
సాక్షి, హైదరాబాద్: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. తెలుగులోని మట్టివాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు.' అని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. దీంతో దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా ఇది అని కొనియాడుతున్నారు.
చదవండి: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
Comments
Please login to add a commentAdd a comment