పొగమంచు కారణంగా 20 వాహనాలు ఢీ | Dense Fog Leads To 20-Car Pile Up On Yamuna Expressway Near Delhi | Sakshi
Sakshi News home page

పొగమంచు కారణంగా 20 వాహనాలు ఢీ

Published Sun, Jan 24 2016 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

పొగమంచు కారణంగా 20 వాహనాలు ఢీ

పొగమంచు కారణంగా 20 వాహనాలు ఢీ

న్యూ ఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా20 వాహనాలు ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని జెవార్ టోల్ ప్లాజా సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వే పై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఢిల్లీకి 77 కిలో మీటర్ల దూరంలో ఈ టోల్ ప్లాజా ఉంది. యమునా ఎక్స్ ప్రెస్ వే గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రాకు 165 కిలోమీటర్ల మేర ఉంది. ఉదయం సమయంలో కేవలం 50 మీటర్ల దూరంలోపు మాత్రమే విజిబిలిటీ ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement