ఛీ.. ఛీ ఇదేం ఎయిర్‌ పోర్టు....మహిళలకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు | 5 Women Passengers At Doha Airport Over Forced Gynecological Tests | Sakshi
Sakshi News home page

ఛీ.. ఛీ ఇదేం ఎయిర్‌ పోర్టు....మహిళలకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు

Published Mon, Oct 24 2022 6:46 PM | Last Updated on Mon, Oct 24 2022 6:47 PM

5 Women Passengers At Doha Airport Over Forced Gynecological Tests - Sakshi

దోహ ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియాకి చెందిన ఐదుగురు మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించింది. సదరు మహిళా ప్రయాణికులు 2020లో ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో వెళ్తున్నప్పుడూ ఘోర పరాభవాన్ని చవి చూశారు. దీంతో సదరు మహిళలు ఆ ఖతార్‌ ఎయిర్‌ వేస్‌పై దావా వేయాలని సన్నద్ధమవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

రెండేళ్ల క్రితం అక్టోబోర్‌ 2020లో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో సిడ్నీకి వెళ్లినప్పుడూ ఆ మహిళలు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే...అక్కడ ఖతార్‌లో పెళ్లికాకుండా గర్భం దాల్చితే వారిని జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తుంది. ఐతే ఆ రోజు ఈ మహిళలు దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఖాతర్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలో దోహా ఎయిర్‌పోర్ట్‌ బాత్‌రూంలో ఒక నవజాత శిశువును ఎవరో వదిలేసి వెళ్లారు.

దీంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సదరు మహిళలను తుపాకితో బెదిరించి బలవంతగా అంబులెన్స్‌లో టార్మాక్‌కు తీసుకెళ్లి బలవంతంగా గైనాకలజిస్ట్‌ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రయాణికురాలు నర్సు మాట్లాడుతూ... ఆ ఘటన తర్వాత మళ్లీ ఈ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించలేదని, చాలా మానసిక క్షోభకు గురైనట్లు వివరించారు. సదరు మహిళా ప్రయాణికులు ఆ ఎయిర్‌పోర్ట్‌పై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఖతార్‌ అధికారులు ఈ విషయమై  ఆ మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేసి సదరు అధికారిని సస్పెండ్ చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

(చదవండి: దేవుడిలా రక్షించిన వాచ్‌...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement