dense fog
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్‌జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలను అమలు చేశారు.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
పుణెలో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్‌కోర్స్‌లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు గాయపడ్డారు.#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024 ఇదీ చదవండి: పెరోల్‌పై డేరా బాబా విడుదల -
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ -
Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. డేటా మైనింగ్ వలే ఇంటర్నెట్ నుంచి కేవలం కొన్ని ప్రెస్ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్, కాంగ్రెస్ ఐటీసెల్ వెనకబాటుతనానికి నిదర్శనమని సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. 1/6 It is for someone who is lost in his esoteric world of thesaurus that data mining of selective press articles from the internet qualifies as “research”. Here are some actual facts for arm-chair critic @ShashiTharoor and the Cong IT Cell that might help tackle their lack of… https://t.co/hA3sijtjr8 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2024 ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు. చదవండి: అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి -
పొగ మంచు ఎఫెక్ట్: చెన్నై వెళ్లాల్సిన విమానాలు శంషాబాద్‌కు మళ్లింపు
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో ఆదివారం ఉదయం తీవ్రమైన స్థాయిలో పొగమంచు చుట్టు ముట్టింది. దీంతో చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలని తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచుతో చెన్నై ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు. This looks like some crazy fog+smoke (Bhogi Effect). Visibility is very poor across Chennai..👀 pic.twitter.com/bRka4t21b3 — Chennai Updates (@UpdatesChennai) January 14, 2024 ఈ క్రమంలో ప్రతికులమైన వాతావరణం కారణంగా చెన్నై, ఢిల్లీకి సంబంధించిన పలు విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని ఇండిగో ఎయిర్ లైన్స్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. విమాన ప్రయాణికులు ఎప్పటికప్పుడు ముందుగానే విమాన వివరాలు తెలుకోవాలని సూచించింది. #WATCH | Tamil Nadu: A layer of smog engulfs several parts of Chennai. (Drone visuals from Rajiv Gandhi Road, shot at 6:40 am) pic.twitter.com/BEdSPwhsrH — ANI (@ANI) January 14, 2024 అయితే ఈ రోజు(ఆదివారం) చెన్నైలో పెద్ద ఎత్తున పొగమంచు ఏర్పడటానికి భోగి పండగ సందర్భంగా ప్రజలు వేసే మంటటు కారణమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. VIDEO | Flight services affected at Chennai Airport due to dense fog in the region. pic.twitter.com/TvQBjxn66l — Press Trust of India (@PTI_News) January 14, 2024 -
Delhi Airport: రన్‌వే వద్ద భారీ క్రేన్.. ప్రమాదంలో పడ్డ విమానాలు
న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు విధినిర్వహణలో భాగంగా చేసిన ఓ పని వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్ కారణంగా విమానాలకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ఐఎల్ఎస్) సిగ్నల్ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి సేఫ్ ల్యాండింగ్‌కు ఐఎల్ఎస్ సిగ్నల్ నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఈ విషయం వారం తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వారు కంగారుపడ్డారు. క్రేన్ కారణంగా సిగ్నల్ సరిగా అందకపోవడంతో 100 దాకా విమానాలు గత వారం ఆలస్యంగా ల్యాండ్ అవడమే కాకుండా కొన్ని విమానాలను ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. ‘ఐఎల్ఎస్ సిగ్నల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్ లైన్ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్ అయ్యాయి’అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవేకు అనుసంధానించే అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్హెచ్ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది. ఇదీచదవండి..సూరీడు కనిపించి ఏడు రోజులైంది -
న్యూఇయర్ వేళ ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో న్యూఇయర్ దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలితో ప్రారంభం కానుంది. 2024 న్యూఇయర్ నాడు ఢిల్లీ సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలపై ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా జనవరి 1న రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దట్టమైన పొగమంచు, అతి శీతల పరిస్థితులపై వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరభారతంలో చలి తీవ్రత 9 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్సర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్, హోషియార్పూర్, జలంధర్, కపుర్తలా, లూథియానా, పఠాన్‌కోట్, పాటియాలా, రూప్‌నగర్, తరణ్ జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 110 విమానాలు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో చలి బెంబేలెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో విపరీతంగా చలి పెరుగుతోంది. దీనికితోడు పొగమంచు దట్టంగా వ్యాపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశమంతటా చలిగాలులు వీస్తున్నాయి. #WATCH | Dense fog covers parts of national capital as cold wave continues. (Visuals from Dhaula Kuan area, shot at 6:15 am) pic.twitter.com/MneDB9QmJC — ANI (@ANI) December 27, 2023 పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో పొగమంచు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దడ పుట్టిస్తున్న చలి చలి తీవ్రత పెరగడంతో రాజధాని వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులపై బయటికి వెళ్లేవారు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తవ్రత పెరిగిన కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 110 విమాన రాకపోకలకు అంతరాయం పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులో దృశ్యమానత(విజిబిలిటీ) దాదాపు సున్నాకి పడిపోయింది. ఉదయం 10 గంటలకు కూడా రహదారులన్నీ పొగమంచుతో కమ్ముకున్నాయి. 'దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 110 విమాన రాకపోకలకు ఆలస్యం అవుతోంది' అని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అథారిటీ పేర్కొంది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని 25 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. తెలుగురాష్ట్రాలను కప్పేసిన మంచు తెలుగురాష్ట్రాలను కూడా పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలు అయినా పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అటు.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. రోడ్లు కనపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
Vijayawada: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి
విజయవాడను సోమవారం మంచు దుప్పటి కప్పేసింది. నగరం అంతా పొగమంచుతో నిండిపోయింది. ఉదయం పది గంటల వరకూ భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. వాహనాలన్నీ లైట్ల వెలుగుల్లో రాకపోకలు సాగించాయి. పొగ మంచులో నగరం సరికొత్త అందాలతో కనువిందు చేసింది. ప్రకాశం బ్యారేజీ, రైలు వంతెన, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా నగరమంతా పొగమంచు అలముకోవడంతో బెజవాడ వాసులు ఇబ్బందులు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఢిల్లీ: చలిగాలుల ప్రభావంతో వణికిపోతున్న జనం
-
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన స్పైస్ జెట్ విమానం దిగేందుకు విజుబుల్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ట్రూజెట్, ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం చుట్టపక్క గ్రామాలను పొగమంచు ఆవరించింది. ఉదయం 7 గంటల అయినా పొగమంచు వీడలేదు. రహదారులపై మంచుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
-
కమ్మేసిన మంచుపొగ.. నిలిచిపోయిన విమానాలు!
-
కమ్మేసిన మంచుపొగ.. నిలిచిపోయిన విమానాలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీని మంచుపొగ కమ్మేసింది. దట్టంగా మంచుపొగ అలుముకోవడం, వెలుతురు మందగించడంతో సోమవారం ఉదయం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వెలుతురు మరీ మందగించడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఐదు దేశీ విమానాలు, ఏడు అంతర్జాతీయ విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఒక విమాన సర్వీస్‌ను రద్దుచేశారు. హస్తినలో వెలుతురు మందగించి.. మంచుపొగ దట్టంగా అలముకోవడంతో ఉదయమైనా చిమ్మచీకటి అలుముకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం కూడా ప్రమాదకరస్థాయికి చేరడం గమనార్హం. వాయునాణ్యత సూచీలో నగరంలోని షాదిపూర్లో 332, సిరి ఫోర్ట్‌లో 388 పాయింట్లు (రెండు కూడా అత్యంత ప్రమాదకరం) నమోదవ్వగా.. ద్వారకలో 257 పాయింట్లు (తీవ్ర అనారోగ్యకరం), ఐటీవోలో 182పాయింట్లు (అనారోగ్యకరం) నమోదైంది. అటు ఉత్తరప్రదేశ్ వారణాసిలో దట్టమైన పొగమంచు కారణంగా వైమానిక సేవలకు అంతరాయం కలిగింది. -
మన్యంలో కొనసాగుతున్న చలి తీవ్రత
అరకు: మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఆదివారం రాత్రి లంబిసింగిలో 6 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారినా పొగమంచు వీడక మంచు దుప్పటిని తలపిస్తుండటంతో.. స్థానికులు పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్ల సాయంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. -
పొగమంచు కాదు.. పైలట్లదే తప్పు!
గత కొన్ని రోజులుగా పొగమంచు దట్టంగా ఉందని, అందువల్ల పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయని వింటున్నాం. కానీ, విమానాలు ఆలస్యం కావడానికి అసలు కారణం అది కాదట.. విమానయాన సంస్థలు, వాటిలో పనిచేసే పైలట్లే అందుకు కారణమని డీజీసీఏ చెబుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పొగమంచు కారణంగా దాదాపు 900 విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్నయితే ఢిల్లీకి బదులు సమీపంలో ఉన్న వేరే విమానాశ్రయాల్లో దిగాల్సి వచ్చింది. అయితే.. వాటిలో 811 విమానాలు విజబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే అలా అయ్యిందని ఎయిర్‌పోర్టు ఆపరేటర్ డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. మరో 97 విమానాలను మాత్రం 50 మీటర్ల స్థాయిలో కూడా విజిబులిటీ లేకపోవడంతో వేరేచోట్ల దించాల్సి వచ్చిందన్నారు. సాధారణంగా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు విమానాశ్రయాలతో పాటు విమానాలు కూడా అత్యాధునిక ల్యాండింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలను దించడానికి పైలట్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాగా తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలు దిగేందుకు పొడవైన రన్‌వేతో పాటు అదనపు పరికరాలు కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాయి. కానీ విమానయాన సంస్థలు మాత్రం అలా దిగేందుకు వీలున్న విమానాలను, పైలట్లను ఢిల్లీకి ఉపయోగించడం లేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఎయరిండియాను డీజీసీఏ ఎక్కువగా తప్పుబట్టింది. 125 మీటర్ల కంటే పైన కూడా విజిబులిటీ ఉంటేనే ఆ విమానాలు దించుతున్నారని లేకపోతే వేరేచోటుకు మళ్లిస్తున్నారని చెప్పింది. -
రైళ్లు గంటల కొద్దీ ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. జనజీవనం, రవాణ వ్యవస్థ స్తంభించిపోతోంది. మంగళవారం ఉత్తరాదిన 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో ఆరు రైళ్లను రద్దు చేశారు. ఇస్లాంపూర్-న్యూఢిల్లీ మగధ్ ఎక్స్‌ప్రెస్ 48 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 22 గంటలు, భువనేశ్వర్-న్యూఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 38 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఏ విమానం కూడా రద్దు కాలేదు. కాగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా వచ్చాయి. -
మన్యంలో మంచుదుప్పటి
పాడేరు: మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో పర్యటకులతో పాటు స్ధానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం రాత్రి లంబసింగిలో 11 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 13 డిగ్రీలు, మోదుకొండమ్మ పాదాల వద్ద 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగాశుక్రవారం ఉదయం పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గోవా, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, వందలాదిగా నిలిచిపోయిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా దట్టమైన పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 15 దేశీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
విమాన రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో రన్ వే కనిపించడం లేదు. పొగమంచు కారణంగా 6 అంతర్జాతీయ విమానాలు, 7 దేశీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓ డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ రద్దు చేశారు. మంచు ప్రభావంతో ఢిల్లీలో 94 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 8 అంతర్జాతీయ విమానాలు, 5 దేశీయ విమాన సర్వీసులు, 81 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 3 అంతర్జాతీయ విమాన సర్వీసులు, 3 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్ ఎక్స్ప్రెస్వేస్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
ఢిల్లీ-హైదరాబాద్ విమానం రద్దు
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. పొగ మంచుతో వెలుతురు మందగించడంతో 54 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 రైలు సర్వీసులను రద్దు చేశారు. నాలుగు అంతర్జాతీయ విమానాలు, ఐదు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ-హైదరాబాద్ విమాన సర్వీసు రద్దు చేశారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగత్రలు రోజురోజుకు తగ్గుతుండడంతో హస్తినవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు, చలిగాలులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఆలస్యంగా నడుస్తున్న 81 రైళ్లు