
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది.
ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు.
అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది.
చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే?