న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఎంతకూ కదలకపోవడంతో క్యాబిన్ లోపల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తర్వాత కొద్ది సేపటికి విమానం నుంచి ప్రయాణికులను దిగాల్సిందిగా సిబ్బంది కోరారు. విమానం నుంచి దిగిన వారంతా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులైతే అలసిపోయారు.
విమానంలో ఎయిర్‌కండీషన్ కూడా పనిచేయకపోవడంతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ప్రయాణికుల్లోని ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ పోస్టును విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు.
ఎయిర్‌ఇండియా ప్రైవేటైజేషన్ పూర్తగా ఫెయిలైందనడానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఈ పోస్టుకు స్పందించిన ఎయిర్‌ఇండియా సంస్థ తమ విమానం ఆలస్యమవడంపై విచారం వ్యక్తం చేసింది.
ఇటీవలే ముంబై నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం కూడా ఆరు గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో కూడా ఏసీ లేకుండా ప్రయాణికులు ఆరు గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment