ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం, రద్దు | Dense Fog Reduces Visibility In Delhi-NCR Flights Delayed | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం, రద్దు

Published Wed, Jan 15 2025 9:41 AM | Last Updated on Wed, Jan 15 2025 11:15 AM

Dense Fog Reduces Visibility In Delhi-NCR Flights Delayed

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ జీరోకు పడిపోయింది. దీంతో.. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీకి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం నమోదవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఈ కారణంగా దాదాపు 184 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో​ ఏడు విమానాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక,  రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే సమయంలో ఆరు రైలు సర్వీసులను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

 

ఇదిలా ఉండగా.. ఢిల్లీలో వాయు నాణ్యత పూర్ కేటగిరీలో కొనసాగుతోంది. దీంతో, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆరెంజ్‌ అలర్ట్‌ విధించింది ఇక, బుధవారం ఉదయం ఢిల్లీలోని కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సఫర్జజ్‌గుంజ్‌లో ఆరు డిగ్రీలుగా నమోదైంది. దీంతో, ప్రజలు చలితో వణికిపోతున్నారు. 

వణుకుతున్న ఉత్తరాది.. ఢిల్లీలో తగ్గిన విజిబిలిటీ
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement