హైదరాబాద్, సాక్షి: పండుగ వేళ ప్రయాణికులకు తీపివార్త చెబుతుందనుకున్న హైదరాబాద్ మెట్రో యాజమాన్యం.. షాకిచ్చింది. అయితే అది టికెట్ ఛార్జీల విషయంలో కాదు. మెట్రో ద్వారా దూర ప్రయాణం చేస్తూ వందల మందికి ఊరట ఇస్తున్న పార్కింగ్ విషయంలో..
నగరంలో నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లు కీలక గమ్యస్థానాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు స్టేషన్‌లో ఇక ఫ్రీ పార్కింగ్ కనిపించదు. ఈ మేరకు మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నాగోలు, మియాపూర్ స్టేషన్‌లలో పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయనున్నారు.
టూ వీలర్‌కు, ఫోర్ వీలర్‌కు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించనున్నారు. అయితే ఈ ఫీజు నామమాత్రంగానే ఉంటుందని, ప్రయాణికుల వాహనాల భద్రత కోసమే వసూలు చేస్తున్నట్లు చెబుతోంది. హైదరాబాద్‌లో చాలా మెట్రో స్టేషన్‌లకు పార్కింగ్ సమస్య ఉంది. అయితే కొన్ని స్టేషన్‌ల వద్ద ఆ సదుపాయం ఉండగా.. పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment