Oscars 2023: Megastar Chiranjeevi Congratulates To RRR Team For Naatu Naatu Won The Oscar For Best Original Son - Sakshi
Sakshi News home page

Oscar Awards 2023: కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. ఆర్‌ఆర్‌ఆర్ టీంకు చిరు అభినందనలు

Published Mon, Mar 13 2023 8:56 AM | Last Updated on Mon, Mar 13 2023 11:35 AM

Megastar Chiranjeevi Congratulates RRR Team Natu Natu Oscar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవేదికపై సత్తా చాటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆర్‌ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని, అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందని దర్శకధీరుడు రాజమౌళిని చిరు కొనియాడారు.

కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్‌రక్షిత్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిల పేర్లను ప్రస్తావిస్తూ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement