తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఒకే రన్‌వేపై అదుపుతప్పాయి. కికోబోగా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు..యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్ నుంచి బయల్దేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా రన్‌వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్‌వేపై నుంచి కొద్దిదూరం పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో విమానానికి బాగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు.
This is crazy 🤯
— Flight Emergency (@FlightEmergency) November 29, 2023
An Embraer E120 had problems with its landing gear when landing in Kikoboga in Tanzania and left the runway.
another aircraft was sent to rescue passengers, but this one had problems taking off, hit a building and caught fire.pic.twitter.com/sTJmeEcRx5
కాగా ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆరుగంటలకే కికోబోగా ఎయిర్పోర్ట్ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబిజార్కు వెళ్లడానికి బయలు దేరింది. రన్‌వేపై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కూడా విమానం చాలా వరకూ దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలి వద్ద భారీగా పొగలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చదవండి: ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ
🇹🇿 Embraer E120 Brasília had problems with its landing gear in Kikoboga, Tanzania and left the runway.
— Ryan sikorski (@Ryansikorski10) November 30, 2023
Another Brasília plane had problems taking off, hit a building and caught fire. pic.twitter.com/KauBBB3V5U
Comments
Please login to add a commentAdd a comment