ఢిల్లీ: దేశ రాజధానిలో న్యూఇయర్ దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలితో ప్రారంభం కానుంది. 2024 న్యూఇయర్ నాడు ఢిల్లీ సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలపై ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అంతేకాకుండా జనవరి 1న రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దట్టమైన పొగమంచు, అతి శీతల పరిస్థితులపై వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరభారతంలో చలి తీవ్రత 9 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది.
పంజాబ్‌లోని అమృత్‌సర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, జలంధర్, కపుర్తలా, లూథియానా, పఠాన్‌కోట్, పాటియాలా, రూప్‌నగర్, తరణ్ జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment