![పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81481122842_625x300_1.jpg.webp?itok=ykwdBp7s)
పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగాశుక్రవారం ఉదయం పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గోవా, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, వందలాదిగా నిలిచిపోయిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలో కూడా దట్టమైన పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 15 దేశీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.