free parking
-
అటెన్షన్ ప్లీజ్.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ముఖ్యగమనిక
హైదరాబాద్, సాక్షి: పండుగ వేళ ప్రయాణికులకు తీపివార్త చెబుతుందనుకున్న హైదరాబాద్ మెట్రో యాజమాన్యం.. షాకిచ్చింది. అయితే అది టికెట్ ఛార్జీల విషయంలో కాదు. మెట్రో ద్వారా దూర ప్రయాణం చేస్తూ వందల మందికి ఊరట ఇస్తున్న పార్కింగ్ విషయంలో..నగరంలో నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లు కీలక గమ్యస్థానాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు స్టేషన్లో ఇక ఫ్రీ పార్కింగ్ కనిపించదు. ఈ మేరకు మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నాగోలు, మియాపూర్ స్టేషన్లలో పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయనున్నారు. టూ వీలర్‌కు, ఫోర్ వీలర్‌కు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించనున్నారు. అయితే ఈ ఫీజు నామమాత్రంగానే ఉంటుందని, ప్రయాణికుల వాహనాల భద్రత కోసమే వసూలు చేస్తున్నట్లు చెబుతోంది. హైదరాబాద్‌లో చాలా మెట్రో స్టేషన్లకు పార్కింగ్ సమస్య ఉంది. అయితే కొన్ని స్టేషన్ల వద్ద ఆ సదుపాయం ఉండగా.. పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. -
ఫ్రీ పార్కింగ్ కోసం ధర్నా
-
పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం
చార్మినార్: పాతబస్తీలో ఓవైపు పర్యాటకులు..మరోవైపు రంజాన్ షాపింగ్ రద్దీతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు సైతం ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్ మరింత క్లిష్టంగా మారగా... ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ► రంజాన్ మాసంలో చివరి పది–పన్నెండు రోజులు పాతబస్తీలోని మార్కెట్లు రద్దీగా మారుతాయి. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతం కిటకిటలాడుతుంది. ► అలాగే మక్కా మసీదులో ప్రతి రోజు నిర్వహించే ఐదు నమాజ్‌లకు ముస్లింలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ► దీనిని దృష్టిలో పెట్టుకొని నగర ట్రాఫిక్ ఉన్నతాధి కారులు తాత్కాలిక పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ సౌకర్యం కల్పించిన ప్రాంతాలివే.. ►చార్మినార్ సమీపంలో.. ► యునానీ ఆసుపత్రి ప్రాంగణం ► కుడా స్టేడియం ► మోతీగల్లీ పెన్షన్ ఆఫీసు ► కోట్ల అలీజాలోని ముఫిదుల్లానామ్ హైస్కూల్ ప్రాంగణం ►పంచమొహల్లాలోని కూలగొట్టిన ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలం పార్కింగ్ ఉచితమే.. రంజాన్ మాసంలోని చివరి పది–పన్నెండు రోజులు ఎంతో కీలకం. పాతబస్తీ రద్దీగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమీపంలోని ఆరు ప్రాంతాల్లో వాహనదారుల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశౠం. ఇక్కడ పార్కింగ్ ఉచితం. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే..మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ -
రూల్స్ నందు పోలీసు రూల్స్ వేరయా..!
సాక్షి, అబిడ్స్: నగర ట్రాఫిక్ పోలీసులు సామాన్యులకో రూలు, పోలీసులకు మరో రూలు విధిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బషీర్‌బాగ్ చౌరస్తాలోని బ్రిడ్జి కింద వాహన దారులు ఉచితంగా పార్కింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు బషీర్‌బాగ్ చౌరస్తా పరిసరాల్లో ఉచిత పార్కింగ్ ప్రదేశాలు నాలుగేళ్ల క్రితమే గుర్తించారు. దీంతో బషీర్‌బాగ్ పరిసరాల్లో ఉండే బాబూఖాన్ ఎస్టేట్, ఇన్‌కంటాక్స్ కార్యాలయాలు, ఎల్ఐసీ కార్యాలయాలు, ఇతర కార్యాలయాలకు చెందిన సిబ్బందితో పాటు కార్యాలయాలకు వచ్చే వారు కూడా ఉచితంగా తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఉచిత పార్కింగ్‌ను తొలగించిన ట్రాఫిక్ అధికారులు.. నాలుగేళ్లుగా బషీర్‌బాగ్ బ్రిడ్జి ఇరువైపులా, బ్రిడ్జి కింద ఉచిత పార్కింగ్‌ను ఇటీవల ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. నో పార్కింగ్ బోర్డు పెట్టి ఈ స్థలాల్లో ఎవరూ వాహనాలు నిలుపరాదని నిషేధాజ్ఞలు విధించారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నగరంలో ఉచిత పార్కింగ్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా బషీర్‌బాగ్ చౌరస్తాలోని బ్రిడ్జి ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఉచిత పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడంతో స్థానిక కార్యాలయాలకు వచ్చే వారికి ఎంతో వీలుగా ఉండేది. బషీర్‌బాగ్ బ్రిడ్జి కింద ఉచిత పార్కింగ్ బోర్డును తొలగించి నో పార్కింగ్ బోర్డు పెట్టిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ వర్తించవా...? బషీర్‌బాగ్ చౌరస్తాలో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చేవారు అమ్మవారి ఆలయం ఎదురుగా నిజాం కాలేజీ గ్రౌండ్ గేటు పక్క అక్రమంగా నడి రోడ్డు వరకు తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. పోలీసులు, పోలీసు కార్యాలయాలకు వచ్చే వారు ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్దంగా రోడ్డుపై వాహనాలను పార్కు చేస్తే పట్టించుకునే వారే లేరు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఉచిత పార్కింగ్‌ను తొలగించి నడిరోడ్డుపై పార్కు చేసే పోలీసు వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వాహనదారుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత పార్కింగ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించడం సరి కాదని పలువురు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఒక రూలు, సామాన్య ప్రజలకు మరో రూలు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తిరిగి ఉచిత పార్కింగ్‌కు అనుమతి.. బషీర్‌బాగ్ బ్రిడ్జికింద వాహనాలు పెద్ద ఎత్తున పార్క్ చేస్తుండడంతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టినప్పుడు ఇబ్బంది కలుగుతుందనే దృష్టితోనే నో పార్కింగ్ బోర్డు పెట్టామని ట్రాఫిక్ ఏసీపీ మురళీకృష్ణ తెలిపారు. సామాన్య ప్రజలకు ఒక రూరు, పోలీసులకు ఒక రూలా అని ‘సాక్షి’ ఏసీపీ మురళీ కృష్ణను వివరణ కోరింది. త్వరలోనే సంబంధిత ఇన్స్పెక్టర్లకు చెప్పి ప్రజల సౌకర్యార్థం బషీర్‌బాగ్ బ్రిడ్జికింద గతంలోనే మాదిరిగానే ఉచిత పార్కింగ్ కొనసాగించే విధంగా చూస్తామని పేర్కొన్నారు. చదవండి: మందుబాబులు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా? సిగ్నల్ జంప్: ఏయ్ నన్నే ఆపుతావా? -
మరో పది కోట్ల కార్లు రోడ్డెక్కితే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘యూ డోంట్ నో వాట్ యూ గాట్ టిల్ ఇట్స్ గాన్, దే పేవ్ పారడైజ్ పుటప్ ఏ పార్కింగ్ లాట్ (నీవు పోగొట్టుకున్న దాని విలువ అది పొయ్యాకగానీ తెలియదు. వారు స్వర్గాన్ని చదునుచేసి పార్కింగ్ స్థలం చేస్తారు)’ అనే పాటను ‘బిగ్ ఎల్లో టాక్సీ’ ఆల్బమ్‌లో జోని మిశ్చెల్ పాడుతారు. అది నిజమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. నివాసిత కాలనీల్లోని ఖాళీ స్థలాలు, సాయం సంధ్య వేళల్లో పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు, కొంటె కబుర్లు చెప్పుకుంటూ కుర్రాళ్లు కాలక్షేపంచేసే కూడలి స్థలాలు, ఇరు సంధ్యల్లో వాహ్యాలికి వెళ్లి ముసలివాళ్లు ముచ్చట్లు పెట్టుకునే స్థలాలు పార్కింగ్ స్థలాలుగా మారిపోతున్నాయి. మరో నాలుగు రోజులు పోతే అక్కడక్కడ ఉన్న పార్కులు, పశ్చిక బయళ్లు, ఫౌంటేన్లు కూడా పార్కింగ్ స్థలాలు అయ్యే ప్రమాదం ఉంది. భారత దేశంలో ప్రైవేటు వాహనాల సంఖ్య పది కోట్లు దాటడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. మరో పదేళ్ళలోనే మరో పది కోట్ల వాహనాలు రోడ్లమీదకు వస్తాయని ప్రస్తుత అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆదాయం పెరగడం వల్లనో, సౌకర్యం కోసమో, హోదా కోసమో ప్రజలు కార్ల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో వాహనాల కొనుగోళ్లు జనాభా పుట్టుక కన్నా రెండింతలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నగరాలు కూడా వాటికి దగ్గరగానే పోతున్నాయి. మున్ముందు నగరాల్లో ఐదుగురు సభ్యుల కుటుంబం ఉండేందుకు 20 చదరపు మీటర్ల స్థలం దొరక్కపోవచ్చేమోగానీ ఉచిత కారు పార్కింగ్ చోటు మాత్రం కచ్చితంగా దొరుకుతుంది. రోజు రోజు పెరిగి పోతున్న పార్కింగ్‌కు ప్రభుత్వాలు సరైన స్థలాలు చూపించలేక పోవడం, పబ్లిక్ స్థలాల్లో పార్కింగ్ చేయడం తమ హక్కని వాహనాల యజమానులు భావించడం అందుకు కారణం. ఫ్రీ పార్కింగ్ అన్నది కార్లకు పునరుత్పత్తి డ్రగ్గు లాంటిదని అంతర్జాతీయ పార్కింగ్ గురు ‘డొనాల్డ్ షౌప్’ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని నగరాల్లో అన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ వ్యవస్థ ఉంది. భారత దేశంలో తక్కువగా పెయిడ్ పార్కింగ్, ఎక్కువగా ఫ్రీ పార్కింగ్లు ఉన్నాయి. పబ్లిక్ స్థలాల్లో ఉచితంగా పార్క్ చేసే హక్కు ప్రైవేటు కార్లకు ఎక్కడిదన్న ప్రశ్న ఆ దేశాలది. కొన్న కారుపై, వాడుతున్న ఇంధనంపై ఇప్పటికే పన్ను కడుతున్న తమ వద్ద నుంచి పార్కింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తారా? అన్నది భారతీయుల ప్రశ్న. ప్రశ్నలో లాజిక్ ఉందిగానీ, దూర దృష్టి లేదు. ఉచిత పార్కింగ్ పేరిట అన్ని ఖాళీ స్థలాలు ఆక్రమించుకుంటూ పోతే మున్ముందు పబ్లిక్ స్థలాలంటూ మిగలవు. రోడ్లపై కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితమవుతున్న ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ, నగర పాలనా వ్యవస్థతో కలిసి ఆధునిక పద్ధతిలో అన్ని చోట్ల పార్కింగ్ స్థలాల నిర్మాణం కోసం పూనుకోవాలి. అందుకు పార్కుల లాంటి పబ్లిక్ స్థలాల జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ స్థలాలు చూసుకోవాలి. ‘ఏం ట్రాఫిక్‌రా బాబు!’ అంటూ విసుక్కునే వాహన యజమానులు పార్కింగ్ స్థలాల కోసం ప్రభుత్వంపై విసుక్కోవాలి. -
నేటి నుంచే ఫ్రీ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్ : షాపింగ్ మాల్స్.. మల్టీప్లెక్స్‌లు.. ఇతరత్రా వాణిజ్య ప్రదేశాల్లో పార్కింగ్ దోపిడీకి ఇకపై చెక్ పడనుంది. గంటల లెక్కన ఇష్టారీతిన సాగుతున్న పార్కింగ్ ఫీజుల వసూలు నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు పార్కింగ్ ఉచితం. ఆ తర్వాత పార్కింగ్ చేసే సమయం.. నిబంధనలను బట్టి పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నారు. వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజుల్ని క్రమబద్ధీకరిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆదివారం నుంచి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పార్కింగ్ ఫీజుల్ని వసూలు చేయాలి. అలా కాక ఇష్టానుసారం వసూలు చేసే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం జీహెచ్ఎంసీకి ఉంది. ఈ మేరకు మాల్స్, మల్టీప్లెక్స్‌ల యజమానులతో జీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించి స్పష్టం చేసింది. ఈ భేటీలో వారు వ్యక్తపరచిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించింది. అయితే పార్కింగ్ పాలసీని మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారికి స్పష్టం చేసింది. తొలి అరగంట ఉచితం.. మార్చి 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు వాణిజ్య ప్రదేశాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు సరుకులు కొన్నా, కొనకపోయినా ఉచితం. ఆ తర్వాత పార్కింగ్ చేసే సమయాన్ని బట్టి పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేయవచ్చో స్పష్టం చేసి.. వాటిని తప్పక పాటించాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. ఈ వివరాలు ప్రజలకు తెలిసేలా పార్కింగ్ ప్రదేశాల్లో డిజిటల్‌గా ప్రదర్శించడం, జీవో ప్రతిని అంటించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. వాహనం పార్కింగ్ చేసిన సమయాన్ని తప్పకుండా నమోదు చేయాలని, ఇందుకుగానూ స్టాంప్ వేయడమో, లేక తగిన డివైజ్‌ను వినియోగించడమో చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. పార్కింగ్ ఫ్రీ ఇలా.. పార్కింగ్ ప్రదేశంలో ఉంచిన వాహనానికి 30 నిమి షాల వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు. కొను గోలు చేసినా, చేయకపోయినా పార్కింగ్ ఫీజు అడగరాదు. అంటే బేషరతుగా పార్కింగ్ పూర్తి ఉచితం. అరగంట దాటితే మాత్రం సంబంధిత మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపించాలి. ఎంతో కొంత కొనుగోలు చేసిన వారైనా సరే ఈ సదుపాయం ద్వారా గంట సేపటి వరకు తమ వాహనానికి ఎలాంటి పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. కొనుగోలు బిల్లు చూపించకపోతే మాత్రం నిర్ణీత పార్కింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టికెట్‌ను కానీ చూపించాలి. ఈ బిల్లు, మూవీ టికెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్ ఫీజు కంటే తక్కువుండే పక్షంలో నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే. ఫిర్యాదులు.. కోర్టు ఆదేశాలతోనే.. జీహెచ్ఎంసీలో దాదాపు 25 మల్టీప్లెక్స్‌లతోపాటు పలు షాపింగ్ మాల్స్, వాణిజ్య ప్రదేశాలు ఉన్నాయి. నగరంలోని వివిధ మాల్స్, మల్లీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజులు భారీగా ఉండటంపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు, భవన నిర్మాణ నిబంధనలు, పార్కింగ్ ఫీజుల విషయంలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణకు జీవో తెచ్చింది. గ్రేటర్లో ప్రస్తుతం పార్కింగ్ ఫీజులు ద్విచక్ర వాహనాలకు తొలి రెండు గంటల వరకు రూ.20, కార్లకు రూ.30గా ఉన్నాయి. రెండు గంటలు దాటాక ప్రతి గంటకు ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లకు రూ.20గా ఉంది. ఐదు నిమిషాలే పార్కింగ్ చేసినా తొలి రెండు గంటల చార్జీని వసూలు చేస్తుండటంతో ప్రజల నుంచి విమర్శలున్నాయి. -
తొలి అరగంట ఫ్రీ
నగరంలో ఏప్రిల్ 1 నుంచి వాహనాల పార్కింగ్ పాలసీని కచ్చితంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో పార్కింగ్ విధానాన్ని నిర్ణయిస్తూ ఈ నెల 20వ తేదీన జీవో నెంబర్ 63 జారీ చేసింది. ఈ జీవో మేరకు..మాల్స్,మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థల్లో 30 నిమిషాల వరకు ఉచితపార్కింగ్ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలుఅమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఈమేరకు ఆయనగురువారం నగరంలోని మల్టీప్లెక్స్, మాల్స్, వాణిజ్యసముదాయాల యజమానులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్కింగ్ పాలసీ గురించివారికి వివరించారు. సాక్షి, సిటీబ్యూరో:నగరంలో ఏప్రిల్ ఒకటో తేదీనుంచి పార్కింగ్ పాలసీని కచ్చితంగా అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పార్కింగ్ పాలసీ అమలుపై గురువారం మల్టీప్లెక్స్, మాల్స్, వాణిజ్యసముదాయాల యజమానులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్రప్రభుత్వం నగరంలో పార్కింగ్ విధానాన్ని నిర్ణయిస్తూ ఈనెల 20వ తేదీన జీవో(నెంబర్63) జారీ చేసిందన్నారు. జీవో మేరకు..మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్యసంస్థల్లో 30 నిమిషాల వరకు ఉచిత పార్కింగ్ కల్పించాల్సి ఉంటుందన్నారు. 30 నిమిషాల నుండి గంట వరకు ఆయా మాల్స్, మల్టీప్లెక్స్‌లలో షాపింగ్ చేసినట్లు బిల్లు చూపించిన వారికి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి బిల్లులు చూపని వారికి నిర్ణీత పార్కింగ్ ఫీజు వసూలు చేయవచ్చునని తెలిపారు. నగరంలో పార్కింగ్ చార్జీలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సవివరమైన పార్కింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. వీటిని అమలు చేయనివారిపై నిబంధనల మేరకు తగిన చర్యలుంటాయన్నారు. వాహనం పార్కింగ్ చేసిన సమయాన్ని, తెలుపుతూ స్టాంప్ వేయడమో, లేక తగిన డివైజ్‌ను వినియోగించడమో చేయాలని కమిషనర్ సూచించారు. పార్కింగ్ ఫీజుల సమాచారాన్ని, జీవో ప్రతులను అందరికీ కనిపించేలా అంటించాలని, పెయింటింగ్ వేయించాలని సూచించారు. నగరంలో 9,100 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా, వాహనాలు మాత్రం 54 లక్షలున్నాయంటూ, పార్కింగ్ సమస్య పరిష్కారానికిగాను ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిల్లో తాత్కాలికంగా పార్కింగ్‌ను కల్పించే విధానాన్ని త్వరలోనే రూపొందిస్తామన్నారు. కాగా మాల్స్, మల్టీప్లెక్స్ ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని, ప్రధానంగా ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసుల స్థానంలో స్టీల్ గ్లాస్‌లను వినియోగించాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, జోనల్ కమిషనర్లు హరిచందన, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. కాగా సమావేశానికి హాజరైన వారికి పార్కింగ్ పాలసీ గురించి తెలియజేశాక, అమలుకు తగినంత గడువిస్తే బాగుండేదన్నారు. పార్కింగ్పైఆధార పడ్డ ఎందరికో జీవనోపాధి పోతుందన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంలో కూడా పార్కింగ్ ఫీజుందని ప్రస్తావించారు. పార్కింగ్ ఫీజులిలా.. ♦ 30 నిమిషాల వరకు:ఎవరి నుంచి ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదు. బేషరతుగా ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించాల్సిందే. ♦ 31 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు:సదరు షాపింగ్ సెంటర్లో ఏదైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేయరు. బిల్లు చూపని పక్షంలో నిర్ణీత పార్కింగ్ ఫీజు వసూలు చేయవచ్చు. ♦ గంట దాటితే:ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు లేదా సినిమా టిక్కెట్ చూపించాలి. పార్కింగ్ ఫీజు మొత్తం కంటే సినిమా టిక్కెట్ / కొనుగోళ్లకు బిల్లు ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. -
హైదరాబాద్ లో ఫ్రీ పార్కింగ్ స్థలాలివే...
ఉప్పల్‌కు చెందిన అరుణ్ ఉదయమే టిఫిన్ తెద్దామని సమీపంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌కు వెళ్లాడు... బైక్ రోడ్డు మీద పెట్టి టిఫిన్‌కు వెళ్లడంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారమైంది...ఇది ఒక్క ఉప్పల్లోనే కాదు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. అయితే జీహెచ్ఎంసీ పార్కింగ్ కాంట్రాక్టర్లమంటూ ఎక్కడ సందు దొరికితే అక్కడ వసూళ్ల పర్వం కొనసాగిస్తుండటంతో చాలా మంది ద్విచక్రవాహనదారులు తమ వాహనాన్ని రహదారులపైనే పార్కు చేసి వెళ్తున్నారు. నో పార్కింగ్ జోన్లో వందల సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనిపై అధ్యయనం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ‘ఫ్రీ పార్కింగ్’ సౌకర్యాన్ని కల్పించారు. మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 49 ప్రాంతాలను గుర్తించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ స్థలాలను శుభ్రం చేసి పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎటువంటి రుసుం లేకుండా ఇక్కడ బైక్‌లు, కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఇవీ ఫ్రీ పార్కింగ్ స్థలాలు... మాదాపూర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో: మాదాపూర్‌లోని అవసా హోటల్, ప్రైడ్ హోండా, హైటెక్స్ జంక్షన్‌కు వెళ్లే సీఐఐ, ఇమేజ్ గార్డెన్, కొండాపూర్‌లోని హర్ష టయోటా, కొత్తగూడలోని రత్నదీప్ సూపర్ మార్కెట్, శిల్పరామం నైట్ బజార్‌కు ఎదురుగా ఫోర్‌వీలర్స్‌ను పార్కింగ్ చేసుకోవచ్చు. కూకట్పల్లి ఠాణా పరిధిలో... జేఎన్టీయూ రైతు బజార్ సమీపంలో ద్విచక్ర వాహనాలు, రైతు బజార్‌కు ఎదురుగా బైక్‌లు, కారులు, రెడీమేడ్ ఆస్పత్రి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ రోడ్డు నంబర్ 3లో ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. మియాపూర్ పరిధిలో: చందానగర్‌లోని మైత్రి ఆస్పత్రి నుంచి ఈనాడు బ్యాంక్, అంగర హోటల్ నుంచి కేఎస్ బేకర్స్, గంగారామ్లోని చెన్నై షాపింగ్ మాల్ నుంచి నీల్కమల్ ఫర్నిచర్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. అల్వాల్ ఠాణా పరిధిలో... సుచిత్ర జంక్షన్, కొంపల్లిలోని బర్టన్‌గూడ జంక్షన్, ఏఎంఆర్ గార్డెన్లో బైక్‌లు, ఫోర్ వీలర్స్, ఓల్డ్ అల్వాల్‌లోని లైబ్రరీ బిల్డింగ్ ఎదురుగా, కుత్బుల్లాపూర్ మీ సేవా రోడ్డు సమీపంలో బైక్‌లు పార్క్ చేసుకోవచ్చు. బాలానగర్ ఠాణా పరిధిలో... బీబీఆర్ హాస్పిటల్, బొజయ్ గార్డెన్ ఓల్డ్, శోభనా, నర్సాపూర్ ఎక్స్ రోడ్డులోని రామ్ హోండా, బాలానగర్ టీ జంక్షన్‌లోని గణేశ్ మెడికల్ షాప్, మల్లికార్జున లాడ్జి రాజుకాలనీలో కమాన్ , ఫెరోజ్‌గూడ ఎస్బీహెచ్ ఎదురుగా బైక్‌లు పార్క్ చేసుకోవచ్చు, జీడిమెట్ల ఠాణా పరిధిలో... జీడిమెట్ల ఐడీఏలోని జేఎస్ఆర్ కాంప్లెక్స్, షాపూర్‌నగర్‌లోని కిరణ్మయి హాస్పిటల్, రంగ.. భుజంగ థియేటర్ సమీపంలోని విఘ్నేశ్వర కాంప్లెక్స్, ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, గాజులరామారం ఎక్స్ రోడ్డులోని ఉషోదయ టవర్స్, షా సినీ ప్లానెట్‌లోని వాల్యూమార్ట్, గణేశ్‌నగర్‌లోని గౌరి వైన్స్ కాంప్లెక్స్, క్యూకాటన్ బిల్డింగ్, ఐడీపీఎల్ ఎక్స్ రోడ్డులోని భాగ్యరథీ డిగ్రీ కాలేజి బిల్డింగ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. ఉప్పల్ ఠాణా పరిధిలో... రామంతాపూర్ చెరువు సర్వీసు రోడ్డు, యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఉప్పల్ ఎక్స్ రోడ్డు, సర్వీసు రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. మాల్కాజిగిరి ఠాణా పరిధిలో... మల్కాజిగిరి ఎక్స్ రోడ్డులోని గాంధీ పార్క్ వాల్ రోడ్డు, ఆనంద్‌బాగ్ నుంచి ఉత్తమ్‌నగర్ వరకు బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. నేరేడ్మెట్ ఎక్స్‌రోడ్డు, ఏఎస్‌రావ్ నగర్‌లోని కెనడీ హైస్కూల్, వెర్టక్స్ ప్లాజా, నార్త్ కమలానగర్‌లోని ఉడ్ ల్యాండ్స్ హోటల్, కుషాయిగూడ మార్కెట్, కమలానగర్‌లోని కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో... దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడి, కొత్తపేటలోని రైతు బజార్, రాజేంద్రనగర్‌లోని ఆర్డీఓ ఆఫీసు వద్ద బైక్‌లు పార్క్ చేయవచ్చు.