Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్‌ | Delhi Airport Flight Delays Scindia Counter To Shashi Tharoor | Sakshi
Sakshi News home page

Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్‌

Published Wed, Jan 17 2024 5:47 PM | Last Updated on Wed, Jan 17 2024 6:44 PM

Delhi Airport Flight Delays Scindia Counter To Shashi Tharoor - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా‍రు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్‌ ఇచ్చారు.  

డేటా మైనింగ్‌ వలే ఇంటర్‌నెట్‌ నుంచి కేవలం కొన్ని ప్రెస్‌ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్‌, కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్‌, కాంగ్రెస్‌ ఐటీసెల్‌ వెనకబాటుతనానికి  నిదర్శనమని సింధియా ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు.

ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం  కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు  ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా  ఇచ్చారు.

అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్‌ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు.

చదవండి: మ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement