సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే ముందు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
చదవండి: కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య..
Comments
Please login to add a commentAdd a comment