
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొస్తుందని పేర్కొన్నారు.
మొదటి అర గంటకు ఎవరి నుంచీ పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని, అనంతరం గంట వరకు వాహనం ఉంచితే సదరు మాల్లో వస్తువుల కొనుగోలు బిల్లు చూపిన వారి నుంచి ఫీజు వసూలు చేయరాదని, గంటకు పైగా ఉన్న వాహనదారులకు సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు చూపినా ఉచిత పార్కింగ్ అవకాశం వినియోగించుకోవచ్చునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment