు విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. -
ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే
వాషింగ్టన్: ప్రపంచంలో తమ దేశంలో చేసినన్ని కరోనా టెస్టులు మరెక్కడా జరగలేదని అంటున్నారు వైట్ హౌస్ అధికారులు. కరోనా టెస్టుల విషయంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ తమ తర్వాత స్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో అమెరికాలో 42మిలియన్ల టెస్టులు చేసి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. 12 మిలియన్ల టెస్టులతో భారత్ రెండవ స్థానంలో ఉంది’ అన్నారు. టెస్టుల విషయంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే.. ఇది ఎంతో మెరుగ్గా ఉందని కైలీ తెలిపారు. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.5 మిలియన్లుగా ఉండగా 1,38,000 మరణాలు సంభవించాయి. (నేటి నుంచి యూఎస్‌కు విమానాలు) ఇక వ్యాక్సిన్ అభివృద్ధి గురించి కైలీ మాట్లాడుతూ.. మోడరనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మంచి సంకేతాలను చూపిస్తున్నారన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 45 మందిలో సానుకూల, తటస్థ రోగనిరోధక ప్రతిస్పందనను చూపిస్తున్నారని తెలిపారు. కోలుకున్న రోగులతో దీన్ని పోల్చి చూస్తే ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. ‘ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్ ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో.. చివరకు అదే లభిస్తుంది అన్నారు. ముఖ్యంగా మోడరనా వ్యాక్సిన్ జూలై చివరి నాటికి మూడవ దశకు చేరుకుంటుంది’ అని కైలీ తెలిపారు. దీనిలో 30,000 మంది పాల్గొంటారన్నారు. (కరోనాతో గేమ్స్ ) మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కోసం 450 మిలియన్ డాలర్లతో రెజెనెరాన్ కుదరుర్చుకున్న ఒప్పందం చాలా ప్రోత్సాహకరమైనదని అన్నారు కైలీ. ప్రస్తుతం కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న అనేక చికిత్సా విధానాలలో ఇది ఒకటి. దీన్ని రోగనిరోధకత, చికిత్స కోసం ఉపయోగించవచ్చు. వేసవి చివరి నాటికి 70 నుంచి 300 వేల డోసులను సిద్ధం చేస్తామని రెజెనెరాన్ తెలిపిందన్నారు. -
837 వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వీధి బాలలను గుర్తించి వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి సంరక్షించే అరుదైన కార్యక్రమం ముస్కాన్ కోవిడ్–19కు విశేష స్పందన లభించింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మూడు రోజుల్లో 837 మంది వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాల్లోని ఇద్దరిని గిద్దలూరు క్వారంటైన్‌కు, విజయనగరం జిల్లాలో ఒకరిని హోం క్వారంటైన్‌ను తరలించారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ సాక్షికి తెలిపారు. ► డీజీపీ సవాంగ్ ఈ నెల 14న ప్రారంభించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19 కార్యక్రమం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ► గడిచిన 3 రోజుల్లో 2,670 మంది వీధి బాలలను పోలీసులు గుర్తించారు. వారిలో 2,339 మంది బాలురు, 331 మంది బాలికలున్నారు. 33 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు. ► గుర్తించిన వీధి బాలల్లో 2,500 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చగా, మరో 170 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ► బాలికలతో చాకిరీ చేయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేయగా, మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులిచ్చారు. -
ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలి
-
అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు..
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు ప్రభుత్వం పంపించిందని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి కరోనా రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.(ఏపీలో మరో 1919 కరోనా కేసులు) కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే..అలాంటి వారికి మరోసారి రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని, హైరిస్క్ కేసులున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల అనంతరం డిశ్చార్జి అవుతున్నవారిని పరీక్షించవచ్చని, కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరికీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఫామ్‌హౌస్‌కు వెళ్లడంకాదు.. ప్రజల్లో ధైర్యం నింపండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయంతో రోజులు నెట్టుకురావాల్సి వస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటుంటే సీఎం కేసీఆర్ చేతులెత్తేసి ఫామ్‌హౌస్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న ఏపీలో కరోనా పాజిటివ్ 2.8 శాతం ఉంటే తెలంగాణలో 22 శాతం ఉందని, ఇది జాతీయ సగటు (7.14 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అతితక్కువ టెస్టులకే 22 శాతం పాజిటివ్æ ఉందంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ‘ఫామ్‌హౌస్‌కు వెళ్లడం కాదు, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని తేవాలి, ఆ దిశలో చర్యలు చేపట్టాలి’అని సీఎంను కోరారు. ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబసర్వే చేసే శక్తి ఉన్న రాష్ట్రానికి కరోనా టెస్టులు చేయడంలో శక్తి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. ఆనాడు అవసరం లేకున్నా సమగ్ర కుటుంబసర్వే చేసి ఇప్పుడు అవసరం ఉన్నా కరోనా టెస్టులు చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి 50 శాతం బెడ్స్ ప్రభుత్వం తీసుకొని చికిత్స అందించాలని, ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక యాప్ తయారు చేసి బెడ్స్ వివరాలు అందులో పొందుపరచాలని, పేద–మధ్య తరగతి కుటుంబాల కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భట్టి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో కరోనా హోమ్ క్వారంటైన్లో ఉండటానికి ఏర్పాట్లు చేయాలని, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి భట్టి సూచించారు. -
నెగెటివా.. పాజిటివా?
శంకర్(పేరు మార్చాం) తమ్ముడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తనతోపాటు కుటుంబంలోని మొత్తం ఆరుగురూ ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో స్వాబ్ నమూనాలు ఇచ్చారు. ఇచ్చిన ఐదు రోజులకు ఆరుగురులో ఇద్దరికి పాజిటివ్ అని చెప్పారు.. ఆరో రోజున మిగిలిన నలుగురివీ నెగెటివ్ అని చెప్పారు. ఏడో రోజుకు మళ్లీ పరిస్థితి మారింది.. నెగెటివ్ అన్న నలుగురిలో ఇద్దరు మాత్రమే నెగెటివ్ అని.. ఒకరు పాజిటివ్ అని సవరణ చేశారు. ఇంకొకరి రిపోర్టు వారం దాటినా రానే లేదు. ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉంటే.. రాజారాం (పేరు మార్చాం) అనే ఆయన ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో నమూనాలు ఇచ్చారు. ఈరోజు వరకూ ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. పాజిటివా, నెగెటివా అన్న వివరాలు కూడా ఇవ్వలేదు. 104కు ఫోన్ చేస్తే తమకు తెలియదన్నారు. నమూనాలు ఇచ్చిన ఆసుపత్రిలో అడిగితే ఇక్కడ పరీక్షలు చేయరని చెబుతున్నారు. ఎవరిని అడిగితే విషయం తెలుస్తుందో కూడా తెలియదు. దీంతో ఆ కుటుంబం వైద్య, ఆరోగ్యశాఖ వర్గా లకు చెందిన అధికారుల వద్దకు వెళ్లినా ఇంకా రిపోర్టులు రాలేదన్న సమాచారమే వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలా రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీల్లో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. అనేకమందికి వారంరోజులైనా స్పష్టత రావడం లేదు. ఫలితాలెప్పుడు వస్తాయోనన్న విషయంలో కూడా స్పష్టతలేదని బాధితులు విచారం వ్యక్తం చేశారు. వివరాల కోసం ఎవరెవరికో ఫోన్లు చేయాల్సిన దుస్థితి. పాజిటివ్ వచ్చినవారికే ఫోన్లు చేస్తున్నారు. నెగెటివ్ అయితే సమాచారం ఇవ్వడంలేదు. దీంతో నెగెటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చిందా అనే విషయం తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీల్లో భారీగా నమూనాలు పేరుకుపోవడం, పరీక్షల వివరాలను అప్లోడ్ చేయడంలో ఆలస్యం వల్ల ఫలితాలు జాప్యమవుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి చెప్పా రు. ప్రైవేటు లేబొరేటరీల్లోనూ పరిస్థితి అలాగే ఉందని, ఫలితాలను ఐసీఎంఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి రావడంతో ఆలస్యం అవుతోందని ఓ లేబొరేటరీ యాజమాన్యం పేర్కొంది. సీరియస్ రోగుల పరిస్థితి ఏంటి? కరోనా నిర్ధారణ పరీక్షలు ఆలస్యం కావడం వల్ల సీరియస్ రోగుల పరిస్థితి విషమంగా మారుతోంది. ఒక్కోసారి ప్రాణాపాయస్థితికి చేరుకుంటోంది. ఐదారు గంటల్లో ఫలితం ఇవ్వాలి. కానీ, ఐదారు రోజులు, వారం ఆలస్యమైతే పరిస్థితి చేయిదాటి పోతుంది. సీరియస్‌గా ఉన్నవారి పరిస్థితికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి తక్షణమే ఫలితం తెలిస్తే అతనికి వైద్యం చేయడానికి వీలు కలుగుతుందని, లేకుంటే అది ముదిరి ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అంటించే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనివల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదమూ ఉందని భయాందోళన చెందుతున్నారు. పాజిటివ్ వచ్చిన రోగులకు ఫోన్లు చేస్తున్నారే కానీ ఎటువంటి వైద్యసాయం, సలహాలు అందివ్వడంలేదని శంకర్ అనే బాధితుడు విచారం వ్యక్తం చేశారు. పరిస్థితి సీరియస్ అయితే పట్టించుకునేనాథుడే లేడంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సమన్వయలోపం కరోనా నిర్ధారణ కోసం లేబొరేటరీల్లో నమూనాలు తీసుకున్నాక వాటిని సకాలంలో పరీక్షించడం, తదుపరి ఐసీఎంఆర్ పోర్టల్ లోనూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్లోనూ అప్ లోడ్ చేస్తారు. ప్రతీ లేబొరేటరీకి ఒక అధిపతి ఉంటారు. వాటన్నింటినీ పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో ఒకరు పర్యవేక్షణ చేస్తారు. అన్ని లేబొరేటరీల నుంచి ఫలితాల వివరాలను తెప్పించి అప్లోడ్ చేయించడం అతని బాధ్యత. అయితే ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. అక్కడి నుంచి పోర్టల్‌లో అప్లోడ్ చేశాక వాటిని మరో విభాగాధిపతి ప్రజలకు తెలియజేస్తారు. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో బాధితులకు తీవ్రమైన అన్యా యం జరుగుతోంది. వాటిని సరిదిద్దాల్సిన ఉన్నతస్థాయి వైద్య, ఆరోగ్య యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందన్న భావన నెలకొంది. అసలు పనిచేయించుకోనీయకుండా సమావేశాల పేరుతో టైం వేస్ట్ చేయిస్తున్నారని ఒక ఉన్నతాధికారి వాపోయారు. -
సామాన్యులకు ‘సంజీవని’
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 30 బస్సులను సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా టెస్ట్‌లు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. -
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
-
కరోనా టెస్టులు పెంచండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో డాక్టర్ సంజయ్ జాజు, డాక్టర్ రవీంద్రన్‌లతో కూడిన నిపుణుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించింది. గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను సందర్శించింది. అక్కడి ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై ఆరా తీసింది. ఆ తర్వాత దోమలగూడలోని దోభీగల్లీ కంటైన్మెంట్ ఏరి యాను సందర్శించి, క్షేత్రస్థాయిలోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం గాంధీ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి అధికారులతో సమావేశమై.. యాక్టివ్ కేసులు, వెంటిలేటర్లు, చికిత్స విధానం వంటి అంశాలపై ఆరా తీసింది. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, ఇప్పటి వరకు ఇక్కడ అందించిన వైద్య సేవలు, చికిత్స తర్వాత కోలుకున్న రోగులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ఆస్పత్రి వైద్యులు వివరించారు. ఇదే సమయంలో కొంతమంది వైద్యులు కేంద్ర బృందాన్ని కలసి,క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. సీఎస్‌తో భేటీ..టెస్టులపై సీరియస్ ఆ తర్వాత కేంద్ర బృందం ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమావేశమైంది. వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి యోగితారాణా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ కేంద్రాలు, చికిత్సలు, కంటైన్మెంట్ విధానంపై వైద్యారోగ్యశాఖ అధికారులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,081 పడకలను సిద్ధం చేసినట్లు, అదనంగా మరో 4,489 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రూ.475 కోట్లతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చినట్లు అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లగా..ఆశించిన స్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ చేయకుండా కోవిడ్ నియంత్రణ ఎలా సాధ్యమని కేంద్ర బృందం రాష్ట్ర అధికారులను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కంటైన్మెంట్ సరిగా చేయకుండా వైరస్ కట్టడి ఎలా సాధ్యమని నిలదీసినట్లు తెలిసింది. కాంటాక్ట్ కేసులను గుర్తించి, టెస్టులు నిర్వహించడం ద్వారానే కోవిడ్ నియంత్రణ సాధ్యమని బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ మేరకు టెçస్టుల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. -
రోజుకు 7,600 పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏరా ట్లు చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న పరీక్షల్లో ఎక్కువ శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో మరిన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగిరం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌ల్లో 2,290 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం మాత్రమే ఉంది. రాష్ట్రంలో అన్ని ల్యాబ్‌లు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. తాజాగా నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, ట్రూనాట్ సెంటర్లలో కొత్తగా 1,100 పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఈ ప్రక్రియ వారంలోగా పూర్తవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండ్రోజుల్లో హైదరాబాద్‌లోని ల్యాబ్‌ల్లో మరో 3,210 పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కొత్త గా సీబీనాట్లో వెయ్యి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ల్యాబ్స్‌లో రోజుకు 7,600 పరీక్షలు జరగనున్నాయి. వందలో 14 మందికి పాజిటివ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్ రేట్(టీపీఆర్) 14.39 శాతానికి ఎగబాకడమే ఇందుకు నిదర్శనం. జాతీ య స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, రాష్ట్రం లో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలో 5.2 శాతం మాత్రమే టీపీఆర్ ఉండగా, మే 14 నాటికి 6.07 శాతానికి పెరిగింది. ఆ తర్వాత మే 15 నుంచి జూన్ 16 మధ్య కాలంలో రెట్టింపు అయింది. జూన్ 16న 12.6 శాతానికి పెరగ్గా.. ప్రస్తుతం 14.39 శాతానికి ఎగబాకింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే రాష్ట్రంలో వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కరోనా నిర్థారణ కోసం పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి వైరస్ సోకినట్టు ఫలితాలొస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న జీహెచ్ఎంసీతో పాటు పరిసర జిల్లాల పరిధిలోని 30 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గత వారం రోజులుగా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాజిటివ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. -
రోజుకు 30 వేల కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 22 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. దీన్ని 30 వేలకు పెంచుతాం. పరీక్షలకు రోజుకు రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కార్ ముందుకెళుతోంది. 40 వేల మందికి ఏకకాలంలో వైద్యం అందించేలా పడకలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో 20 వేల వరకు ఆక్సిజన్ పడకలే’ అంటున్నారు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న కేసులకు ఇంట్లోనే వైద్యం చేసేలా వైద్యులు చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వాళ్లు 80 శాతం మంది ఉంటారు. తీవ్రత ఎక్కువ ఉంటేనే ఆస్పత్రికి పంపుతాం. నలభై ఏళ్లు దాటి, దీర్ఘకాలిక జబ్బుల (మధుమేహం, కిడ్నీ, హైపర్ టెన్షన్)తో బాధపడే వాళ్లందరికీ స్క్రీనింగ్ చేస్తాం. 60 ఏళ్లు దాటిన వారికి కూడా పరీక్షలు చేసి, కోవిడ్ కేర్ లేదా స్టేట్ నోడల్ ఆస్పత్రికి తరలిస్తాం. ఇప్పటికే బీపీ, షుగర్, క్యాన్సర్, గుండెజబ్బులున్న వారిని గుర్తించి వారిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 20 వేల మంది పైగా ఉన్న వైద్యులే కాకుండా, మరో 24 వేల మంది హౌస్ సర్జన్ చేస్తున్న వారు, పీజీ చదువుతున్నవారు, స్టాఫ్‌నర్సుల సేవలు వినియోగించుకుంటున్నాం. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రోజూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనాపై సమీక్ష నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. చాలా రాష్ట్రాలు ఏపీ అనుసరిస్తున్న విధానాలను అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో ఇద్దరు వైద్యులుండేలా చర్యలు చేపట్టాం. అలాగే ప్రతి ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్లు ఉండేలా చేస్తున్నాం. గతంలో లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో ఒకేసారి 9,700 పోస్టులకు నియామకాలు చేపడుతున్నాం. ఏ రాష్ట్రం చేపట్టని విధంగా సర్కార్ 16 కొత్త వైద్య కళాశాలలను సీఎం నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. కొత్త కాలేజీలు వస్తే వైద్యసీట్లతోపాటు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. -
పోలీస్ అకాడమీ సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో కరోనా కలకలంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం సరోజిని ఆస్పత్రిలో టీఎస్పీఏ సిబ్బంది, క్యాడెట్లకి ఉచిత కరోనా నిర్ధారణ క్యాంపు ఏర్పాటు చేయించారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అకాడమీలో ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ రాగా, సిబ్బంది, క్యాడెట్లకి రూ.2,800 చొప్పున ప్రైవేటు ల్యాబ్ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్షలు చేయించాలని తొలుత ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు పెల్లుబికాయి. పోలీస్ అకాడమీలో సామాజిక దూరం పాటించడం లేదని, కరోనా పాజిటివ్ వస్తే మాత్రం తమ డబ్బుతో పరీక్షలు చేయించుకోవాలా? అంటూ సిబ్బంది ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు లేవనెత్తారు. ఈ విషయాన్ని సాక్షి ‘పోలీస్ అకాడమీ కరోనా కలకలం’ అన్న శీర్షికతో వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన అకాడమీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. -
పోలీస్ అకాడమీలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడ మీ (టీఎస్పీఏ)లో ఓ అటెండర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అకాడమీ సిబ్బంది, కేడెట్లలో ఆందోళన మొదలైంది. కాగా, అకాడమీలో ఒకే గదిలో 400 మంది వరకు కేడెట్లను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తూ భౌతిక దూరం తదితర కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాడమీలో 1,200 మంది ఎస్సైలు, 650 మంది వరకు విమెన్ పీసీ కేడెట్లు శిక్షణ పొందు తున్నారు. వీరు కాకుండా మరో 400 మంది సిబ్బంది బయట నుంచి వస్తారు. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే క్యాంపస్‌లో ఉంటా రు. లాక్డౌన్ విధించినా అకాడమీలో కొత్తవారిని రానీయలేదు. లాక్డౌన్ ఆంక్షలు తొలగించిన తరువాత హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగాయి. దీంతో టీఎస్పీఏ అటెండర్ ఉద్యోగికి కరోనా రావడంతో సిబ్బం దిలో కలకలం మొదలైంది. ఆందోళనకు కారణాలివే..! అకాడమీలో భౌతిక దూరం నిబంధన ఏ కోశానా అమలుకావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. తరగతిలో 400 మందికిపైగా కేడెట్లు ఒకే హాల్లో కూర్చుంటున్నారు. ముఖానికి మాస్కులు వేసుకుంటున్నా.. అంత దగ్గరగా కూర్చోవడంతో కేడెట్లలో కరోనా ఆందోళన మొదలైంది. రెండు వేల మంది కేడెట్లు, 400 మంది సిబ్బందితో శ్రమదానం సైతం చేయించారు. కరోనా కేసు వెలుగుచూసినా ఎలాంటి మార్పు రాలేదు. అకాడమీలో శనివారం కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనికి అందరూ హాజరయ్యారు. కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆదివారం నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. రూ. 2,800 కట్టిన వారికి ప్రైవేటు సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలపడంతో సిబ్బంది నీరుగారిపోయారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: మృతదేహాలను ఆసుపత్రి నుంచి తరలించే ముందు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టులు తగి నన్ని నిర్వహించడం లేదంటూ పీఎల్ విశ్వేశ్వర్రావు, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం లో మే 26 నాటి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంబంధిత పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్, న్యాయవాది ఉదయ్ కుమార్‌సాగర్ వాదనలు వినిపిస్తూ ఐసీఎంఆర్ వద్ద కూడా తగినన్ని టెస్ట్ కిట్లు లేవని, అవసరమైన సందర్భాల్లోనే పరీక్షలు జరపాలన్న నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీచేయడంతో పాటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అలాగే స్వస్థలాలకు వచ్చిన వలస కార్మికుల సంఖ్య, వారికి జరిపిన కరోనా పరీక్షల సంఖ్య, కోవిడ్ కట్టడి జోన్లు గ్రీన్ జోన్లుగా మార్చిన వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ హెచ్చరికలపైనా స్టే సదరు కేసులో తాము ఇచ్చిన ఉత్తర్వులు పాటించడం లేదని, కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందంటూ హైకోర్టు జూన్ 8న జారీచేసిన ఉత్తర్వులను అపరిపక్వమైనవే కాకుండా.. ఈ దశలో అలాంటి ఉత్తర్వులు సరైనవి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కూడా విచారించిన జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు జూన్ 8న జారీచేసిన ఉత్తర్వులపైన కూడా స్టే విధించింది. -
కరోనా పరీక్షలు, చికిత్స : దేనికెంత..?
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను అందులో పొందుపరిచారు. ప్యాకేజీ రోజువారీ ఫీజు (రూ.లలో) రొటీన్ వార్డ్ + ఐసోలేషన్ 4,000 ఐసీయూ (వెంటిలేటర్ లేకుండా) + ఐసోలేషన్ 7,500 ఐసీయూ (వెంటిలేటర్ సహా) + ఐసోలేషన్ 9,000 ప్యాకేజీలో లభించేవి.. ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలన్నింట్లో రోగికి సీబీసీ, యూరిన్ రొటీన్, హైచ్ఐవీ స్పాట్, యాంటీ హెచ్ఐవీ, హెచ్‌బీఎస్, సీరం క్రియాటినైన్, యూఎస్జీ, 2డీ ఎకో, డ్రగ్స్, ఎక్స్‌రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్ చార్జెస్, మీల్స్‌తోపాటు ప్రొసిజర్స్ (రెలెస్ట్యూబ్ ఇన్సర్షన్, యూరినరీ ట్రాక్ట్ క్యాథెటరైజేషన్) సేవలు అందుతాయి. ప్యాకేజీలో లభించనివి... ► పీపీఈ కిట్లు ► ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ (సెంట్రల్ లైన్ ఇన్సర్షన్, కీమోపోర్ట్ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్ ప్రొసిజర్, బైయాప్సీస్, యాసిటిక్/ప్లైరల్ టాప్పింగ్. వీటికి 2019 31 డిసెంబర్ నాటి ర్యాక్ రేట్ల ఆధారంగానే చార్జీ వసూలు చేయాలి.) ► కోవిడ్–19 టెస్టింగ్ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం) ► హైఎండ్ డ్రగ్స్ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్ న్యూట్రిషన్, టోసిల్‌జంబ్. వీటికి ఎంఆర్పీ ధరలే వసూలు చేయాలి) ► హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ (సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్ పరీక్షలు) ల్యాబ్ పరీక్షలకు ఫీజులు ఇలా... కేటగిరీ ఫీజు ల్యాబ్/హాస్పిటల్ వద్ద శాంపిల్ ఇస్తే రూ. 2,200 ఇంటి వద్దకు వచ్చి శాంపిల్ సేకరిస్తే రూ. 2,800 ప్రభుత్వ మార్గదర్శకాలివీ.. ► కరోనా చికిత్స చేసే ప్రైవే టు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శిస్తూ ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. ► రోగులు, వారి బంధువుల కు సేవల వివరాలను వెల్లడించాలి. ► పాజిటివ్ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వా ళ్లు, అతితక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చే ర్చుకోవద్దు. వారిని హోం ఐసోలేషన్‌కు పరిమితం చేయాలి. ► ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్ లు, ఆస్పత్రులే కరోనా పరీక్షలు నిర్వహించాలి. ► కరోనా అప్డేట్స్ను ప్రభు త్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెబ్సైట్లో సకాలంలో పొందుపరచాలి. ఇందుకు ప్రతి ల్యాబ్, ఆస్పత్రికి పరిశీలన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్లు జారీ అవుతాయి. ► నిబంధనలకు లో బడి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు వ్యవహరించాలి. ► కరోనా చికిత్సలు, పరీక్షలపై మార్కెటింగ్ చేసుకున్నట్లు ఫిర్యాదులొస్తే చర్యలు ఉంటాయి. ► ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అ తిక్రమిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. -
కరోనా పరీక్ష @ రూ. 2,200
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సేవలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఫీజులను ఏ మేరకు వసూలు చేయాలనే విషయమై ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. అదేవిధంగా ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు చేసేలా వెసులుబాటు కల్పించింది. కరోనా పరీక్షకు రూ. 2,200 ఫీజును ఖరారు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే చికిత్సలో భాగంగా రోజుకు ఐసోలేషన్ ఫీజు రూ. 4 వేలు, ఐసీయూలో వెంటిలేటర్ అవసరం లేకుండా రోజుకు రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉంటే రోజుకు రూ. 9 వేలుగా ధరలు ఖరారు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులతో కలసి ఆయన మీడియా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పటాన్చెరు నియోజకవర్గంలో 50 వేల పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఈ టెస్టుల సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు చేయడం లేదంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము తొలిరోజు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్ భరోసా కల్పించేందుకే పరీక్షలు... కరోనా కట్టడిలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం, లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం వల్లే తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్షణాల్లేని వారికి ఎలాంటి చికిత్స అందించాలి, లక్షణాలున్న వారికి ఎలాంటి చికిత్స ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టిందని, తర్వాత ఐసీఎంఆర్ సైతం రాష్ట్ర విధానాన్ని అనుసరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో పరిస్థితికి అనుగుణంగా పనిచేస్తోందని, లేకుంటే ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్‌లో పరిస్థితి నెలకొనేదన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకే టెస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు ఈటల చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 4,500 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని, త్వరలో అన్ని మెడికల్ కాలేజీల్లో ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని, పరీక్షల కోసం మరో మిషన్‌ను సిద్ధం చేస్తున్నామని, దీంతో రోజుకు 7,500 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, కేసుల సంఖ్య ప్రకారం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో సమూహ వ్యాప్తి లేదని, అన్ని రకాల సర్వేలు ఇదే రిపోర్టు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపుల తర్వాత సీఎం కేసీఆర్ లోతుగా పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులిలా.. రోజుకు ఐసోలేషన్ ఫీజు - రూ. 4,000 ఐసీయూలో వెంటిలేటర్ అవసరం లేకుండా రోజుకు.. - రూ. 7,500 ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉంటే రోజుకు.. - రూ. 9,000 ప్రైవేటుపై టాస్క్‌ఫోర్స్... ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలపై ఆయా యాజమాన్యాలు ప్రతిక్షణం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, వాటి ఆధారంగా కంటైన్మెంట్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటామన్నారు. ఈటల తెలిపారు. ప్రైవేటు ఆస్పతులు, ల్యాబ్‌లపై నిఘా కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందం పనిచేస్తుందన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈటల సూచించారు. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రతి రంగాన్నీ రక్షించుకుంటామని, వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, జర్నలిస్టులకు ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రికి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో దాదాపు 5 వేల పడకల ద్వారా ఆక్సిజన్‌తో కూడిన చికిత్స అందించే వీలుందన్నారు. సీజనల్ వ్యాధులపై పకడ్బందీ సర్వే నిర్వహించనున్నామని, ఇందుకు తాత్కాలిక పద్ధతిలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను నియమించుకొని ఇంటింటి సర్వే చేపడతామన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలని, మిగతా వర్గాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు. పడకల కొరత లేదు: సీఎస్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. పెయిడ్ పేషెంట్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని, ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతర కేటగిరీ వారంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలన్నారు. ఐసీఎంఆర్ గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఎవరూ మార్కెటింగ్ చేసుకోవద్దని, అలాంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను బ్లాక్ చేయొద్దని, రోగులు, పడకల వివరాలు డిస్ప్లేలో తప్పకుండా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. యాజమాన్యాలు అన్నివేళలా పడకల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశామన్నారు. కరోనా లక్షణాలు లేనివారు ఆస్పత్రుల్లో చేరొద్దని, హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉన్న పడకలు- 17,000 ‘ఆక్సిజన్’తో చికిత్స అందించే వీలున్న పడకలు- 5,000 -
30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇందుకోసం కరోనా నిబంధనలను అనుసరించి ప్రైవేటు లేబొరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని చెప్పారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతోందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ 30 నియోజకవర్గాలు : ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, చార్మినార్, మలక్‌పేట్, అంబర్పేట్, ముషీరాబాద్, కార్వాన్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్‌పురా, పటాన్చెరు తీవ్ర లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స... ‘తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరుప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నో కొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. వచ్చే 7–10 రోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా ప్రైవేటు లేబొరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స (హోం ట్రీట్మెంట్) అందించాలి’అని సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంత మందికైనా చికిత్స అందించేందుకు సిద్ధం... హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంత మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు వైరస్ సోకిన వారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి, అప్రమత్తతతో ఉంది’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
కరోనా పరీక్షలు @ పలుకుబడి
► హైదరాబాద్‌లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు నివసిస్తున్న అపార్టుమెంట్లో ఉండే ఓ వ్యక్తి తనకు కూడా వైరస్ సోకిందేమోనని సందేహించాడు. తనకు కూడా పరీక్షలు చేయాలంటూ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది అతడికి పరీక్షలు నిర్వహించేందుకు నిరాకరించారు. ఏవైనా లక్షణాలు ఉంటేనే రావాలని తిప్పి పంపారు. ఇప్పటికీ అతడిలో కరోనా వైరస్ గిలి అలానే ఉండిపోయింది. ► ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి బంధువుకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఉద్యోగీ పరీక్షలకు వెళ్లి భంగపడ్డాడు. మరో సంస్థకు చెందిన వ్యక్తి దగ్గు, గొంతు నొప్పి అంటూ వెళ్తే యాంటీ బయాటిక్స్ వేసుకుని అప్పటికీ తగ్గకపోతే 10 రోజులు ఆగి రావాలని ఉచిత సలహా ఇచ్చి పంపిన వైద్య సిబ్బంది పరీక్షలే చేయలేదు. సాక్షి, హైదరాబాద్ : ..ఈ ఉదాహరణలను బట్టి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోం దని అర్థమవుతోంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అవసరం అనుకుని పరీక్షల కోసం వస్తున్న వారికి పరీక్షలు చేయకుండా నిరాకరిస్తుండటం ప్రజల్లో విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు చేసేం దుకు ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే తిప్పి పంపిస్తుండటంతో సాధారణ ప్రజానీకానికి పాలు పోవట్లేదు. అదే సమయంలో పలుకుబడి ఉన్న వారికి, కొందరు ప్రజాప్రతినిధులకు అడిగిన వెంటనే పరీక్షలు చేస్తుండటంతో సామాన్యులను పట్టించుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరీక్షల విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ► గాంధీ, ప్రభుత్వ, ప్రైవేటు పరీక్ష కేంద్రాలకు రోజూ టెస్టుల కోసం వస్తున్న వారు - 2,000 రోజూ వేల మంది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జరుపుతున్న కరోనా టెస్టుల సంఖ్యతో పోలిస్తే మన రాష్ట్రంలో జరుగుతున్న టెస్టుల సంఖ్య చాలా తక్కువ అనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో అటు కోర్టులు, ఇటు కేంద్రం కూడా రాష్ట్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనవసరంగా టెస్టులు చేయొద్దనే విధానంతో ముందుకెళ్తోంది. ఐసీఎంఆర్ కూడా రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదని, ప్రమాదం లేదని తేల్చింది. రాష్ట్రంలో ఆర్–నాట్ శాతం కూడా 180 నుంచి 110కి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ అవసరం అనుకున్న వారికి టెస్టులు చేయకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అడిగిన అందరికీ కాకపోయినా అవసరం అనుకున్న వారికి, కరోనా సోకిన వారితో సహజీవనం చేయాల్సిన వారికి పరీక్షలు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కాగా, తమకు పరీక్షలు చేయాలంటూ రోజూ 2 వేల మందికి పైగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు చేసేందుకు తమకు అనుమతి లేదంటూ ప్రైవేట్ వర్గాలు తిప్పి పంపడం, ప్రభుత్వ వర్గాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, ఐసొలేషన్‌లో ఉండాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలు పోవట్లేదు. వీరికి ఇలా.. వారికి అలా.. సామాన్యులను వెనక్కి పంపిస్తున్న ప్రభుత్వ వైద్య వర్గాలు.. పలుకుబడి ఉన్న వారికి మాత్రం అడిగిందే తడవుగా పరీక్షలు చేయడం మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు ఒక విధానం, మాకు మరో విధానమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం సాధ్యం కాకపోయినా నిజంగా అవసరమైన వారిని వెనక్కి పంపొద్దని పలువురు కోరుతున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులతో సహజీవనం చేయడం కన్నా.. తమకు వైరస్ ఉందో లేదో తెలియకుండా జీవించడం నరకాన్ని తలపిస్తోందని, కుటుంబసభ్యులతో మానసిక ప్రశాంతత ఉండకుండా పోతోందని వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతిస్తే సరి! ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు చేసేందుకు ఐసీఎంఆర్ కొన్ని ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిల్లో టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇస్తే సమస్యలు వస్తాయని వాదిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అనుమతించగా సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం, కరోనా సోకిన వారితో సహజీవనం చేసే వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌కు పరీక్షలు చేసే అవకాశం ఇస్తేనే ఉపయోగమన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రై వేటు ల్యాబ్‌లు పరీక్షలకు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయకుండా ప్రభుత్వమే ఓ విధానం రూపొందించి, దాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ పరీక్షలు నిర్వహించేలా అనుమతిస్తే ఉపయోగకరంగా ఉంటుందని, అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుందన్న వాదనలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. -
మరోసారి మేయర్‌కు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే ఆయనకు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు మేయర్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో శుక్రవారం దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు. -
మళ్లీ క్రికెట్ కోసం...
లండన్: మళ్లీ లైవ్ క్రికెట్‌ను అస్వాదించేందుకు అభిమానులు సిద్ధంగా ఉండండి. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకుంది. ప్రైవేట్ విమానంలో కరీబియన్ ఆటగాళ్లు పయనమయ్యారు. ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు విండీస్ ఆటగాళ్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇంగ్లండ్ చేరాక ప్రస్తుత నిబంధనల మేరకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కావడంతో ఆటగాళ్లు బస చేసే హోటల్ నుంచి బయటికిరారు. క్వారంటైన్ ముగిశాక మరోసారి కరోనా పరీక్షలు చేస్తారు. టెస్టు సిరీస్ కాస్తా జూలై 8న మొదలవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ షట్డౌన్కు త్వరలోనే ఈ సిరీస్ ద్వారా తెరలేవనుందని విండీస్ కెప్టెన్ హోల్డర్ చెప్పాడు. కరీబియన్ నుంచి తొలి అడుగు పడుతోందన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ మొత్తం క్రికెట్ ప్రపంచం మళ్లీ ఆటను చూసేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తోందని అన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో గేట్లు మూసి ప్రేక్షకుల్లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తారు. -
విలేకరులకు కరోనా టెస్టులు చేయండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మీడియా ప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబాలను ఆ దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ కోరారు. మీడియా రిపోర్టర్ మనోజ్ మృతి తీవ్రంగా కలచి వేసిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో నూ కరోనాపై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసే మీడియా ప్రతినిధులు కూడా కోవిడ్ వారియర్లేనని, వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్య లు చేపట్టాలన్నారు. నిన్న డాక్టర్లు, నేడు రిపోర్టర్లకు కరోనా సోకిందని, రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కరోనా కట్టడిపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఈనెల 9న తలపెట్టిన బీజే పీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరె న్స్ సమావేశం వాయిదా పడిందని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. -
భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్
వాషింగ్టన్: భారత్, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మెయిన్ నగరంలో ఓ మెడికల్ ప్రోడక్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అధికంగానే ఉంది. జాన్స్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 1.9 మిలియన్ కరోనా కేసులు, 1,09,000 మరణాలు సంభవించాయి. మరోవైపు భారతదేశంలో 2,36,657 కరోనా కేసులు, 6,642 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదట కనుగొనబడిన చైనాలో 84,177 కేసులు, 4,638 మరణాలు నమోదయ్యాయి. (2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్) ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మా దేశంలో 2 కోట్ల మందికి టెస్టులు చేశాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. టెస్టులు ఎక్కువ చేస్తే.. కేసులు పెరుగుతాయి. నా దేశ ప్రజలకు కూడా ఇదే చెప్పాను. ఒక వేళ మీరు గనక ఇండియా, చైనా వంటి ఇతర దేశాల్లో టెస్టులు విస్తృతంగా చేస్తే.. అక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయి అని నేను హామీ ఇస్తున్నాను’ అన్నారు. జర్మనీతో పోలిస్తే.. అమెరికాలోనే అత్యధికంగా టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. జర్మనీలో ఇప్పటి వరకు కేవలం 40 లక్షల మందికి మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. దక్షిణ కొరియాలో 30 లక్షల మందికి పరీక్షలు చేపట్టారని తెలిపారు. అమెరికాలో ఈ సంఖ్య ఎక్కువన్నారు ట్రంప్. (‘వారి కోసం 5 వేల పడకలు సిద్ధం’) -
కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్ష ల సంఖ్యను మరింత పెంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇందుకు అన్ని బోధనా ఆస్పత్రుల్లో టె స్టుల కోసం సీబీనాట్ యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య ఎంత పెరిగినా వారికి చికిత్స ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. బాధితుల ప్రాణ రక్షణకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్రవారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సరైన చికిత్స చేయట్లేదని, వైద్యులకు కిట్లు ఇవ్వట్లేదంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే ఆరోపణలు చేయాలని సూచించారు. పీపీఈ కిట్లు, మాస్కులు వాడుతున్న డాక్టర్లకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని, కిట్లు లేకపోవడం వల్లే డాక్టర్లకు కరోనా సోకిందనడం సరికాదని పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో, ముంబైలో, అమెరికాలో చాలా మంది డాక్టర్లకు కరోనా సోకిం దని, వారికి కూడా కిట్లు లేకపోవడంతోనే వ్యాధి వచ్చిందా అని ప్రశ్నించారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు వైరస్ సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు, 11 లక్షల ఎన్–95 మాస్కులు ఉన్నాయని, అన్ని రకాల మందులు సహా దేనికీ కొరత లేదన్నారు. అవసరమైన ప్రతి హాస్పిటల్లో కి ట్లు, మాస్కులు వాడుకోవాలని అధికారులకు సూచించామని స్పష్టంచేశారు. డాక్టర్లు, వైద్య సి బ్బందిని రక్షించుకోవడమే ఎజెండాగా అన్ని చర్యలూ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైరస్ బారిన పడిన డాక్టర్లకు నిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిస్తామని చెప్పారు. ఐసీఎంఆర్ చెప్పినట్లు లక్షణాలున్న వ్యక్తులకు, పాజిటివ్ వ్యక్తుల హైరిస్క్ కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. మనోధైర్యం దెబ్బతీయొద్దు.. ప్రభుత్వం పని చేసుకోకుండా కోర్టులో పిల్స్ వేస్తూ, అర్థం లేని వాదనలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమస్యను ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోందని, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. కరోనా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతి ఇస్తే ఇబ్బందులొస్తాయని, ప్రైవేటులో టెస్టు చేయించుకున్న వారికి పాజిటివ్ వస్తే కాంటాక్ట్ ట్రేస్ చేయడం కష్టం అవుతుందని వివరించారు. ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులకు పర్మిషన్ ఇచ్చిన రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తాయని, వాటిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స, వసతులు, సేవలపై వందల మంది పేషెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారని, కేంద్ర బృందం కూడా ప్రశంసించిందని పేర్కొన్నారు. ఎవరో ఓ వ్యక్తి తీసిన వీడియోను టీవీ చానెళ్లు ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్లు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారని, వాళ్ల మనోధైర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయొద్దన్నారు. లాక్డౌన్ సడలింపులు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలతోనే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముంబై, భివండి నుంచి వచ్చిన వలస కూలీల్లో చాలా మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం లక్షణాలు లేని పేషెంట్లను ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వసతులు లేనివారిని నేచర్ క్యూర్, కింగ్ కోఠి సహా వేర్వేరు ఆస్పత్రుల్లో ఐసోలేట్ చేస్తున్నామన్నారు. ఇతర వైద్య చికిత్సలను నిలిపేసినా ఇబ్బందులు ఉండవని, కానీ ప్రసవాలను ఆపలేమని, వాటిని సకాలంలో చేస్తేనే తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పారు. రోజుకు 50 వేల ప్రసవాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా మరణాలను తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా 150 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయని, అందులో 50 కేంద్రం ఇచ్చిందని తెలిపారు. మరో 950 వెంటిలేటర్లను ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. -
కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 11,364 వైద్య పరీక్షలు చేసింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల సంఖ్య 3 లక్షల 4 వేల 326కు చేరింది. మిలియన్‌కు 5699 వైద్య పరీక్షలు చేస్తూ ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా, ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 1807 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా రికార్డ్ స్థాయిలో 68 శాతం రికవరీ రేటు నమోదైంది. గత 24 గంటల్లో 66 కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా పాజిటివ్ కేసుల్లో విదేశాల నుండి వచ్చిన వారు 17 మంది, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు 8 మంది ఉన్నారు. చదవండి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా రికవరీ రేటు -
వూహాన్లో అందరికీ పరీక్షలు
వూహాన్/వాషింగ్టన్/లండన్: చైనాలోని వూహాన్లో నెల రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనానిర్ధారణ పరీక్షలు చేయనుంది. 1.1కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది. 10 రోజుల్లోగా మొత్తం పరీక్షలుచేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. పరీక్షల నిర్వహణపై సమగ్ర ప్రణాళిక తమకు ఇంకా అందలేదని ఝోన్గాన్ ఆస్పత్రి డైరెక్టర్ పెంగ్ జియాంగ్ అన్నారు. అందరికీ పరీక్షల నిర్వహణ అంటే అత్యంత వ్యయంతో కూడుకున్నదని కోవిడ్ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకి, వారితో కాంటాక్ట్ అయిన వారికి, మెడికల్ సిబ్బంది, వయసు మీద పడిన వారికి పరీక్షలు చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వస్తుందో లేదో: బోరిస్ జాన్సన్ కోవిడ్ వ్యాధిపై పోరాటం చేసి కోలుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వైరస్ రావడానికి ఏడాదైనా పట్టొచ్చని, పూర్తిగా రాకపోవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ రాకపోయినా కోవిడ్‌తో పోరాటం చేయాలన్నారు. బ్రిటన్ ఆర్థికంగా కోలుకోవాలంటే భౌతిక దూరం పాటిస్తూ దశలవారీగా ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. ‘వ్యాక్సిన్ రావడానికి ఏడాది పట్టొచ్చు. లేదంటే అసలు రాకపోనూవచ్చు. వ్యాక్సిన్ రాదు అన్న దానికి సిద్ధపడే లాక్డౌన్ ఎత్తివేస్తూ సాధారణ జనజీవనానికి రావాలన్నారు. రోజూ మూడు లక్షల పరీక్షలు: ట్రంప్ అమెరికాలో కోవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగిందని ఈ వారంలో దేశం కోటిమందికి పరీక్షల నిర్వహణ పూర్తి అవుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 92 ల్యాబరెటరీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రోజుకి దాదాపు లక్షా 50 వేల పరీక్షలు నిర్వహించేది. ఇప్పుడు ప్రతీ రోజూ 3 లక్షలు నిర్వహిస్తోందని ట్రంప్ సోమవారం వెల్లడించారు. ఈ వారంలో కోటి మందికి పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. శ్వేత సౌధంలోకి వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్ వేసుకోవడం తప్పనిసరి చేశారు. మహిళా విలేకరితో ట్రంప్ వాదన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహిళా విలేకరిపై విరుచుకుపడి అర్ధంతరంగా సమావేశాన్ని ఆపి వెళ్లిపోయారు. సీబీఎస్ విలేకరి వీజే జియాంగ్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ మండిపడ్డారు. కరోనాతో వేలాది మంది మరణిస్తున్నా ప్రపంచంతో పోటీ పడేలా కరోనా పరీక్షలెందుకని ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ట్రంప్ కరోనాతో అమెరికాలో మాత్రమే కాక ప్రపంచ దేశాల్లో ఎందరో మరణిస్తున్నారని, ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదని, చైనాను అడగండని అన్నారు. జియాంగ్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు ఆమె కుటుంబం చైనా నుంచి అమెరికాకి వలస వచ్చింది. చైనాను అడగాలని తనతోనే ఎందుకు అంటున్నారని జియాంగ్ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే పరీక్షలు.. పాసులు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న వలసకూలీలు, ఇతరత్రా ప్రజలు సొంత వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు ఇచ్చే పాసులతో స్వస్థలాలకు వెళ్లిపోవచ్చన్నారు. సరిహద్దుల వద్ద ఉన్న వైద్యులు ఈ టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు అన్ని చెక్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి తీసుకెళ్లింది. కరోనా పరీక్షలను పూర్తిగా తగ్గించారని, దీనికి గత సహేతుక కారణాలను వెల్లడించడం లేదని వివరించింది. పరీక్షలకు అవసరమైన అన్ని సదుపాయాలున్నా వాటిని ఎందుకు వినియోగించుకోవడం లేదో ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని విన్నవించింది. కరోనాపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తుంటే, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు కరోనా సోకాలని సీఎం కేసీఆర్ శాపాలు పెడుతున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వైద్యులకు సదుపాయాల కల్పన, ధాన్యం సేకరణ, వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఈ అంశాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంలో నాణ్యత లేదని, ధాన్యం కొనుగోళ్లలో వాడుతున్న పాత గోనె సంచులు ఫొటోలు, ధాన్యం కేంద్రాలు వసతుల లేమి అంశాలను ఫొటోలతో సహా చూపించారు. సన్నబియ్యం ఇవ్వాలి: పీసీసీ చీఫ్ ఉత్తమ్ గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలకు నెలకు రూ.5 వేలు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి అన్ని రాజకీయపక్షాలతో మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం రోజుకు ఎన్ని కరోనా పరీక్షలు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు చూపెట్టడం లేదని, మరణాలపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేవని ఆరోపించారు. చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంతమంది వలస కూలీలున్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని, వలస కూలీలు వెళ్ళి పోతే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని, ఈ దృష్ట్యా వలస కూలీలకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. నరేగాలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల ను బేషరుతుగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. -
కరోనా టెస్టుల్లో దూసుకుపోతున్న ఏపీ
సాక్షి, అమరావతి: గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన నిర్ధారణ టెస్ట్‌ల గణాంకాలు చూస్తే దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఏపీలో కరోనా టెస్ట్‌ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. మిలియన్‌కు 1771 చొప్పున వైద్య పరీక్షలు చేస్తున్నారు. మిలియన్ కు 1400 పరీక్షలతో తమిళనాడు రెండవ స్థానం ఉండగా.. మిలియన్‌కు 1200 పరీక్షలతో రాజస్థాన్ 3వస్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటివరకు 94వేల 558 పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (సమర్థవంతంగా టెలి మెడిసిన్) ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 1.48 శాతంగా ఉండగా.. కరోనా మరణాల రేటు 2.21 శాతంగా ఉంది. గత ఐదు రోజులుగా ఏపీలో కరోనా మరణాలు సంభవించలేదు.. కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు ఏపీలో 321 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 9 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉన్నాయి.. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరుల్లో కొత్త ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ వచ్చే నాటికి మన రాష్ట్రంలో కేవలం 90 టెస్టులు మాత్రమే చేసే సామర్థ్యమే ఉండగా.. ఇప్పుడు 7500 టెస్టులు చేసే స్థాయికి ఏపీ చేరింది. 240 ట్రూనాట్ మెషీన్ల ద్వారా టెస్టులు చేస్తున్నారు. మరో 100 మెషీన్లు కొనుగోలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు) -
కరోనా టెస్టులు పెద్ద ఎత్తున నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్/ ఖమ్మం: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలని, వైరస్ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అకాల వర్షాలు, పంటల కొనుగోళ్లు, ఇతర సమస్యలపై చర్చించేందుకు సీఎల్పీ సమావేశమైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిరలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొడెం వీరయ్యలతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న తీరు, అకాల వర్షాలు, యాసంగి పంటల కొనుగోళ్లపై చర్చించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్రం బాగా వెనుకబడిందని, ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్‌లలో ఎందుకు ఈ పరీక్షలు చేయడం లేదని సీఎల్పీ ప్రశ్నించింది. రూ.1,500 నగదు సాయం రాష్ట్రంలో ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కరోనా సాకుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పై కేసులు పెట్టడం సరైంది కాదని, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్యపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తి వేయాలని పేర్కొంది. పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించింది. ఇతర రాష్ట్రాల్లో ధాన్యానికి బోనస్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం తరుగు పేరుతో రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆక్షేపించింది. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని, డీజీపీని కలవాలని సీఎల్పీ నిర్ణయించింది. కష్ట కాలంలో ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, పేదలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క -
ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ అభివృద్ధి చేసిన కరోనా టెస్ట్ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆమోదం తెలిసింది. ఐఐటీలో కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా అతి చౌకగా పరీక్షలు చేయవచ్చని తెలిపింది. ఈ కిట్‌ను త్వరలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు తగిన భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. -
కరోనా వ్యాప్తిపై జల్లెడ
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ క్షేత్రస్థాయిలో ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శ్రీకారం చుడుతోంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 82 జిల్లాల్లో వ్యాధి ఉధృతి, జాడ తెలుసుకునేందుకు ‘ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు’నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు, ఓ మాదిరి కేసులు, ఒక్క కేసూ నమోదుకాని లేదా అతితక్కువ కేసులు నమోదైన జిల్లాలను ఎంపిక చేసింది. ఐసీఎంఆర్ ఎంపిక చేసిన వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో కామారెడ్డి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో ఐసీఎంఆర్ ఈ నమూనాలను సేకరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ పరీక్షలు చేపట్టనుంది. ఎంపిక చేసిన జిల్లాలే కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఈ పరీ„ýక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్రాలకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. వైరస్ సంక్రమణపై ఆరా... దేశంలో ఇప్పటివరకు దాదాపు 21 వేల మంది కరోనా బారినపడగా 650 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వైరస్ సోకిన బాధితుల్లో అధిక శాతం మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఉంటున్నారు. అయితే ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసుల్లో ఎలాంటి లక్షణాలు, కాంటాక్టులు లేకుండానే కొందరికి వైరస్ సంక్రమించినట్లు తేలింది. దీంతో ఈ వైరస్ ఎలా సంక్రమించిందనే విషయమై ఆరా తీసేందుకు ర్యాండమ్‌గా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. తద్వారా కరోనా సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) చెందిందా లేదా అనే విషయంపై అంచనాకు రావచ్చని భావిస్తోంది. అదే సమయంలో వైరస్ సోకిన వారిలోనూ నిరోధకశక్తి బాగా ఉన్న కొందరికి ఎలాంటి చికిత్స లేకుండానే వ్యాధి తగ్గినట్లు తేలిన నేపథ్యంలో అలాంటి వారిని కూడా ఈ నమూనా పరీక్షల ద్వారా గుర్తించే వీలు కలుగుతుంది. 400 మందికి పరీక్షలు.. ప్రతి జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 400 మందికి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఐసీఎంఆర్ ఇప్పటికే టెస్ట్ కిట్లను పంపింది. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాకు పది వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఐసీఎంఆర్ మార్గనిర్దేశంలో పనిచేసే ఈ బృందాలు 40 మంది చొప్పున నమూనా పరీక్షలు జరుపుతాయి. ఈ బృందాలను సమన్వయపరిచేందుకు ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమించారు. వైద్య పరీక్షల సమాచారాన్ని వెంటనే తమకు పంపాలని ఐసీఎంఆర్ ఆదేశించింది. వైద్య పరీక్షల నిర్వహణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమ నిష్పత్తి ఉండేలా చూడాలని నిర్దేశించింది. ఈ పరీక్షల అనంతరం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న తీరుపై స్పష్టత ఏర్పడుతుందని, అంతేగాకుండా లాక్డౌన్ ఎత్తివేత, సడలింపులపైనా ఒక అంచనాకు రాగలుగుతామని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
13 మంది తహసీల్దార్లకు కరోనా పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్: ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని 13 మంది తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఇటీవల అనంతపురం జిల్లాలో విధుల్లో ఉన్న ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని రెడ్జోన్ల పరిధిలో ఉన్న తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, నారాయణవనం, పలమనేరు తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. హాట్‌స్పాట్స్ జాబితాలో జిల్లా చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన హాట్‌స్పాట్ ప్రాంతాల జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించిన కేంద్రం ఓ జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ జాబితాలో చేర్చింది. తిరుపతి, రేణిగుంట, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కు వగా పాటిజివ్ కేసులు రావడంతో వీటిని రెడ్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రాకపోకలపై పూర్తిగా నిషేధం. జిల్లా హాట్‌స్పాట్‌గా గుర్తించడం వల్ల మొదటి దశ లాక్డౌన్ అమలుపై అన్ని నియమ నిబంధనలు, షరతులు అలాగే వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. పాటిజివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యశాఖ సమాయత్తం అవుతోంది. కేవలం నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు మాత్రమే వర్తిస్తుంది. నేటి నుంచి ట్రూనాట్లతో స్వాబ్స్ సేకరణ చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో గురువారం నుంచి ట్రూనాట్ మిషన్ల ద్వారా కరోనా స్వాబ్స్ సేకరణ ప్రారంభిస్తామని జిల్లా టీబీ కంట్రోలర్ రమేష్‌బాబు తెలిపారు. చిత్తూరులోని జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో 5, తిరుపతి రుయాలో 5, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో 3, పలమనేరులో 2 , మదనపల్లెలో 2 చొప్పున ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఫలితాలు గంటలోనే తెలుస్తాయన్నారు. పాజిటివ్ వస్తే తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపి మరోసారి పరీక్షిస్తామన్నారు. నెగటివ్ వస్తే ఆ ఫలితాన్ని తీసుకుంటామన్నారు. ఒక మిషన్ ద్వారా రోజుకు 20 మందిని పరీక్ష చేయవచ్చని వివరించారు. ట్రూనాట్ యంత్రాలను పరిశీలిస్తున్న రమేష్ బాబు మదనపల్లెలో కరోనా నిర్ధారణ పరీక్షలు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో గురువారం నుంచి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా ఆస్పత్రిని రమేష్‌బాబు పరిశీలించారు జిల్లా ఆస్పత్రిలో అమర్చిన ట్రూనాట్ యంత్రాలను తనిఖీచేసి వాటి పనితీరును పరిశీలించారు. -
కరోనా: 50 నిమిషాల్లోనే ఫలితాలు
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వైరస్ నిర్ధారణ శాంపిళ్లను వేగంగా పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ – 19 కేసులు పెరగకుండా ప్రాథమిక దశలోనే చెక్ పెట్టేందుకు ట్రూనాట్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఈ ఆధునిక పరికరాలతో జిల్లాలో పరీక్షలను వేగంగా నిర్వహించి కేసులను త్వరితగతిన గుర్తించే అవకాశం లభించింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది శాంపిళ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లా అధికారులు. ఇందులో భాగంగా మూడురోజుల్లో వందకుపైగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను చూపించారు. సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరులోనే నమోదైంది. అలాగే ఒక మృతి కూడా ఉంది. 50కి పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన శాంపిళ్లను తిరుపతి, పూణేకు పంపేవారు. అక్కడి నుంచి ఫలితాలు వచ్చేంత వరకు నిరీక్షించాలి్సన పరిస్థితులు ఉండేవి. ఫలితంగా వ్యాధి నిర్ధారణ జాప్యమయ్యేది. దీనికి చెక్ పెడుతూ ప్రభుత్వం ట్రూనాట్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచి్చంది. నెల్లూరులోనే ఎక్కు వ శాంపిళ్లను పరీక్షించి అందులో పాజిటివ్ వచ్చిన వాటిని మాత్రమే తిరుపతికి పంపి అక్కడ కూడా పాజిటివ్ వస్తే కరోనా కేసుగా నిర్ధారిస్తారు. ఇప్పటి వరకు 1,058 అనుమానితుల శాంపిళ్లను పరీక్షించగా, అందులో 56 మాత్రం పాజిటివ్‌గా నమోదయ్యాయి. జిల్లాకు 300 ట్రూనాట్ కిట్లు జిల్లాకు కోవిడ్ – 19 నిర్ధారణ (స్క్రీనింగ్ టెస్ట్) చేసే ట్రూనాట్ కిట్లను 300 వరకు పంపించారు. మూడు రోజులుగా 180 శాంపిళ్లు రాగా, అందులో 112 శాంపిళ్లను పరీక్షించగా ఐదుగురికి మాత్రమే పాజిటివ్‌గా వచ్చింది. వీటిని తిరుపతికి పంపించి అక్కడ మరోసారి టెస్ట్ చేసి ఆపై ఫైనల్ చేసి ప్రకటిస్తారు. నెగటివ్ వస్తే మాత్రం నెల్లూరులోనే ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ నగరంలోని టీబీ ఆస్పత్రి ల్యాబ్‌లోనే జరుగుతోంది. గతంలో ట్రూనాట్ కిట్ల ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేవారు. నెల్లూరులో 19 కిట్లు ఉండేవి. ఆయా కిట్ల ద్వారానే కరోనా టెస్ట్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అందులో సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష ఇలా.. ముందుగా కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లు (స్వాబ్ తీసుకోవడం) వైరల్ లైక్సెస్ మీడియాలో పెట్టి ల్యాబ్‌కు తీసుకొస్తారు. వాటిని ఓపెన్ చేశాక ట్రూనాట్ మిషన్‌లో పెట్టి ఆర్ఎన్ఏ వైరస్‌ను ఐసొలేట్ చేస్తారు. తర్వాత దాన్ని చిప్‌లో పెట్టి లూసిన్ తయారు చేసి వైరల్ లోడ్ చేస్తారు. అందులో వైరస్ ఉందా.. ఒకవేళ ఉంటే అది ఏ స్థాయిలో ఉందో పరిశీలిస్తారు. పాజిటివ్ వస్తే ఆ శాంపిల్‌ను తిరుపతికి పంపించి స్విమ్స్‌లో పరీక్షిస్తారు. బీఎస్ఎల్ సేఫ్టీ ఉన్న చోటే పరీక్షలు నగరంలోని టీబీ కల్చర్ సెన్సివియట్ ల్యాబ్ (బయో సేఫ్టీ టూ) క్యాబిన్ ఉంటుంది. ఇక్కడ బీఎస్ఎల్ సేఫ్టీ లెవల్ ఉంటాయి. 112 శాంపిళ్లను పరీక్షించాం కరోనా అనుమానితుల నుంచి 180 శాంపిళ్లు వ చ్చాయి. ఇందులో 112 శాంపిళ్లను పరీక్షించాం. వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. వీటిని తిరుపతికి పంపాం. ప్రభుత్వం ట్రూనాట్ కిట్లను 300 వరకు పంపించింది. వీటి ద్వారా నిత్యం వందల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. – డాక్టర్ ప్రసాద్‌రావు, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి 50 నిమిషాల్లోనే ఫలితాలు నెల్లూరు(అర్బన్): జిల్లాకు ట్రూనాట్ ల్యాబ్ పరికరాలు రావడంతో ఇక ఇక్కడే పరీక్షలు జరిగి ఫలితాలు 50 నిమిషాల్లో వెల్లడి కానున్నాయి. ర్యాపిడ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను తిరిగి తిరుపతి పంపి ఆర్టీపీసీఆర్ పద్ధతిలో పరీక్షిస్తారు. అనంతరం పాజిటివ్ వచ్చినట్లు ప్రకటిస్తారు. నెగటివ్ వస్తే మాత్రం నూరు శాతం కరోనా లేనట్లే లెక్క. ఈ పరికరాలను మరిన్ని ఏర్పాటుచేసి జిల్లాలోని పలు మండలాల్లో పరీక్షలు చేయనున్నారు. కొత్తగా శిక్షణ పొందడం, ప్రత్యేక పద్ధతిలో నమూనాలను సేకరించాల్సి వస్తుండటంతో ఒక వ్యక్తి రోజుకు 40 మంది కన్నా అదనంగా శాంపిళ్లు సేకరించలేరు. దీంతో మరింత మందికి శిక్షణ ఇచ్చి, ల్యాబ్ టెక్నీషియన్లను భారీ స్థాయిలో భర్తీ చేసేందుకు జిల్లా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. వీరిని రెండు, మూడు రోజుల్లోనే విధుల్లోకి తీసుకోనున్నారు. వీరు విధుల్లోకి వస్తే శాంపిళ్లను పెద్ద మొత్తంలో సేకరించనున్నారు. పెద్దాస్పత్రి, నారాయణలో మాత్రమే కాకుండా మరో 5 సీహెచ్‌సీల్లో పరీక్షలు చేయనున్నారు. -
కరోనాకు ఆరోగ్యబీమా వర్తిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వైద్య పరీక్షలు ఉచితంగా అందించే అంశంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలకు అనుసరిస్తున్న విధానాన్ని తెలపాలని కోరింది. కరోనా వైద్యానికి బీమా అమలుకు ఐఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసిందో లేదో స్పష్టత ఇవ్వాలని కూడా కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నివారణ వైద్యం ఉచితంగా అందజేయాలంటూ న్యాయవాది పి.తిరుమలరావు రాసిన లేఖను హై కోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి గురువా రం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందజేయాలని కోరారు. వాదనల అనంత రం ధర్మాసనం పై విధంగా ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. -
‘కరోనా చర్యలపై కేంద్రమంత్రి అభినందించారు’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ (కోవిడ్ 19)ను నియంత్రించే చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పడిన ఐదు కమిటీల విధివిధానాలపై చర్చించామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా మన దేశంలో విమానయానం చేసే వారికి కూడా ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్ 95 మాస్కుల కొరత ఉందని, ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే వారికి ఈ మాస్క్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని మంత్రి ఈటల చెప్పారు. ఆ వివరాలను వెల్లడించారు. ‘తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలన్నిటినీ పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గాంధీలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌కు అనుగుణంగా మరొక ల్యాబ్ ఇవ్వాలని కోరాం. సోషల్ మీడియాలో బాద్యతా రహితంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు హాజరు కావొచ్చు. మాస్కుల లభ్యతపై కమిటీ వేశాం. ఎక్కువ ధరలకు మాస్కులు అమ్ముతున్న దుకాణాదారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇవాళ రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డు సందర్శిస్తాం. ఇటలీ నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తితో పాటు నిన్న ఖమ్మం నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు టెస్టులు చేశాం. ఆ రిపోర్టులు రేపు వస్తాయి’అని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
రేపటి నుంచి ఇక్కడే కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్/తాండూరు: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను సోమవారం నుంచి హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కిట్లు పంపించిందని, ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. వైరస్‌కు సంబంధించిన అనుమానాల నివృత్తి కోసం 24 గంటల కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ఏవైనా సందేహాలుంటే 040–24651119కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. శనివారం మరో ముగ్గురు కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని, దీంతో ఇప్పటివరకు ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 18కు చేరిందని వెల్లడించారు. వీరిలో 11 మందికి కరోనా వైరస్ లేదని పరీక్షల్లో నిర్ధారణ అయిందని, మరో 7 మందికి సంబంధించిన ఫలి తాలు రావాల్సి ఉందన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరల్ వ్యాధులు సోకినప్పుడు ఉపయోగించే మందును అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం కిట్స్ పంపించిందని, వారి సూచన మేరకు శాంపిల్ టెస్ట్ (ట్రయల్) నిర్వహించామని తెలిపారు. సోమవారం నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. తాండూరులో కరోనా కలకలం తాండూరు వాసికి కరోనా వైరస్ సోకిందన్న వార్త శనివారం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఓ మహిళ చైనా నుంచి భారత్‌కు తిరిగి వస్తుండగా శంషాబాద్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని ప్రచారం సాగుతోంది. ఆ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించగా, తనకు ఎలాంటి వైరస్ సోకలేదంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని పుకారు షికారు చేస్తోంది. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన ఆ మహిళ ఎవరు? తాండూరులో ఎక్కడ ఉంటారు? అనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోర గా.. తాండూరుకు చెందిన ఓ మహిళ చైనా నుంచి తిరిగి వచ్చిందనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై గాంధీ ఆస్పత్రి నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. -
ఇక ‘గాంధీ’లోనే కరోనా నిర్ధారణ
గాంధీ ఆస్పత్రి/నల్లకుంట: కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ ట్రయల్ రన్ పరీక్షలు గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్ నుంచి వ్యాధి నిర్ధారణకు అవసరమైన రీఏజెంట్స్ (ద్రావకాలు)ను హైదరాబాద్‌కు తెప్పించింది. గాంధీ ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగమణి నేతృత్వంలోని వైద్య బృందం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్వీప్మెంట్ ధరించి ట్రయల్ రన్లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించింది. గాంధీలో వచ్చిన రిపోర్టులను, పుణే వైరాలజీ ల్యాబ్ జారీ చేసిన రిపోర్టులతో సరి చూసి, రిపోర్టుల జారీలో ఎలాంటి తేడాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పూర్తిస్థాయిలో నిర్ధారణ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు. మరో 8 అనుమానిత కేసులు.. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతూ తాజాగా గాంధీ ఆస్పత్రిలో నలుగురు, ఫీవర్ ఆస్పత్రిలో మరో నలుగురు బాధితులు చేరారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఇటీవలే వీరంతా చైనా నుంచి నగరానికి చేరుకున్నారు. వీరిలో 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పంపారు. రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు 16 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి, నిర్ధారణ పరీక్షలు చేయించగా, వీరిలో 9 మందికి నెగిటివ్ వచి్చంది. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కాదు.. స్వైన్‌ఫ్లూ.. కరోనా అనుమానంతో 4 రోజుల క్రితం ఫీవర్‌లో చేరి, గురువారం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయిన గోదావరిఖనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన భర్త(31), భార్య(25), కుమార్తె(5)ల్లో భర్త సహా కుమార్తెకు స్వైన్ ఫూగా నిర్ధారణ అయింది. భార్య రిపోర్టు నెగిటీవ్ వచి్చంది. దీంతో వైద్యులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సిందిగా సూచించారు. అమాంతం పెరిగిన మాస్‌్కల ధరలు కరోనా, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతకమైన వైరల్ ఫీవర్లకు నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది, రోగులు, రోగి సహాయకులు భయాందోళనకు గురై తప్పనిసరిగా సాధారణ మాస్్కలతోపాటు ఎన్90 మాస్క్‌లను వినియోగిస్తున్నారు. దీంతో మాస్క్‌ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కరోనాపై పుకార్లు నమ్మవద్దు: ఈటల సుల్తాన్‌బజార్: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. చైనా నుంచి భారత్‌కు వచి్చన 12 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించామని తెలిపారు. అందులో 9 మందికి వైరస్ లేదని నిర్ధారణ అయిందన్నారు. మిగత వారిని వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు పట్టించుకోవద్దని తెలిపారు. వెళ్లిపోయిన కరోనా అనుమానితులు చైనా నుంచి ఇటీవలే నగరానికి చేరుకుని జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న (25), (28), (30), (31) వయసున్న బాధితులను ఫీవర్ ఆస్పత్రి వైద్యులు ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. వీరిలో ముగ్గురు నగరానికి చెందిన వారు కాగా, మరొకరు తాండూరుకు చెందిన యువతిగా తెలిసింది. గురువారం చేరిన ఓ వ్యక్తితోపాటు, శుక్రవారం చేరిన నలుగురిలో ఇద్దరు ఇక్కడి వార్డులో ఉండలేమని చెప్పి సాయంత్రం డిశ్చార్జ్ చేసుకుని, ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. రేబిస్వార్డు పక్కనే ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే రోగుల విముఖతకు కారణమని తెలిసింది. కాగా ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో రెండు అనుమానిత కరోనా కేసులు ఉన్నాయని, వీరి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనాపై అప్రమత్తంగా ఉన్నామని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.శ్రవణ్‌కుమార్ తెలిపారు. కరోనా నోడల్ ఆఫీసర్‌గా ఆర్ఎంవో ప్రభాకర్‌రావును నియమించినట్లు తెలిపారు. -
రూ.50 కే 15 రకాల వైద్య పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్త్‌కియోస్క్ లు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరం గా ఉన్నాయి. కేవలం రూ.50 కే 15 రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకొనే అవకాశం లభించ డంతో ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని అందుబాటులో ఉంచారు. రక్తపోటు, షుగర్.బరువు, బోన్‌మారో, శరీరంలో కొలెస్ట్రాల్, ప్రొటీన్ స్థాయి తదితర 15 రకాల పరీక్షలపైన ఒక అవగాహన లభిస్తుంది. ముఖ్యంగా వేల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. నిద్రలేమి, అలసట తదితర సమస్యలతో బాధపడేవారు ప్రయాణ సమయంలో తమ ఆరోగ్యస్థితిని తెలుసుకొనేందుకు ఈ కియోస్క్‌లు దోహదం చేస్తాయి. ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి 1.95 లక్షల మంది, కాచిగూడ నుంచి లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రూ. వందల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలను కేవలం రూ.50 లకే అందజేస్తుండటంతో ప్రయాణికులు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ప్రయాణికులకు తమ ఆరోగ్యం పట్ల ఒక ప్రాథమిక అవగాహనను కల్పిస్తుంది. -
దోచేందుకే పరీక్ష
మహేంద్ర కుమార్తెకు జ్వరంగా ఉండడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతికి డెంగీ సోకినట్లు అనుమానంగా ఉందని వైద్యులు రాసిచ్చిన పరీక్షలకు రూ.6వేలు ఖర్చు చేశాడు. అయినా సరే ఏ జ్వరం అనే దానిపై నివేదికల్లో స్పష్టత లేదు. మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ రూ.4వేలు ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గకపోవడంతో నెల్లూరులోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా రూ.800 ఖర్చుతో వైరల్ జ్వరం వచ్చినట్లు తేల్చారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి సైతం కుదుటపడింది.’’ చిత్తూరు అర్బన్ : ఇది మహేంద్ర ఒక్కడి సమస్యే కాదు జిల్లాలోని చాలామంది తల్లిదండ్రుల ఆవేదన. ఇటీవల జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో నివాసాల మధ్య నీటి నిల్వ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దోమల వ్యాప్తి పెరిగింది. ఇదే అదునుగా జ్వరమొచ్చి రక్తపరీక్షల్లో ప్లేట్లెట్లు కాస్త తగ్గినా కొందరు వైద్యులు డెంగీని బూచిగా చూపుతూ బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. డెంగీ జ్వరాలపై ప్రజలకు కనీస అవగాహన ఉంటే తప్ప ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేటట్లు కనిపిం చడం లేదు. డెంగీ వ్యాప్తి ఇలా.. డెంగీ జ్వరం ఎడిస్ ఈజిప్టి (టైగర్ దోమ) దోమవల్ల వ్యాప్తి చెందుతుంది. ఆర్బో అనే వైరస్ ఎడిసన్ దోమలోకి ప్రవేశించి అది మనిషిని కుట్టడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశి స్తుంది. దోమ కుట్టిన ఐదు రోజులుతర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమలు ఇళ్లల్లోని మంచినీళ్లు, పూలకుండీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, నిల్వ ఉన్న వర్షపు నీళ్లల్లో వృద్ధి చెందుతుంటాయి. కేవలం ఇది పగటి పూట కుట్టడం ద్వారానే డెంగీ వ్యాప్తి చెందుతుంది. నిర్ధారణ పరీక్షలు మ్యాక్ ఎలీసా పరీక్ష తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో మ్యాక్ ఎలీసా ద్వారా డెంగీ నిర్థారణ పరీక్ష ఉచితంగా చేస్తారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి రక్తనమూనా సేకరిస్తారు. రక్తంలోని సీరంకు ఐజీజీ, ఐజీఎం పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి 8 గంటల సమయం పడుతుంది. ఇందులో పాజిటివ్ వస్తే డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్థారిస్తారు. డెంగీ జ్వరం నుంచి కోలుకున్న ఆరునెలల వరకు మ్యాక్ ఎలిసా పరీక్ష ఎప్పుడు నిర్వహించినా పాజిటివ్ వస్తుంది. అంతమాత్రాన డెంగీ జ్వరం ఆరునెలలుగా ఉందని అర్థం కాదు. ఈ పరీక్షలకు కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్డీటీ పరీక్ష ర్యాపిడ్ డయోగ్నస్టిక్ టెస్ట్ (ఆర్డీటీ) ద్వారా ఇటీవల డెంగీ జ్వరాలను నిర్థారణ చేయడం చాలా ల్యాబ్‌లకు అలవాటైపోయింది. ఈ పరీక్ష ద్వారా రక్త నమూనా సేకరించి ఐదు రోజుల్లోపు జ్వరంతో బాధపడుతుంటే ఎన్ఎస్–1 పరీక్ష చేస్తారు. ఐదు రోజులకు పైబడి జ్వరం వస్తూనే ఉంటే ఐజీజీ, ఐజీఎం పరీక్షలు చేస్తారు. ఇది అరగంటలో పూర్తయిపోతుంది. అయితే డెంగీ నిర్థారణకు ఇది సరైన పరీక్ష కాదు. డెంగీతో పాటు ఇతర వైరల్ జ్వరాలు వస్తే కూడా ఈ పరీక్షలో పాజిటివ్ వస్తుంది. ఈ పరీక్ష చేయడానికి రూ.300 పైన చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేటు వైద్యులు రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. ప్లేట్లెట్ల పరీక్ష సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని ప్లేట్లెట్లు సంఖ్య 2లక్షల వరకు ఉంటుంది. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్యను తెలిపే పరీక్షకు రూ.100 – 200 చెల్లిస్తే సరిపోతుంది. గంటలో ఫలితాన్ని ఇచ్చేస్తారు. పౌష్టికాహారం, వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే ప్లేట్లెట్లు పెరుగుతాయి. ఒక్కోసారి ప్లేట్లెట్లు 10వేలకు కూడా పడిపోతాయి. అంతమాత్రాన కంగారు పడాల్సినవసరం లేదు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో రోగికి నేరుగా ప్లేట్లెట్లనే ఎక్కించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో ప్లేట్లెట్లు పడిపోయిన వ్యక్తికి 1.40లక్షల వరకు ప్లేట్లెట్లను పునరుత్పత్తి చేసే యంత్రాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారంటే ♦ ప్లేట్లెట్లు తగ్గినా, ఆర్డీడీ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా డెంగీ వచ్చినట్లు కాదు. ♦ కొందరు ల్యాబ్ నిర్వాహకులు, మరికొందరు ప్రైవేటు వైద్యులు డెంగీపై కంగారు పెట్టేస్తుంటారు. అలాంటి వాటికి భయపడొద్దు. ♦ ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక, సామాజిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో అనుభవమున్న వైద్యులున్నారు. విడవని జ్వరంతో బాధపడుతున్న వారిని అక్కడికి తీసుకెళ్తే రోగికి ఉన్న లక్షణాల ఆధారంగానే డెంగీ ఉందా, లేదా అని చెప్పేస్తారు. ♦ డెంగీ నిర్ధారణ కోసం మ్యాక్ ఎలీసా పరీక్షలకు రక్తనమూనా సేకరించి తిరుపతికి పంపిస్తారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత డెంగీ ఉంటే చికిత్స ప్రారంభిస్తారు. ఇవన్నీ ఉచితంగా చేయాలి. ఇక డెంగీ వైరస్ ద్వారా వచ్చే జ్వరానికి పారాసిట్మాల్ మాత్ర వేస్తేనే క్రమంగా తగ్గిపోతుంది. బొప్పాయి, దానిమ్మ పండ్లను బాగా తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ప్లేట్లెట్లు కూడా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.– డాక్టర్ పి.సరళమ్మ, జిల్లా ప్రభుత్వవైద్యశాలల సమన్వయాధికారి -
డాడీ కావాలంటే... ఇగో వద్దు!
పిల్లలు పుట్టలేదంటే మగవాళ్లు అదేదో భార్యకు ఉండే సమస్య అనుకుంటారు.భార్యకు పరీక్షలు చేయించాలంటే అది చాలా ఖర్చుతో కూడిన పని. అదే మగాడి ప్రాథమిక పరీక్షలు ?రూ. 500/–లకు మించవు. అలాంటప్పుడు ‘ఇగో’ మాని ‘డాడీ’ అయితే..హ్యాపీ కదా!...చాలా చాలా హ్యాపీ కదా!! సంతానలేమికి కారణాలు మహిళల్లో ఎన్ని ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయి. నిజంగా చెప్పుకోవాలంటే సంతానలేమి అనే సమస్యలో తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. పురుషుల్లో కారణాలు కనుగొనడం చాలా సులువు. అది తక్కువ ఖర్చుతోనే జరిగిపోతుంది. మహిళల్లో సమస్యల కోసం మొదటే వెళ్తే, వాటికి సంబంధించిన పరీక్షల ఖర్చులు పురుషుల పరీక్షలతో పోలిస్తే చాలా ఎక్కువే. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో ఏమీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం వృథా అవుతాయి. అందుకే తొలుత పురుషులు పరీక్ష చేయించుకోవడం మేలు. కారణాలను కనుగొనడం యాండ్రాలజిస్ట్ల పని పురుషుల్లోని లైంగికతకు సంబంధించిన అంశాలనూ, సంతానలేమికి గల కారణాలను పరిష్కరించే వైద్య విభాగానికి యాండ్రాలజీ అని పేరు. మొదట ఈ పేరును దుర్వినియోగం చేస్తూ చాలామంది నకిలీ డాక్టర్లే సమాజంలో చెలామణీ అవుతున్నారు. అందుకే ముందుగా క్వాలిఫైడ్ యాండ్రాలజిస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక యాండ్రాలజిస్ట్ అని పిలిచే ఆ డాక్టర్ కూడా తన రోగిని భయపెట్టకుండా, ఆందోళనకు గురిచేయకుండా సాంత్వన పరుస్తూ చికిత్స చేస్తారు. ఏ పరీక్షలూ చేయకుండానే ‘మీలో ఏదో లోపం ఉందం’టూ ఒక డాక్టర్ చెబితే దాన్ని నమ్మడం అంత సబబు కాదు. ఆందోళన చెందకుండా రెండో ఒపీనియన్‌కు మరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. మాటల తర్వాతి దశ... భౌతిక పరీక్ష పురుషులతో మాట్లాడటం ముగిశాక తర్వాతి దశ... ఫిజికల్ ఎగ్జామినేషన్ అని పిలిచే భౌతిక అంశాల పరీక్షలు. ఇందులో భాగంగా పేషెంట్‌లోని సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ సరిగానే ఉన్నాయా అని చూడటం. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే... అతడిలో మీసాలు గడ్డాలు బాగానే పెరిగి ఉన్నాయా, అతడికి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వెంట్రుకలు బాగానే వచ్చాయా, పురుషాంగం పరిమాణం ఉండాల్సినంతగా ఉందా, వృషణాల సైజ్ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాకే ఆ తర్వాత పరీక్షల దశకు వెళ్లాలి. కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్స్తోనే కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వృషణాల సైజు చాలా చిన్నగా ఉన్నప్పుడూ, వ్యాస్ సరిగా లేకపోయినా, పెద్ద పెద్ద పరీక్షలు చేయించినా లాభమే ఉండదు. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే... అప్పుడు కేవలం 200 నుంచి 500 రూపాయలు మాత్రమే ఉండే మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. ఇప్పుడు చేయించాల్సింది వీర్యపరీక్ష... వీర్యపరీక్షలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు తెలుస్తాయి. ఈ వీర్యపరీక్ష చేయించడానికి ముందుగా కనీసం మూడు రోజుల పాటు సెక్స్ లేదా హస్తప్రయోగం చేయకూడదు. ఆ పరీక్ష చేసే ల్యాబ్ టెక్నీషియన్ కూడ మంచి తర్ఫీదు పొంది ఉండాలి. ఒక్కోసారి ఒక వీర్యపరీక్షకూ మరో వీర్యపరీక్షకూ కూడా పొంతన ఉండకపోవచ్చు. అందుకే మొదటి పరీక్షలోనే వీర్యకణాల గురించి ఏదైనా ప్రతికూల ఫలితం కనిపిస్తే కుంగిపోకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోతుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు బాగా వస్తాయి. ఇలా ఉండటం మన మామూలు ఆరోగ్యానికీ అవసరం. మనం ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నప్పుడు వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చాలా బాగుంటాయి. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్ర ఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్ ఆ దంపతుల సెక్స్ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. తొలి అవగాహన దంపతులదే... సంతానలేమితో బాధపడే దంపతుల్లో చాలామందికి సెక్స్ పట్ల సరైన అవగాహన ఉండదు. సంతానం కోసం పరితపించే దంపతుల్లో చాలామందికి సంతానం కోసం సెక్స్‌లో ఎప్పుడు పాల్గొనాలో కూడా తెలియదంటే అది అతిశయోక్తి కాదు. సాధారణంగా మహిళకు రుతుస్రావం వచ్చిన 11వ రోజు నుంచి 18వ రోజు వరకు ఏదో ఒక రోజున అండం విడుదలయి ఉంటుంది. అందుకే ఆయా రోజుల్లో దంపతులు తప్పనిసరిగా కలవాలి. కలయిక ముగిసిన వెంటనే మహిళ పైకి లేవకూడదు, శుభ్రపరచుకోకూడదు. మూత్రవిసర్జన చేయకూడదు. శుక్రకణాలతో కూడిన వీర్యం యోనిలోకి పూర్తిగా వెళ్లేలా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మహిళల్లో అర్జెంటుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చేలాంటి మూత్రసమస్య ఏదైనా ఉంటే అలాంటి మహిళలు సెక్స్‌కు ముందే మూత్రవిసర్జనకు వెళ్లిరావడం మంచిది. సెక్స్ అయ్యాక వీర్యం వెంటనే బయటకు రాకుండా ఉండేందుకు గాను మహిళలు తమ ఎడమవైపునకు లేదా కుడివైపునకు ఒరిగిపోయి పూర్తిగా ముడుచుకుపోయినట్లుగా కాసేపు పడుకొని ఉండటం మంచిది. అది శుక్రకణాలన్నీ బయటకు రాకుండా లోపలివైపునకు వెళ్లేందుకు దోహదపడుతుంది. పురుషుడికి స్ఖలనం కాగానే... వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తుందని అపోహ పడే దంపతులూ చాలామందే ఉంటారు. నిజానికి వీర్యానికి సంబంధించి ఎంతో కొంత ద్రవం బయటకు వస్తుంది. కానీ వీర్యంలో ఉండే ద్రవమంతా వీర్యకణాలు కాదు. ఇంత ద్రవరాశిలో మొత్తం వీర్యకణాల సంఖ్య దాదాపుగా 60 లక్షల నుంచి 1.20 కోట్ల వరకు ఉంటుంది. వీర్యం ద్రవం కాస్తంత బయటకు వచ్చినా దంపతులు ఆందోళన పడకూడదు. ఎందుకంటే... వీర్యం యోనిలోకి ప్రవేశించగానే... శుక్రకణాలన్నీ తమ ఇన్స్టింక్ట్ మేరకు అండంతో కలిసేందుకు ముందుకు వెళ్తూ ఉంటాయి. నిజానికి ఈ అంశాలన్నింటినీ యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్ దంపతులకు వివరిస్తూ వారిలో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన పెంచేలా కౌన్సెలింగ్ రూపంలో వారికి తెలియజేయాలి. అప్పుడు వారిలో ఉండే ఆందోళన చాలావరకు తగ్గుతుంది. తర్వాత చేయించాల్సినవి హార్మోన్ పరీక్షలు... వీర్యరాశిలో వీర్యకణాల సంఖ్య అంతా సక్రమంగా ఉండి, ఆ దంపతుల కలయికలు కూడా బాగానే ఉన్నప్పటికీ గర్భం రాకపోతే అప్పుడు తర్వాత చేయాల్సిన పరీక్షల గురించి ఆలోచించాలి. అప్పుడు వాటిలో మొదట చేయాల్సినవి హార్మోన్ పరీక్షలు. ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్ (ఇవి మహిళలకూ చేస్తారు) ఈ నాలుగు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఈ పరీక్షలు కూడా అంత ఖర్చుతో కూడినవేమీ కాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ముందుగా చెప్పినట్లుగా పురుషుల్లో తక్కువ పరీక్షలతో, తక్కువ ఖర్చుతోనే కారణాలేమిటో నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు. అందుకని పురుషులతోనే మొదట పరీక్షలు మొదలుపెట్టాలి. ఒకవేళ హార్మోన్ పరీక్షలు కూడా నార్మల్‌గా ఉంటే వీర్యకణాల సంఖ్య కూడా నార్మల్‌గా ఉంటే కొన్ని రోజులు విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి మళ్లీ వీర్యకణాల టెస్ట్ చేయించడం మంచిది. అప్పుడు దంపతులు ఆందోళన చెందకూడదు. కొన్నిసార్లు కలయిక సరిగా లేకపోవడం వల్ల గర్భధారణకు రెండుమూడేళ్లు ఆలస్యం కావచ్చు. ఇందుకు ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. ఎందుకంటే ప్లానింగ్ తర్వాత రెండుమూడేళ్ల సమయం అంత పెద్దదేమీ కాదు. వీర్యరాశిలో అసలు వీర్యకణాలే లేకపోతే... ఇక్కడ మనం ఒక విషయాన్ని విపులంగా తెలుసుకోవాలి. వీర్యం అన్నది వీర్యకణాలు జీవించి ఉంటూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక మీడియం. ఈ వీర్యాన్ని ప్రొస్టేట్ గ్రంథి తయారు చేస్తుంది. వీర్యకణాలు వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ ఉత్పత్తి అయిన ఆ కణాలు, వాస్ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యరాశి వరకు చేరి, అక్కడ ఈదుతూ ఉంటాయి. ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో వీర్యకణాలు అస్సలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. కచ్చితంగా ఇది క్లిష్టమైన సమస్య. ఎందుకంటే... కోటికణాలు ఉన్నచోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు కదా. కారణాలను కచ్చితంగా కనుగొంటే... ఈ సమస్యను కూడా అధిగమించడానికి ఆధునిక వైద్య శాస్త్రంలో మార్గాలున్నాయి. రోగికి వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు మొదటి నెల విటమిన్ మాత్రలు ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి పరీక్ష చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవనే రిపోర్ట్ వస్తే అప్పుడు టెస్టిక్యులార్ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందా లేదా అని ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇదొక ఆశారేఖ... వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్ కూడా కొందరిలో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్‌కు మేలు చేసేందుకు డాక్టర్లకు అవకాశం ఉంటుంది. నిజంగానే వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉంటే... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్‌ను) రిపేర్ చేసి వీర్యకణాలు మామూలుగా బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ. నూటిలో కేవలం 10 మందికి మాత్రమే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ చేయించుకోవడం వల్ల నష్టమైతే ఉండదు. ఇలాంటి సంక్లిష్టమైన పరీక్షలు యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్ల్లో బాగా నైపుణ్యం ఉన్నవారు చేస్తేనే సత్ఫలితాలు ఇస్తాయి. పేషెంట్‌కు డాక్టర్ చేసే పరీక్ష ఏమిటో, దాని పరిణామాలు ఏమిటో తెలుసుకోవల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇదంతా వృషణాల్లో వీర్యకణాల తయారీ ఉంటేనే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి. ఇది మరో ప్రత్యామ్నాయం... ఒకవేళ వీర్యకణాల తయారీ బాగుంటే పేషెంట్‌కు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదేమిటంటే... కొన్ని వీర్యకణాలను సేకరించి, వాటిని ల్యాబ్‌లోని ఫిజ్‌లో (క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగించవచ్చు. గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో యూరాలజిస్ట్ సహాయంతో వృషణాల నుంచి కనీసం 100 వీర్యకణాలను సేకరించి, కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని, టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వెళ్లడం అనేది కూడా మరో మంచి ప్రత్యామ్నాయం. అయితే ఇందులో కూడా 10% – 20% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. అందుకని పేషెంట్ గానీ, డాక్టర్‌గానీ వీర్యంలో వీర్యకణాలు లేనప్పుడు కౌన్సెలింగ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. నాళాన్ని (వాస్‌ను) రిపేర్ చేసే సర్జరీకి దాదాపు లక్షరూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇది గనక విజయవంతం అయితే ఒకే బిడ్డ కాకుండా, ఆ తర్వాత బిడ్డలు నార్మల్‌గానే పుట్టే అవకాశం ఉంది. కానీ సక్సెస్ 10% – 20% అని మాత్రమే పేషెంట్ గుర్తెరగాలి. అలాగే టెస్ట్‌ట్యూబ్ బేబీలో 30% వరకు సక్సెస్ ఉన్నప్పటికీ ప్రతిసారీ దాదాపు లక్ష వరకు ఖర్చవుతుంది. కాబట్టి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పేషెంట్, డాక్టర్ల మధ్య పరస్పర చర్చలు, నమ్మకం, ప్రక్రియల పట్ల అవగాహన చాలా ముఖ్యం. ఇక టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వస్తే కేవలం కొన్ని సెంటర్స్ మాత్రమే చేస్తాయి. ఇదొక టీమ్‌వర్క్. ఇందులో యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ మాత్రమే కాకుండా అత్యాధునికమైన ఎక్విప్మెంట్కు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకని సంతానం లేని దంపతులు అందరూ ఇలాంటి క్లిష్టమైన పద్ధతులను ఎంచుకునే ముందు రెండుమూడేళ్లు మంచి ఆహారం తీసుకుంటూ, రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొంటూ, పిల్లల కోసం కాకుండా, వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిరాశపడకండి... ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండండి. పిల్లలు వారంతట వారే మీ జీవితంలోకి వస్తారు. ఒకవేళ వీర్యకణాల సంఖ్య తగ్గితే... ఒకవేళ వీర్యరాశిలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్‌గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ అనే స్కానింగ్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం నొప్పి లేని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్ అనే సమస్య ఉందా లేదా తెలుస్తాయి. వేరికోసిల్ అంటే... వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను చాలా సాధారణ శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాల్సి ఉంటుంది. వేరికోసిల్ ఆపరేషన్ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెరుగుతుంది. అయితే కొంతమందిలో మళ్లీ స్కాన్ చేసి చూపినప్పుడు కొంత వేరికోసిల్ సమస్య మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. మాట్లాడటమే మొదటి ఔషధం... పురుషుల్లో ఉండే సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి డాక్టర్ తొలుత చేయాల్సింది పేషెంట్‌తో మాట్లాడటమే. భౌతిక పరీక్షల కంటే ముందర ఇదెంతో ప్రధానం. ఎందుకంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక విజ్ఞానం కాస్త తక్కువే. పైగా సమస్యలూ, వాటి పరిష్కారాల కోసం ఓపెన్‌గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే పేషెంట్ పూర్తిగా మనసు విప్పి మాట్లాడేలా సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత ఆ దంపతుల సెక్స్ జీవితంపై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అవి... పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభనలు సరిగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక నెలలో మహిళకు రుతుస్రావం అయిన 11వ రోజు నుంచి 18వ రోజుల్లో తప్పకుండా కలుస్తూ... ఆ మిగతా రోజుల్లో కూడా క్రమం తప్పకుండా సెక్స్ చేయగలుగుతున్నారా అని కూడా తెలుసుకోవాలి. కలయిక బాగానే జరుగుతున్నప్పుడు పురుషుడి వీర్యం, మహిళ యోనిలోకి సక్రమంగానే వెళ్తోందా, లేదా అని కూడా అడిగి తెలుసుకోవాలి. పురుషుడు సెక్స్ సరిగా చేయలేకపోయినా, వీర్యం సక్రమంగా యోనిలోకి ప్రవేశించకపోయినా... మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్ మొదట తెలుసుకోవాలి. పేషెంట్ నమ్మకం చూరగొని ఐదు పది నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు తెలుస్తాయి. ఆ మాటల్లోనూ కొన్నిసార్లు కొన్ని కారణాలు తెలిసే అవకాశాలుంటాయి. -
క్యాన్సర్ కాటుకు కొత్తచికిత్సల దెబ్బ!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 90 లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. అయితే ఎన్నెన్నో పరిశోధనల కారణంగా క్రమంగా కొత్త చికిత్స విధానాలు, కొత్త ప్రక్రియలు, కొత్త మందులు, కొత్త పరీక్షలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా గతంలో 85% కేసులు ప్రాణాంతకంగా ఉండగా...ఇప్పుడు దాదాపు 85% క్యాన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. క్యాన్సర్ చికిత్స రంగంలో ఇంకా ఎన్నెన్నో కొత్త ఆశారేఖలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నేడు క్యాన్సర్ డే సందర్భంగా వాటిలో కొన్నింటి గురించిన వివరాలు... ప్రపంచంలో ఏదైనా కొత్త మందు లేదా చికిత్స విధానం రోగులకు అందుబాటులోకి రావాలంటే... రోగికి అది సురక్షితమైందా, ఏమేరకు లాంటి అనేక అంశాలను అనేక దశల్లో పరిశీలించి అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) అనే అత్యున్నత సంస్థ అనుమతులను ఇస్తుంది. గత ఏడాది అది 18 కొత్త రకాలైన క్యాన్సర్ చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చింది. క్యాన్సర్ ప్రక్రియల వల్ల 13 రకాల ఉపయోగాలను కొత్తగా కనుగొన్నట్లు ప్రపంచానికి వెల్లడించింది. వ్యక్తిగతమైన ఔషధాలు : ఒక రకం క్యాన్సర్‌కు ఒక మందు కనుక్కున్నారని అనుకుందాం. అప్పుడు ఆ రకం క్యాన్సర్ రోగులందరూ వాడాల్సిందే. అయితే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ఇచ్చే మందులైన ఇమ్యూనోథెరపీ అనే ప్రక్రియలూ, ఆరోగ్యకరమైన కణాలను వదిలేసి కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే పట్టి పట్టి చంపేసే టార్గెట్ థెరపీలలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ఫలితంగా ఊపిరితిత్తుల, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో మునుపెన్నడూ ఊహించనంత పెను మార్పులు వచ్చాయి. వాటి వల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. అందరూ క్యాన్సర్ రోగులకూ గంపగుత్తగా ఒకే మందు వాడటానికి బదులు... ఆ మందును మరింత ప్రభావపూర్వకంగా మార్చేందుకు వీలున్న మరో ప్రక్రియకు ఎఫ్‌డీఏ ఇటీవల అనుమతిని ఇచ్చింది. స్వభావంలోనూ, ఒక మందుకు స్పందించే విషయంలోనూ వ్యక్తికీ వ్యక్తికీ మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా అతడి జన్యుపరిస్థితిని, జన్యువుల తీరుతెన్నులను పరిశీలించి, ఒక అవయవంలో క్యాన్సర్ ఉన్న స్థానాన్ని బట్టి... ఇలాంటి కొన్ని అంశాల ఆధారంగా ఆ మందులలో మార్పులు చేసి, అవి ఆ వ్యక్తిలో మరింత ప్రభావపూర్వకంగా, బలంగా పనిచేసేలా చేస్తారు. ఇలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పనకే ఇటీవల ఎఫ్‌డీఏ అనుమతులను ఇచ్చింది. దీన్నే ‘పర్సనలైజ్డ్ థెరపీ’ అని చెప్పవచ్చు. ఇది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఒక చికిత్సాప్రక్రియ. టీఆర్కే ఫ్యూజన్ ప్రోటీన్ : క్యాన్సర్ చికిత్సల కోసం పరిశోధకులు ప్రతిరోజూ కొత్తదారులు వెదుతుకూనే ఉన్నారు. ఆ మార్గాల్లో పయనిస్తూ, కొత్త చికిత్సా ప్రక్రియలను కనుగొంటున్నారు. క్యాన్సర్ కూడా ఒక కణమే కదా. అన్ని కణాలకు ఉన్నట్లే దానికీ ఒక జన్యుపటలం ఉంటుంది. కాకపోతే ఆరోగ్యకరమైన కణంలా కాకుండా అది విభిన్నంగా, విపరీతంగా ప్రవర్తిస్తుంటుంది. ఈ కొత్తమార్గంలో చూసినప్పుడు దాని జన్యుపటలంలోని ప్రోటీన్ల గొలుసుల్లో(‘ప్రోటీన్ చైన్’లో) ఏదైనా మార్పులు చేయడం వల్ల అది తనకు తానుగా నశించిపోతుందేమోనంటూ పరిశోధకలు పరిశీలించారు. ఇది కూడా క్యాన్సర్ రోగులకు వ్యాధి పూర్తిగా తగ్గేలా చేసే ఒక ప్రక్రియ అనీ, త్వరలోనే అది అందుబాటులోకి వస్తే అది క్యాన్సర్ చికిత్సా రంగంలోనే ఓ పెద్ద మార్పు తీసుకొస్తుందనే ఆశలున్నాయి. హైపర్‌థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీని మరింత విస్తృత పరచడం : సాధారణంగానైతే కీమోథెరపీని నిర్దిష్టంగా ఒక చోట కాకుండా శరీరమంతటా ఆ మందు ప్రవహించేలా డాక్టర్లు ఇస్తుంటారు. అయితే శస్త్రచికిత్స ద్వారా కడుపును తెరచి, ఆ కడుపు కుహరంలో కీమోథెరపీకి ఉపయోగించే మందును ఉంచడం ద్వారా ఇచ్చే చికిత్సను ‘హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ (హెచ్ఐపీఈసీ) అని అంటారు. సాధారణ కీమోథెరపీలో మందు శరీరమంతటికీ విస్తరిస్తుంది కదా... కానీ ఈ హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో మందు కేవలం కడుపు ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ విశేషమైన వేడికి పుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను భస్మం చేస్తుంది. సాధారణ కణాలకు తనను తాను రిపేర్ చేసుకునే శక్తి ఉంటుంది. ఫలితంగా ఈ ప్రక్రియలో దెబ్బతిన్న సాధారణ ఆరోగ్యకరమైన కణాలు మళ్లీ మామూలు స్థితికి వస్తాయి. కానీ భస్మమైన క్యాన్సర్ కణాలు మళ్లీ పుట్టవు. అలాగే దెబ్బతిన్న క్యాన్సర్ కణాలకు తమను తాము రిపేర్ చేసుకునే శక్తి ఉండదు. ఈ అంశం ఆధారంగా ఈ ప్రత్యేకమైన థెరపీని కడుపునకు సంబంధించిన కొన్ని క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు. క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు. క్యాన్సర్ చికిత్సలో కృత్రిమ మేధస్సు సహాయం తీసుకోవడం : ఊహల్లోనూ మన మేధస్సుకు ఒక సరిహద్దు లేదు. అయిప్పటికీ ఎన్నో సంక్లిష్టమైన నిర్మాణాలతో ఉండే జన్యుపటలం లాంటి అంశాలను కేవలం మనిషి ఒక్కడే (అంటే మ్యాన్యువల్‌గా) విశ్లేషిస్తూ అర్థం చేసుకోవడంలో ఎంతో సమయం పట్టవచ్చు. ఆ సమయం ఆదా అయ్యే విధంగా మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సే క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్‌ను అర్థం చేసుకునేలా ప్రోగ్రామ్ చేస్తారు. దాని విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా ధ్వంసం చేయవచ్చో తేలిగ్గా తెలిసిపోతుంది. ఇలా క్యాన్సర్‌పై పోరాటంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సు కూడా సహాయం చేస్తోంది. ఇవీ... ఇటీవల క్యాన్సర్ రంగంలో చోటు చేసుకున్న, చేసుకోబోతున్న విప్లవాత్మకమైన మార్పులు. ఇవన్నీ త్వరలోనే దాదాపుగా ‘క్యాన్సర్ రహిత లోకం’ వైపునకు బాటలు పరుస్తాయేమోనని ఆశాభావంతో రాబోయే తరాలు ఎదురుచూస్తున్నాయి. సాధారణ మూత్రపరీక్షతోనే క్యాన్సర్‌ను తెలుసుకోవచ్చు లక్షణాలను బట్టి కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ పరీక్షలు చేయిస్తారు. అయితే అప్పటికే వ్యాధి ముదిరిపోయి, చికిత్సకు లొంగకుండా పోవడం అన్నది కొన్ని సందర్భాల్లో కనిపించే అవకాశం ఉండటం ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు కేవలం మూత్రపరీక్ష వంటి చిన్న పరీక్షతోనూ తెలుసుకునే సాంకేతికతను ‘ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్ కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సహాయంతో రొమ్ము క్యాన్సర్‌ను చాలా నిశితంగానూ, చాలా త్వరగానూ పట్టేయడానికి వీలవుతుంది. దాంతో చికిత్స ఆలస్యం కావడం అనే పరిస్థితి తప్పిపోయి, ఎంతో మంది మహిళల ప్రాణాలు నిలబడతాయి. ఇదీ క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రాబోతున్న మరో ఆశారేఖ. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా ఉంది. మూత్రం ద్వారా పట్టేసేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశోధకులు నిర్మించారు. దీనికి పెద్దగా ఖర్చుకూడా అవసరం లేదు. మూత్రాన్ని పరిశీలించి, రొమ్ముక్యాన్సర్ తాలూకు వాసన పట్టేస్తుందనే ఉద్దేశంతోనో ఏమో ఈ ఎలక్ట్రానిక్ పరికరానికి ‘ఈ–నోస్’ (ఎలక్ట్రానిక్ ముక్కు) అని పిలుస్తున్నారు. దాంతో మహిళారోగులు భవిష్యత్తులో మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... కేవలం కొద్ది ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. డాక్టర్ ఏవీఎస్ సురేశ్, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బడులు.. హైటెక్‌లోకి అడుగులు!
కృష్ణాజిల్లా, మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల పరీక్షలు ట్యాబ్‌ల ద్వారానే నిర్వహించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. భవిష్యత్‌లో పేపరు, పెన్ను అనేది ఉపయోగించకుండా, పరీక్షల కోసమని ట్యాబ్‌లనే ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రామీణ విద్య బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేస్తున్నప్పటకీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించటం లేదనే జాతీయస్థాయి విద్యారంగ నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో డిజిటల్ విధానం ద్వారానే విద్యా బోధన సాగాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇందుకనుగుణంగా మార్పులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే డిజిటల్, వర్చువల్ తరగతుల బోధన సాగుతుండగా, తాజాగా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ట్యాబ్‌ల ద్వారానే పరీక్షలు.. భవిష్యత్తులో విద్యార్థులు అన్ని రకాల పరీక్షలను ట్యాబ్‌ల ద్వారానే పూర్తి చేసేలా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని రకాల పోటీ పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సత్తా ఉన్నప్పటికీ వీటిని ఎదుర్కోలేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే వీటిపై అవగాహన ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీంతో సర్కారు బడుల్లో ప్రాథమిక పాఠశాలల స్థాయిలోనే ట్యాబ్‌ల వినియోగంపై విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నారు. 3, 4 తరగతుల విద్యార్థులపై ప్రయోగం ప్రాథమిక పాఠశాలల్లోని 4, 5 తరగతుల విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా పరీక్షలు రాసేందుకు తొలిప్రయోగం చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను ప్రస్తుతం ట్యాబ్‌ల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా తరగతుల పాఠ్యాంశాల్లోని అంశాలతో తయారు చేసిన ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లో సిద్ధం చేశారు. విద్యార్థికి ఒక ట్యాబ్ ఇచ్చి, ట్యాబ్ ద్వారానే పరీక్షను ఎదుర్కోవాలని సూచిస్తారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ట్యాబ్ ద్వారా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కో పేపరులో 40 ప్రశ్నలు ఉంటాయి. రెండు సబ్జెక్టులను 1.20 గంటల్లో పూర్తి చేయాలి. సమయం దాటితే ప్రశ్నాపత్రం స్క్రీన్‌పై కనిపించదు. ఎంత సమయం ఉందనేది విద్యార్థి తెలుసుకునేలా ట్యాబ్‌లో పొందుపరిచారు. జిల్లాలో 23 పాఠశాలలు ఎంపిక ట్యాబ్‌ల ద్వారా పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులను సన్నద్ధం చేసే క్రమంలో దీనిపై ఎలా ముందుకెళ్లాలనేది తెలుసుకునేందుకు జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ మండలాల్లోని 21 పాఠశాలలను ఎంపిక చేశారు. మచిలీపట్నం మండలంలో 9, గుడివాడలో 7, నూజివీడు మండలంలో 7 పాఠశాలల్లో ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి విజయంతానికి గాను 16 మంది సీఆర్పీలను ఎంపిక చేసి, వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రయోగానికి ప్రత్యేక యాప్ ట్యాబ్‌లపై పరీక్షల నిర్వహణకు విద్యార్థులకు అవగాహన కల్పించి, దీని అమల్లో సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ స్థాయిలో గల ఓ ఏజెన్సీకి అప్పగించారు. సెంటర్ ఫర్ స్వే్కర్ ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్) పేరుతో సదరు సంస్థ ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ప్రశ్నావళి నిక్షిప్తమై ఉన్న యాప్‌ను ట్యాబ్‌ల్లో సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు సలోమీ గుప్తా, దేవికా కపాడియా, నీల్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఇందుకు సంబం«ధించిన పనులు టెక్నీషియన్లు చేస్తున్నారు. ఈ వారంలోనే పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ట్యాబ్‌లపై ప్రయోగ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
లివర్ కౌన్సెలింగ్స్
నా వయసు 46 ఏళ్లు. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్ పూర్తిగా పాడైపోయిందని చెబుతున్నారు. దాంతో నేనూ, మా కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. లివర్ పూర్తిగాపాడైంది... పరిష్కారం చెప్పండి మన దేశంలో తీవ్ర ప్రాణాంతక జబ్బులలో లివర్ వ్యాధులు ముఖ్యమైనవి. లివర్ పాడవడానికి అనేక కారణాలున్నాయి. పెద్దవాళ్లలో (ముఖ్యంగా మగవాళ్లలో) విపరీతంగా తాగడం వల్ల త్వరగా లివర్ పాడైపోతోంది. అలాగే ఎక్కువ శాతం మంది హెపటైటిస్– బీ, హెపటైటిస్–సి వైరస్ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్ బ్లడ్ టెస్ట్స్ నిర్వహించి మీ లివర్ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి. ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ ప్రక్రియ అంటారు. ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్ ఆర్గాన్ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్ లభించే అవకాశం ఉంది. కెడావర్ ఆర్గాన్ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్ డోనార్’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్ స్పెషలిస్ట్‌ను కలవండి. నా వయసు 34 ఏళ్లు. మా అన్నయ్యకు కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదనీ, కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. రక్తసంబంధీకులలో ఎవరైనా కాలేయదానం చేయవచ్చని వివరించారు. నేను మా అన్నయ్యకు కాలేయం ఇవ్వాలని అనుకుంటున్నాను. డాక్టర్లు వివిధ పరీక్షలు చేశాక నేను దాతగా అన్నివిధాలా అర్హురాలినని చెప్పారు. మా అన్నయ్యకు కాలేయం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? నేను కాలేయ దానం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులుఉంటాయా? అన్ని రకాల పరీక్షలూ చేశాక, మీ అన్నయ్యకు మీరు కాలేయం ఇవ్వడానికి అన్నివిధాలా అర్హులని వైద్యులు నిర్ధారణ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేయాన్ని దానం చేయవచ్చు. మన దేహంలో కొంతభాగాన్ని తొలగించినా కూడా మళ్లీ యథారూపానికి వచ్చే స్వభావం కాలేయానికే ఉంది. మీ నుంచి 20–25 శాతం కాలేయాన్ని తొలగించి, దాన్ని మీ అన్నగారికి అమర్చుతారు. కాలేయ దానం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కాలేయానికి ఉన్న పునరుత్పత్తి శక్తి వల్ల దాతలోని కాలేయం కూడా మళ్లీ 6–8 వారాలలో యథాస్థితికి పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆటలూ ఆడవచ్చు. అందరిలాగే ఏవిధమైన ఇబందులూ లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ అన్నయ్యకు కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు మీరు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ శస్త్రచికిత్స చేయించాలి. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి అవి మీ అన్నయ్యకు మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కాలేయం చాలా కీలకమైన అవయవం. అది ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ మనం తిన్న ఆహారంలోని పదార్థాలను చిన్న పోషకాల్లోకి మార్చుతుంది. జీర్ణప్రక్రియలో భాగంగా పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డటానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. శరీరంలోకి చేరే విషాలను విరిచేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే చిన్న దెబ్బతగిలినా తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరు కాలేయాన్ని ఇవ్వడం ద్వారా మీ అన్నయకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు. కాబట్టి నిరభ్యంతరంగా కాలేయాన్ని ఇవ్వవచ్చు. ఫ్యాటీలివర్అంటున్నారు... సలహాఇవ్వండి నా వయసు 56 ఏళ్లు. శాకాహారిని. అయితే తరచూ మద్యం తీసుకుంటూ ఉంటాను. డయాబెటిస్ ఉంది. మందులు వాడుతున్నాను. ఇటీవల హాస్పిటల్‌కు వెళ్లి జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు ఫ్యాటీలివర్ ఉన్నట్లు డాక్టరు గుర్తించారు. ఫ్యాటీలివర్ అంటే ఏమిటి? దీనికి చికిత్స చెప్పండి. ఫ్యాటీలివర్ వ్యాధి అంటే కాలేయంలో మామూలుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా కొవ్వు చేరడం. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పదిశాతాన్ని మించినప్పుడు ఫ్యాటీలివర్ వ్యాధి వస్తుంది. ఈవ్యాధి కొంతమందిలో ఎందుకు వస్తుందో, మరికొంత మంది దీనికి నిరోధక శక్తి ఎందుకు కలిగి ఉంటారో తెలియదు. అయితే కొన్ని లక్షణాలు మాత్రం వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిగ్రస్తులంతా దాదాపు స్థూలకాయులే. ఊబకాయం కాలేయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వ్యాధిగ్రస్తులు చాలావరకు మధ్యవయస్కులు. రక్తంలో ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా కాలేయ వ్యాధి ఉన్న చాలామందిలో ఫ్యాటీలివర్ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఫ్యాటీ లివర్‌తో సహా చాలా కాలేయ వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ఆలస్యం చేయకుండా కాలేయ వ్యాధుల చికిత్సకు అవసరమైన ఆధునిక వసతులు, నిపుణులు ఉన్న ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అవసరమైన పరీక్షలు జరిపించి, వ్యాధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, తగు చికిత్స ప్రారంభించగలుగుతారు. మద్యం అలవాటు కాలేయ వ్యాధుల తీవ్రతను పెంచి పరిస్థితిని మరీ దిగజారుస్తుంది. మద్యం అలవాటు మానేయండి. శరీరం బరువు తగ్గించుకోండి. బరువు మూడు నుంచి ఐదు శాతం తగ్గినా కాలేయంలో కొవ్వు గణనీయంగా తగ్గిపోతుంది. ఫ్యాటీలివర్‌కు ఇతర వైద్యచికిత్సలతో పాటు ఆరోగ్యకరమైన జీవనవిధానం, క్రమం తప్పని ఏరోబిక్ వ్యాయామాలు, రెడ్‌మీట్ తినకుండా ఉండటం వంటి జీవనశైలిని సూచిస్తుంటాం. ఫ్యాటీ లివర్ ఉన్నవారు వారానికి ఐదురోజులైన రోజుకు అరగంట కంటే తగ్గకుండా వ్యాయామం చేయడం అవసరం. డాక్టర్ బాలచంద్రన్ మీనన్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
టెస్టుల్లో చోటు దక్కకపోవడం బాధించింది
ముంబై: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడం కాస్త బాధ కలిగించిందని భారత క్రికెటర్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. ‘ఈ విషయంలో నిరాశగానే ఉంది. అయినప్పటికీ ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగటమే నా లక్ష్యం. ప్రస్తుత సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల నుకుంటున్నా’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొన్న ధవన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని ధవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. టెస్టు సిరీస్‌లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే కచ్చితంగా ఆసీస్ గడ్డపై తొలి సిరీస్ విజయం నమోదు చేస్తుంది’ అని పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ‘ఇంగ్లండ్ పిచ్‌లపై నాకు మెరుగైన రికార్డే ఉంది. గత చాంపియన్స్ ట్రోఫీల్లో మంచి ప్రదర్శనే చేశా. ఒక్కసారి కుదురుకుంటే చాలు.. ఫలితం దానంతట అదే మన దారిలోకి వస్తుందనడాన్ని నమ్ముతా. కచ్చితంగా అదే జోరు కొనసాగించి ఈసారి ప్రపంచకప్‌తో తిరిగివస్తాం’ అని ధవన్ చెప్పుకొచ్చాడు. -
ఇండిపెండెంట్ డైరెక్టర్ల ఎంపికకు పరీక్ష
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్లు కాదలిచిన వారికి ఎంపిక పరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర కార్పొరేట్ శాఖ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. నిజానికి కంపెనీల చట్టం 2013లో ఉత్తమ పరిపాలనకు గాను కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో కార్పొరేట్ అవకతవకల నేపథ్యంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. ఇక కార్పొరేట్ వ్యవహారాల్లో ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకోవాలనుకుంటున్న తరుణంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర మరింత కీలకంగా మారింది. దేశంలో కార్పొరేట్ పాలనను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు పీపీ చౌదరి తెలిపారు. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్రను బలోపేతం చేయడం ఒక చర్యగా చెప్పారు. కంపెనీల బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ అయ్యే వారికి తగిన అర్హతలు ఉండాలన్నారు. కనీస అర్హతకు తోడు, ఒక సర్టిఫికేషన్ కోర్స్/ పరీక్ష అనేదానిని పరిశీలిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునే ముందు కంపెనీలను సంప్రదిస్తామన్నారు. అయితే, కొత్తగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవ్వాలనుకునే వారికే పరీక్ష నిర్వహణ ప్రతిపాదన అని, ప్రస్తుతమున్న వారికి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న వారికి అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక, ప్రభుత్వం తీసుకొచ్చే సవరణలతో, ఇండిపెండెంట్ డైరెక్టర్ల డేటా బ్యాంకును ఏర్పాటు చేయడంతోపాటు, నిర్వహణ బాధ్యతలను ఐఐసీఏ ఏజెన్సీ చూస్తుందని మంత్రి చెప్పారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లు కంపెనీల పాలన విధానాలను పర్యవేక్షిస్తూ, సలహాదారులుగా వ్యవహరిస్తుంటారు. -
ఆయుర్వేదంతో డెంగీకి చెక్
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధికి చెక్ పెట్టే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో డెంగీ నివారణ కోసం రూపొందించిన మొట్టమొదటిదిగా చెపుతున్న ఈ ఔషధం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఆయుష్, ఐసీఎంఆర్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేసే ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. కర్ణాటకలోని బెల్గామ్‌లో ఉన్న సీసీఆర్ఏఎస్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ఈ ఔషధం భద్రత, సామర్థ్యంపై ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డబుల్ బ్లైండ్ ప్లాస్బో అనే కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ విద్యా కేఎస్ ధిమాన్ తెలిపారు. మానవులపై పరిశోధనలు చేసే ఈ పద్ధతికి అంతర్జాతీయంగా ఆమోదం ఉందని చెప్పారు. ఆయుర్వేదంలో వినియోగిస్తున్న 7 మూలికలతో గత ఏడాది జూన్‌లో ఔషధాన్ని సిద్ధం చేశామని చెప్పారు. పైలట్ స్టడీలో 90 మంది రోగులకు ద్రవ రూపంలో ఔషధం ఇచ్చామని, ఇకపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌లో దీనిని ట్యాబ్లెట్ రూపంలో ఇస్తామని చెప్పారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ వల్ల తీవ్రమైన జ్వరం, ఒళ్లు నెప్పులు, తీవ్ర తలనొప్పి, వాంతులు, చర్మ సంబంధ సమస్యలు మొదలైనవి వస్తాయి. ఏటా 40 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ప్రస్తుతం డెంగీకు ఎటువంటి మందు లేదు. డెంగీ లక్షణాల ఆధారంగా ముందస్తు నివారణ చర్యలు మాత్రమే చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు.. ఆరోగ్య సంస్థలు దీనికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాయి. -
రాజేష్‌కు లైంగిక సామర్థ్య పరీక్షల నిర్వహణ
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. పెళ్లైన తొలిరాత్రి తనకు మగతనం లేదనే విషయాన్ని బయటపెట్టినందుకు భార్య శైలజను రాజేష్ పైశాచికంగా హింసించిన ఘటన ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేష్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని గంగాధరనెల్లూరు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది. రెండు రోజుల కిందట పోలీసులు రాజేష్‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి హైదరాబాదుకు తీసుకెళ్లారు. ఉస్మానియా వర్సిటీలో శుక్రవారం అతనికి శారీరక ప్రమాణాల పరీక్షలు జరిపిన అక్కడి ఫోరెన్సిక్ విభాగ వైద్య బృందం శనివారం లైంగిక పటుత్వ పరీక్షలు చేపట్టింది. ఫలితాలను పోలీసులు కోర్టుకు అందజేసి, తదుపరి కేసు దర్యాప్తునకు సిద్ధమవుతున్నారు. -
మూడు ఫార్మాట్లలో మార్పులు!
-
మూడు ఫార్మాట్లలో మార్పులు!
ఐసీసీ సీఈసీ మీటింగ్‌లో ప్రతిపాదన దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యా యి. టెస్టులు, వన్డేలు, టి20ల్లో మరింత పోటీతత్వాన్ని పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొన్ని విప్లవాత్మక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈమేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండేళ్ల పాటు జరిగే టెస్టు లీగ్, వన్డే ప్రపంచకప్ అర్హత కోసం మూడేళ్ల పాటు 13 జట్లతో కూడిన వన్డే లీగ్ నిర్వహణ, టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ప్రాంతీయ అర్హత మ్యాచ్‌లను జరపాలని నిర్ణయించారు. వీటిని ఐసీసీ బోర్డులో ఆమోదించాల్సి ఉంది. నేడు (శనివారం) ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉన్నా ఇందులో చర్చకు వచ్చే అవకాశాలు లేవు. ఏప్రిల్‌లో జరిగే మరో బోర్డు సమావేశంలో వీటిపై ఆమోద ముద్ర పడనుంది. ఇదే జరిగితే 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్లో సమూల మార్పులు ఉంటాయి. ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు సుదీర్ఘకాలంగా మ్యాచ్‌లు జరిగినట్టుగానే వన్డే ప్రపంచకప్ కోసం 13 జట్లు మూడేళ్ల పాటు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో పది శాశ్వత సభ్యదేశాలతో పాటు అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్, ప్రపంచ క్రికెట్ లీగ్ విజేత పాల్గొంటాయి. ఏడాదిలో కనీసం ఓ జట్టు 12 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. -
రేపు ఏపీపీఎస్సీ పరీక్షలు
హాజరుకానున్న 2264 మంది అభ్యర్థులు ఏర్పాట్లపై డీఆర్వో మల్లీశ్వరిదేవి సమీక్ష అనంతపురం సెంట్రల్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్స్ ఇంజనీర్స్ పోస్టులకు ఆదివారం (18న) నిర్వహిస్తున్న పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మల్లీశ్వరిదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,264 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు డీఆర్వో తెలిపారు. నగరంలో ఐదు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా పత్రాల బాక్సులు రవాణా కోసం ఇద్దరు తహశీల్దార్లను లైజనింగ్ అధికారులుగా, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 5 మంది తహశీల్దార్లను సహాయక సమన్వకర్తలుగా, ప్లెయింగ్‌స్క్వాడ్‌లుగా నియమించామని చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను పరీక్షా కేంద్రాల్లో తీసుకురాకూడదని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మాత్రమే కేంద్రాల్లో అనుమతిస్తారని, పరీక్షా సమయం ముగిసే వరకూ బయటకు అనుమతి లేదన్నారు. హాల్‌టికెట్లు పొరపాట్లు ఉంటే గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించి ఇన్విజలేటర్కు అందజేయాలని, లేనిచో అలాంటి అభ్యర్థిని పరీక్షకు అనుమతించబోమన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
ప్రతిభకు గీటురాళ్లు స్కాలర్షిప్ టెస్ట్‌లు
నేడు రెండు అర్హత పరీక్షలు ఎన్ఎంఎంఎస్కు 4,570, ఎన్టీఎస్కు 5,540 మంది ఎంపికయితే భవిష్యత్తు ఆనందమే రాయవరం : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారికి ఉపకార వేతనాలు అందించేందుకు నేషనల్ మీన్స కమ్ మెరిట్ సర్టిఫికెట్ (ఎన్ఎంఎంఎస్) పథకం ఏర్పాటు చేశారు. 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అర్హత పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు నేషనల్ టాలెంట్ సెర్చ్ (ఎన్టీఎస్) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలు ఈ నెల 6న జిల్లాలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పేద విద్యార్థులకు భరోసా కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా పేద విద్యార్థుల్లో ప్రతిభా వంతులను ప్రోత్సహించేందుకు నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ను 2008–09లో ప్రవేశపెట్టారు. ఇది పేద విద్యార్థులకు విద్యాపరంగా భరోసానిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యంలో స్కాలర్షిప్కు అర్హత పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.6 వేలు చొప్పున నాలుగేళ్ల పాటు విద్యార్థికి స్కాలర్షిప్ను నేరుగా వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తారు. పదో తరగతి పాసైన అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే స్కాలర్షిప్ కొనసాగింపు జరుగుతుంది. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ అర్హత పరీక్షకు ఏటా విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏటా జిల్లా నుంచి సుమారు 400 మంది ఈ స్కాలర్షిప్కు ఎంపికవుతున్నారు. ఎ¯ŒSటీఎస్ పరీక్ష ఉత్తీర్ణులైన వారు తిరిగి సెకండ్ లెవెల్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో కూడా ఉత్తీర్ణత సాధిస్తే వారికి ఇంటర్లో నెలకు రూ.1,250 చొప్పున, డిగ్రీ, పీజీ స్థాయిలో నెలకు రూ.2 వేలు వంతున స్కాలర్షిప్ అందజేస్తారు. పరీక్ష విధానమిలా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎ¯ŒSఎంఎంఎస్ పరీక్షకు అర్హత పొందుతారు. ఏడో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా పరీక్షకు అర్హత కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 7వ తరగతిలో 50 శాతం, మిగిలిన విద్యార్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. ఆబ్జెక్టివ్ టైపు విధానంలో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. జిల్లా ప్రాతిపదికగా స్కాలర్షిప్కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితా ఆధారంగా వారి అకౌంట్లకు నేరుగా స్కాలర్ షిప్ అందజేస్తారు. ఈ ఏడాది ఎ¯ŒSఎంఎంఎస్ పరీక్షకు 4,570 మంది, ఎ¯ŒSటీఎస్ పరీక్షకు 5,540 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓరియంటేష¯ŒS తరగతులు నిర్వహించాం పేద విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఎ¯ŒSఎంఎంఎస్, ఎస్టీఎస్ అర్హత పరీక్షలు ఉపయోగపడుతున్నాయి. ఏటా దరఖాస్తు చేసే వారి సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామం. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించేందుకు ప్రత్యేకించి ఉన్నత పాఠశాలల్లో ఓరియంటేష¯ŒS తరగతులు నిర్వహించాం. – ఆర్.నరసింహారావు, డీఈవో, కాకినాడ ఏర్పాట్లు పూర్తి చేశాం ఎ¯ŒSఎంఎంఎస్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ పరీక్షలు డివిజ¯ŒS కేంద్రాల్లో 23 చోట్ల, ఎ¯ŒSటీఎస్ పరీక్షకు కాకినాడ పట్టణంలో 20 కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం బాగా ప్రిపేరయ్యా.. ఎ¯ŒSఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు బాగా ప్రిపేరయ్యాను. తప్పనిసరిగా స్కాలర్షిప్ సాధిస్తాననే నమ్మకం ఉంది. ఉపాధ్యాయులు బాగా శిక్షణ ఇచ్చారు. – వి.లోహితప్రియ, 8వ తరగతి విద్యార్థిని, రాయవరం. -
కోరుకున్న లక్ష్యం దిశగా విరాట్ కోహ్లి!
డిసెంబర్ 2009లో టీమిండియా తొలిసారి టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. కొద్దికాలమే ఆ ర్యాంకు భారత్ నిలబెట్టుకుంది. ఇప్పుడు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో మన కుర్రాళ్లు బాగా ఆడుతుండటంతో టెస్టు క్రికెట్లో మళ్లీ ఆ కిరీటం టీమిండియాను ఊరిస్తోంది. నంబర్ ర్యాంకును దృష్టిలో పెట్టుకొని వెస్టిండీస్ జట్టుతో నాలుగో టెస్టుకు జట్టు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ట్రినిడాడ్‌లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులోనూ విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. 'టీమిండియా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆడుతోంది. నంబర్ ర్యాంకును సాధించడంపైనే మేం దృష్టి పెట్టాం. అదెంతో దూరంలో లేదు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పగ్గాలు టెస్టు కెప్టెన్ పగ్గాలు తీసుకున్నప్పుడు.. టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టాలని కోహ్లి భావించాడని, ఆ లక్ష్యం దిశగానే జట్టును విజయాలపథంలో నడిస్తున్నాడని రోహిత్ కొనియాడాడు. ప్రస్తుతం 112 పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కన్నా ఆరుపాయింట్లు వెనుకబడి ఉంది. అయితే, శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో వెనుకబడటంతో ఆ జట్టు నంబర్ వన్ స్థానం నుంచి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే కచ్చితంగా నంబర్ ర్యాంకును సొంతం చేసుకుంటుందని పరిశీలకులు చెప్తున్నారు. -
ప్రాణం మీదికి తెచ్చిన ఉద్యోగ ‘పరీక్ష’
• విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు • జారిపడిన అభ్యర్థి.. తీవ్ర గాయాలు జోగిపేట: సబ్‌స్టేషన్ ఆపరేటర్ల కోసం నిర్వహించిన పరీక్షలు ఓ నిరుద్యోగి ప్రాణాల మీదకు వచ్చారుు. నారాయణఖేడ్ ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లలో పనిచేసేందుకు సోమవారం అందోలు మండలం అల్మారుుపేట సబ్‌స్టేషన్ లో అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. దాదాపు 30 మందిలో నారాయణఖేడ్‌కి చెందిన పుండరీకం.. పరీక్షల్లో భాగంగా విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు పట్టుతప్పి కిందకు పడిపోయాడు. దీంతో నడుముకు తీవ్ర గాయాలయ్యారుు. బాధితుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుుతే, విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగిన వారినే సెలెక్ట్ చేయాలని ఎస్ఈ ఆదేశించారని జోగిపేట ట్రాన్ ్సకో డీఈ శ్రీనివాస్, ఏడీ నాగరాజు తెలిపారు. -
ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు
ఖమ్మం క్రైం: కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బుధవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈ పరీక్షలకు 17వ రోజయిన బుధవారం 1200మందికిగాను 947మంది హాజరయ్యారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఈవెంట్ల నిర్వహణ కొంత ఆలస్యమైంది. అభ్యర్థుల 800 మీటర్ల పరుగు పందెం రికార్డులను భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, డీఎస్పీ సాయిశ్రీ నమోదు చేశారు. మైదానంలో ఎస్పీ కలియతిరుగుతూ వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాంరెడ్డి, సురేందర్‌రావు, వీరేశ్వరారవు, సురేష్‌కుమార్, సంజీవ్, మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా జరిగిన ఎక్సైంజ్ కానిస్టేబుల్ పరీక్షలు
పటాన్చెరు టౌన్ : మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు ప్రశాతంగా జరిగాయి. మొత్తం ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. మండలంలో మొత్తం 4,704 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 3, 671 మంది రాశారు. మొత్తం 1,033 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. మండలంలోని గీతం1, 2 కళాశాలల్లో 784 మంది , 782 మంది, సెయింట్‌జోసఫ్ హైస్కూల్ 393 మంది, మంజీరా డిగ్రీ కళాశాలలో 256మంది, ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో 433 మంది, టర్భో మిషనరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 461 మంది, టీఆర్ఆర్ కళాశాలలో 562 మంది పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా పరీక్షకు వచ్చిన వారిని అనుమతించలేదు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను చెక్ చేసిన తరువాతే వారిని పరీక్షకు అనుమతించారు. మొత్తం మీద మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాతంగా ముగిశాయి. -
కొనసాగుతున్న కానిస్టేబుళ్ల శారీరక దారుఢ్య పరీక్షలు
ఖమ్మం క్రైం : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్ల శారీరక దారుఢ్య పరీక్షలు ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కొనసాగుతున్నాయి. ఎస్పీ షానవాజ్‌ఖాసీం పర్యవేక్షణలో 9వ రోజైన శనివారం 1,200 మంది అభ్యర్థులకు గాను 911 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పురుష అభ్యర్థులకు 800మీటర్లు పరుగుపందెం, 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్ ఈవెంట్లను పూర్తిచేశారు. మహిళా అభ్యర్థులకు బయోమెట్రిక్, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చే సిన అనంతరం ఎత్తులో అర్హత సాధిం చిన వారిని 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ నిర్వహించా రు. స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, ఏఆర్డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యులు పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్ కు ట్రయిల్ రన్!
బరేలి : హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల త్వరలో సాకారం కానుంది. ఇండియన్ రైల్వే అందుకోసం మరో అడుగు ముందుకేసింది. ఇజత్ నగర్, భోజీపురా స్టేషన్ల మధ్య శనివారం స్పానిష్ కు చెందిన టాల్గో కంపెనీ హైస్పీడ్ రైలు కోచ్ లకు సెన్సార్ ట్రయల్ నిర్వహించింది. ట్రయల్ రన్ లో భాగంగా సూపర్ లగ్జరీ కోచ్ లను ఇండియన్ ఇంజన్ తో పట్టాలపై నడిపించినట్లు అధికారులు తెలిపారు. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్పీడ్ రైలు దేశంలో అతి త్వరలో పట్టాలెక్కనుంది. (చదవండి...మనకూ స్పానిష్ హైస్పీడ్ రైలు) టాల్గో కంపెనీ ఈ కోచ్ లను సుమారు 30 ఏళ్ళ క్రితం తయారు చేసింది. ఇప్పటివరకూ తజకిస్తాన్ తో సహా 12 దేశాల్లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యింది. అనేక సెన్సార్ల ఆధారంగా నడిచే కోచ్ లు సరైన రీతిలో పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు రైల్వే బోర్డ్ మెకానికల్ ఇంజనీర్ సెన్సార్ ట్రయల్ నిర్వహించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం బరెలీ నుంచి మొరాదాబాద్ వరకూ ప్రారంభించే బోగీల స్పీడ్ ట్రయల్ జూన్ 12 వరకూ కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్రస్తుత ట్రయల్ సందర్భంలో ఈ కోచ్ లు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, త్వరలో న్యూఢిల్లీ ముంబై మార్గంలోని మధుర పాల్వాల్ సెక్షన్ లో జరిగే ట్రయల్ రన్ లో గంటకు 180 నుంచి 200-220 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన కోచెస్ సెన్సార్ ట్రయల్ విజయవంతమైందని ఈశాన్య రైల్వే ఇజత్ నగర్ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం రైల్వే బోర్డులోని ముగ్గురు సభ్యుల బృదం వర్క్ షాప్ కు చేరుకొని, టాల్గో కోచెస్ కు సంబంధించిన వివరాలను అందించిందని, అనంతరం స్పానిష్ టీమ్ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు, కోచ్ లలోని ప్రతి వస్తువుకు చెందిన పూర్తి సమాచారాన్ని విపులంగా వివరించినట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు. -
మమ్మీ డాడీలకు 10 పరీక్షలు ఆర్ యూ రెడీ...
సమ్మర్ స్పెషల్ పిల్లలకు చెప్పాల్సిన పది కథలివి. కథలు చెప్పాలంటే క్లయిమాక్స్ తెలిసుండాలిగా. అదీ నీతి కథల్లో క్లయిమాక్సే కీలకం. అందుకే మమ్మీ డాడీలకి ఈ చిన్ని పరీక్ష. పిల్లలు పరీక్షలు అయిపోయాయి. ఇక మిగిలింది పెంపకం పరీక్షలే. కాపీయింగ్ చేయకుండా జవాబులు చూడకుండా మీ పిల్లలకి ఈ నీతి కథల క్లయిమాక్స్‌లు చెప్పి మంచి పేరెంట్స్ అనిపించుకోండి. ఎంజాయ్. 1 ఎవరి పని వారు చేయాలి... ఒక ఊళ్లో ఒక రజకుడున్నాడు. అతడి దగ్గర ఒక కుక్క, గాడిద ఉన్నాయి. ఒక రోజు రాత్రి ఒక దొంగ ఆ రజకుడి ఇంటికి వచ్చాడు. గాడిద అది చూసి కుక్కతో- ‘లే..లే.. పెద్దగా మొరుగు. దొంగ వచ్చాడు’ అంది. దానికి కుక్క ‘నీ పని నువ్వు చూసుకో. ఇంతకాలం ఈ ఇంటి యజమానికి సేవ చేశాను. కాని ఏం చేశాడు? సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు’ అంది. దానికి గాడిద ‘అవన్నీ ఎంచవలసిన సమయం ఇది కాదు. నీకు విశ్వాసం లేకపోతే నాకు ఉంది. నువ్వు మొరగకపోతే నేను ఓండ్ర పెడతాను’ అని పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. అప్పుడేం జరిగిందంటే... 2 బడాయి తాబేలు... ఒక చెరువులో కొన్ని కొంగలు, ఒక తాబేలు నివసించేవి. ఒకసారి ఆ ప్రాంతానికి కరువొచ్చింది. చెరువు మెల్లగా ఎండిపోవడం మొదలెట్టింది. కొంగలు ఒక్కొక్కటిగా వలస వెళుతున్నాయి. అది గమనించిన తాబేలు తనకు స్నేహితులైన రెండు కొంగల దగ్గరకొచ్చి- ‘మిత్రులారా... ఈ కష్టకాలంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లండి. నీళ్లున్న వేరే చెరువుకు వచ్చి మీతో పాటు బతుకుతాను’ అంది. ‘తీసుకెళతాం. కాని ఎలా’ అన్నాయి కొంగలు. దాని తాబేలే మార్గం చెప్పింది. పొడవైన కర్ర తెచ్చి రెండు కొంగలను చెరొక కొన పట్టుకొమ్మంది. మధ్య భాగాన్ని తాను పళ్లతో కరిచి పట్టుకుంది. కొంగలు గాల్లో లేచాయి. వాటితో పాటు తాబేలు కూడా లేచింది. కింద నుంచి ఇది గమనించిన జనం ముక్కున వేలేసుకున్నారు. పిల్లలు వెంటబడ్డారు. చాలామంది ‘ఈ తెలివి ఎవరిది.. ఈ తెలివి ఎవరిది’ అని ఆశ్చర్యపోయారు. అప్పుడేమైందంటే... 3 నక్కా- కొంగ ఒకసారి ఒక నక్క కనపడిన ఆహారాన్నల్లా పోగేసి విందు చేసుకుంది. తినే తొందరలో ఒక ఎముక దాని గొంతులో ఇరుక్కుంది. మింగుదామంటే లోపలికి పోదు. ఊయాలంటే బయటకు రాదు. ఈ అవస్థ నుంచి బయట పడేయమని చెరువు దగ్గర ఉన్న కొంగ దగ్గరకు వెళ్లింది. ‘మిత్రమా. నా గొంతులో ఉన్న ఎముక తీసి పెట్టు. ఊరికే వద్దు. నీ సాయానికి తగిన డబ్బు చెల్లిస్తాను’ అంది. కొంగ అందుకు అంగీకరించి నక్క గొంతులోకి తన ముక్కును పెట్టి ఎముకను లాగి బయట పడేసింది. అప్పుడేమైందంటే.... 4 పాము- చలిచీమలు... ఒక అడవిలో ఒక త్రాచు ఉండేది. అది ఎంతో పాశవికంగా పక్షుల గూళ్ల మీద దాడి చేసి వాటి గుడ్లు తినేస్తూ ఉండేది. పక్షులు దానిని ఏమీ చేయలేకపోయేవి. ఒకసారి అది దారిలో ఒక పెద్ద చీమల పుట్టను చూసింది. ఆ పుట్టనే తన ఇల్లు చేసుకోవాలనుకుంది. వెంటనే ఆ పుట్టలోకి దూరి అక్కడున్న చలిచీమలతో ‘ఎవరనుకున్నారు? మర్యాదగా అవతలికిపోండి. ఇక నుంచి ఈ పుట్ట నాది’ అంది. రాబోయేది వానాకాలం. చీమలు ఎంతో శ్రమ పడి ఆ పుట్టను నిర్మించుకున్నాయి. ఇప్పుడు త్రాచు వచ్చి చేరింది. పైగా చీమలు అంటూ చిన్న చూపు చూస్తోంది. అప్పుడేమైందంటే... 5 ఐకమత్యమే మహాబలం ఒక అడవిలో ఒక పావురాల గుంపు ఉండేది. ఒకరోజు అవి ఆకాశంలో ఎగురుతూ ఉండగా కింద నూకలు చల్లి కనిపించాయి. పావురాలు అవి చూసి నేల వాలుదామనుకున్నాయి. కాని వాటిలోని ఒక ముసలి పావురం- ‘తొందరపడకండి. అడవి మధ్యలో నూకలు ఉన్నాయంటే వాటి కింద వల ఉంటుంది. ఇది వేటగాడి పని’ అంది. అయినా కూడా పావురాలు మూర్ఖంగా వెళ్లి నూకల మీద వాలాయి. అంతే... వల వాటిని పట్టేసింది. దూరంగా వేటగాణ్ణి గమనించి వాటి పైప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు ముసలి పావురం ‘బాధ పడకండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనందరం రెక్కలు ఒక్కసారే ఆడించి పైకి ఎగురుదాం. వలతో సహా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు’ అంది. వెంటనే పావురాలు తమ రెక్కల్లో బలం తెచ్చుకున్నాయి. అన్నీ కలిసి ఒక్కసారిగా ఎగిరాయి. వేటగాడు నోరు తెరుచుకుని చూస్తూ ఉండగానే అన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. అప్పుడేమైందంటే... 6 సింహం- చిట్టెలుక.... ఒక అడవిలో ఒక సింహం ఉండేది. దాని పేరు చెప్తే అందరికీ హడల్. ఒకరోజు అది ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉండేది. అది తన కలుగు నుంచి బయటకు వచ్చి ఆడుకోవడం మొదలెట్టింది. అది ఒకసారి సింహం చెవిని గిల్లడం మరోసారి సింహం తోక మీద గెంతడం చేసేసరికి సింహానికి మెలకువ వచ్చి ఆపైన కోపం వచ్చి చిటికెలో తన పంజాలో ఎలుకను బంధించేసింది. ‘నిన్ను తినేస్తా’ అంది సింహం. ‘బాబ్బాబు... ఈసారికి నన్నొదిలిపెట్టు. నన్ను నీ స్నేహితుణ్ణి అనుకో. ఒక స్నేహితుడిగా నీకు మేలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మేలు చేస్తా’ అంది చిట్టెలుక. అందుకు సింహం పెద్దగా నవ్వి ‘నీతో స్నేహమా... నువ్వు నాకు చేసే సాయమా’ అంది. కాని చిట్టెలుక ముఖం చూసి జాలితో వదిలేసింది. ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద వేటగాడు అడవికి వచ్చాడు. సింహాన్ని వలేసి బంధించాడు. అప్పుడేమైందంటే.... 7 నాన్నా... పులి... ఒక రైతు తన కొడుకుతో పాటు పొలానికి వెళ్లాడు. దగ్గరలోనే అడవి ఉంది. అందువల్ల రైతు తన కొడుకుతో ‘బాబూ.. పులి తిరుగుతోంది. నీకు కనపడితే వెంటనే నాన్నా.. పులి అని పిలూ వస్తాను’ అని తన పనిలో పడ్డాడు. కొడుకు ఆడుకుంటూ తండ్రిని పరీక్షిద్దామని ‘నాన్నా... పులి’ అన్నాడు. వెంటనే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పులి లేదు. కొడుకు ఆకతాయిగా నవ్వాడు. మరికొద్ది సేపటి తర్వాత కొడుకు మళ్లీ ‘నాన్నా.. పులి’ అన్నాడు. తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పులి లేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడేమైందంటే... 8 ఆవు - పులి.. ఒక ఆవు అడవికి మేతకు వెళ్లి దారి తప్పింది. అది సరాసరి పులి తిరిగే ప్రాంతంలోకి వెళ్లింది. పులికి ఇది మంచి పలహారం. ఆవును పులి ఆపేసింది. ‘నిన్ను తినేస్తా’ అంది. అప్పుడు ఆవు ‘నాకు దొరికిన గడ్డిని నేను తినడం ఎంత న్యాయమో నీకు దొరికిన జీవాన్ని నువ్వు తినడం అంతే న్యాయం. అయితే ఒక్క మాట. నాకు ఈ మధ్యనే లేగదూడ పుట్టింది. దానికి ప్రతి సాయంత్రం నేను పాలు ఇవ్వాలి. ఇప్పుడు నన్ను వదిలితే వెళ్లి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను తినెయ్’ అంది. పులి నమ్మలేదు. ‘నువ్వు అబద్ధం చెప్తున్నావ్. నువ్వు మళ్లీ రావు’ అంది. ‘లేదు... వస్తాను’ అంది ఆవు. అప్పుడేమైందంటే... 9 కాకి - కుండ అనగనగా ఒక కాకి. ఆ కాకికి ఒకరోజు దప్పికేసింది. ఎగిరింది... ఎగిరింది... ఒక ఇంటి పెరటిలో ఒక కుండ కనిపించింది. కాకి అక్కడ వాలి కుండలోని నీళ్లు తాగాలని చూసింది. కాని నీళ్లు దాని ముక్కుకు అందలేదు. అవి అడుగున ఉన్నాయి. కాకికి దప్పికగా ఉంది. ఏం చేయాలి? ఒక ఆలోచన వచ్చింది. కాకి వెంటనే దగ్గరలో ఉన్న రాళ్లను ఏరి ఒక్కోరాయినీ ఆ కుండలో వేయడం మొదలెట్టింది. అప్పుడేమైందంటే... 10 కుందేలు తెలివి ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ప్రతిరోజూ తనకు ఆహారంగా అడవిలోని ఒక మూగ జీవిని కోరేది. ఎవరూ దానిని ఎదిరించలేక బాధపడుతుండేవారు. ఆరోజు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన బాధ్యత కుందేలు మీద పడింది. కుందేలుకు సింహం నోట చిక్కడం ఇష్టం లేదు. అందుకని అది సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్లింది. సింహం కోపంగా ‘ఎందుకింత ఆలస్యం?’ అని అడిగింది. కుందేలు వినయంగా ‘ప్రభూ, నా తప్పేమీ లేదు. నీలాంటివాడే ఒకడు నన్ను అటకాయించాడు. తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది’ అంది. ‘నాలాంటివాడా? ఎక్కడ? చూపించు’ అంది సింహం. అప్పుడు ఏమైందంటే... జవాబులు 1. ఆ ఓండ్రకు నిద్ర చెడిన రజకుడు వేళగాని వేళలో ఓండ్ర పెడతావా అని దుడ్డుకర్ర తీసుకొని గాడిదను నాలుగు బాదాడు. ఈ హడావిడికి దొంగ పారిపోయాడు. నీతి: కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి అని. 2. తాబేలు తబ్బిబ్బయ్యింది. ఈ ఘనత తనదే అని నలుగురికీ అరిచి చెప్పాలనుకుంది. ఆ మాట కోసమే ఏమరుపాటులో నోరు తెరిచింది. ఇంకేముంది? ఆకాశం నుంచి నేల మీద చతికిల పడింది. నీతి: గొప్పలు అన్ని వేళలా మంచివి కావు. 3. నక్క ఎంతో సంతోషపడింది. అమ్మయ్య... కృతజ్ఞతలు అంది కొంగతో. మరి నా ఫీజు అంది కొంగ. నక్క హా..హా..హా.. అని పెద్దగా నవ్వి నా నోట్లో తల పెట్టి ప్రాణాలతో బయటపడ్డావ్. అదే నీ ఫీజు అంది. నీతి: దుష్టులతో జాగ్రత్త. ఎంత మేలు చేసినా కీడు చేస్తారు. 4. చలిచీమలు అడవిలో ఉన్న తన బంధుగణాన్నంతా పిలిచాయి. వేలాదిగా చీమలు తరలి వచ్చాయి. అవన్నీ ఒక్కసారికి త్రాచును కమ్ముకున్నాయి. అత్యంత బలం గలదాన్నని విర్రవీగిన ఆ త్రాచు చలిచీమల చేత చిక్కి అర్ధంతరంగా చచ్చింది. నీతి: ఎవరినీ బలహీనులుగా చూడవద్దు. 5. అవన్నీ అక్కడి నుంచి దూరంగా పెద్ద చెట్టు దగ్గర వాలాయి. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉంది. అది ఆ పావురాలకు స్నేహితుడు. పావురాలు దానితో తమ అవస్థ చెప్పగా వెంటనే ఎలుక వచ్చి తన పళ్లతో ఆ వలను తెచ్చి వాటికి విముక్తి ప్రసాదించింది. నీతి: ఐకమత్యమే మహాబలం. 6. సింహం వల నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఇంతలో సింహానికి వచ్చిన కష్టాన్ని చిట్టెలుక గమనించింది. అంతే.. గబగబా వచ్చి తన వాడియైన పళ్లతో వలను తెంపేసి సింహాన్ని విముక్తం చేసింది. సింహానికి చిట్టెలుక మీద గౌరవం పెరిగింది. అప్పటి నుంచి ఎలుకను అది తన నిజమైన స్నేహితుడిగా స్వీకరించింది. నీతి: స్నేహం ఎంత చిన్నదైనా మేలే చేస్తుంది. 7. పులి నిజంగానే వచ్చింది. కొడుకు భయపడిపోయి ‘నాన్నా..పులి’ అని పెద్దపెద్దగా అరిచాడు. కాని కొడుకు మళ్లీ ఆకతాయిగా అబద్ధం చెప్తున్నాడనుకొని తండ్రి రాలేదు. కొడుకును పులి తినేసింది. నీతి: అబద్ధం ప్రాణాంతకం. 8. పులి అపనమ్మకంగానే వదిలేసింది. ఆవు వెంటనే ఇంటికి పరిగెత్తి దూడకు కడుపు నిండుగా పాలు తాపి ‘జాగ్రత్త తల్లి’ అని ముద్దులు పెట్టి వదల్లేక వదల్లేక అడవికి చేరుకుంది. ‘ఇక నాకు దిగుల్లేదు. తిను’ అంది. పులికి ఇది ఆశ్చర్యం. మాట మీద నిలబడే గొప్ప గుణం గల ఆవును చూసి దాని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఆవును వదిలేసింది. అంతేకాదు అప్పటి నుంచి అది అనవసర వేట కట్టిపెట్టింది. నీతి: నిజాయితీకి మించిన వ్యక్తిత్వం లేదు. 9. రాళ్లన్నీ అడుగుకు వెళ్లాయి. కుండలోని నీళ్లు పైకి వచ్చాయి. కాకి హాయిగా తన దప్పిక తీర్చుకుని ఎగిరిపోయింది. నీతి: శక్తి కన్నా యుక్తి మేలు. 10. కుందేలు నేరుగా సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లింది. ‘అదిగో చూడు’ అని బావిలోకి చూపించింది. సింహం తొంగి చూసి, తన నీడనే ప్రత్యర్థి అనుకుని దానితో పోరాటానికి ఒక్క ఊపున బావిలో దూకి చచ్చింది. నీతి: మూర్ఖులకు ముప్పు తప్పదు. -
వెబ్సైట్ లో టెన్త్ హాల్ టికెట్లు
నేటి రాత్రి 8 గంటల నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల హాల్ టికెట్లను విద్యా శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి విద్యార్థులు వెబ్సైట్(bsetelangana.org) నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టింది. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేయిం చుకుని పరీక్షకు హాజరు కావచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల మొదట్లోనే పాఠశాలలకు హాల్ టికెట్లను పంపించామని, విద్యార్థులంతా స్కూళ్ల నుంచి హాల్‌టికెట్లను తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యాజమాన్యాలు హాల్‌టికెట్లను నిరాకరించడానికి వీల్లేదన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, ఇతరత్రా కారణాలతో హాల్‌టికెట్లను నిరాకరించినట్లు ఫిర్యాదులు వస్తే ఆయా పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని పరీక్షల విభాగం నిర్ణయించింది. టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అన్ని చర్యలను విద్యా శాఖ పూర్తి చేసింది. బుధవారం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి జిల్లా స్థాయి అబ్జర్వర్లతో పరీక్షల నిర్వహణపై చర్చించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అరగంట ముందే అనుమతి.. టెన్త్ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ విద్యార్థులు ఉదయం 8:30 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు వెల్లడించారు. 8:45 గంటల నుంచి 9 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు. 9 గంటలకు విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాలు అందజేస్తారు. అందులో విద్యార్థుల వివరాలను రాయాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభమయ్యాక 15 నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అదీ మొదటి రోజు మాత్రమేన ని, మిగితా రోజుల్లో ముందుగానే రావాలన్నారు. అరగంట ముందుగానే ఓఎంఆర్ జవాబు పత్రం ఇస్తున్నందునా ఆలస్యంగా వస్తే విద్యార్థులకే సమయం వృథా అవుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తొలుత భావించినా ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి రావడంతో ఆ ఆలోచనను విద్యా శాఖ విరమించుకుంది. అయితే 10 నుంచి 20 వరకు సమస్యాత్మక కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. 2,615 కేంద్రాల్లో పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 2,615 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది. ఇందులో ప్రభుత్వ స్కూళ్లలో 2,427 కేంద్రాలు, ప్రైవేటు స్కూళ్లలో 188 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతేడాది 5.65 లక్షల మంది పరీక్షలు రాయగా.. ఈసారి 11,181 పాఠశాలల నుంచి 5,56,757 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,21,046 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులు 35,711 మంది ఉన్నారు. రెగ్యులర్‌లో బాలురు 2,68,938, బాలికలు 2,58,108 మంది ఉన్నారు. మరో 11,500 మంది ఓల్డ్ సిలబస్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షలకు వెళ్లనున్నారు. -
అమ్మను దోషిని చేస్తారా!?
అభిప్రాయం దేశంలోని 50 వేల స్కాన్ సెంటర్ల రికార్డు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షించటం చేతకావటం లేదు. కానీ ప్రతి ఏటా 2 కోట్ల 90 లక్షల మంది గర్భవతుల గర్భాలలో ఉన్నది ఆడో, మగో స్కాన్ చేసి, నమోదు చేయించి... ట్రాక్ చేసి ఆడ శిశువుల్ని కాపాడతారట. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననడం అంటే ఇదే కదా! ‘‘డాక్టర్లని ఎంత కాలం శిక్షిస్తాం? ఇకనయినా లింగ నిర్ధారణను చట్టబద్ధం చేసి ఆడ శిశువుల్ని కాపాడాలి’’ అంటూ మన కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకాగాంధీ ఇటీవల మేధోమథనం చేశారు. ఈ దేశంలో ఎవరయినా స్కాన్ సెంటర్‌కు వెళ్ళి గర్భంలోని బిడ్డ ఆడో, మగో చెప్పమంటే కాదనే ధైర్యం ఎవరికుంటుంది’’ అని పాపం డాక్టర్ల నిస్సహాయత పట్ల చలించిపోయారు. లింగ నిర్ధారణ చట్ట రీత్యా తీవ్ర నేరం అని ప్రతి ఆసుపత్రిలో పెట్టిన బోర్డు కూడా అడిగిన వారికి చూపించలేనంత భయంతో డాక్టర్లు ఈ దేశంలో బతుకుతున్నారు... గర్భవతుల నుండి డాక్టర్లను కాపాడే చట్టం తెస్తే ఇంకా బాగుంటుం దేమోనని సదరు మంత్రి మలివిడతలో ప్రస్తావించ వచ్చు. పురుష వీర్య కణాలలోని ఎక్స్, వై క్రోమోజో ములను వడపోసి కేవలం మగ పిండాన్ని ఏర్పర్చే వై క్రోమోజోము వీర్య కణాలనే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టడం అంటే అసలు ఆడపిండం ఏర్పడే అవకాశాన్ని లేకుండా చేసే పద్ధతి... డబ్బు, అవకాశంలేని వారు రూ.10 వేలతో లింగ నిర్ధారణ, గర్భస్రావాలకు వెళితే.. ఉన్నత, నయా మధ్యతరగతి లక్షన్నర ఖర్చుతో క్రోమో జోముల వడపోతలకు పాల్పడుతున్నారు. అంటే లింగాన్ని బట్టి గర్భస్రావాలు చేయటం నేరం అంటే మన వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంలోని మరింత ఆధునికతను వాడి ఆడ శిశువులను పుట్ట కుండా చేస్తున్నారన్న మాట... అంటే వైద్యవృత్తిలోని కనీస నైతిక విలువల్ని, చట్టాన్ని రెండింటినీ ఉల్లంఘి స్తున్నారన్న మాట. 2003 చట్ట సవరణ కాలం నుండి 2014 వరకూ దేశంలో కోటి 21 లక్షల మంది ఆడ శిశువులని ముందే తెలియడంతో గర్భస్రావాలు జరిగితే 206 మంది డాక్టర్లకు మాత్రం కనీస శిక్షలు విధించారు. వారి సర్టిఫికెట్లు మాత్రం ఉపసంహరించిన దాఖలాలు లేవు. 15 రాష్ట్రాల్లో అస్సలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఊపిరి తీయకుండా అమ్మ గర్భంలోనే హతమైనకోటిన్నర మంది పసిపాపల గురించి ఒక కన్నీటి బొట్టు రాలలేదు కాని మనేకాగాంధీ దయార్ద్ర హృదయం నేరస్తులైన ఈ 206 మంది వైద్యుల కోసం మాత్రం ఆక్రోశిస్తోంది. ఇక లింగ నిర్ధారణ చట్టబద్ధం అయితే గర్భాలలో ఉన్నది అంతా మగ శిశువులే అని నమోదు చేస్తారు. ఆడ శిశువుల భ్రూణ హత్య నేరంగాని మగ శిశువుల అబార్షన్ కాదు కదా. రకరకాల వైద్య కారణాలతో మగ శిశువులుగా నమోదైన ఆడ పిండాల్ని యధేచ్ఛగా తొలగిస్తారు. ఆడవాళ్ళకు పిండాలు పెట్టి గర్భస్రావ పరిశ్రమ విరాజిల్లడం ఖాయం. అంతగా వివక్షత అనుకుంటే ఆడ డాక్టర్లు మాత్రమే లింగ నిర్ధారణ చేయాలని నియమం పెడితే సంపూర్ణ సమానత్వం సిద్ధిస్తుంది. ఆడ పిల్లను కనాలా వద్దా? అసలు ఎంత మందిని కనాలి? ఎప్పుడు కనాలి? అసలు కనాలా వద్దా? అనే విషయంలో నోరు మెదిపే అధికారం ఆడవాళ్ళకు ఈ దేశంలో ఉందా? ఎందరికి ఉంది? స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కు అనడం పాశ్చాత్య సంస్కృతి. అది ఇక్కడ చెల్లదని కుల మతాల గుత్తేదార్లు రంకెలు వేసి కాలు దువ్వుతున్న కాలం ఇది. ప్రతి దేశభక్తి గల స్త్రీ 10 మంది పిల్లల్ని (ఇతర మతాల వారికి మినహారుుంపు) కనాలని, లేదంటే కనీస పక్షం నలుగురు కొడుకుల్ని మాత్రం కనాలని బహి రంగంగా శాసించే పార్లమెంటు బాబాలను ఎన్నుకున్నందుకు స్త్రీలు ఈపాటి మూల్యం చెల్లించాలికదా! త్యాగం చేయటం, అణగి వుండటం ఉగ్గు పాలతో తాగి ఆచరించేవారే మన దేశపు నిజమైన స్త్రీలు కాబట్టి గర్భస్థ శిశువు అడయినా మగయినా నిర్ధారణ జరిగాక దాన్ని కాపాడటం నూటికి రెండొందల పాళ్ళు అమ్మల కర్తవ్యమే... అందుకే కదా మాతృ దేవోభవ అన్నది... ఆ గర్భం చట్టబద్ధంగానో, నాటు పద్ధతితోనో, కొట్టడం, తన్నడం వంటి ఖర్చులేని టెక్నాలజీ వల్లనో లేదా ప్రమాదవశాత్తుగానో లేదా అసలు సహజసిద్ధ కారణాల వల్లనో గర్భస్రావం అయితే ఆమె నేరస్తురాల వుతుందన్న మాట. దీనికి వేరెవరూ బాధ్యులు కాదు. భావజాలం, సమాజం, కుటుంబ, డాక్టర్లు, ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆడ శిశువుల మరణాలకు, భ్రూణ హత్యలకు బాధ్యులనడం దేశ ద్రోహం... అసలు స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కులుండాలనడం మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అంతర్జాతీయ కుట్ర. 10 మందిని కనడం, కుటుంబ పోషణకు మాత్రమే సంపాదించడం (ఆర్థిక స్వావ లంబన వల్ల స్త్రీలు విచ్చలవిడి అవుతారట) వంటి పాతివ్రత్య సూత్రాల పునరుద్ధరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే ‘‘ఇండియాస్ డాటర్’’ నిషేధం, బాలనేరస్తుల వయస్సు తగ్గింపులతో స్త్రీలపై అత్యాచా రాలు అరికట్టడం జరిగింది. అద్దె గర్భాలు చట్టబద్ధం అయితే ఇల్లు కదలకుండా స్త్రీలు స్వయం ఉపాధి పొంది లక్షలు ఆర్జించవచ్చు. మానవ సమతుల్యం కంటే జంతు సమతుల్య తను ప్రేమించేవారు మంత్రిగా ఉండి ఇటువంటి ఆలో చనలు చేయటం మన జన్మజన్మల కర్మఫలం. కనుక మనం ఒక అగ్రరాజ్యంగా ఎదగడాన్ని భగ్నం చేయ డానికే స్త్రీల హక్కులు, మానవ హక్కులు, దళిత హక్కులని గగ్గోలు పెడుతూ అభివృద్ధి నుండి మనల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని దేశ భక్తులంతా గమనిం చాలని మనవి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, దేవి pa_devi@rediffmail.com -
మగాడు ఎదుర్కొన్న తొలి పరీక్ష
పరీక్షలు ఆది నుంచి ఉన్నాయి. ఇవాళ స్కూలు పరీక్షలు కాలేజీ పరీక్షలు పరీక్షలుగా చలామణి అవుతున్నాయి గానీ వేల సంవత్సరాలుగా ఇవి మనిషిని శోధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇవి మగాడికి పరీక్ష పెడుతూనే ఉన్నాయి. ఆడమ్ మొదటి పరీక్షను ఎదుర్కొన్నాడు. మాయాసర్పం ఫలాన్ని తినమని ఈవ్‌ను ఉసిగొల్పింది. ఈవ్ ఆ ఫలాన్ని పంచుకోమని ఆడమ్‌ని కోరింది. పెద్ద పరీక్ష అది. దేవుడు అప్పటికే కొన్ని నిషేధాజ్ఞలు ఇచ్చి ఉన్నాడని, వాటిని శిరసావహించాలని ఆడమ్‌కు తెలుసు. కాని తెలిసి తెలిసి తప్పు చేశాడు. స్వర్గలోకం నుంచి భూలోకానికి పతనమయ్యాడు. గమనించండి. అది ‘ఫాల్ ఆఫ్ మేన్’ అయ్యింది తప్ప ‘ఫాల్ ఆఫ్ ఉమన్’ కాలేదు. మగాడు ఎదుర్కొన్న తొలి పరీక్ష ఫలితం అది. దానిని ఇప్పటి వరకూ అనుభవిస్తూనే ఉన్నాడు. ఇచ్చినమాటకు కట్టుబడాల్సి రావడం దశరథుడు ఎదుర్కొన్న అతి పెద్ద పరీక్ష. కన్నకొడుకును వనవాసం పంపడమా? కాని పంపే తీరాల్సి వచ్చింది. పితృవాక్య పరిపాలన అనే పరీక్షకు రాముడు నిలబడాల్సి వచ్చింది. ‘నేను వెళ్లను... నాకు రాజ్యం ఇవ్వండి’ అనంటే చేయగలిగింది ఏముంది? కాని జగత్తంతా చూస్తోంది శ్రీరామచంద్ర ప్రభువును. తండ్రి మాటను శిరసా వహిస్తాడా... లేదంటే భంగం కలిగిస్తాడా? శిరసావహించాడు. అందుకే ఒకే మాట.. ఒకే బాణం అనే పేరు గడించాడు. ఆ వంశంవాడే సత్యహరిశ్చంద్రుడు. మాట ఇచ్చాడు. పరీక్షకు నిలబడ్డాడు. రాజ్యం, భోగం, భార్యా పిల్లలు అన్నీ పోయినా సరే పరీక్ష తప్ప లేదు. పాసయ్యాడు. మామూలు పాస్ కాదు వేల సంవత్సరాలు నిలబడే ఉత్తీర్ణత. ‘తండ్రీ... నీవే దైవం’ అని హిరణ్యకశిపుడితో ఒక్క మాట చెప్పాలి. కాని తాను నమ్మిందానికే కట్టుబడ్డాడు ప్రహ్లాదుడు. నారాయణుడినే తన గుండెల్లో అభీష్టించుకున్నాడు. ఫలితం? అన్నీ చావు పరీక్షలే. తండ్రి పెట్టిన ఆ పరీక్షలన్నీ భరించాడు. సహించాడు. చివరకు జవాబుగా నరసింహుడినే సాక్షాత్కరింపజేశాడు. సత్యం పలికిన ప్రతి ప్రవక్తా లోకం పెట్టి కఠిన పరీక్షలన్నింటికీ నిలబడ్డారు. దైవకుమారుడు జీసెస్ కూడా అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. దేశద్రోహి, మతద్రోహి అనే నిందలను మోశాడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం శిలువను మోశాడు. మానవాళిని పాపవిముక్తులను చేయడం కోసం తన పవిత్ర రక్తాన్ని కూడా చిందించాడు. ఇబ్రాహీమ్ ప్రవక్త, ఇస్మాయీల్, ముహమ్మద్ ప్రవక్త వంటి వారు సైతం దైవం విధించిన రకరకాల పరీక్షలకు అత్యంత విధేయంగా తలవంచారు. భక్త కన్నప్ప, భక్త సిరియాళుడు, మంజునాథుడు, చిరుతొండనంబి వంటి సామాన్యభక్తుల నుంచి రంతిదేవుడు, శిబిచక్రవర్తి, నలమహారాజు, విక్రమార్కుడు, బలి, ధర్మరాజు వంటి చక్రవర్తులు కూడా కాలం, దైవం పెట్టిన ఎన్నో విషమ పరీక్షలని ఎదుర్కొనవలసి వచ్చింది. గాంధీ మహాత్ముడైతే తనను పరీక్షించే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. తనను తానే పరీక్షించుకున్నాడు. అందులో నెగ్గాడు కూడా. విశ్వామిత్రుడు, పరశురాముడు, దూర్వాసుడు, వాల్మీకి, అష్టావక్రుడు, నారదుడు వంటి మహామునులకూ పరీక్షలు తప్పలేదు. వీరిదేముంది సాక్షాత్తూ మృత్యుదేవుడైన యముడు కూడా పరీక్షలను ఎదుర్కొన్నాడు... అదీ సావిత్రి వంటి సామాన్య స్త్రీల నుంచి... మార్కండేయుడి వంటి మునిబాలకుల నుంచి! చివరాఖరుకు ఆంజనేయస్వామి, వినాయకుడు, కుమారస్వామి వంటి వారికీ మినహాయింపు దొరకలేదు. కాని వాళ్లు ప్రలోభాలకు లొంగలేదు. బెదిరింపులకు చెదరలేదు. నిలబడ్డారు. వీరంతా ఎందుకు... విష్ణుమూర్తి అంతటివాడికీ పరీక్ష తప్పలేదు. భృగుమహర్షి ఈడ్చి పెట్టి తన ఎడమ కాలితో వక్షస్థలం మీద తంతే, నవ్వుతూ భరించాడు. అదేమని అడగలేదని ప్రియసతి అలిగి తనని విడిచి వెళ్లిపోతే వెదుక్కుంటూ భూలోకానికి వచ్చి కఠోర తపస్సు చేశాడు. అప్పటికీ కూడా ఆ మహాతల్లి ఆయన మీద జాలిచూపలేదు. తన అంశే అయిన పద్మావతమ్మని కట్టుకున్నా కానీ, శిలవైపొమ్మని శపించేసరికి చేసేది లేక ఏడుకొండల మీద వెంకటేశ్వరుడిగా వెలిశాడు. భూమి గుండ్రంగా ఉంది అన్నవాడు మగాడే. వాణ్ణి లోకం చంపాలనుకుంటుంది. అయినా నిలబడతాడు. గ్రహాల ఉనికిని చెప్పిన వాడు మగాడే. వాణ్ణీ లోకం తరిమికొట్టాలనుకుంటుంది. అయినా నిలబడ్డాడు. సముద్రానికి చివర అగాథం లేదని, అందమైన భూభాగం ఉందని చెప్పినవాడు మగాడే. అతణ్ణి లోకం ఏమిటి సొంత నావికులే నమ్మలేదు. అయినా నిలబడ్డాడు. కులం ఒక మూఢత్వం అన్న పూలే పరీక్షలకు నిలబడ్డాడు. దళితులూ మనుషులే అన్న అంబేద్కరూ పరీక్షలకు నిలబడ్డాడు. పరీక్షలు ఎదుర్కొనాల్సింది మగవాళ్లే. వాళ్లు నిలబడక తప్పదు. ఇప్పుడు కూడా మగపిల్లవాడికి పుట్టినప్పటి నుంచీ పరీక్షలే. తొందరగా మాటలు వచ్చేయాలి. తొందరగా స్కూల్లో చేరిపోవాలి. తొందరగా పాసైపోవాలి. తొందరగా బీటెక్ చేసేయాలి. తొందరగా ఎం.ఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోవాలి. తొందరగా పెళ్లి చేసుకోవాలి. తొందరగా పిల్లల్ని కనాలి. తొందరగా వాళ్లను సరిగ్గా పెంచి చదివించి పెళ్లి చేసి తిరిగి మనవలని కూడా దారి పెట్టి... ఇందులో ఏ పరీక్ష తప్పినా సంఘం ఊరుకోదు. నింద వేస్తుంది. చేతగానివాడు అంటుంది. ఈ పరీక్షలకు నిలబడకపోతే అనుమానంగా చూస్తుంది. - సాక్షి ఫ్యామిలీ -
సారీ... చెల్లెమ్మా!
భార్గవి చనిపోయింది! ఆత్మహత్య చేసుకుంది!! చెల్లెళ్లిద్దరూ ఈ రోజుకీ అక్కా అక్కా అంటూ పలవరిస్తూనే ఉన్నారు. అమ్మానాన్న.. తల్లీ తల్లీ ఎందుకిలా చేశావే అని తల్లడిల్లిపోతున్నారు. క్షమించమ్మా. నిన్ను ఏకాకిని చేసినందుకు క్షమించమ్మా. నీ కష్టం అర్థంచేసుకోనందుకు క్షమించమ్మా. చోద్యం చూస్తున్న మా పిరికితనాన్ని క్షమించమ్మా. అమ్మాయిలను బడికి పంపకూడదేమోనన్న భయానికి ఆజ్యం పోసినందుకు క్షమించమ్మా. సారీ భార్గవి... సారీ చెల్లమ్మా. ఇలా ఇంకో చెల్లికి జరక్కుండా జాగ్రత్తపడతాం. భార్గవి! బంగారు బొమ్మ. పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. పరీక్షలు దగ్గరపడ్డాయి కదా, ఇంకా బాగా చదువుతోంది. 10/10 గ్రేడ్ సాధించాలని ఆ అమ్మాయి తపన. సాధించి తీరుతుందని తల్లిదండ్రుల ధీమా. రేయింబవళ్లు కష్టపడి చదువుతోంది. ఇష్టంగా చదువుతోంది. ఇంటి పని చేస్తూనే, ఇద్దరు చెల్లెళ్లకు చదువులో సాయం చేస్తూనే తను చదివినవి మననం చేసుకుంటోంది. అమ్మానాన్న ఇక్కడ లేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వడానికి ఉపాధి కోసం పరాయి రాష్ట్రానికి వెళ్లారు. రోజూ వారికి ఫోన్ చేస్తోంది భార్గవి. ‘బాగా చదువుతున్నాను. కాలేజీలో చేరి ఇంకా బాగా చదువుతాను. తర్వాత మంచి ఉద్యోగం చేసి మీకు కష్టం తప్పిస్తాను’ అని చెబుతోంది. ఇంట్లో పెద్ద కూతురు భార్గవి. అప్పుడే ఇంత పెద్దది అయిందా అని అమ్మానాన్న ఎప్పట్లాగే ఆ రోజు కూడా మురిసిపోయారు. ఫోన్లోనే కూతురు పెట్టిన ముద్దులకు తడిసి ముద్దయ్యారు. ఆ ముద్దుల తడి ఇంకా ఆరనైనా లేదు. అంతలోనే దుఃఖపు వరదలో మునిగిపోయారు. భార్గవి చనిపోయింది! ఆత్మహత్య చేసుకుంది!! చెల్లెళ్లిద్దరూ ఈ రోజుకీ అక్కా అక్కా అంటూ పలవరిస్తూనే ఉన్నారు. అమ్మానాన్న.. తల్లీ తల్లీ ఎందుకిలా చేశావే అని తల్లడిల్లిపోతున్నారు. ఏం జరిగింది? రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్న భార్గవికి మరో పరీక్ష ఎదురైంది. ప్రేమ పరీక్ష! వయసులో భార్గవికంటే చిన్నవాడైన తోటి విద్యార్థి ఆమెను ప్రేమిస్తున్నానన్నాడు. నువ్వూ నన్ను ప్రేమించు అన్నాడు. నువ్వు లేకపోతే బతకలేనన్నాడు. నువ్వు ఒప్పుకోక పోతే బతకనివ్వను అని కూడా అన్నాడేమో తెలీదు. మొత్తానికైతే రోజూ వెంటపడేవాడు. భార్గవి భయపడిపోయింది. వణికిపోయింది. అక్క ముఖంలో దిగులును ఆ చిన్నారి చెల్లెళ్లు గమనించారు కానీ, ప్రేమ వేధింపులే అందుకు కారణమని గ్రహించలేకపోయారు. అసలు గ్రహించేంత వయసు కూడా కాదు వాళ్లది. భార్గవికి ప్రేమించే టైమ్ లేదు. ప్రేమించే ఆసక్తీ లేదు. చదువుపైనే ఆమె ప్రేమ. తల్లిదండ్రులపైనే ఆమె ప్రేమ. నానమ్మ మీదే ఆమె ప్రేమ. భవిష్యత్తు మీదే ఆమె ప్రేమ. చెల్లెళ్ల మీదే ఆమె ప్రేమ. అందుకే అతడికి చెప్పింది. నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని గట్టిగా చెప్పింది. వినకపోవడంతో విసుగెత్తి చివరకు అమ్మకు నాన్నకు చెప్పింది. నాయనమ్మకు చెప్పింది. మేనమామకు చెప్పింది. ఎవరు వెళ్లి చెప్పినా ఆ విద్యార్థి వినలేదు. విసిగి వేసారి అలసిపోయిన భార్గవి ఆఖరి ప్రయత్నంగా పోలీసులకు కంప్లైంట్ చేసింది. వాళ్లు చెప్తే అతడు వినేవాడేమో కానీ వాళ్లు చెప్పలేదు. ‘చె బుదామనే అనుకున్నాం, వేరే పనిలో ఉండి చెప్పలేకపోయాం’ అని ఇప్పుడు... భార్గవి చనిపోయాక అంటున్నారు! వారం క్రితమే వచ్చింది భార్గవి సొంతూరు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామం. నాన్న పల్లపు చినవెంకన్న. అమ్మ విజయ. భార్గవి వేములపల్లిలోని మోడల్ స్కూల్లో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఏడు సంవత్సరాల క్రితమే బతుకు తెరువు కోసం మహారాష్ట్రలో టెలిఫోన్ కేబుల్ గుంతలు తవ్వే పనికి వెళ్లారు. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, పండుగలకు మాత్రమే ఇక్కడికి వచ్చి వెళుతున్నారు. భార్గవి శెట్టిపాలెంలోనే తన పెద్ద చెల్లి మహేశ్వరితో కలిసి నాయనమ్మ సైదమ్మ వద్ద ఉంటోంది. ఆమె చిన్న చెల్లెలు సదా త్రిపురారం మండలంలోని పెదదేవులపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి ఐదో తరగతి చదువుతోంది. అంతా కుదురుగా ఉన్న సమయంలో ఇక్కడ భార్గవి చదువుకు అనుకోని ఆటంకం! ఆ ఊళ్లోనే ఉంటున్న ఆమె సహవిద్యార్థి ప్రేమ పేరుతో ఆమె చదువును సాగనివ్వడం లేదు. అతడు కూడా వేములపల్లిలో భార్గవి చదివే మోడల్ స్కూల్లోనే ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజూ భార్గవి వెంటపడి తనను ప్రేమించమని వేధిస్తున్నాడు. కొన్నాళ్లు చూసి, సహనం నశించి భార్గవి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. దీంతో అతడికి రెండు నెలల క్రితం టీసీ ఇచ్చి పంపించారు. అప్పటి నుంచి శెట్టిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో... మోడల్స్కూల్లోని బాలికల హాస్టల్లో ఉంటున్న భార్గవి ఆరోగ్యం బాగోలేక వారం రోజుల క్రితమే శెట్టిపాలెంలోని నాయనమ్మ వద్దకు వచ్చింది. అక్కడి నుంచే రోజూ పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తోంది. ఇదే అదునుగా భావించాడు సహవిద్యార్థి. ప్రేమించమని వేధించడం మొదలు పెట్టాడు. ఇక తట్టుకోలేక ఈనెల 21వ తేదీ ఆదివారం రాత్రి మేనమామ పుల్లయ్యతో కలిసి వెళ్లి వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఏమైందో తెలీదు. సోమవారం ఉదయం నాయనమ్మ ఊళ్లోని మిల్లుకు బియ్యం పట్టించేందుకు వెళ్లినప్పుడు... ఇంట్లో ఎవరూ లేని సమయంలోభార్గవి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పక్కింటి వాళ్లు అరుపులు విని వచ్చి మంటలు ఆర్పేలోగా భార్గవి మృతి చెందింది. ప్రేమ వేధింపులకు బలైపోయింది! - పైడిమర్రి రామకృష్ణ, సాక్షి, వేములపల్లి ఫిర్యాదు వచ్చింది తమ గ్రామానికే చెందిన విద్యార్థి తనను ప్రేమించాలని రోజూ వేధిస్తున్నాడని పల్లపు భార్గవి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలల నుంచి అతడు తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. సోమవారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నాం. - విజయ్‌కుమార్, ఎస్ఐ, వేములపల్లి ఈవ్టీజింగ్నుఎదుర్కోవడానికి మానసిక నిపుణుల సూచనలు తల్లిదండ్రులకు : పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉండాలి. సామాజిక సంబంధాల (రిలేషన్షిప్ ఇష్యూస్) గురించి పిల్లల దగ్గర మాట్లాడటానికి కొందరు తల్లిదండ్రులు వెనకాడుతుంటారు. ఏ విషయమైనా తల్లిదండ్రుల దగ్గర జంకు లేకుండా ప్రస్తావించేలా పిల్లలతో వ్యవహరించాలి. ఫలానా అంశం తల్లిదండ్రుల దగ్గర ప్రస్తావించకూడని రహస్యం అని పిల్లలు అనుకోకూడని విధంగా వాళ్లతో కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలతో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, వేధింపులు ఇలా ఏ అంశంపైనైనా మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా అవాంఛిత పరిణామం జరుగుతుంటే పిల్లలు దాన్ని చెప్పుకునేలా తల్లిదండ్రుల చొరవ ఉండాలి. టీచర్లకు : సామాజిక సంబంధాలను గుర్తించడానికి తగిన ఆస్కారం ఉన్న స్థానంలో టీచర్లు ఉంటారు. టీనేజర్లు, వాళ్ల స్నేహితుల వ్యవహారాలు కనిపెట్టడానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లు ఇది తమకు సంబంధించని వ్యవహారం అనుకుంటుంటారు.టీనేజర్ల విషయంలో ఏదైనా తేడా ఉందని గ్రహించిన వెంటనే పిల్లలకు వాళ్లు తగిన సలహా ఇవ్వవచ్చు. తల్లిదండ్రులు చెప్పిన దాని కంటే టీచర్లు చెప్పేదాని ప్రభావమే పిల్లలపై ఎక్కువ. ఏదైనా తమ పరిధి దాటిపోతుందని గ్రహిస్తే టీచర్లు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపాలి. పోలీసులకు : ఈవ్‌టీజింగ్ అంశాలు తమ దృష్టికి వచ్చినప్పుడు బాధితులకు తగిన న్యాయం చేస్తూనే... పిల్లలిద్దరి విషయంలోనూ వారు తప్పనిసరిగా గోప్యత పాటించాలి. పిల్లలు సామాజికంగా వివక్షకు గురికాకుండా ఉండటానికి వారు ఇచ్చే ఫోన్ నెంబర్లు, వాళ్లు చదివే స్కూలు వంటి అంశాల్లో ఈ గోప్యత చాలా అవసరం. ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు : సాధారణంగా అమ్మాయిలు టీజింగ్‌కు గురయ్యే మాల్స్, నలుగురు కలిసేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ బాధితులకు తగిన కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. టీనేజ్ పిల్లలు చదివే స్కూళల్లో, కాలేజీలలో అప్పుడప్పుడూ ఈ అంశాల మీద అవగాహన సదస్సులు నిర్వహించాలి. కేవలం ఈ అంశంపై వార్తలు వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో మాత్రమే కాకుండా... ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్నేహితులకు : ఈవ్‌టీజింగ్ లాంటివి జరుగుతున్న సందర్భాల్లో అది మొదట తెలిసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది కేవలం స్నేహితులకు మాత్రమే. అందుకే తమ స్నేహితులు ఉదాసీనంగా ఉన్నా, డిప్రెషన్‌కు లోనైనా దాన్ని చక్కదిద్దడమో లేదా టీచర్లకో, పిల్లల తల్లిదండ్రులకో ఫ్రెండ్ సమాచారం ఇవ్వాలి. అలాగే తన స్నేహితురాలి సమాచారాన్ని అవసరమైన వ్యక్తులకు తప్ప ఇతరులకు తెలియజేయని విధంగా గోప్యత పాటించాలి. తమ స్నేహితురాలిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఫ్రెండ్స్ మాటలు ఉండాలి. నిజానికి వాళ్లకు మొదటి సలహా, సూచన ఇవ్వగలిగే అద్భుత అవకాశం స్నేహితులకే ఉంటుంది. - డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ -
ప్రివెన్షన్ బెస్ట్ మెడిసిన్...
ఎగ్జామ్ టిప్స్ రోజూ 3-4 లీటర్ల వరకు నీళ్లు, పళ్లరసాలు తాగిస్తుండాలి. మధుమేహం వంటి సమస్యలున్న పిల్లలకు మాత్రం వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు పక్కన బండ్ల మీద పండ్లరసాలను, ఆహారపదార్థాలను తీసుకోనివ్వకూడదు. కలుషిత నీరు, ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ విషయంలోనూ, చేతుల శుభ్రత పాటించడంలోనూ పిల్లలకు సరైన అవగాహన తల్లిదండ్రులు, టీచర్లు కలిగించాలి. జలుబు నుంచి రిలీఫ్ కలగాలంటే బాగా మరిగించిన నీటితో ఆవిరిపట్టాలి. పరీక్షలు ఉన్నన్ని రోజులు రోజూ ఉదయం, రాత్రి పడుకునేముందు ఉప్పునీటితో నోటిని పుక్కిలించమనాలి. ఇలా గార్గిల్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలు బాధించవు. చదవాలి కదా.... అని తెల్లవార్లూ కూర్చోబెట్టకుండా పిల్లలకు తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. పరీక్ష అయిపోయిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లదనానికి దోమలు విపరీతంగా ఇళ్లల్లోకి చేరుతుంటాయి. కిటికీలు మూయడం, దోమల మందులు, నెట్లు వాడటం చేయాలి. జ్వరంగా ఉన్నప్పుడు తడిబట్టతో ఒళ్లు తుడవడం, వైద్యుల సలహాతో మందులు వాడటం తప్పనిసరి.పరీక్షలు లేని రోజుల్లో దగ్గు, తుమ్ములు సమస్య ఉన్నప్పుడు ఒకటి రెండు రోజుల్లో పిల్లల్ని స్కూల్‌కి పంపించకూడదు. ఒకరికి ఈ సమస్య ఉంటే తరగతిలో మిగతా పిల్లలకూ సోకే అవకాశం ఉంటుంది. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు చేతిగుడ్డ అడ్డుగా పెట్టుకొమ్మని పిల్లలకు ముందుగానే చెప్పాలి. తాజా ఆహారపదార్థాలుగా కూరగాయలు, పండ్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉండే వాటిని ఇవ్వాలి. -
‘ఒట్టి’చాకిరే..!
విద్యాశాఖ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు విద్యావాలంటీర్లుగా నియమించే యోచనపై అభ్యంతరం అప్రెంటిస్ వ్యవస్థను తిరిగితెచ్చే యత్నాలపై తీవ్ర నిరసన సోషల్ మీడియా ద్వారా మంత్రి గంటాకు వినతుల వెల్లువ ఈ నెల 29న విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏకకాలంలో సమావేశాలు వినుకొండ టౌన్: జిల్లాలో సుమారు 30 వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి, ఆరునెలలుగా తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. 2014 నవంబర్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత డీఎస్సీ కీలో నెలకొన్న తప్పిదాలపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో తుది ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. కోర్టుకేసులు తుది దశకు చేరుకున్నాయని, తుది తీర్పు ఎప్పడైనా రావచ్చని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను తుది నియామకాలు ఇచ్చేంత వరకు విద్యావాలంటీర్లుగా నియమించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈనెల 21న హైదరాబాద్‌లో జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఆలోచన చేసినట్టు తెలియడంతో డీఎస్సీ అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యాశాఖలో అప్రెంటీస్ విధానం ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారు రూ.1200, రూ.1500ల నెలవారీ వేతనంతో రెండేళ్ల పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ పూర్తయిన వారినే రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా నియమించేవారు. ఎన్నో పోరాటాలు చేసిన ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఈ అప్రెంటీస్ విధానాన్ని 2008 డీఎస్సీ నుంచి రద్దు చేయించారు. అప్పటి నుంచి పూర్తి ప్రారంభ వేతనంతో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతున్నాయి. తిరిగి ఇప్పుడు డీఎస్సీ మెరిట్ అభ్యర్థులతో విద్యావాలంటీర్లుగా రూ.5వేలు.రూ.7వేల గౌరవ వేతనంతో నియమించాలని విద్యాశాఖ ఆలోచన చేస్తుండటంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. విద్యావాలంటీర్లుగా నియమించడం అంటే అప్రెంటీస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడమేనని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నిరసన... విద్యాశాఖ ఆలోచనను నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఫేస్బుక్, వాట్స్‌యాప్‌ల ద్వారా మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు తమ నిరసన తెలుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే డీఎస్సీ నియామకాలు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో మళ్లీ విద్యావాలంటీర్ల నియామకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి డీఎస్సీ అభ్యర్థులు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మంత్రి గంటాకు తమ నిరసన తెలుపుతున్నారు. గతించిపోయిన అప్రెంటీస్ విధానాన్ని విద్యావాలంటీర్ల రూపంలో మళ్లీ తీసుకు రావద్దని వేడుకుంటున్నారు 29న డీఎస్సీ సాధన సమితి సమావేశం.. డీఎస్సీ నియామకాలు త్వరగా చేపట్టాలని, మెరిట్ అభ్యర్థులతో విద్యావాలంటీర్ల నియామక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఈ నెల 29న విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏకకాలంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. లేకుంటే ఆందోళన చేపడతామంటున్నారు. అప్రెంటిస్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టడమే.. గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో అప్రెంటీస్ వ్యవస్థ ఉంది. ఐదు వేల రూపాయల నెల జీతంతో విద్యా వాటంటీ ర్లుగా డీఎస్సీ మెరిట్ అభ్యర్థును నియమించటం అంటే అప్రెంటీస్ విధానం తిరిగి తీసుకురావడం లాంటిదే. ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకుని డీఎస్సీ నియామకాలు చేపట్టాలి. - జి.వి.ప్రవీణ్‌కుమార్, ఎస్జీటీ అభ్యర్థి ఇప్పటికే ఎంతో నష్టం... విద్యావాలంటీర్లుగా నియమించాలన్నా మెరిట్ జాబితా ఇవ్వాలి. అదే మెరిట్ జాబితా ఇచ్చి నేరుగా నియామకాలు చేపట్ట వచ్చుకదా. ఇప్పటికే తీవ్ర ఆలస్యం జరిగి నష్టపోతున్నాం. ప్రభుత్వం నిరుద్యోగుల గోడు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలి. - జి.రామ్‌సింగ్, ఎస్జీటీ అభ్యర్థి -
పూర్తి స్థాయి సిరీస్ ఓ పరీక్ష!
- శ్రీలంక పర్యటనపై కోహ్లి - కొత్త వ్యూహాలు ఉన్నాయన్న టెస్టు కెప్టెన్ చెన్నై: ధోని గైర్హాజరులో తొలి రెండు టెస్టులు, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్ (3 టెస్టులు)కు అతను నాయకత్వం వహించబోతున్నాడు. అందుకే శ్రీలంకతో జరిగే సిరీస్ తనకో సవాల్‌లాంటిదని, తన సామర్థ్యానికి పరీక్షగా అతను భావిస్తున్నాడు. ఆదివారం భారత టెస్టు జట్టు లంకకు బయల్దేరడానికి ముందు అతను మీడియాతో మాట్లాడాడు. ‘వ్యక్తిగతంగా ఈ సిరీస్ పట్ల చాలా ఉత్కంఠగా ఉన్నాను. గతంలో అనుకున్న అనేక ప్రణాళికలకు పూర్తి సిరీస్‌లో అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒక టెస్టులో ఐదు రోజుల్లో మన వ్యూహాలన్నీ వాడలేం. కాబట్టి గత మూడు టెస్టులను బట్టి నా కెప్టెన్సీని అంచనా వేయవద్దు. నన్ను నేను నిరూపించుకునేందుకు ఇది నాకు మంచి అవకాశం’ అని కోహ్లి అన్నాడు. ఈ సిరీస్‌కు సంబంధించి తన మదిలో అనేక ఆలోచనలు ఉన్నాయని, ఏదైనా ఒక వ్యూహం విఫలమైతే ప్రత్యామ్నాయంగా ప్లాన్ ‘బి’ సిద్ధంగా ఉంటుందన్నాడు. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్ల వ్యూహమే సరైనదని, దానికే కట్టుబడి ఉంటానని అతను పునరుద్ఘాటించాడు. ఈ విషయంలో తన బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్ ఏర్పాటు చేసి వారికి మద్దతుగా నిలుస్తానన్నాడు. బ్యాటింగ్‌లో 40కు పైగా సగటు ఉన్న అశ్విన్‌ను టెస్టు ఆల్‌రౌండర్‌గా తాను పరిగణిస్తానన్న కోహ్లి...హర్భజన్, భువనేశ్వర్‌లను కూడా ఇదే జాబితాలో చేర్చాడు. మురళీ విజయ్ ఫిట్‌నెస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని, తొలి టెస్టులోగా అతను సిద్ధమవుతాడని కెప్టెన్ స్పష్టం చేశాడు. రెండో ఓపెనర్‌గా రాహుల్, ధావన్ మధ్య పోటీ నెలకొనడంతో ఎలాంటి ఇబ్బందీ లేదని విరాట్ చెప్పాడు. ‘అందరూ ఫామ్‌లో ఉండటం అనేది సమస్యే కాదు. వీరిద్దరు బాగా ఆడుతున్నారు. ఇది మంచి పరిణామమే. తుది జట్టులో ఎవరనేది తర్వాత తేలుతుంది’ అని విశ్లేషించాడు. రోహిత్ శర్మ టెస్టు ప్రదర్శన ఇటీవల గొప్పగా లేకపోయినా...అతను ప్రతిభావంతుడని, మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. దానర్థం అది కాదు! మరోవైపు బీసీసీఐ నైతిక విలువల నియమావళిలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆటగాళ్లకు మేలు చేస్తుందన్న విరాట్ కోహ్లి... దానిపై వివరంగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించాడు. బంగ్లాతో వన్డే సిరీస్ పరాజయంపై అనంతరం ‘మేం ప్రణాళికలను సమర్థంగా అమలు చేయలేకపోయామని’ చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయించారని కోహ్లి వివరణ ఇచ్చాడు. ఇది ధోనికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యగా అప్పుడు వార్తల్లో నిలిచింది. ‘మేం అంటే అందులో నేను కూడా భాగమేనని అర్థం. అంటే నా తప్పు కూడా ఉందనే కదా. దానిని వక్రీకరించారు. జట్టులో ఎలాంటి విభేదాలూ లేవు’ అని విరాట్ స్పష్టం చేశాడు. -
ద్రవిడ్ శిక్షణకు పరీక్ష!
- కోచ్‌గా తొలి మ్యాచ్ - నేటినుంచి భారత్ ‘ఎ’, ఆసీస్ ‘ఎ’ అనధికారిక టెస్టు చెన్నై: భారత సీనియర్ జట్టులో స్థానమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వర్ధమాన క్రికెటర్లకు మరో అవకాశం! గతంలో టెస్టులు ఆడిన సీనియర్లు, తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కుర్రాళ్లూ వీరిలో ఉన్నారు. నేటినుంచి భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ మధ్య జరిగే తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ కోసం వీరంతా సిద్ధమయ్యారు. గతంలో ఐపీఎల్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించినా...దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తొలిసారి పూర్తి స్థాయిలో కోచ్ బాధ్యతలు తీసుకోవడంతో ఈ సిరీస్ ఆసక్తి రేపుతోంది. ‘ఎ’ టీమ్ ద్వారా భవిష్యత్తులో సీనియర్ జట్టుకు తగినంత మంది రిజర్వ్ ఆటగాళ్లను అందించాలన్నదే తన లక్ష్యమని ద్రవిడ్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యువ జట్టు ప్రదర్శనపై అందరి దృష్టీ నిలిచింది. చతేశ్వర్ పుజారా నేతృత్వంలో భారత్ బరిలోకి దిగుతుండగా, ఆసీస్ టీమ్‌కు ఉస్మాన్ ఖాజా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆరోన్ అవుట్ మ్యాచ్‌కు ముందే భారత్‌కు పేస్ విభాగంలో ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ టెస్టు జట్టులో సభ్యుడైన వరుణ్ ఆరోన్ వైరల్ ఫీవర్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టెస్టు స్పెషలిస్ట్ అయినా ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన పుజారా ఈ సిరీస్‌లో రాణించి తిరిగి రావాలని పట్టుదలగా ఉన్నాడు. అతని భవిష్యత్తుకు ఈ సిరీస్ కీలకం కానుంది. పుజారాతో పాటు కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత సెలక్టర్ల విశ్వాసం కోల్పోయిన ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా, ముకుంద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఐపీఎల్‌తో కాస్త పేరు తెచ్చుకున్న కుర్రాళ్లు అపరాజిత్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ గోపాల్ నాలుగు రోజుల ఫార్మాట్లోనూ రాణించాల్సి ఉంది. పటిష్టంగా ప్రత్యర్థి మరో వైపు ఆస్ట్రేలియా జట్టులోనూ చాలా మంది టెస్టులు ఆడిన సీనియర్లు ఉన్నారు. భారత పిచ్‌లపై ఆడకపోవడం బలహీనతగా కనిపిస్తున్నా... వీరంతా ఏదో ఒక దశలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నవారే. కెప్టెన్ ఖాజాతో పాటు గత సిరీస్‌లో భారత్‌తో టెస్టు ఆడిన జో బర్న్స్, ఫెర్గూసన్, వేడ్, అగర్ అనుభవజ్ఞులు కాగా... కౌల్టర్ నీల్, సీన్ అబాట్, ప్యాటిన్సన్, గురీందర్ సంధు ఐపీఎల్‌తో అందరికీ చిరపరిచితమైన ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. -
పులిరాజా పరీక్షల్లేవు!
⇒ హెచ్ఐవీ రోగుల నెత్తిన పిడుగు ⇒ ఆరు నెలలుగా టెస్టింగ్ కిట్లు లేక ఆగిన వైద్యపరీక్షలు ⇒ హెచ్ఐవీ పాజిటివ్ తల్లుల బిడ్డలకు లభించని సిరప్లు ⇒ నెలకు రెండు లక్షలమంది కిట్లు లేక తిరుగుముఖం ⇒ చిన్నాభిన్నమైన ఎన్జీవో వ్యవస్థ.. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ల దోపిడీ సాక్షి, హైదరాబాద్: జబ్బును బయటకు చెప్పలేరు.. అలాగని లోపలా దాచుకోలేరు.. అలాంటి బాధ అనుభవించే హెచ్ఐవీ రోగుల నెత్తిన పిడుగుపడింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి (నాకో) నిధులివ్వలేదన్న కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ ఉందో లేదో నిర్ధారించేందుకు వాడాల్సిన టెస్ట్కిట్లు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో హెచ్ఐవీ పరీక్షలకు వచ్చేవారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఏపీశాక్స్ను 10వ షెడ్యూల్లో చేర్చడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ దీన్ని గాలికొదిలేశాయి. దీంతో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల తర్వాత అత్యధిక హెచ్ఐవీ రోగులున్న తెలుగు రాష్ట్రాల్లో నియంత్రణ పూర్తిగా అదుపు తప్పింది. ఈఏడాది నాకోనుంచి రూ.100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐసీటీసీల్లో కిట్లు ఎక్కడ? ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ (ఐసీటీసీ)కు నెలకు రెండు లక్షలమంది సెక్స్ వర్కర్లు, డ్రై వర్లు ఇలా పలు వర్గాలకు చెందినవారు పరీక్షలకోసం వస్తారు. ఇందులో నెలకు కనీసం నాలుగువేల మందికి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 463 ఐసీటీసీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో గత ఫిబ్రవరి నుంచి కిట్లు లేకపోవడంతో వైద్య పరీక్షలు ఆపేశారు. దీంతో గడిచిన నాలుగు నెలల్లో ఎనిమిది లక్షల మంది బాధితులు వైద్య పరీక్షలు చేయించుకోకుండా వెనక్కు వెళ్లిపోయారు. గర్భిణుల బిడ్డలకు సిరప్లు ఏవీ? ఎయిడ్స్ నియంత్రణా మండలి లెక్కల ప్రకారం ఈ ఏడాది హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణులు నాలుగువేల మందిపైనే ఉన్నట్టు అంచనా. వీళ్లు ప్రసవం అయిన తక్షణమే బిడ్డకు 72 గంటల్లోగా నెవాప్రిన్ సిరప్ వేయాలి. ఆ తర్వాత 3 నుంచి 13 వారాల వరకూ సెప్ట్రాన్ సిరప్ వేయాలి. ఈ రెండు సిరప్లు వేస్తేనే తల్లినుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా ఉంటుంది. గడిచిన ఆరు మాసాల్లో రెండువేల మందికి పైగా హెచ్ఐవీ సోకిన గర్భిణులు ప్రసవం అయ్యారు. కానీ ఆ బిడ్డలకు సిరప్లు వేసే పరిస్థితి లేదు. ఆ బిడ్డల పరిస్థితి దారుణం. సీడీ4 కిట్లూ లేవు హెచ్ఐవీ రోగులకు వ్యాధినిరోధకత శక్తిని సీడీ4 టెస్ట్‌ద్వారా చూస్తారు. అంటే తెల్లరక్త కణాల కొలమానం అన్నమాట. సీడీ4 కౌంట్ 350 కంటే తగ్గితే ఆ వ్యాధిగ్రస్థుడు ఖచ్చితంగా ఏఆర్టీ (యాంటీ రిట్రోవెల్ ట్రీట్మెంట్) మందులు వాడాలి. హెచ్ఐవీ సోకిన టీబీ రోగులైతే విధిగా ఏఆర్టీ మందులు వాడాల్సిందే. ఈ టెస్టును ప్రతి ఆరు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. కానీ ఏడాదిగా రెండు రాష్ట్రాల్లో సీడీ4 కిట్లు లేవు. దీంతో హెచ్ఐవీ రోగులు ప్రై వేటుకు వెళ్లలేక, ఇక్కడ కిట్లు లేక యాతన పడుతున్నారు. డీపీఎంల దోపిడీ రాజ్యం ఏడాదిగా హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క ప్రచార కార్యక్రమమూ లేదు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లుగా నియమితులైనవారు ఎన్జీవోలనుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఎన్జీవోలు పనిచేయడం మానేశారు. కొందరు నాలుగైదేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తూ హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క కార్యక్రమమూ చేపట్టలేదు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రాలను పర్యవేక్షించే ఓ జాయింట్ డెరైక్టర్ అండతో ప్రాజెక్టు మేనేజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కేంద్రం నుంచి రావడం లేదు హెచ్ఐవీ కిట్లు లేని మాట వాస్తవమే. అయితే ఇవి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ రాలేదు. ఈ ఏడాది నిధులు కూడా రూ.100 కోట్లు రావాల్సి ఉండగా రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. - డాక్టర్ రామ్మోహన్, జేడీ, ఏపీశాక్స్ నా ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక పోతున్నా ఐదారేళ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్నా. ఇక్కడ హెచ్ఐవీ రోగులకు వైద్యసేవలు అందడం లేదంటే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లే కారకులు. ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకుండా వచ్చిన నిధులను తినేస్తున్నారు. దీంతో వేలాదిమంది హెచ్ఐవీ రోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.-కె.రవి, హెచ్ఐవీ బాధితుడు (సమాచార హక్కుచట్టం కార్యకర్త) రెండు రాష్ట్రాల్లో హెచ్ఐవీ బాధితులు 5 లక్షలు తెలంగాణలో హెచ్ఐవీ బాధితులు 2.5 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవీ బాధితులు 2.7 లక్షలు ఏటా కొత్తగా నమోదయ్యే బాధితులు 25 వేలు ఏటా ప్రసవానికి వస్తున్న హెచ్ఐవీ బాధితులు 5 వేలు ఏటా రెండు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మృతులు 31 వేలు -
దారి తప్పిన జీవితాల్లో..దివ్యమైన వెలుగు
అమ్మ తిట్టింది.. నాన్న కొట్టాడు.. పరీక్షలు సరిగ్గా రాయలేదు.. చాలా చిన్న కారణాలు. ఇవే పిల్లలను ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి. ఇళ్ల నుంచి పారిపోయి నగరానికి చేరుతున్నారు బాలలు. తాము చేసింది తప్పో ఒప్పో తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక.. వెళ్లే దారి తెలియక ఇక్కడ ఏం చేయాలో తోచక అగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ‘దారి’ తప్పుతుంటే.. మరికొందరు చిన్నాచితకా పనుల్లో చేరి తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారు. ఇలా నగరానికి వచ్చేవారిని చేరదీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు సన్మార్గంలో నడిచేలా కృషి చేస్తోంది. - సికింద్రాబాద్ నెల రోజుల్లో 100 మందిని చేరదీసిన దివ్యదిశ 1098తో అభాగ్యులకు ఆశ్రయం కారణాలు ఏమైనా జిల్లాలు, రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే బాలబాలికల సంఖ్య ప్రతీ నెలలో వందకుపైగా ఉంటోంది. వీరిలో తమ కంటపడే ఒకరిద్దరు చిన్నారులను రైల్వే పోలీసులు చేరదీస్తున్నారు. మిగతా వారు స్టేషన్ దాటిపోయి ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు కర్మాగారాల్లో చేరడం, లేదంటే భిక్షాటనను వృత్తిగా ఎంచుకోవడం చేస్తున్నారు. అయితే, దివ్యదిశ ఆధ్వర్యంలో ఇటీవల స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘చైల్డ్ హెల్ప్ డెస్క్’ ద్వారా అందిస్తున్న సేవలు బాలల జీవితాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ సంస్థ సేవలను, పనితీరును అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి శాస్త్ర విద్యార్థులు వస్తున్నారంటే సేవలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల క్రితం.. నెలరోజుల క్రితం రైల్వే అధికారులు, పోలీసుల సహకారంతో దివ్యదిశ రైల్వేస్టేషన్లో చైల్డ్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ విధులు నిర్వహించే సంస్థ ప్రతినిధులు.. ప్లాట్‌ఫామ్‌లపై అనుమానాస్పదంగా తచ్చాడే బాలలను గుర్తించి, వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆపై ఆశ్రయం కల్పించడం, పక్కా సమాచారం ఉంటే తల్లిదండ్రులకు సమాచారం అందించడం, లేదంటే హాస్టళ్లలో చేర్పించడం వంటివి చేస్తున్నారు. ఎవరన్నా ఫోన్ చేసి చెబితే చాలు దిక్కు లేని, దారి తప్పిన బాలలను తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎందరికో ఆదరణ గడిచిన నెలరోజుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వంద మంది బాలలను గుర్తించిన ఈ సంస్థ ప్రతినిధులు.. వివిధ మార్గాల్లో వారి సమస్యకు పరిష్కారం చూపారు. తల్లిదండ్రులు లేని, ఆచూకీ తెలియని 25 మంది బాలురకు సైదాబాద్‌లోని వసతిగృహంలో ఆశ్రయం కల్పించారు. ఇదే కోవకు చెందిన మరో 20 మంది బాలికలను నింబోలి అడ్డాలోని గర్ల్స్ హాస్టల్లో చేర్చారు. పారిపోయి వచ్చిన 20 మంది బాలురను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ‘చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన మా అమ్మను నాన్న వదిలేశాడు. ఇంటర్ చదువుతున్న నన్ను కళాశాల మాన్పించింది. నన్నూ తప్పుడు మార్గంలో నడిచి డబ్బు తేవాలని చిత్రహింసలకు గురిచేసేది. ఆమె చెర నుంచి తప్పించుకు వచ్చి దివ్యదిశను ఆశ్రయించా. ఇక్కడ నేను చదువుకుం టున్నా’.. అంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తన కష్టాల కథను చెప్పుకుంది. ‘భర్త మద్యానికి బానిసయ్యాడు. ముగ్గురు పిల్లల్ని పెంచే శక్తి లేక నన్ను, పిల్లల్ని వదిలేసి పోయాడు. నాలుగిళ్లలో పాచిపని చేసుకునే నాకు ముగ్గురు పిల్లలను చదివించే సంపాదన రావడం లేదు. దివ్యదిశ వారు ఇద్దరు పిల్లల్ని వసతిగృహంలో చేర్పించి చదువు చెప్పిస్తున్నారు’.. నగరానికి చెందిన ఓ పేద మహిళ దీనగాథ. నచ్చజెప్పి ఇంటికి పంపిస్తున్నాం ఇంటినుంచి పారిపోయి వచ్చిన బాలలకు నచ్చజెప్పి తిరిగి పంపిస్తున్నాం. తల్లిదండ్రుల ఆచూకీ లభించనివారిని, బాలకార్మికులను మాత్రం వసతి గృహాలకు తరలిస్తున్నాం. పలువురు తప్పిపోయిన బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. - సుమలత, దివ్యదిశ కౌన్సిలర్ -
ఆగిన చక్రాలు.. ఆగని పరీక్షలు
- నేడు ఎంసెట్..రేపటి నుంచి డీఎస్సీ - ఏకకాలంలో జిల్లాలో 45 వేల మంది అభ్యర్థుల తాకిడి - ఇతర జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల్లో ఆందోళన చిత్తూరు (అర్బన్): కొలువు కోసం కొందరు.. చదువుల కోసం మరికొందరు. ఎవరైనా సరే పరీక్షలు మాత్రం తప్పనిసరి. పరీక్షలు రాయాల్సిన వేలాది మంది అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆందోళన. పరీక్షలు బాగా రాస్తామో.. రాయమోనని కాదు.. అసలు పరీక్షలకు హాజరవుతామా..? అని. శుక్రవారం ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత నిరుద్యోగులు ఎదురు చూస్తున్న డీఎస్సీ పరీక్షలు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె అభ్యర్థులను, విద్యార్థులను మానసిక ఒత్తిడిలో పడేస్తోంది. ఎంసెట్ పరీక్షలకు రాయలసీమ రీజియన్ నుంచి 17,001 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షలను శుక్రవారం తిరుపతిలోని 27, చిత్తూరులోని 7 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడికల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత సమయంలోపు ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటామా అనే దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుని గురువారం రాత్రికే తిరుపతి, చిత్తూరు నగరాలకు చేరుకున్నారు. కొంతమంది మాత్రం ప్రయాణాన్ని శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. ఇక ఎంతోకాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న డీఎస్సీ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్, భాషా పండితులు, పీఈటీలకు ఈనెల 9 నుంచి 11 వరకు జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 37,782 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలన్నీ తిరుపతిలోనే జరగనుండటంతో ఇక్కడ 171 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో బయాలజికల్ సైన్స్‌తో పాటు పలు పోస్టులు డీఎస్సీలో భర్తీ చేయకపోవడంతో నాన్‌లోకల్ కింద కడప, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరీక్షలు రాయడానికి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లంతా సమయానికి ఆయా జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం సవాల్‌గా మారనుంది. ఆర్టీసీ సమ్మెతో పలు ప్రాంతాలకు నడిచే రైళ్లలో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుండగా, స్లీపర్ క్లాస్‌లో వెయింటింగ్ లిస్టు వేలలో చూపిస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య విద్యార్థులు, నిరుద్యోగులు నిజమైన పరీక్షను ఎదుర్కోనున్నారు. -
మే రెండో వారంలో టెన్త్ ఫలితాలు!
నేటితో ముగియనున్న పరీక్షలు ఈనెల 28న ఫస్ట్ ఇంటర్ ఫలితాలు? సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ప్రధాన పరీక్షలు ఈనెల 9తో ముగియనున్న నేపథ్యంలో ఫలితాలను మే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకనం పనులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలను ఈనెల 28న విడుదల చేయాలన్న యోచనలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఉన్నారు. ఆ తరువాత రెండు మూడు రోజులకు ద్వితీయ సంవత్సర ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. -
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్స్ ప్రవేశ పరీక్ష శనివారం హైదరాబాద్‌లో ప్రశాంతంగా జరిగింది. 97 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఈఈ హైదరాబాద్ కోఆర్డినేటర్ సీతాకిరణ్ వెల్లడించారు. 60 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన రెండు పేపర్లకు 51,074 మందికిగాను 49 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష సమయానికి దాదాపు గంట ముందుగానే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవడం విశేషం. హనుమాన్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కొన్నిచోట్ల విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. కొందరు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోవడంతో పరీక్షకు హాజరుకాలేదు. కన్నీటి పర్యంతమై భారంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోపక్క విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, స్నేహితులు నిలువనీడ లేక తీవ్ర అవస్థలు పడ్డారు. పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోనే పరీక్ష రాశారు. మరోవైపు వరంగల్లోనూ ఈ పరీక్ష ప్రశాంతం గా ముగిసింది. పేపర్-1కు 97.5 శాతం, పేపర్-2కు 94.5 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్ష కో ఆర్డినేటర్ జి.మథ్యాస్‌రెడ్డి తెలిపారు. -
సామర్థ్యం సన్నగిల్లిందే..!
ప్రాథమిక పాఠశాలల్లో లక్ష మందికి ‘సీ’ గ్రేడ్ చదవడం, రాయడం రాని వైనం సామర్థ్యాన్ని పెంచేందుకు వేసవిలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు 1,809 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ఏర్పాటు ఈ నెల 24 నుంచి మే 31 వరకు కొనసాగింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు పాఠశాలల్లోని విద్యార్థుల్లో సామర్థ్యం మసకబారుతోంది. ప్రాథమిక విద్యపై కోట్లు ఖర్చుపెడుతున్నా.. విద్యార్థుల ప్రతిభ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. ఏడాది పొడవునా చదువు చెప్పినప్పటికీ ఒంట బట్టించుకోని విద్యార్థులపై సర్వశిక్షా అభియాన్ రాష్ట్రప్రాజెక్టు ప్రత్యేకదృష్టి సారించింది. వార్షిక పరీక్షల్లో పూర్తిగా వెనకబడిన (సీ-గ్రేడ్) విద్యార్థులకు 40 రోజులపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకటి నుంచి ఐదో తరగతిలో వార్షిక పరీక్షల్లో ‘సీ’ గ్రేడ్ వచ్చిన విద్యార్థులు మాత్రం ఈ నెల 24 నుంచి మే 31 తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.ఈ మేరకు ఎస్ఎస్ఏ రాష్ట్రప్రాజెక్టు డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు మూడు గంటలు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో సమ్మెటీవ్-1 (త్రైమాసిక పరీక్షలు)లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులు 3,84,974 మంది ఉన్నారు. తాజాగా నిర్వహించిన సమ్మెటీవ్-3 (వార్షిక పరీక్షలు)లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళిక తయారు చేసింది. ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1809 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో శిక్షణ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 50 మంది విద్యార్థుల చొప్పున 90,450 మంది కవర్ కానున్నారు. అయితే సమ్మెటీవ్-3 ఫలితాల ఆధారంగా శిక్షణ కేంద్రాల సంఖ్యలో మార్పులుంటాయి. చదవడం, రాయడమే లక్ష్యంగా.. వేసవిలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల లక్ష్యం విద్యార్థులకు చదవడం, రాయడం కోసమే. వాస్తవానికి ‘సీ’ గ్రేడ్‌లో నమోదు కావడమంటే వారికి చదవడం, రాయడం సైతం రావడం లేదని అర్థం. ఈ క్రమంలో ప్రత్యేక తరగతుల్లో ఆయా విద్యార్థులకు ఈ రెండు అంశాల అభ్యసన కోసం ప్రత్యేకంగా అభ్యాస పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. తెలుగు, ఆంగ్లం, గణితానికి సంబంధించి ఏ4 సైజులో ఉన్న 1,08,540 పుస్తకాలను విద్యాశాఖ ఇప్పటికే ముద్రించింది. వీటిని ప్రతి సెంటర్‌కు పంపిణీ చేయనుంది. సీ గ్రేడ్ విద్యార్థులకు బోధన, అభ్యాసన కోసం సీఆర్పీ (క్లస్టర్ రిసోర్స్ పర్సన్)లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 2,609 మందిని ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఎంపిక చేసింది. వీరు ప్రత్యేక తరగతులు నిర్వహించినందుకుగాను రూ.800 గౌరవవేతనం కూడా ఇవ్వనుంది. -
బీఎడ్‌లో ఇకపై 12 పేపర్లు
నాలుగు సెమిస్టర్లుగా కోర్సు 20 వారాలపాటు ఇంటర్న్‌షిప్ జూలై నుంచి రెండేళ్ల కోర్సుగా బీఎడ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్న విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ఇకపై 12 పేపర్ల (ప్రశ్నాపత్రాలు) విధా నం అమల్లోకి రానుంది. సెమిస్టర్ విధానం, ఐదు నెలలపాటు(20 వారాలు) ఇంటర్న్‌షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మార్పు చేసిన పాఠశాల విద్యా విధానం, పరీక్షల సంస్కరణలు, సిలబస్‌లో మార్పులకు అనుగుణంగా బీఎడ్ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన విద్యావిభాగం అధిపతులు, ప్రభుత్వ, ప్రైవేటు బీఎడ్ కాలేజీల ప్రతినిధులతో సిలబస్ రూపకల్పనపై విద్యాశాఖ చర్చించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ పర స్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పరీక్షల సంస్కరణల కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి యూనివర్సిటీలు, కళాశాలల ప్రతినిధులకు తెలియజేశారు. కొత్త నిబంధనలను వివరించారు. గతంలో ఏడాది కోర్సుగా ఉన్న బీఎడ్‌లో 6 ప్రశ్నాపత్రాల విధానం అమల్లో ఉం డగా వచ్చే విద్యా సంవ త్సరంలో(జూలై నుంచి) అమల్లోకి రానున్న రెండేళ్ల బీఎడ్ కోర్సులో స్కూల్ ఇంటర్న్‌షిప్ కాకుండా 12 ప్రశ్నాపత్రాల విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) కోర్సు సిల బస్‌లోనూ మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. ఇవీ బీఎడ్‌లో రానున్న ప్రధాన మార్పులు... ఇప్పటివరకూ 8 వారాలే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (పాఠశాలల్లో ప్రాక్టికల్ తరగతులు) ఇకపై 20 వారాలపాటు ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యం, జ్ఞానం, సమాచారం, కరి క్యులమ్కు ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక పేపరుగా ప్రవేశ పెడతారు. ఉపాధ్యాయ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? పిల్లలకు వారేం చెప్పాలి? బోధన పద్ధతులు, అనుసరించాల్సిన నిబంధనలు, ప్రజలతో మ మేకం ఎలా కావాలన్న అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. దీనికి 250 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఏడాది కోర్సులో ఉన్న 6 పేపర్ల స్థానంలో రెండేళ్ల కోర్సులో 12 పేపర్ల విధానం అమల్లోకి తెస్తున్నందునా, ఇలాంటి వివిధ అంశాలకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను సిద్ధం చేశారు. ఆప్షనల్ కోర్సులుగా వొకేషనల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్, గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ ఉంటాయి. వృత్తి సం బంధ సామర్థ్యాల పెంపునకు (ఎన్హాన్సింగ్ ప్రొఫెషనల్ కెపాసిటీస్) ప్రాధాన్యం ఇస్తారు. -
వేళ్ల మీద పరీక్ష
ఓ అంధ విద్యార్థి పరీక్షకు వెళ్లి జవాబులు రాసేందుకు.. బాబాయినో.. మామయ్యనో సహాయకుడిగా తెచ్చుకోవడం మామూలే. ఎవరి తోడూ లేకుండా బ్రెయిలీ లిపిలో జవాబులు రాసేవారిని చూశాం. కానీ ఈ విద్యార్థులు టెక్నాలజీని ఒడిసిపట్టి విజయవంతంగా పరీక్షలు రాస్తున్నారు. ప్రశ్నలకు లాప్టాప్లో జవాబులు చకచకా టైప్ చేసి ఈతరానికి చిరునామా మేమని నిరూపిస్తున్నారు. ..:: వాంకె శ్రీనివాస్ ఫొటోలు: సన్నీ సింగ్ కంప్యూటర్ ఉంటే చాలు మాకెవరి తోడూ అవసరం లేదంటున్నారు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్‌లోని నేత్ర విద్యాలయ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలకు చెందిన అంధ విద్యార్థులు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో లాప్టాప్లను వినియోగిస్తూ సమాధానాలిస్తున్నారు. సీఈసీ, హెచ్ఈసీ ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వీరు ఒక్క సంస్కృతం మినహా మిగతా పరీక్షలన్నీ కీబోర్డ్‌పై వేళ్లాడిస్తూ రాసేస్తున్నారు. రీడ్ అండ్ రైట్.. ఈ అంథ విద్యార్థులు సులభంగా పరీక్ష రాయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు. జాస్ (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) అనే స్క్రీన్ రీడర్ హెల్ప్‌తో వీరు పరీక్షలు రాస్తున్నారు. లాప్టాప్ ఆపరేటింగ్ కోసం వీరు ఎవరి సహకారమూ తీసుకోరు. ఎగ్జామ్ పూర్తయ్యే వరకూ వీరే సోలోగా దాన్ని ఆపరేట్ చేస్తారు. ‘అంధ విద్యార్థులకు జంబ్లింగ్ పద్ధతి ఉంది. అయితే లాప్‌టాప్‌లతో ఎగ్జామ్ రాస్తున్నందున వారందరికీ ఒకే గదిని అలాట్ చేశాం. వీరికి సంబంధించిన ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి వారికిచ్చిన లాప్టాప్లో సేవ్ చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా జాస్ సాఫ్ట్వేర్ వాడతారు. విద్యార్థులు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటారు. క్వశ్చన్ సెలెక్ట్ చేయగానే... కర్సర్ మూమెంట్‌ను బట్టి ఆ ప్రశ్న వారికి వినిపిస్తుంది. ప్రశ్న పూర్తికాగానే.. ఎంటర్ ప్రెస్ చేసి జవాబు టైప్ చేయడం ప్రారంభిస్తారు. విద్యార్థులకు వారు ఏం టైప్ చేస్తున్నారో కూడా హెడ్‌ఫోన్స్‌లో క్లియర్‌గా వినిపిస్తుంది. పొరపాటున తప్పు స్పెల్లింగ్ టైప్ చేసినా.. తిరిగి సెట్ చేసుకునే వెసులుబాటుంది. పరీక్ష పూర్తయిన తర్వాత వీరు టైప్ చేసిన జవాబు పత్రాన్ని ప్రింట్ తీసి.. ఓఎంఆర్ షీట్‌ను యాడ్ చేసి బోర్డుకు పంపిస్తాం’ అని తెలిపారు నేత్ర విద్యాలయ ప్రిన్సిపల్ యాదగిరిరెడ్డి. ఇతర కాలేజీల్లో సెంటర్ పడిన పిల్లలకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు. క్లాస్‌లోనూ లాప్టాప్లే.. ‘మా కాలేజీ 2007లో ప్రారంభమైంది. మొదట్లో ఇంటర్ మాత్రమే ఉండేది. 2010 నాటికి డిగ్రీ తరగతులు కూడా ప్రారంభించాం. ఇక్కడ చేరిన విద్యార్థులకు ముందుగా ఇంగ్లిష్ బేసిక్స్, గ్రామర్ నేర్పిస్తాం. కంప్యూటర్ ఆపరేటింగ్పై అవగాహన కల్పిస్తాం. వీరు మౌస్ లేకుండా నేరుగా కీబోర్డ్‌తోనే అన్ని పనులు చేసేలా గైడ్ చే స్తాం. జాస్ సాఫ్ట్‌వేర్‌తో వీరికి కంప్యూటర్ ఆపరేట్ చేయడం సులభం అవుతుంది. క్లాసుల్లో అధ్యాపకులు చెబుతున్న పాఠాలు వింటూ.. దాన్ని టైప్ చేసి సేవ్ చేసుకుంటారు. టైప్ చేస్తున్నప్పుడు పదాలు వినబడటం వల్ల.. వాటిని ఎలా పలకాలో కూడా విద్యార్థులకు అలవాటు అవుతోంది. ఇంటర్‌తో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా క్లాస్ రూమ్స్‌లో లాప్టాప్ వినియోగిస్తున్నారు. తొలినాళ్లలో లాప్టాప్ అంటేనే భయపడిన విద్యార్థులు ఇప్పుడు ఆపరేటింగ్‌లో అదరగొడుతున్నారు. ఇంగ్లిష్తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్పై అవగాహన ఉండటంతో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు వీరికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి’ అని వివరించారు యాదగిరిరెడ్డి. -
నా చిట్టి తల్లికి ఏమయ్యింది..?
తిరుపతిక్రైం: ‘‘పరీక్షలు బాగా రాస్తున్నా ను.. నాన్నా.. అని ముందు రోజు ఫోన్ చేసింది. మరుసటి రోజు ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంతలో నా చిట్టి తల్లికి ఏమయ్యింది’’ ఓ ప్రైవేట్ కాలేజీ భ వంతి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న రేవతి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్ తెలిపిన వివరాల మేరకు పులిచర్ల మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎ.వెంకటరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె ఎ.రేవతి(17) రూరల్ మండలం తుమ్మలగుంట సమీపంలోని ఉప్పరపల్లెలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రేవతి స్థానిక పద్మావతి కళాశాలలో జరుగుతున్న పరీక్షలకు ప్రతిరోజూ హాజరవుతోంది. శుక్రవారం ఉదయం కూడా పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగిసిన తరువాత కళాశాలకు చేరుకుని భోజనం చేసి, గదిలోని తోటి విద్యార్థులతో కలసి కొంత సేపు ఆట విడుపుగా ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్టడీ అవర్స్ ఉండడంతో విద్యార్థులందరూ మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లారు. అయితే రేవతి మాత్రం బిల్డింగ్‌లోని మూడో అంతస్తుపైన పిట్టగోడ పైకి ఎక్కి కూర్చుని, అక్కడి నుంచి కిందకు దూకేసింది. దీన్ని గుర్తించిన కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. రేవతిని చికిత్సకోసం రుయా ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు చెప్పారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించా రు. సంఘటనా స్థలానికి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్‌పల్లి సీఐ షరీఫుద్దీన్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఆత్మహ త్య గురించి కూడా విచారించిగా రేవతి పరీక్షలు సరిగా రాయలేదని ఆందోళనలో ఉన్నట్లు సహచర విద్యార్థినులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత రేవతి(16) మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి, హుటాహుటిన రుయా ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కుమా ర్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు గా విలపించారు. గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘పరీక్షలు బాగా రాస్తున్నాను నాన్నా’ అని చెప్పిన తన కుమార్తెకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అంటూ తల్లి విలపించడం అక్కడి వారి ని కలచివేసింది. మృతురాలి తండ్రి మాట్లాడుతూ ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని ఆరోపించారు. పెద్దిరెడ్డి పరామర్శ మెడికల్ కళాశాల మార్చురీ వద్దకు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడి, ఈ సంఘటన పై ఆరా తీస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలేజీ సిబ్బందికి సూచించారు. విద్యార్థి సంఘాల ఆందోళన సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కళాశాల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు చో టు చేసుకుంటున్నాయన్నారు. కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డును డిమాండ్ చేశారు. విచారణ జరిపి నిందితులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు జాఫర్ ఉన్నారు. -
పక్షం రోజులు ముందుగా పరీక్షలు
ఏప్రిల్ 1 నుంచే ఒకటో తరగతి నుంచి 9వ తరగతుల పరీక్షలు 11 నుంచి పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్ సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను 15 రోజుల ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సాధారణంగా వీటిని ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని గతంలోనే తేదీలు ఖరారు చేశారు. అయితే వాటిని ఏప్రిల్ 1 నుంచే నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షల స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే 9 తరగతుల పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం అయితే టీచర్లంతా ఆ పనుల్లోనే ఉంటుండడంతో 1 నుంచి 9 తరగతుల పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాన్ని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టెన్త్ మూల్యాంకనం కంటే ముందుగానే పరీక్షలను ప్రారంభించనున్నారు. 8వ తరగతి వరకు పరీక్షలు ఆరు రోజుల్లో పూర్తి కానున్నాయి. 9వ తరగతిలో 11 పేపర్ల విధానం ప్రవేశపెట్టడంతో ఏప్రిల్ 11తో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన జేసీజే పరీక్షలు
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) నియామక పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణకు సంబంధించిన ఒకేఒక్క సెంటర్ హైదరాబాద్ మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలను నిర్వహించారు. 3,069 మంది న్యాయవాదులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 2,386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముగ్గురు డీసీపీల పర్యవేక్షణలో 200 మంది రిజర్వ్ పోలీసులతో గట్టి బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ న్యాయవాదుల నిరసన ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆదివారం పరీక్షలను అడ్డుకోబోయారు. పరీక్ష కేంద్రమైన టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకొని కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై నిరసనకారులను విడిచి పెట్టారు.