delhi air port
-
నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఎంతకూ కదలకపోవడంతో క్యాబిన్ లోపల వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.తర్వాత కొద్ది సేపటికి విమానం నుంచి ప్రయాణికులను దిగాల్సిందిగా సిబ్బంది కోరారు. విమానం నుంచి దిగిన వారంతా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులైతే అలసిపోయారు. విమానంలో ఎయిర్‌కండీషన్ కూడా పనిచేయకపోవడంతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని ప్రయాణికుల్లోని ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ పోస్టును విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు.ఎయిర్ఇండియా ప్రైవేటైజేషన్ పూర్తగా ఫెయిలైందనడానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఈ పోస్టుకు స్పందించిన ఎయిర్ఇండియా సంస్థ తమ విమానం ఆలస్యమవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇటీవలే ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం కూడా ఆరు గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో కూడా ఏసీ లేకుండా ప్రయాణికులు ఆరు గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివచ్చింది. -
Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. డేటా మైనింగ్ వలే ఇంటర్నెట్ నుంచి కేవలం కొన్ని ప్రెస్ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్, కాంగ్రెస్ ఐటీసెల్ వెనకబాటుతనానికి నిదర్శనమని సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. 1/6 It is for someone who is lost in his esoteric world of thesaurus that data mining of selective press articles from the internet qualifies as “research”. Here are some actual facts for arm-chair critic @ShashiTharoor and the Cong IT Cell that might help tackle their lack of… https://t.co/hA3sijtjr8 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2024 ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు. చదవండి: అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి -
విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి: సింధియా
న్యూఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం సుమారు వంద విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. కొన్ని విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా బయలుదేరాయి కూడా. ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదిక స్పందించారు. ‘‘నిన్న(ఆదివారం) ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని గంటలపాటు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు జీరో విజిబిలిటీ ఉంది. ఈ కారణంగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల రక్షణ, భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌పోర్టులోని CAT-IIIలో భాగంగా ప్రారంభించిన నాలుగో రన్‌వేను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల రద్దు, ఆలస్య అసౌర్యాన్ని తగ్గించడానికి, ప్రయాణికుల సరైన సమాచారం అందజేయాలని కూడా విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రయాణికులంతా సహకరించాలని కోరుతున్నా. ప్రయాణికలు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఈ సమయంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. అలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదు’’ అని మంత్రి సింధియా పేర్కొన్నారు. Yesterday, Delhi witnessed unprecedented fog wherein visibility fluctuated for several hours, and at times, dropped to zero between 5 AM to 9 AM. The authorities, therefore, were compelled to enforce a shut-down of operations for some time even on CAT III runways (CAT III… — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 15, 2024 మరోవైపు.. విమానం ఆలస్యానికి సంబంధించి ఓ ప్రయాణికుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్‌పై దాడికి యత్నంచిన విషయం తెలిసిందే. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Ram Mandir: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’.. ఎలాగంటే!
న్యూఢిల్లీ: ‘బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె’... అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆధునిక యుగంలో దీన్ని కాస్త మార్చి ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’ అని చదువుకునే చిత్రమైన సంఘటన జరిగింది. అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. లండన్ వెళ్లే ఎయిర్ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్ ఆపేశారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. ఈ విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యేల్ వాంగ్‌చుక్ ఉన్నారు. ఎయిర్ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: Karnataka Toddler Swallowed Coin: ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని) -
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
ఎంపీ సుజనా చౌదరికి షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అధికారులు షాకిచ్చారు. బ్యాంక్ కుంభకోణం కేసులో అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్ఔట్ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు ఇచ్చింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. సుజనా చౌదరిపై 2018లోనే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 2018లో సుజనా ఆస్తులను బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలానికి పెట్టింది. ఈ క్రమంలోనే ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరిలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు సైతం నిర్వహించింది. హైకోర్టులో సుజనాపై మారిషస్ బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే షెల్ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్ చేసినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. (వేలానికి సుజనా చౌదరి ఆస్తులు) సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్) మినహా మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ టీవీ నటి హంగామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 వద్ద మాళవికా తివారి(56) అనే మహిళకు చెందిన పవర్‌బ్యాంకు పేలుడు కలకలం రేపింది. శబ్దం చేస్తూ పేలడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం మాళవిక ధర్మశాలకు వెళ్లే విమానం కోసం వేచి చూస్తుంది. ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెను చెకింగ్ కోసం పిలిచారు. తన హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంకును పెట్టుకుని సెక్యూరిటీ చెకింగ్ వద్దకు వచ్చింది. అక్కడ హ్యాండ్ బ్యాగులోని వస్తువులను చూపించానికి నిరాకరించడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన మహిళ బ్యాగులోని పవర్ బ్యాంక్ తీసి నేలకేసి కొట్టింది. దీంతో చిన్నపాటి పేలుడు సంభవించడంతో కొద్దిసేపు గందరగోళం వాతావరణం ఏర్పడింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆమెను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఐపీసీ సెక్షన్ 336, 285 ల కింద మాళవికను అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పయిందంటూ ఆమె క్షమాపణ కోరిందనీ, అయితే విచారణ అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేశామని ఎయిర్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సంజయ్ భాటియా తెలిపారు. ఆమె నేపథ్యం గురించి ఖచ్చితంగా తెలియదు కానీ ఒక టీవీ నటిగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. -
రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: రెండు విమానాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. భద్రతా కారణాలతో ఖాట్మాండుకు వెళ్లాల్సిన 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 122 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని వెల్లడించింది. -
ఢిల్లీకి చేరుకున్న తెలుగోళ్లు
హైదరాబాద్: నేపాల్‌లో శనివారం సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలుగోళ్లు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నట్టు తాజాగా సమాచారం అందింది. మొత్తం 54 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో 34 మంది తెలంగాణకు, 19 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణ వారిలో 35 మంది కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వారే. నగరంలోని హయత్ నగర్‌కు చెందిన 11 మంది, మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన 24 మంది అందులో ఉన్నట్టు సమాచారం. -
ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
హైదరాబాద్: నేపాల్‌లో భూకంపం వచ్చిన సందర్భంగా భారత రాయబార కార్యాలయంలో ఎమర్జెన్సీ నంబర్లను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు.. 009779851107021, 009779851135141 నంబర్లను సంప్రదించవచ్చు. అదే విధంగా తెలంగాణ నుంచి నేపాల్ వెళ్లిన వారి వివరాల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తెలంగాణ సచివాలయంలో రూంలో 040 - 23454088 ను సంప్రదించవచ్చు. కాగా, కరీంనగర్‌కు చెందిన వాసులు దాదాపు 1000 మంది దాకా ఖాట్మండులో చిక్కుకున్నారు. సంచార జీవనం సాగించే బుడిగ జంగాల కులస్తులు, ఖాట్మండుకు 10 కిలో మీటర్ల దూరంలో నివాసం ఉండేవారు. భూకంప తీవ్రతకు వారి గుడిసెలు కూలిపోయాయి. ప్రస్తుతం వారు రోడ్డున పడ్డారు. నేపాల్ నుంచి ఢిల్లీకి నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా 564 మంది భారతీయులను తరలించినట్టు సమాచారం. ఇప్పటికే నేపాల్‌కు 17 - 5MI విమానాలు చేరుకున్నాయి. మరో 10 విమానాల్ని పంపుతున్నట్టు అధికారులు తెలిపారు. -
తెలుగు యాత్రికుల అవస్థలు
హైదరాబాద్: నేపాల్ నుంచి వచ్చిన తెలుగు యాత్రికులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు 60 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటిదాకా అధికారులు హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నాలు చేయలేదని యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం తీవ్రతకు భారత్‌లో మృతుల సంఖ్య 67 దాటింది. రాష్ట్రాల వారీగా చూసినట్లయితే.. బీహార్‌లో 47, ఉత్తరప్రదేశ్‌లో 17, పశ్చిమ బెంగాల్లో ముగ్గురు మృతిచెందారు.