passengers trouble
-
అటెన్షన్ ప్లీజ్.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ముఖ్యగమనిక
హైదరాబాద్, సాక్షి: పండుగ వేళ ప్రయాణికులకు తీపివార్త చెబుతుందనుకున్న హైదరాబాద్ మెట్రో యాజమాన్యం.. షాకిచ్చింది. అయితే అది టికెట్ ఛార్జీల విషయంలో కాదు. మెట్రో ద్వారా దూర ప్రయాణం చేస్తూ వందల మందికి ఊరట ఇస్తున్న పార్కింగ్ విషయంలో..నగరంలో నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లు కీలక గమ్యస్థానాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు స్టేషన్లో ఇక ఫ్రీ పార్కింగ్ కనిపించదు. ఈ మేరకు మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నాగోలు, మియాపూర్ స్టేషన్లలో పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయనున్నారు. టూ వీలర్‌కు, ఫోర్ వీలర్‌కు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించనున్నారు. అయితే ఈ ఫీజు నామమాత్రంగానే ఉంటుందని, ప్రయాణికుల వాహనాల భద్రత కోసమే వసూలు చేస్తున్నట్లు చెబుతోంది. హైదరాబాద్‌లో చాలా మెట్రో స్టేషన్లకు పార్కింగ్ సమస్య ఉంది. అయితే కొన్ని స్టేషన్ల వద్ద ఆ సదుపాయం ఉండగా.. పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. -
నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఎంతకూ కదలకపోవడంతో క్యాబిన్ లోపల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.తర్వాత కొద్ది సేపటికి విమానం నుంచి ప్రయాణికులను దిగాల్సిందిగా సిబ్బంది కోరారు. విమానం నుంచి దిగిన వారంతా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులైతే అలసిపోయారు. విమానంలో ఎయిర్‌కండీషన్ కూడా పనిచేయకపోవడంతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ప్రయాణికుల్లోని ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ పోస్టును విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు.ఎయిర్ఇండియా ప్రైవేటైజేషన్ పూర్తగా ఫెయిలైందనడానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఈ పోస్టుకు స్పందించిన ఎయిర్ఇండియా సంస్థ తమ విమానం ఆలస్యమవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇటీవలే ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం కూడా ఆరు గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో కూడా ఏసీ లేకుండా ప్రయాణికులు ఆరు గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివచ్చింది. -
Vishaka: విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఢిల్లీ ఎయిర్ఇండియా, విజయవాడ ముంబయి,హైదరాబాద్, చెన్నై,ఇండిగో, ఎయిర్ఇండియా,విమానాలు రద్దయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారి పొగ మంచు ఏర్పడటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పండగ రోజు తమను గమ్యస్థానాలకు వెళ్లకుండా చేశారని ప్రయాణికులు ఇండిగో, ఎయిర్ఇండియా విమాన సంస్థల అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదీచదవండి.. చెన్నై వెళ్లే విమానాల దారి మళ్లింపు -
Video: ఓకే రన్‌వేపై ప్రమాదానికి గురైన రెండు విమానాలు
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఒకే రన్‌వేపై అదుపుతప్పాయి. కికోబోగా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు..యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్ నుంచి బయల్దేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా రన్‌వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్‌వేపై నుంచి కొద్దిదూరం పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో విమానానికి బాగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. This is crazy 🤯 An Embraer E120 had problems with its landing gear when landing in Kikoboga in Tanzania and left the runway. another aircraft was sent to rescue passengers, but this one had problems taking off, hit a building and caught fire.pic.twitter.com/sTJmeEcRx5 — Flight Emergency (@FlightEmergency) November 29, 2023 కాగా ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆరుగంటలకే కికోబోగా ఎయిర్పోర్ట్ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబిజార్కు వెళ్లడానికి బయలు దేరింది. రన్‌వేపై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూడా విమానం చాలా వరకూ దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలి వద్ద భారీగా పొగలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ 🇹🇿 Embraer E120 Brasília had problems with its landing gear in Kikoboga, Tanzania and left the runway. Another Brasília plane had problems taking off, hit a building and caught fire. pic.twitter.com/KauBBB3V5U — Ryan sikorski (@Ryansikorski10) November 30, 2023 -
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ హంగామా
సాక్షి, హైదరాబాద్: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై హంగామా సృష్టించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొందనే మెట్రో రైలులో హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారికి మెట్రో ప్రయాణీకులే షాకిచ్చారు. సీబీఎన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్న ఓ మధ్య వయస్కుడు మాట్లాడుతూ... ‘ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఏం చేయాలో అది చేయండి. అంతేకానీ ఊరికే అరచి ఏం ఉపయోగం’’ అని ప్రశ్నించడంతో వారు ఖంగు తిన్నారు. అయితే టీడీపీ వర్గం వారు అక్కడితో ఆగిపోలేదు.. ‘‘ఏం చేయమంటారు’’ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి కూడా అతడు ఓపికగా బదులిచ్చాడు. ‘‘న్యాయపోరాటం ఒకటి నడుస్తోంది కదా...’’ అని సమాధానమిచ్చారు. టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొంతమంది మియాపూర్నుం నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైలులో ప్రయాణిఒంచారు. దారిపొడవునా నినాదాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించాలన్నది వారి ఉద్దేశం. మియాపూర్‌లో మెట్రోరైలు ఎక్కే సమయంలోనూ టీడీపీ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అందరినీ ఒకేసారి వదలడం లేదంటూ పేచీ పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలను మాత్రమే లోనికి వదిలే క్రమంలో ఇతరులు పలువురు ఇబ్బందులకు గురయ్యారు. మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు మెట్ల వద్ద ఉన్న డోర్‌ను కాసేపు క్లోజ్ చేయడంతో.. చిన్నపిల్లలతో అరగంటపాటు మహిళలు, ఇతర ప్రయాణికులు మెట్లపై నిల్చునున్నారు. దీంతో అసహనానికి గురైన కొందరు మహిళా ప్రయాణికులు ఇదేంటి అంటూ పోలీసులను నిలదీశారు. ఇక ప్లకార్డులతో మెట్రో కింద ఫోటోలకు ఫోజులిచ్చిన కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ‘Let’s Metro for CBN’ protest by travelling from Miyapur-LB Nagar was held in #Hyderabad metro by supporters of Chandrababu Naidu, by wearing black t-shirts. Police and passengers stopped them from causing inconvenience to public pic.twitter.com/KxIx0vTKN6 — Naveena (@TheNaveena) October 14, 2023 -
విశాఖలో విమాన ప్రయాణికుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు కడపకు విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్ నుంచి జూలై వరకు విమాన ప్రయాణికుల గణాంకాలను గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్యలో 33.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి 7,74,925 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది అదే సమయానికి 10,37,656 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయం 36.1 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య 20,289 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య ఈ ఏడాది 27,612కు పెరిగింది. ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు 19.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 3.09 లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు కూడా గణనీయంగా ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సంఖ్యలో 22.6 శాతం వృద్ధి నమోదైంది. తిరుపతి, కర్నూలు ఎయిర్‌పోర్టుల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప క్షీణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 18,84,926 మంది ప్రయాణించారు. దేశం మొత్తం మీద చూస్తే ఆ నాలుగు నెలల కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 10.04 కోట్ల నుంచి 12.30 కోట్లకు చేరుకుంది. పెరిగిన విదేశీ ప్రయాణికులు రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి మాత్రమే విదేశీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. విశాఖ నుంచి విదేశీ ప్రయాణికుల సంఖ్య 20.9 శాతం వృద్ధితో 20,097 నుంచి 24,143కు చేరితే, విజయవాడలో 14.4 శాతం వృద్ధితో 14,978 నుంచి 17,135కు చేరుకుంది. -
Odisha Train Tragedy:ఖాళీ చేతులతో 88 మందిని రక్షించి..
ఒడిశా:ఎదో బాంబు పేలిన శబ్దం. వచ్చి చూస్తే.. ఘోర రైలు ప్రమాదం. ఎక్కడ చూసినా అరుపులు, మూలుగులు, రక్తం, చెదిరిపడిన శరీర భాగాలు అన్నీ ఒళ్లు జలదరించే దృశ్యాలే. వాటన్నింటినీ దాటుకుని దాదాపు 88 మంది ప్రాణాలను కాపాడారు ఆ ఇద్దరు యువకులు. రెస్క్యూ పరికరాలు ఏం లేకున్నా.. పడిపోయిన బోగీల్లోకి ధైర్యంగా వెళ్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బయటికి తీశారు. గ్రామస్థుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులే దీపక్ రంజన్, శుభంకర్ జెనాలు. రెస్క్యూ టీంలు రాకముందే ప్రమాదంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతా అల్లకల్లోలం.. దీపక్ రంజన బెహ్రా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. స్థానిక పిల్లలతో కలిసి మైదానంలో ఆటలాడుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. ఘోర రైలు ప్రమాదం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంతా కలిసి సహాయ చర్యలు మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటికి రెస్క్యూ బృందాలు వచ్చేవరకు అన్నీ తామే అయి చూసుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి నీళ్లు, ఆహారం పంచిపెట్టారు.'బోగీల వద్దకు మేము వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంది. చీకటిగా ఉన్న బోగీల్లోకి వెళ్లి చాలామందిని బయటికి లాగాము. బోగీల కిందపడి కొంతమంది విపరీతంగా అరుస్తున్నారు' అని చెప్పారు. కళ్లలో మెదులుతున్నాయి.. 'గాయపడ్డవారికి మొదటి గంట చాలా కీలకం. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళితే బతికే అవకాశం ఉంటుంది. మేమంతా కలిసి మా దగ్గర ఉన్న వాహనాలలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించాము. గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. రెస్క్యూ టీంలు వచ్చే సమయానికే మేము చాలా మందిని రక్షించాము' అని దీపక్ తెలిపారు. 'మేము బోగి లోపలికి వెళ్లేసరికి ఓ గర్భవతి అరుస్తూ కనిపించింది. ఆమెను మేము బయటికి తీసుకురాగలిగాము. కానీ బోగీల లోపలే ఉన్న తన ఇద్దరు కుమారులను రక్షించమని ఆవిడ అడిగిన తీరు ఇంకా కళ్లలో మొదలుతోంది. ఆ భయానక దృశ్యాలు ఇంకా మా మనసును వెంటాడుతున్నాయి.' అని శుభంకర్ చెప్పారు. ఇదీ చదవండి:ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
గాల్లో విమానంలో అనూహ్య ఘటన
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్‌పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది. చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే? -
ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన.. ప్రయాణికులను ఎక్కించుకోకుండా..
బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్‌లైన్‌ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు. ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్వర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. కాగా ప్రయాణికులకు బోర్డింగ్‌పాస్‌లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్‌లో ఇదే నా చివర ఫ్లైట్ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్ చేశారు. కాగా గోఫస్ట్ ఎయిర్వేస్ ఆయా ట్వీట్లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
వారం రోజులుగా ఓడలోనే.. న్యూ ఇయర్ ప్లాన్ రివర్స్.. తీవ్ర ఆగ్రహం..
న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రూజ్ షిప్ వారం రోజులుగా ఎక్కడా ఆపకుండా సముద్రంలోనే ఉండిపోయింది. జనవరి 1న ఆస్ట్రేలియా చేరుకోవాల్సిన ఈ ఓడ.. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేక ఆగిపోయింది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన వందల మంది ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సదరు ఓడను నిర్వహిస్తున్న సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు ఆపారు? అయితే ఈ ఓడ హల్(అడుగు భాగం)పై ఫంగస్ పేరుకుపోయింది. బ్యాక్టిరీయా, సూక్ష్మ జీవలు, మొక్కలు వంటి బయోఫౌల్ పెరిగింది. ఇది తమ జలాల్లోలోకి ప్రవేశిస్తే హానికరం అని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఓడను లంగర్లు వేసుకునేందుకు అనుమతించలేదు. దీంతో గజ ఈతగాళ్లను పెట్టి ఆ ఫంగస్‌ను మొత్తం తొలగించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఓడ కదిలింది. అయితే ఈ కారణంగా జనవరి1న గమ్యానికి చేరుకోవాల్సిన క్రూజ్ షిప్ జనవరి 2న చేరుకుంటోంది. ఈ ఓడలో ఎక్కువమంది ప్రయాణికులు ఆస్ట్రేలియాకు చెందిన వారే ఉన్నారు. డిసెంబర్ 23న ఈ క్రూజ్ షిప్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ పోర్టు నుంచి బయలుదేరింది. చివరిసారి డిసెంబర్ 26న వెల్లింగ్టన్ పోర్టులో ఆగింది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఇందులోని ప్రయాణికులు భూమిపై కాలు పెట్టలేకపోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఓడలోనే ఉన్నారు. ఈ కారణంగా నాలుగు స్టాపుల్లో క్రూజ్ షిప్ ఆగలేదు. తమ జలాల్లోకి ప్రవేశించే ప్రతి ఓడను చెక్ చేశాకే అనుమతిస్తామని ఆస్ట్రేలియా చెప్పింది. ఫంగస్ ఉన్నందునే న్యూజిలాండ్ ఓడను ఆపినట్లు స్పష్టం చేసింది. దిద్దుబాటుగా క్యాష్‌బ్యాక్.. మరోవైపు ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో వికింగ్ ఓరియన్ ఓడ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలకు దిగారు. అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరారు. పరిహారంగా టికెట్ ఖరీదులో కొంత వెనక్కి ఇస్తామన్నారు. చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..! -
ఛీ.. ఛీ ఇదేం ఎయిర్ పోర్టు....మహిళలకు బలవంతంగా గైనకాలజీ పరీక్షలు
దోహ ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియాకి చెందిన ఐదుగురు మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించింది. సదరు మహిళా ప్రయాణికులు 2020లో ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తున్నప్పుడూ ఘోర పరాభవాన్ని చవి చూశారు. దీంతో సదరు మహిళలు ఆ ఖతార్ ఎయిర్ వేస్‌పై దావా వేయాలని సన్నద్ధమవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అక్టోబోర్ 2020లో ఖతార్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వెళ్లినప్పుడూ ఆ మహిళలు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే...అక్కడ ఖతార్‌లో పెళ్లికాకుండా గర్భం దాల్చితే వారిని జైల్లో పెట్టి కఠినంగా శిక్షిస్తుంది. ఐతే ఆ రోజు ఈ మహిళలు దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఖాతర్ ఎయిర్వేస్లో ప్రయాణించాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలో దోహా ఎయిర్పోర్ట్ బాత్రూంలో ఒక నవజాత శిశువును ఎవరో వదిలేసి వెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు సదరు మహిళలను తుపాకితో బెదిరించి బలవంతగా అంబులెన్స్‌లో టార్మాక్‌కు తీసుకెళ్లి బలవంతంగా గైనాకలజిస్ట్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రయాణికురాలు నర్సు మాట్లాడుతూ... ఆ ఘటన తర్వాత మళ్లీ ఈ ఎయిర్వేస్లో ప్రయాణించలేదని, చాలా మానసిక క్షోభకు గురైనట్లు వివరించారు. సదరు మహిళా ప్రయాణికులు ఆ ఎయిర్‌పోర్ట్‌పై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఖతార్ అధికారులు ఈ విషయమై ఆ మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేసి సదరు అధికారిని సస్పెండ్ చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...) -
‘హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త’
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టికెట్లను ఇకనుంచి వాట్సప్ మాధ్యమం ద్వారా కొనుగోలు చేసి జర్నీ చేయొచ్చు. దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సప్ ద్వారా ఈ– టికెట్ కొనుగోలు చేసే విధానానికి ఎల్అండ్టీ మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం బిల్ ఈజీ, సింగపూర్‌కు చెందిన షెల్ఇన్ఫోగ్లోబల్ ఎస్సీ సంస్థల సహకారం, భాగస్వామ్యం తీసుకుంది. దీంతో ప్రయాణికులు తమ వాట్సప్ నంబరు ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు చేసే అవకాశం దక్కింది. ఈ– టికెట్‌ను మెట్రో స్టేషన్లోకి ప్రవేశించే ముందు ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేటు వద్ద చూపి లోనికి ప్రవేశించవచ్చు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. డిజిటలైజేషన్ దిశగా నగర మెట్రో అడుగులు వేస్తుందన్నారు. డిజిటల్ ఇండియా మిషన్‌కు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. కాలుష్య రహిత ప్రయాణం, డిజిటల్ సాంకేతికతకు మెట్రో పట్టం కడుతోందన్నారు. బిల్ఈజీ సంస్థ ఎండీ ఆకాశ్ దిలీప్ పాటిల్ మాట్లాడుతూ..ఎల్అండ్టీ మెట్రోతో భాగస్వామిగా చేరడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ– టికెట్ కొనుగోలు చేయండిలా.. ► ముందుగా వినియోగదారులు మెట్రోరైల్ నంబరు 8341146468 వాట్సప్ నంబరుకు హాయ్ అనే సందేశాన్ని పంపించాలి. ► మీ నంబరుకు ఓటీపీతో పాటు ఈ– టికెట్ బుకింగ్‌కు సంబంధించి యూఆర్ఎల్ లింక్ వస్తుంది. 5 నిమిషాల వ్యవధి లభిస్తుంది. ►లింక్‌ను క్లిక్ చేస్తే ఈ– టికెట్ గేట్‌వే వెబ్‌పేజ్ తెరుచుకుంటుంది. ►ఆ తర్వాత మీరు ప్రయాణించే మార్గాన్ని ఎంటర్‌చేసి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, రూపే డెమిట్ కార్డ్‌ల ద్వారా టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు.దీంతో మీ వాట్సప్‌కు ఈ– టికెట్ యూఆర్ఎల్ లింక్ వస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే క్యూఆర్ ఈ– టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ క్యూఆర్ ఈ–టికెట్‌ను స్టేషన్లోకి ప్రవేశించే ముందు ఏఎఫ్సీ గేటు వద్ద స్కాన్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్ టికెట్ ఒకరోజు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. -
ఒక్క రైలు ఖాళీ ఉండట్లే.. స్పెషల్ ట్రైన్ల కథేంది?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇందుకనుగుణంగా అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేకంగా గతేడాది వరకు కోవిడ్ కారణంగా వాయిదా పడిన ప్రయాణాలు ఈ సంవత్సరం తిరిగి మొదలయ్యాయి. దీంతో అన్ని రూట్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి విశా ఖ, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, పట్నా, కోల్ కత్తా, భువనేశ్వర్, తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 నుంచి 200 కు పైగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో బంధువుల ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరగడంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రైళ్ల కొరత... ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల సకాలంలో రిజర్వేషన్లు లభించడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే గోదావరి, గౌతమి, ఈస్ట్‌కోస్ట్, కోకనాడ తదితర రైళ్లలో ఈ నెలాఖరు వరకే కాకుండా వచ్చే నెలలోనూ వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. తిరుపతికి వెళ్లే రైళ్లలోనూ డిమాండ్ భారీగా పెరిగింది. సాఫ్ట్వేర్ నిపుణులు, పర్యాటకుల రద్దీతో బెంగళూరు, హౌరా, చెన్నై వైపు వెళ్లే రైళ్లలో నిరీక్షణ తప్పడం లేదు. చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్) సికింద్రాబాద్ నుంచి పట్నా వరకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ రూట్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. దీంతో నెల నుంచి 2 నెలల వరకు ఎదురుచూడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కొంతకాలంగా ప్రయాణికుల రద్దీ 20 శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక రైళ్లేవీ... రద్దీ ఉన్న కొన్ని మార్గాల్లో ఇటీవల కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలో ఎక్కువ శాతం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కావడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని పట్నా వెళ్లేందుకు రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్న ఓం ప్రకాశ్ తెలిపారు. హయత్‌నగర్‌లోని ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్‌గా పని చేస్తున్న ఓంప్రకాశ్, అతని సోదరుడు జయప్రకాశ్‌లు సొంత ఊరికి వెళ్లేందుకు నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 85 ప్రధాన రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా మరో 100కు పైగా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. అయినా ప్రయాణం కోసం పడిగాపులు తప్పడం లేదు. -
రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..
సాక్షి, రాజమహేంద్రవరం: రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. ఈ పనిని రైల్వే రక్షక దళానికి (ఆర్పీఎఫ్) అప్పగించింది. తోటి ప్రయాణికుల వలన ఎదురవుతున్న సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. వీటి ప్రకారం ఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు. ఫోన్లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు. చదవండి: (చట్టాలు చేయకుండా నిలువరించలేరు) రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలి. ఈ నిబంధనలను పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోటి ప్రయాణికుల వలన ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు.. అలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపై ఆర్ఫీఎఫ్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుంటారు. దీనిపై బోగీల్లోని ఆర్ఫీఎఫ్ సిబ్బంది, టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. చదవండి: (TTD: ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల) ఫోన్ కాల్ చాలు.. జైలుకు పంపేస్తాం బోగీల్లో తోటి ప్రయాణికుల వలన ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు.. న్యూసెన్స్ కేసు నమోదు చేసి, జైలుకు పంపుతాం. – సైదయ్య, ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్, రాజమహేంద్రవరం -
ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా!
దేశంలో కోవిడ్ కారణాల వల్ల విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం దేశీయ విమానాయన సంస్థ ఇండిగో 'ప్లాన్ బి'ని అందుబాటులోకి తెచ్చింది. ఇండిగో ఎండ్ నుండి ఫ్లైట్ రద్దు చేసినా లేదా రీషెడ్యూల్ చేసినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్ధం తమ వద్ద ప్లాన్ బి' ఉందని తెలిపింది. ఇంతకీ ఆ ప్లాన్ బి' ఏంటని అనుకుంటున్నారా? మీ ఫ్లైట్ సమయం/లేదా తేదీని మార్చుకోవచ్చు. ఇండిగో నిబంధనలకు లోబడి ఉంటే ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా లేకుండా రీఫండ్ పొందవచ్చని ఇండిగో తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. #6ETravelAdvisory: Do not wait in queue, for any cancelled/rescheduled flight for more than 2 hrs visit- https://t.co/evofgYvfrV, all the options available on Plan B are same that are offered at our contact center. For further assistance DM us on Twitter/Facebook pic.twitter.com/AuFYvUEumY — IndiGo (@IndiGo6E) January 5, 2022 ఇండిగో అధికారిక ట్విట్ ప్రకారం.. 2 గంటల కంటే ఎక్కువసేపు రద్దు చేయబడిన లేదా, రీషెడ్యూల్ చేయబడిన ఏదైనా విమానాల కోసం ప్రయాణికులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. “ప్రస్తుతం కోవిడ్‌తో ప్రయాణ పరిమితులు, వాతావరణంలో మార్పుల కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడొచ్చు. అందుకే మార్పులు లేదా రద్దు చేయాల్సి వస్తే ప్రయాణీకులకు వారి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌కు సమాచారం అందిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్లో పేర్కొంది. చదవండి: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగంలో మరో సంచలనం! -
టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
డోడొమా: టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లిడుంబే పరిధిలో హైవేపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షత గాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. అధికవేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారులు కారు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనిపై టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహు హసన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చదవండి: శ్రీకృష్ణుడితో నేను రోజు మాట్లాడతా: అఖిలేష్ యాదవ్ -
ట్రావెల్స్ బస్సు దగ్ధం
పర్చూరు: అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలొచ్చి ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు–చిలకలూరిపేట ఆర్ అండ్ బీ రోడ్డుపై.. పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గురువారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌లోని పఠాన్‌చెరువు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 11 మందిని, చిలకలూరిపేటలో ఒకరిని దించింది. పర్చూరు, చీరాల మీదుగా గుంటూరు జిల్లా బాపట్లకు బస్సు వెళ్లాల్సి ఉంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వచ్చేసరికి గేర్ రాడ్డు పక్క నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి అందులో ఉన్న మిగిలిన 8 మంది ప్రయాణికులను కిందికి దించాడు. అంతలోనే ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులతో పాటు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఆర్డీవో ప్రభాకరరెడ్డి తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యద్ధనపూడి ఎస్ఐ రత్నకుమారి చెప్పారు. చదవండి: ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు -
సీటింగ్ 30.. ట్రావెలింగ్ 134
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): జైనథ్ మండలం భోరజ్ బస్‌స్టాండ్ సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సును ఏఎంవీఐ స్రవంతి సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారులతో కలిసి 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలతో హెదరాబాద్కు వెళ్తున్న బస్సు (పీవై05ఈ1433)ను తనిఖీ చేయగా అందులో 134 ప్రయాణికులు ఉన్నారు. 30 మంది ప్రయాణించే బస్సులో 134 మందిని తరలిస్తుండటంతో ఓవర్‌లోడ్ కారణంగా బస్సును సీజ్‌చేసి ప్రయాణికులతోసహా ఆదిలాబాద్ బస్‌స్టాండ్‌కు తరలించారు. దీంతో కూలీలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి ఆదిలాబాద్ బస్టాండ్‌లోనే సేదతీరారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ బస్‌స్టాండ్‌కు చేరుకుని కూలీలతో మాట్లాడా రు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బస్సు ఓనర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. -
హైదరాబాద్: ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులు రద్దు!
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌కు చెందిన నగేష్ ఈ నెల 12వ తేదీన విజయవాడకు వెళ్లేందుకు ఆర్టీసీ గరుడప్లస్ బస్సు (1402) కోసం అడ్వాన్స్‌గా రిజర్వేషన్ బుక్ చేసుకున్నాడు. ఉదయం 5.50 గంటలకు ఎస్సార్‌నగర్ నుంచి బస్సు బయలుదేరవలసిన సమయాని కంటే అరగంట ముందే చేరుకున్నాడు. కానీ ఉదయం 8.15 గంటల వరకు కూడా బస్సు రాలేదు. పైగా బస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం లేదు. అసలు వస్తుందో, రాదో కూడా తెలియలేదు. టీఎస్ఆర్టీసా కాల్‌సెంటర్‌ను సంప్రదించాడు. ఎలాంటి స్పందన లేదు. చివరకు రెండు గంటల తరవాత ఆర్టీసీ బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన అధికారులు సదరు బస్సు రద్దయినట్లు తాపీగా సెలవిచ్చారు. కానీ ఆ బస్సు కోసం ఉదయం నాలుగున్నరకే పాయింట్‌కు చేరుకున్ననగేష్ మాత్రం 8 గంటల వరకు అంటే మూడున్నర గంటల పాటు ఆందోళనగా ఎదురు చూడవలసి వచ్చింది. ఇది ఒక్క నగేశ్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా రద్దవుతున్న దూరప్రాంత బస్సుల వల్ల అప్పటికప్పుడు మరో బస్సులో వెళ్లేందుకు అవకాశం లేక ప్రయాణికులు తరచుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు మాత్రం ప్రైవేట్ వాహనాల్లో పెద్ద మొత్తం చెల్లించవలసి వస్తోంది. నిర్వహణలో సమన్వయ లోపం... బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ముందే చేరవేయాలి. మరో బస్సు అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బయలేదేరవలసిన గరుడ ప్లస్ బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల బస్సు రద్దయినట్లు అధికారులు తెలిపారు. కానీ ప్రయాణికులకు ఆ సమాచారం అందజేయడంలో తమ సిబ్బంది విఫలమైనట్లు డివిజనల్ మేనేజర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో ఒక్క ఎస్సార్ నగర్ నుంచి బయలుదేరే ప్రయాణికులే కాకుండా కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, లకిడికాపుల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో అదే బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ‘ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాలేకపోయాను. ఇది చాలా దారుణం’. అని నగేశ్ విస్మయం వ్యక్తం చేశారు. ఆదరణ లేకపోవడమే కారణమా... ► సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దవుతున్నట్లు అధికారులు పైకి చెబుతున్నప్పటికీ ఏసీ బస్సులకు ఆదరణ లేకపోవడం వల్లనే అప్పటికప్పుడు రద్దు చేస్తున్నట్లు తెలిసింది. ► ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వెనుకంజ వేస్తున్నారు. ఏసీ వల్ల కోవిడ్ వ్యాపిస్తుందేమోననే ఆందోళన ఇందుకు కారణం. ►దీంతో కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో బస్సులను రద్దు చేసుకోవలసి వస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. కానీ అదే సమాచారాన్ని ముందస్తుగానే ప్రయాణికులకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించకపోవడం ఆర్టీసీ అధికారులు బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది. పనిచేయని కాల్ సెంటర్ ► ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎప్పటికప్పుడు బస్సు సమాచారం తెలుసుకొనేందుకు ఆర్టీసీ కాల్సెంటర్లను ఏర్పాటు చేసింది. ► ఆర్టీసీ కాల్‌సెంటర్ నెంబర్లు : 040–30102829, 040–68153333 ► ఈ కాల్‌సెంటర్లు ఇరువైనాలుగు గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇవ్వాలి. ► కానీ అందుకు విరుద్ధంగా ఫోన్ చేసినా ఎలాంటి సమాచారం లభించడం లేదని, స్పందన కరువవుతుందని ప్రయాణికులలు పేర్కొంటున్నారు. -
లాక్డౌన్: తొలిరోజు ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: ఆకస్మిక లాక్డౌన్ తొలిరోజు బుధవారం బస్సు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య బస్సులు నడుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దూర ప్రాంత ప్రయాణాలపై స్పష్టత కొరవడటంతో గందరగోళం ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు బస్సులు బయలుదేరతాయని భావించి బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులకు నిరాశ ఎదురైంది. డిపోల నుంచి ఒకమాదిరి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు లాక్డౌన్ సమయంలోపు గమ్యం చేరేలా అధికారులు టైమ్‌టేబుల్ ఖరారు చేసి పంపించేశారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్నారు. అయితే ఈ ప్రాంతాలకు ప్రయాణ సమయం ఎక్కువ కావడంతో బస్సులు నడపలేదు. మిగతా ప్రాంతాలకు ఉదయం 8గంటల లోపే బస్సులన్నీ వెళ్లిపోయాయి. ఆ తర్వాత కొత్త ట్రిప్పులు అధికారులు నడపలేదు. దీంతో దూరప్రాంత ప్రయాణికులు, ఇతరులు ఉస్సూరుమంటూ వెనుదిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల నుంచి కూడా నగరానికి బస్సులు రాలేదు. బు«ధవారం రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో గమ్యం చేరి తిరిగి డిపోలకు చేరుకునే అవకాశం ఉన్న దగ్గరి ప్రాంతాల మధ్య మాత్రమే ఎక్కువగా బస్సులు నడిచాయి. 10 శాతం బస్సులే.. లాక్డౌన్ తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా (సిటీ సర్వీసులు మినహా) 650 బస్సులు తిరిగాయి. ఇందులో దూరప్రాంతాలకు వెళ్లిన బస్సులు 12 మాత్రమే కావడం గమనార్హం. గురువారం కూడా ఇదేతరహాలో బస్సులను నడపనున్నట్లు, కేవలం 10 శాతం బస్సులు మాత్రమే నడిచే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు బస్టాండ్లకు రావాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉదయం నాలుగు గంటల పాటు సిటీ బస్సులు రాకపోకలు సాగించగా.. చాలాప్రాంతాల్లో బస్సులు ఖాళీగానే కనిపించడం గమనార్హం. దూరప్రాంతాలకు రైళ్లే దిక్కు రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా దక్షిణ మధ్య రైల్వే రైళ్లను యథావిధిగా నడుపుతోంది. ప్రస్తుతం 80 వరకు రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. గత నెల వరకు ఎక్కువగానే ఉన్నప్పటికీ, సెకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరగడంతో ఏప్రిల్ రెండో వారం నుంచి రైలు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీంతో దాదాపు 30 శాతం రైళ్లు దశల వారీగా రద్దవుతూ వచ్చాయి. మిగతా రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో సరిహద్దులు దాటాలంటే రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ మామూలుగానే ఉంది. -
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6గంటలకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికి రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు పడిగాపులు గాస్తు ఇబ్బందికి గురవుతున్నారు. కాగా మొత్తం 172 మంది ప్రయాణికులు స్పైస్ జెట్ విమానం రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విమానం రాకపోవడానికి సాంకేతిక కారణాలే కారణం కావొచ్చని అధికారులు పేర్కొన్నారు. -
చెప్పిన రూట్లలో కాకుండా నచ్చిన రూట్లలోనే బస్సులు..!
సాక్షి, కరీంనగర్/ మెదక్: దసరా పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికుల జేబుకు బస్ చార్జీల రూపంలో చిల్లులు పడుతున్నాయి. ఒక వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల్లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులను తిప్పే ప్రైవేట్ సిబ్బంది ఇష్టారీతిన దోచుకుంటున్నారు. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం ఉంటడం లేదు. చార్జీల దోపిడీ ఎప్పుడు ఆగుతుందోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కేసులు.. ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తామని..గతంలో ఉన్న బస్సు ఛార్జీ కంటే ఎక్కువ వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని రూట్లలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ డిటీసీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సులకు కండక్టర్లను, డిపో మేనేజర్ కేటాయిస్తామని వెల్లడించారు. కండక్టర్లకు టిమ్ మిషన్లు అందజేస్తామన్నారు. అన్ని బస్సుల్లో రాయితీ బస్‌పాస్‌లకు అనుమతి ఇచ్చామన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే 100కు లేదా..ఆర్టీవో హెల్ఫ్ లైన్ 9391578144 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ప్రైవేట్ బస్సుల నిర్వాహకుల చేతివాటం.. మెదక్‌లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులు చెప్పిన రూట్లలో కాకుండా..వారికి నచ్చిన మార్గాల్లో నడిపిస్తూ ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. బస్సుల యాజమానులను కలెక్టర్ పిలిచి మందలించారు. ఆర్టీసీ అధికారులు చూపిన రూట్లలో మాత్రమే నడపాలని ఆదేశించారు. -
ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు
కీసర: ప్రయాణికుల నుంచి టికెట్ల డబ్బులు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వారి కష్టాలను మాత్రం గాలికొదిలేసింది. రంగారెడ్డి జిల్లా కీసర వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎస్వీకేడీటీ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో కీసర వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. అయితే కొన్ని గంటల వరకూ తమను ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తిరుగు ప్రయాణాలకు కూడా టిక్కెట్లు తీసుకున్నామని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్లో ట్రావెల్స్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. -
అదుపు తప్పితే ఇక అంతే!
- పరిమితికి మించి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అమ్రాబాద్: ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ప్రయాణం చేస్తున్నారు. మండలంలోని అమ్రాబాద్, తిర్మలాపూర్(బీకే), లఖ్మాపూర్(బీకే), మాదవానిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి తదితర గ్రామాల నుంచి ఆటోలు జీపులు అధికంగా తిరుగుతాయి. ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకుని ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఆయాగ్రామాల్లో వాహనాలు బోల్తాపడి ప్రయాణికులు గాయాలపాలైన ఘటనలూ లేకపోలేదు. అప్పుడప్పుడు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు వేస్తున్నా ప్రైవేట్వాహనదారుల్లో మార్పు రావడంలేదు.